7, జనవరి 2023, శనివారం

అక్షయ పాత్ర…(సీరియల్)...(PART-3)

 

                                                                                  అక్షయ పాత్ర…(సీరియల్)                                                                                                                                                                      (PART-3)

నువ్వు ఇక్కడే ఉండొచ్చు నీరజా. నాకు అభ్యంతరం లేదు! గుణం చెడిపోయిన మనుషుల మాటలకు నేను బాధపడను. కానీ, ఎన్ని రోజులు నువ్వు ఇక్కడ ఉండగలవు? రేపు నిన్ను ఎవరైనా పెళ్ళి చేసుకోవద్దా? నువ్వు సంతోషంగా జీవించ వద్దా?”

అనాధను పెళ్ళి చేసుకోవటానికి ఎవడు తయారుగా ఉంటాడు?”

అలా చెప్పకు! లోకంలో మంచి వాళ్ళూ ఉంటారు

అలా ఒక మంచి వాడు ఒకడు ముందుకు వచ్చినా కూడా వీళ్ళందరూ కలిసి అతని మనసులో విషం కలిపేస్తారుఇక నాకు మంచి పేరు దొరుకుతుందని నమ్మకం లేదు. చేతిలో డబ్బో -- బంగారమో ఏదీ లేదు. నాలాంటి అనాధలందరూ ఉండవలసిన చోటు రెడ్ లైట్ ఏరియాలోనే అనే చాలామంది ఆశ.

నేను ఒకడికి భార్యగా ఉండటం కంటే, ఊరికే భార్యగా ఉంటేనే వీళ్ళు తృప్తి పడతారు. అలా ఉండటం కంటే మీ ఒక్కరికీ ఉంపుడుగత్తెగా గౌరవంగా ఉండి బ్రతకటం మేలని నాకు అనిపిస్తోంది. వాళ్ళూ ఎలాగైనా  అనుకోనివ్వండి. మన ఇద్దరి వరకు మనం పరిశుద్దంగా ఉండిపోదాం. జీవితం నాకు చాలు. నేనేమీ పెళ్ళికి ఆశ పడటం లేదు. ఆశ పడటానికి నాకు అంతస్తూ లేదు

ఆమె గొంతు బొంగురుపోయి ఆగింది...అతను బాధతోనూ, జాలితోనూ ఆమెను చూసాడు.

ఇదే నీ నిర్ణయమా?”

నిర్ణయం మీకు నచ్చలేదు అంటే చెప్పండి. నేను వెళ్ళిపోతాను. కానీ, ప్రాణాలతో ఉండను. ప్రతి కుక్కా పొడిచి పీక్కోవటానికి ముందే ప్రాణాన్ని కాలం దగ్గర అప్పగించేస్తాను!

ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దేనికో భయపడి దేనినో తగలబెట్టుకున్నట్టు...!

అప్పుడు ఎవరో తలుపు కొట్టారు. ఆమె బెదిరిపోయి అతని వీపు వెనుకకు వెళ్ళి దాక్కుని నిలబడింది. అతను ధైర్యంగా తలుపు తీసాడు.

బయట బాగా వయసున్న ముసలమ్మ ఒకావిడ నిలబడింది.

లోపల మీరు మాట్లాడుతున్నదంతా విన్నాను. అమ్మాయి పాపం తమ్ముడూ. ఆమెను వదిలేయకండి. వీలైతే ఆమె మెడలో మూడు ముళ్ళు కట్టి ఆమెకు జీవితం  ఇవ్వండి. వీళ్ళు ఈమెను వూరికే వదలరు. ఈమె దొరికేంతవరకూ రౌండు కొడుతూనే ఉంటారు. ఈమెను పిలుచుకుని ఎక్కడికైనా వెళ్ళిపొండి.

అమ్మాయి దగ్గర ఆస్తి పాస్తులు లేవు తమ్ముడూ. కానీ, దానికంతా కలిపి మంచి గుణం నిండి ఉంది. చివరిదాకా నీ కాళ్ళ దగ్గర విశ్వాశంగా పడి ఉంటుంది. తల్లీ కూతుర్లు ఆత్మగౌరవంతో ఉన్నారు. అప్పుడు ఒక్క నాలిక తప్పుగా చెప్పేదా? ఇప్పుడు కష్టకాలం. తల్లిని పోగొట్టుకుని తపిస్తొంది. దీన్ని వదిలేయకు తమ్ముడూ...నీకు పుణ్యం దక్కుతుంది

ముసలమ్మ బ్రతిమిలాడ...అతను ఆశ్చర్యంగా చూసాడు.

నువ్వు...నువ్వు అక్కడ తిరుగుతున్న పిచ్చిదానివి కదూ?”

పిచ్చిదాన్ని కాదు తమ్ముడూ. పిచ్చిదానిలాగా నడుచుకుంటున్న ఒక అబలను. అమ్మాయి వయసులోనే ఉన్నాను...అనాధగా! అప్పుడు నీలాంటి మంచి  మనుషులు దొరకలేదు. ఒక దరిద్రుడు నన్ను మానభంగం చేసి వెళ్ళిపోయాడు. తరువాత చాలామంది.

పిచ్చి పట్టినట్టు తిరిగాను. తరువాత ఎవరూ నా దగ్గరకు రాలేదు. తరువాత అదే నాకు బద్రత అయ్యింది. రోజు వరకు అందరి కళ్ళకూ పిచ్చిదాన్నే. నాకూ అలవాటైపోయింది. ఎవరి ఇంట్లోనైనా భోజనం దొరుకుతుంది. ఏదో ఒక మూలలో ప్రశాంతంగా నిద్రపోతా. ఇదిగో ఈమె ఇంట్లో కూడా చాలా రోజులు భోజనం చేసాను.

ఆమెకు భోజనం లేకపోయినా నామొహం చూసి జాలిపడి నాకు భోజనం పెట్టేది వీళ్ళ  అమ్మ. కృతజ్ఞతా భావంతోనే తమ్ముడూ చెబుతున్నాను. అమ్మాయిని విడిచిపెట్టకు. చేయి గట్టిగా పుచ్చుకో... -- ఆమె చేతిని తీసుకుని ఇతని చేతిలో పెట్టింది.

తన చీర కొంగులో ముడి వేసుకున్న పదిరూపాయలు తీసి జాపింది. దీంతో పసుపుతాడూ, పసుపుకొమ్మూ కొని తాలిగా కట్టేసి సంతోషంగా ఉండు తమ్ముడూ!

నీరజ ఆమె కాళ్ళ మీద పడి కన్నీరు కారుస్తూ నమస్కరించింది. ముసలమ్మ చీకట్లో కనుమరుగు అయ్యింది.

కొంచం సేపు మౌనంగా గడిచింది.

ఆమె ఏదో చెప్పి వెళ్తోంది. ముందూ వెనుకా తెలియని ఒక అనాధను ఎవరైనా పెళ్ళి చేసుకుంటారా ఏమిటి? మీ తల్లి-తండ్రులకు ఎన్నో కలలు ఉంటాయి. అవన్నీ మీరు చెరిపేయ కూడదు. మీరు నన్ను ఒక పనిమనిషిగా చూసుకుంటే చాలు

నా సమస్య నా కన్నవాళ్ళు కాదు నీరజా?”

ఆమె వేరే ఏమిటి?’ అనేటట్టు చూసింది.

నీ మెడలో తాలి కట్టటానికి ఆలొచిస్తున్నది నువ్వు అనాధ అనో, ఏమీలేనిదానివనో అనేది కారణం కాదు. నేను పెళ్ళి అయిన వాడిని. అదే  కారణం

ఆమె ఆశ్చర్యపోతూ అతని చూసింది.

ఇంతవరకు మీ గురించి నాకేమీ తెలియదు!

ఎవరూ ఏదీ అడిగింది లేదు. నేను చెప్పిందీ లేదు. నాకు నాలుగు సంవత్సరాల వయసులో అబ్బాయి ఉన్నాడు. నా భార్యకు ఆంధ్రా ప్రభుత్వంలో ఉద్యోగం. అధికారిగా ఉంది. అందువలనే ఆమె నాతో పాటూ వచ్చి ఉండలేకపోయింది.

ఇంకా కొన్ని రోజుల్లో నన్ను హైదరాబాదుకే మారుస్తారు. నిన్ను పెళ్ళి చేసుకోకపోవటానికి కారణం ఇదే. నేనూ వెళ్ళిపోతే నువ్వు ఏం చేస్తావనేదే నా భయం”    

మీ ఇంట్లో పని మనిషిగా ఉంటాను. నన్నూ పిలుచుకు వెళ్ళండి. ఊర్లో నాకు మాత్రం ఏముంది?”

చూద్దాం. నువ్వు ఎవరికీ భయపడకు. తెల్లవారిన వెంటనే వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. నీకు ఏదైనా ఒకదారి చూపే నేను వెళతాను. బాధ పడకు!

చెప్పినట్టే మరుసటి రోజు తెల్లవారు జామున తమ దగ్గరున్న ఒకటి రెండు సామాన్లు తీసుకుని వాళ్ళు బయలుదేరారు. అందరూ నోరెళ్ళబెట్టి వాళ్ళు వెళ్ళటాన్ని చూసారు. వాళ్ళిద్దరినీ కలిపి చెడుగా మాట్లాడినందు వలనే వాళ్ళిద్దరూ కలిసి వెళుతున్నా చూస్తూ నిలబడ్డారు.

ఆఫీసుకు దగ్గరలోనే ఒక పాత బిల్డింగులో ఒక గది అద్దెకు దొరికింది. వాళ్ళిద్దరినీ భార్యా, భర్తలనే అక్కడి వాళ్ళందరూ అనుకున్నారు. ఆమె, అనవసరంగా బయటకే రాదు. ఒక పనిమనిషిగా మాత్రమే అక్కడుంది.

రాత్రిపూట గాలికోసం అతను వరాండాలో పడుకోగా ఆమె లోపల నిద్రపోయేది. వర్షాకాలం మొదలైన తరువాత పడుకోవటం సమస్య అయిపోయింది. అతనూ లోపలే పడుకోవలసిన నిర్భంధం. అలాంటి ఒక వర్షం రోజున అన్నిటినీ జయించింది శరీరం.

అతను కృంగి కృషించిపోయేడు. నేనా ఇలా నడుచుకున్నానుఅని నమ్మలేక ఆశ్చర్యపడ్డాడు. ఆమె మొహాన్ని చూడలేకపోయాడు. బాధతో అలాగే కూర్చుండిపోయిన అతన్ని ఆమె సమాధానపరచింది.

పరవలేదు...వదలండి. గొప్ప గొప్ప మూనీశ్వరులే ఇందులోనుండి తప్పించుకోలేకపోయారు. మనం సాదారణ మనుష్యులమే కదా! నేను దీన్ని పెద్ద భాగ్యంగా అనుకుంటున్నాను. దేవుడికి నైవేద్యం పెట్టినట్టు ఒక సంతోషం. దీన్ని పెద్ద తప్పుగా తలుచుకుని బాధపడకండి. మీరు ఎప్పుడు పిలిచినా కుక్క పరిగెత్తుకు వస్తుంది

ప్లీజ్ నీరజా. నన్ను పురుగును చేసి, నువ్వు విశ్వరూపం తీయకు! నేను తట్టుకోలేను. ఇది తప్పే! తప్పును సరిచేస్తేనే నా మనసు చాల్లారుతుంది. రేపు తెల్లారిన వెంటనే గుడికి వెళ్ళి నిన్ను పెళ్ళి చేసుకున్న తరువాతే నా తప్పు సరి అవుతుంది”   

అదికూడా తప్పేకదా! మొదటి భార్య ఉండగా...నేనెలా మిమ్మల్ని...? వద్దండీ! అంతస్తు, హక్కు నాకు వద్దు. మీరు మంచివారు. బాగుండాలి. నావలన మీ కుటుంబంలో బీట్లు రాకూడదు. మీ యొక్క కుటుంబ సంతోషమే నా బద్రత కంటే మీకు ముఖ్యం.

మీ అభిమానానికి థ్యాంక్స్. సంతోషం నాకు చివరిదాకా చాలు. ఇక మీదట నన్ను కుక్క తరిమినా నాకేం? నాకు కలత లేదు. నా మీద పడ్డచేయి ఒక మంచి మనిషిది అనే సంతోషం నాకు చాలు. దయచేసి విషయాన్ని ఇంతటితో మరిచిపోయి ఎప్పుడూలాగా మామూలుగా ఉండండి. మీరు ఏం తప్పు చెయ్యలేదు!

లేదు నీరజా. నువ్వు ఏం చెప్పినా నేను సమాధానపడలేను. నన్ను పెళ్ళి చేసుకోవటానికి నీకు ఇష్టమే కదా?”

లేదని చెబితే నేను మహాపాపిని

మరింకేం?”

మీ ఇంటికి ఇది తెలిస్తే ఏమవుతుందో ఆలొచించారా?”

నిజం చెప్పి, సమ్మతం అడుగుదామని ఉన్నాను. నా భార్య చాలా మంచిది! నేను పాపం చేయటాన్ని ఆమె ఎప్పుడూ అంగీకరించదు

ఎంత మంచివారుగా ఉన్నా, ఆడపిల్లా తన హక్కును షేర్ చేసుకోవటానికి ఒప్పుకోదు. దయచేసి మంచివాళ్ళను పరీక్షించకండి

లేదు నీరజా. ఖచ్చితంగా ఆమె అర్ధం చేసుకుంటుందని నమ్ముతున్నా

అర్ధం చేసుకునేది వేరు...ఒప్పుకోవటం వేరు! ఒకవేల మన పెళ్ళికి ఆమె ఒప్పుకోలేదనుకోండి...ఏం చేస్తారు?”

అప్పుడు కూడా నా నిర్ణయంలో మార్పు ఉండదు. నా మనశ్శాక్షే నా న్యాయాధిపతి

మనశ్శాక్షే న్యాయాధిపతి అనేటప్పుడు మిగిలినవారి మనసులను ఎందుకు నొప్పించాలి?”

నువ్వేం చెబుతున్నావు?”

మీ నిర్ణయంలో మార్పు లేదు అన్నప్పుడు ఎవరినీ అడగక్కర్లేదు. మీకు నచ్చినట్లు చేయండి. ఆమె కంటివెంట బొట్టు నీరు వచ్చినా నేను నాశనమైపోతాను.

మీ భార్య అనే సంతోషం మాత్రం నాకు చాలు. అదితప్ప డబ్బు, నగలు అక్కర్లేదు. మీరు కట్టే తాళి నాకు బద్రతనిస్తుంది. అది చాలు నాకు.  మీరు మీ కుటుంబాన్ని బాగా చూసుకోండి.

నా భర్త బయట ఊర్లో ఉన్నాడని చెప్పుకుంటూ, ఇక్కడ ఏదైనా ఇళ్ళ పనిచేసి అలవాటు చేసుకుంటాను. ఇటువైపుకు ఎప్పుడైనా వస్తే నన్ను చూసి వెళ్ళండి. నాకు ఇంకేమీ వద్దు

పిచ్చిగా మాట్లాడకు నీరజా. తాళికట్టేది నిన్ను నీదారికి వదిలేసి పోవటానికా? నీకేం కావాలి ఇప్పుడు? మన విషయం నా ఇంటికి తెలియకూడదు. అదే కదా...? .కే.! నేను చెప్పను. చివరి వరకు విషయం ఆమెకు తెలియకుండా చూసుకుంటా.

కుదిరినంతవరకూ ఇద్దర్నీ సంతోషంగా ఉంచుకుంటా. ఇది నా ప్రామిస్. దీని తరువాత ఇంకేదైనా మాట్లాడి నన్ను మార్చే ప్రయత్నం చేయకు!

వివాదానికి అతను పులుస్టాప్ పెట్టాడు.

మరుసటి రోజు గుడిలో నీరజను పెళ్ళి చేసుకున్నాడు. కరెక్టుగా ఆరునెలల తరువాత అతనికి హైదరాబాద్ ట్రాన్స్ ఫర్ అయ్యింది.

నువ్వు కూడా వచ్చేయి నీరజా. అక్కడే వేరుగా నీకొక ఇల్లు చూస్తాను

రాను...ఖచ్చితంగా రాను. అలావస్తే మనిద్దరం పట్టుబడిపోతాము. కారణం చేత నా వలన మీ కుటుంబంలో పగుళ్ళు ఏర్పడకూడదు. మాట నేను మీకు ఇదివరకే చెప్పాను. మీరు వెళ్ళి రండి.

ఇక ఒంటరిగా ఉండటానికి నాకేమిటి భయం? తాళి కాపలాగా ఉంటుంది. అది మాత్రమే కాకుండా కడుపులో ఒకతోడు ఉంది. తరువాత ఏముంది? ధైర్యంగా బయలుదేరండి. నాకు డబ్బులు పంపి పట్టుబడిపోకండి. నేను ఎలాగైనా  బ్రతికేస్తాను. కుదిరితే ప్రేమగా నాలుగు వాక్యాలు ఉత్తరం రాసి పడేయండి. అది చాలు

నువ్వు గర్భంగా ఉన్నావా నీరజా?” సంతోషం పొంగుకు వస్తుంటే అడిగాడు.

ఇంకా నిర్ధారణ చేసుకోలేదు. కానీ అదే!

పరిస్థితుల్లో నిన్ను వదిలేసి ఎలా వెళ్ళేది?”

బాధ పడుతున్నారా?”

నేనే కదా బాధపడాలి?”   

సరె...ఏం చెయ్యబోతారు? వెళ్లకుండా ఉండిపోతారా?”

అదీ కుదరదు. వెళ్ళకపోతే ఆమె కష్టపడుతుంది. వెళితే నీకు కష్టం

నాకేమీ కష్టం లేదని చెబుతున్నాను కదా?”

ఒకటి చేస్తా నీరజా...నేను వెళ్తాను. నెలలో రెండోవారం ఎలాగైనా ఇక్కడికి వచ్చి ఉంటాను. ఒకవారం ఉండి వెళతాను

అదంతా కుదురుతుందా?”

కుదురుతుందనే నమ్ముతున్నా. ఉద్యోగం మానేసి సొంతంగా వ్యాపారం  మొదలు పెట్టినా పెడతాను. అప్పుడు ఖచ్చితంగా వచ్చి వెళ్ళగలను. నువ్వు కష్టపడనే కూడదు. తోడుకు మనిషిని పెట్టుకో. నెల నెలా డబ్బులు పంపుతా.

డెలివరీ మంచిగా అయ్యేంత వరకు నీ పక్కన ఒక మంచి మనిషి అవసరం. డబ్బు గురించి బాధపడకుండా మంచిగానూ, నమ్మకంగానూ ఒక మనిషిని చూసి తోడుగా ఉంచుకో. కుదిరితే నేను వెళ్లేలోపు ఇంకో మంచి అపార్టుమెంటు చూసి నిన్ను అక్కడ ఉంచి వెళతా

వద్దు...వద్దు. చోటు నాకు బాగా అలవాటు అయిపోయింది. డెలివరీ వరకు ఇక్కడ ఉండటమే మంచిది. పిలిచిన పిలుపుకు ఎవరో ఒకరు పరిగెత్తుకు వస్తున్నారు. కావాలంటే తరువాత ఇల్లు మార్చుకుందాం

నీ ఇష్టం...” -- అతను అంగీకరించాడు. మరో నెల రోజులు ఆమెను సంతోషంగా చూసుకున్నాడు. అవసరమైన సరకులు కొనిపడేసాడు.

ఆమె తోడుకు ఒక నడి వయస్కురాలు దొరకటంతో ప్రశాంతంగా  బయలుదేరాడు.

ఇప్పుడు చెప్పు తులసీ. నేనేం చేయను?”

తండ్రి తన కథను చెప్పి ముగించిన వెంటనే తులసీ కన్నీటితో ఆయన భుజాలమీద వాలిపోయింది.

ఎంత మంచి గుణం నాన్నా నీకు! కత్తి మీద నడిచే విద్యను పదహారు సంవత్సరాలుగా ఎవరికీ గాయం ఏర్పడకుండా, నువ్వూ గాయపరుచుకోకుండా ఎంత అందంగా చేసుకొచ్చావు? నాకు ఆశ్చర్యంగా ఉంది నాన్నా. దీని గురించి పెద్దమ్మకు ఆవగింజంత సందేహం కూడా రాలేదా?” అని అడిగి ముగించ...ఆయన నవ్వారు. పెద్దమ్మా అంటూ మరు క్షణమే ఆమె ప్రేమతో చెప్పిన విధం ఆయనకు బాగా నచ్చింది. సంతోషం పట్టలేక కూతురు తల నిమిరారు.

చట్ట ప్రకారం ఇది తప్పు. సమాజం చూపులకూ ఇది నేరమే! కానీ, నిజమైన ప్రేమ చట్టాలకూ కట్టుబడదు. రెండు కుటుంబాలనూ సంతోషంగా ఉంచుకున్నాను. ఇద్దర్నీ సరిసమంగా ప్రేమిస్తున్నాను. నా త్రాసులో రెండు కుటుంబాలూ సరిసమంగా తూగుతున్నాయి. ఒకే బరువుతో!

మా అన్నయ్య ఎలా ఉంటాడు నాన్నా?”

చూడాలా?”

ఫోటో తీసుకు వచ్చుండచ్చు కదా?”

ఈసారి తీసుకువస్తాను

పెద్దమ్మది కూడా తీసుకురా

వాళ్లతో కలిసి ఉండలేకపోతున్నావే అని బాధ పడుతున్నావు కదూ?”

అందరి యొక్క మంచికొసం, కొన్ని సంతోషాలను వదులుకోవచ్చు. అందులో తప్పులేదు!

తులసీ నవ్వింది. ఆమెకు నాన్నా-అమ్మా యొక్క ప్రేమ, బంధుత్వం అర్ధమయ్యింది. తండ్రి ఇంత ధర్మ సంకటమైన పరిస్థితిలో కూడా రెండు కుటుంబాలనూ ప్రేమతోనూ, ఆనందంతోనూ నడుపుతున్నారు అనేది అర్ధమయ్యింది...ఆయన మీదున్న గౌరవ మర్యాదలు పలురెట్లు అధికమయ్యింది.

ఒక కుటుంబాన్నే నరకంగా మార్చుకున్న కొందరు మనుష్యుల మధ్య, రెండు కుటుంబాలనూ స్వర్గంగా మార్చి పెట్టుకున్నారు ఆయన అనేది ఎంత పెద్ద  విషయం!

ఆమె సందేహాలను ఆయన తీర్చటంతో, ఇంకెలాంటి ప్రశ్నలకూ చోటులేకుండాపోయింది. మనుషులు ఎక్కడైతే ఒకరినొకరు అర్ధం చేసుకుంటారో, సందేహపడరో... ఆ చోటు సంతోషంతో నిండిపోతుంది.

నెలలోని రెండవ వారం సంతోషం యొక్క శిఖరం. ఎందుకంటే మిగిలిన రోజులు దాని ఆనందమైన జ్ఞాపకాలతో గడిచిపోతుంది. ఇంతవరకు ఎలాంటి కష్టమూ ఎవరివలన ఎవరికీ ఏర్పడింది లేదు.

ఒక వారం రోజులే అయన అక్కడుంటారు. అయినా ఆయనకు తెలిసిన అన్నిటినీ తులసీతో  పంచుకుంటారు. తండ్రీ-కూతుర్లు సమయం గడుస్తున్నదే తెలియకుండా మాట్లాడుకుంటారు. ప్రపంచ విషయాలూ, సినిమా, సాహిత్యం, ఇతిహాసం, ఆంగ్ల పుస్తకాలూ అంటూ అన్నిటినీ చర్చిస్తారు.

రాత్రంతా మాట్లాడుకుంటూ తెల్లవారుతున్నప్పుడు కనురెప్పలు నిద్రను నొక్క...లేవలేక అవస్తపడతారు. వాళ్ళు మాట్లాడుకున్న లోతునూ, అరుదైన అభిప్రాయాలనూ పంచుకోవడం ఎప్పుడూ మరిచిపోకూడదని తులసి  కుదిరినంతవరకు తానూ-తండ్రీ మాట్లాడుకుంటున్నప్పుడు ఆయనకే   తెలియకుండా టేప్ఆన్ చేసి తమ మాటలను పదిల పరుచుకుంటుంది.

తండ్రి నవ్వుతూ ఓర్పుతో వింటారు. మాటలు ముగియటంతో లేచి, అలమరా దగ్గరకు వెళ్ళి, అక్కడున్న ఒక క్యాసెట్టును తీసుకువచ్చి టేపు రికార్డర్లో పెట్టి రన్ చేస్తారు. ముందు రోజు ఆమె రికార్డు చేసిన అదే చర్చలు!

నువ్వు రికార్డు చేసావా ఏమిటి?”

ఆమె ఆశ్చర్యంతో అడగ -- ఆయన నవ్వ -- ఆమె నవ్వ...ఇల్లే నవ్వులతో నిండింది.

"బుద్దిమంతులు ఎప్పుడూ ఒకటిగానే ఆలొచిస్తారు" నవ్వుల మధ్యలో ఆయన చెప్పారు.

ఇలాంటి తండ్రినే నాలుగు నెలలుగా చూడలేక పోతున్నది. ఒక్క విషయమూ తెలియటం లేదు. ఒకవేల కుటుంబం గురించి పెద్దమ్మకు తెలిసిపోయుంటుందో? అందువలన అక్కడేమన్నా సమస్యో? అందువలనే నాన్న రాలేదో? అలా ఉండే పక్షంలో, తాను బయలుదేరి వెళ్ళటం వలన ఆయనకు ఇంకా ఎక్కువ ఇరకాటం కదా అవుతుంది! అలా వెళ్ళి రావటం ఆయనకు సంతోషం కలుగజేస్తుందా? ఇబ్బంది పెడుతుందా?

ఎటువంటి నిర్ణయానికీ రాలేక అయోమయంలో పడిపోయింది తులసి!

                                                                                                                      Continued...PART-4

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి