9, జనవరి 2023, సోమవారం

అక్షయ పాత్ర…(సీరియల్)..(PART-4)

 

                                                                                 అక్షయ పాత్ర…(సీరియల్)                                                                                                                                                                     (PART-4)

ఏమిటి...వెళ్ళాలని తీర్మానించుకున్నావా?”

మరుసటిరోజు పొద్దున అమ్మ అడిగిన వెంటనే ఏం సమాధానం చెప్పాలో అర్ధంకాక మౌనంగా కూర్చుంది తులసి.

నాకేమీ అర్ధం కావటంలేదమ్మా! ఏం చేయను...నేను వెళ్ళటం వలన నాన్నకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా తెలియటం లేదే?”

నేనూ అదే చెబుతున్నా. ఇంకా ఒకవారం చూద్దాం. నువ్వు కావాలంటే ఫోనులో ప్రయత్నిస్తూ ఉండు. ఫోను అవుట్ ఆఫ్ ఆర్డర్అయినా కూడా రెండు మూడు రోజుల్లో సరికాదా?”

చూస్తాను. తొందరపడి నేను వెళ్లటం వలన నేనే ఆయనకు కష్టాలు తెచ్చిపెట్ట కూడదే!

చాలా కరెక్టమ్మా. నువ్వు మొదట్లో ఫోనులో ఆయన్ని పట్టుకో. బిజినస్ విషయంగా మాట్లాడాలని చెప్పు. ఆయన ఎందుకు రాలేదో అనేదానికి కారణం తెలుసుకోకుండా తొందరపడొద్దు

సరేనమ్మా...నేను బయలుదేరనా? కాలేజీ, కంప్యూటర్ క్లాసు ముగించుకుని తిరిగి వచ్చేటప్పుడు ఫోన్ చేసి చూస్తాను

ఆమె టిఫిన్ తినేసి బయలుదేరింది. కాలేజీ ముగించుకుని కంప్యూటర్ సెంటర్ కు వెళ్ళిన వెంటనే ప్యూను ఒకతను తులసి దగ్గరకు వచ్చి, ఆఫీసులో పిలుస్తున్నారని చెప్పి వెళ్లాడు.

రండమ్మా...ఏమీలేదు. మీరు వచ్చే క్వార్టర్ ఫీజు ఇంకా కట్టలేదు! అది చెప్పటానికే పిలిచాను. వచ్చే వారంతో టైము అయిపోతుంది. అంతలోపు కట్టేసేయండి...సరేనా?”

తులసి ఆందోళనతో బయటకు వచ్చింది.

దగ్గర దగ్గర ఐదువేల రూపాయలు కట్టాలి. నాన్న వచ్చుంటే పాటికి కట్టేసి వెళ్ళుంటారు.  ఇప్పుడేం చేయాలో ఆమెకు తెలియలేదు.

ఆందోళనతో క్లాసుకు కూడా వెళ్లకుండా ఇంటికి బయలుదేరింది. వచ్చే దోవలో టెలిఫోన్ బూత్ నుండి తండ్రికి ఫోన్ చేసింది.

మళ్ళీ అదే జవాబు. టెలిఫోన్ పనిచేయటం లేదు’. తులసి నీరసంతో ఇంటిదోవ పట్టింది.

ఏం...దొరికిందా?” --- ఆత్రుతతో అడిగింది తల్లి - తులసి లేదని చెప్పింది.

ఎమీ అర్ధం కావాటంలేదమ్మా! అక్కడ ఏం సమస్యో అని టెన్షన్ గా ఉంది. కంప్యూటర్ సెంటర్ లో వచ్చే క్వార్టర్ ఫీజు కట్టమంటున్నారు

 ఎంత?”

చెప్పింది. వచ్చే వారం లోపు కట్టాలట అన్నది.

ఇప్పుడేం చేయాలే?”

నేను హైదరాబాదుకు వెళితేనే మంచిది అనిపిస్తోంది

వద్దు తులసీ. డబ్బుకోసం వెళ్ళి ఒకరోజు కూడా మనం ఆయన్ని కష్టపెట్ట కూడదు. నువ్వు చదువు వదిలేయి. నాన్న వచ్చిన తరువాత మళ్ళీ చేరొచ్చు

నీ దగ్గర నగలేమైనా...?”

లేవు. ఈరోజు వరకు మనింటి ఖర్చులకు, నీ చదువుకూ తప్ప వేరే అనవసరమైన వస్తువులను నాకు కొనివ్వటానికి నేను ఒప్పుకోలేదు. నా చేతులకు, చెవులకు వేసుకున్నవన్నీ కవరింగ్ నగలే.

ఆయన్ని పెళ్ళి చేసుకున్నది పట్టు చీరలకోసమో, బంగారు నగలకోసమో, రెండూ కొనుక్కుని మెరిసిపోవాలనో కాదు. నా మనసులో ఇప్పుడూ మీ పెద్దమ్మకు ద్రోహం చేస్తున్నామే నన్న బాధ ఉంటూనే ఉంది. అందుకనే వీలైనంతవరకు అత్యవసర ఖర్చులకు తప్ప వేరే ఆడంబరాన్ని దగ్గరకు రానివ్వకుండా సింపుల్ గా బ్రతుకుతున్నాను.

నీ పెళ్ళి గురించి కూడా నేను బాధపడటంలేదు. అమ్మా, నాన్న, డబ్బు, నగలూ ఏదీలేని అనాధగా...ఆపదలో ఉన్న నాకు అద్భుతమైన భర్త, సంతోషమైన జీవితం, అందమైన -- అభిమానమైన కూతురు దొరికినప్పుడు, నీకు మంచి జీవితం దొరుకుతుందనే నమ్మకం నాకుంది.

మీ నాన్న ఉన్నప్పుడు నాకేం దిగులు? అందుకనే నీకని చెప్పి ఒక్క గ్రాము బంగారం కూడా చేర్చలేదు!

అర్ధమవుతోందమ్మా. నా చదువు గురించి కూడా నాకిప్పుడు బాధలేదు. నాన్నకు ఏమైందో అనేది తెలుసుకోకపోతే నాకు నిద్ర రాదమ్మా. ఆయన గురించి ఎలా తెలుసుకోగలమో నీకేదైనా దారి తెలిస్తే చెప్పమ్మా

ఇంకో నాలుగు రోజులు చూద్దాం. వార్తా రాలేదు అనుకో, నువ్వు ఒకసారి  వెళ్ళిరా. అదే మంచిది. తరువాత తులసీ ఇంకో విషయం... -- తల్లి తడబడుతూ నిలబడింది.

ఏంటమ్మా?”

చేతిలో చిల్లిగవ్వలేదు. రేపు ఖర్చుకు నయాపైసా లేదు. మూడు నెలల అద్దె బాకీ  ఉంది. అద్దె బాకీ  వస్తుందనే నమ్మకంతో హౌస్ ఓనర్ ఇంతవరకు ఓర్పుగా మాట్లాడారు. ఇప్పుడు ఆయన స్వరంలో కఠినత్వం తెలుస్తోంది. ఇంకా అవమాన పడేలోపు డబ్బుకు ఏదైనా ఒక ఏర్పాటుచేయాలి. ఇంట్లో బియ్యం లేవు. మిగిలిన సరకులూ లేవు. ఏదీలేదు. మహా అయితే ఇంకొక్కరోజు గడపొచ్చు. తరువాత ఏం చేస్తామో తెలియటం లేదు. ఏదైనా ఇంటి పనులు దొరికితే నేను వెళ్దామని చూస్తున్నాను. నువ్వేమంటావు?”

నాన్నకు తెలిస్తే బాధపడతారు

మన కష్టాన్ని ఆయనకెందుకు చెప్పటం? ఆయన వచ్చేస్తే పనికెళ్లటం మానేస్తాను...అంతవరకే?”

అలాగైతే నేను కూడా ఏదైనా పనికి వెళ్తానమ్మా!

నువ్వెందుకే?”

రధాన్ని లాగటం ఒక మనిషి వల్ల కుదరదమ్మా!

ఇన్ని రోజులు మీ నాన్న ఒక్క మనిషిగా రెండు రధాలు లాగలా?”

ఆయన వలన కుదురుతుంది. నీ వల్ల కుదరదు. ఎలాగూ డబ్బు కట్టలేము. కాలేజీకి వెళ్ళి, మిగిలిన టైములో పార్ట్ టైము ఉద్యోగం ఏదైనా దొరుకుతుందా అని చూస్తాను

అది నీ ఇష్టం

తల్లి వద్దనలేదు. రెండే రోజుల్లో తులసి పార్ట్ టైమ్ జాబ్ తెచ్చుకుంది. ఇంట్లోనే కూర్చుని చేసే ఉద్యోగం. మార్కెటింగ్ రీసర్చ్ కంపెనీలో డీకోడర్అనబడే పని. వాళ్ళు రికార్డు చేసుకుంటున్న గ్రూప్ డిస్కషన్ ఆడియోలను విని, దాన్ని అలాగే ఆంగ్లంలో రాసివ్వాలి.

ఒక సీడి రాసిస్తే నాలుగువందల రూపాయలు ఇస్తారు. రోజుకు రెండు గంటలు పనిచేస్తే చాలు. రోజుకు ఎనిమిదివందల రూపాయలు సంపాదించవచ్చు. తిరుగుడు, అలసట ఉండదు. ఆంగ్ల భాష మీద మంచి పట్టు ఉంటే చాలు.

ఒక స్నేహితుని ద్వారా ఒక రీసెర్చ్ ఎక్జిక్యూటివ్ పరిచయం దొరికింది. మొదటి రోజే రెండు సీడీ లు ఇచ్చి రాసిమ్మన్నారు.

రోజు సాయంత్రమే కూర్చుని రాత్రిలోపు రెండు సీడీలు విని అందమైన చేతి రాతతో రాసి ముగించింది. అర్ధంకాని చోట్లలో చుక్కలు పెట్టింది. కరెక్టుగా నాలుగు గంటలు పెట్టింది.

మరుసటి రోజు తీసుకు వెళ్ళి ఇచ్చినప్పుడు ఒకసారి చదివి .కే. చెప్పి వెంటనే డబ్బులిచ్చారు. తులసికి ఆనంద షాక్ తగిలింది. ఆమె మొదటి సంపాదన ఎనిమిది వందల రూపాయలు.

చాలు! డేటైమ్ జాబ్ దొరకకపోయినా కూడా నెలకు పది సీడీలు దొరికితే చాలు. ఎలాగైనా అద్దె ఇచ్చుకుంటూ, సగం కడుపు నింపుకోవచ్చు. దేవుడు ఒకరికి అన్ని తలుపులూ మూయడుఅని నాన్న మాటి మాటికీ చెప్పేవారు. అది నిజమని  అర్ధమయ్యింది.

కష్టపడటానికి రెడీగా ఉన్న వాళ్ళకు ప్రపంచంలో జీవించటానికి కరువే లేదు. పనులు/ఉద్యోగాలూ కోకొల్లల్లుగా ఉన్నాయి అనేవారు నాన్న. సగం మందికి పైనే పలురకాల ఉద్యోగాలున్నాయనేదే తెలియదు. తెలుసుకున్నవారికి సంపాదించుకోవటం ఒక సమస్యే కాదుఅని బాధ పడేవారు.

నిజమే! ఇలా ఒక డీకోడర్ ఉద్యోగం ఉన్నదని ఆమెకు ఇప్పుడే తెలిసింది. ఇంతకు ముందు పేరుకూడా వినలేదు. కానీ, ఎంతోమంది పనిని ప్యాకెట్ మనీకోసం చేస్తున్నారని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపడింది.

కారులో, సెల్ ఫోనుతో వచ్చి దిగిన యువకుడు సీడీ తీసుకువెళ్ళాడు. తమ ఖర్చుల కొసం, తామే కష్టపడి సంపాదించుకునే యువకులూ ఉంటూనే ఉన్నారు.

వచ్చేదారిలో షాపులో గోధుమ పిండి, పెసరపప్పు, టొమేటోలూ, కొంచం బియ్యం -- కూరగాయలూ కొనుక్కుని ఇంటికి వచ్చింది.

సరకులను పెట్టేసి తల్లి దగ్గరకు వెళ్ళి తన మొదటి సంపాదనలో మిగిలిన డబ్బును ఇచ్చింది. ఆమె కళ్ళు విరుచుకోవటం వేడుక చూసింది.

ఒక సేటు ఇంట్లో నాకు పని దొరికింది. నెలకు రెండువేలు ఇస్తామంటున్నారు. పొద్దున ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు అక్కడే ఉండి వాళ్ళు చెప్పే పని చేయాలి

వద్దమ్మా.చేస్తున్నకొద్దీ పని చెబుతూనే ఉంటారు. గట్టిగా పిండేస్తారు. నీవల్ల కాదు!

కాకపోతే ఎవరు వెళ్తారు? వెళ్ళి చూస్తాను! ఒకవేల మంచివాళ్ళుగానూ ఉండొచ్చు కదా?”

తరువాత నీ ఈష్టం. కానీ ఇప్పుడే చేరాలా?”

ఏం?”

నేను హైదరాబాద్ వెళ్ళొస్తా. నాన్న గురించి తెలుసుకుని ఆయన దగ్గరా ఒకమాట చెప్పేసి వెళ్దాం! ఏమంటావు?”

వెళ్ళిరా. కానీ, అక్కడి పరిస్థితులను తెలుసుకుని దానికి తగినట్లు నడుచుకోవాలి. కారణం చేతా నువ్వు ఎవరనే విషయం చెప్పకు! మనవల్ల ఆయనకు ఇబ్బందీ కలగకూడదు

నాకు తెలుసమ్మా!

తులసి డ్రస్సు మార్చుకుని వచ్చింది. మనిషికి నాలుగు చపాతీలు చేసుకుని ఇద్దరూ ఇష్టంలేకపోయినా తినేసి రోజును గడిపారు.

తరువాత మరుసటి మూడురోజులకూ ఇంకో నాలుగు సీడీలు తీసుకుని రాసిచ్చింది. సంపాదించిన డబ్బుతో హైదరాబాద్ కు రైలు టికెట్టు కొన్నది. ఖర్చులకు కొంచం డబ్బూ, రెండు జతల దుస్తులు తీసుకుని హైదరాబాదుకు బయలుదేరింది.

ఒంటరిగా వెళ్లగలవా?” -- తల్లి కలతపడుతూ అడిగింది.

నీకు లాగా ఇంటి పురుగును అనుకున్నావా?” -- తులసి నవ్వింది.

రైలులో ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకు తినకు! అందులో ఏదైనా కలిపి  ఉంచుతారు

టెన్షన్ పడకమ్మా...నేను జాగ్రత్తగా వెళ్ళొస్తాను

ఆయన్ని ఎక్కడ, ఎలా చూసి మాట్లాడతావు?”

అక్కడికి వెళ్ళి నా సౌకర్యం చూసుకుని మాట్లాడుతానమ్మా

నేను చెప్పిందంతా జ్ఞాపకం ఉంచుకో

సరి... -- తులసి ఏర్ బ్యాగును తగిలించుకుని మెట్లు దిగింది.

నువ్వు జాగ్రత్తగా ఉండు!

అమ్మతో చెబుతూ నడిచింది.

రైలు బయలుదేరటంతో, తులసికి తండ్రి జ్ఞాపకాలు ఇంకా ఎక్కువైనై.

                                                                                                                            Continued...PART-5

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి