అక్షయ పాత్ర…(సీరియల్) (PART-6)
‘ఈ
రోజు కొత్తగా
పుట్టాము!’
“అబ్బో...ఏం
వాక్యం! ఇలా
ఇంకెవరైనా రాసుంటారని
అనుకుంటున్నావు?”
శ్రీశ్రీ కవితలను
పెట్టుకుని పారవశ్యంతో
నాన్న మొహం
ప్రకాశవంతమై నిండుకుంది.
“ఒక్కొక్క
క్షణమూ మనం
కొత్తగా పుట్టాల్సిందే.
నువ్వేం చెబుతావు
అమ్మాయ్?”
ఆయన అడిగింది
గుర్తుకు వచ్చింది.
“పుట్టుక
అనేది మరణాన్ని
లోపల అనిచిపెట్టిందే
కదా?”
ఆమె అన్నది.
“చాలా
కరెక్ట్! మరణించటం
తెలిసినవాళ్ళకు
మాత్రమే పుట్టటమూ
కుదురుతుంది. అలా
పుట్టేటప్పుడు
అన్ని మురికిలూ
కాలిపోయుండాలి.
పగ, క్రోధం, భయం, వెర్రి, అన్నీ
బూడిదైపోయుండాలి.
ఎవరో ఒకరు
రోజూ కొత్తగా
పుడతారో, వాడు
తృప్తితో ఉంటాడు.
అతని చూపుల్లో
పిల్లతనం ఉంటుంది.
అతనికి అంతా
సమమే. కొత్తగా
పుట్టినతనికి ‘నేను...నాది’ అనే
అహంకారం ఉండదు.
నేను, నాది
అని చెప్పేవాడూ
మరణిస్తూ ఉంటాడు”
తులసి అత్యంత
శ్రమపడి ఆ
షాక్ నూ, దాంతో
పాటూ వస్తున్న
ఏడుపునూ అనిచిపెట్టుకోవటానికి
ప్రయత్నించింది.
అప్పుడు కూడా
కళ్ళు ఎర్రబడి
జ్యోతుల్లా కనబడుతున్నాయి.
నాన్నకు చావు? ఎలా? గొంతు
నొప్పి పుట్టింది.
ఒళ్ళంతా వణికింది.
గోపీ ఆమెనే
చూస్తూ ఉండటం
గమనించి, తన
ఎమోషన్స్ ను
అనుచుకుని తలపైకెత్తింది.
“చాలా
మంచి మనిషి.
ఎలా...?”
నీరసమైన స్వరంతో
అడిగింది.
“బీ.పి.
ఎక్కువై, మెదడు
దెబ్బతిన్నది. నాలుగు
నెలలు కోమాలో
ఉన్నారు. స్పృహలోకి
రాకుండానే వెళ్ళిపోయారు”
‘బీ.పీ.నా? ఆయనకా? దేనికీ
భయపడని, బాధపడని, క్లియర్
మైండు ఉన్న
ఆ మనిషికి
ఎలా బీ.పీ.
దగ్గరకు చేరింది?’
ఒకవేల ఆయన
ధైర్యాన్ని మించి
ఆయన మనసులోపల
తన మరో
కుటుంబ వ్యవహార
రహస్యం లోలోపల
ఆయనకు ఒత్తిడి
ఏర్పరిచిందో? పెద్దెనిమిదేళ్ళ
ఒత్తిడి ఒక
రోజు అగ్నిపర్వతంలా
పేలిపోయిందా?
తులసి పెదాలు
కొరుక్కుని దుఃఖాన్ని
మళ్ళీ మింగి
లోపలకు తోసింది.
“నేను
వస్తాను. మీకు
ఎలా ధైర్యం
చెప్పాలో తెలియటం
లేదు! మీ
అమ్మకు మీరు
ధైర్యం చెప్పండి.
ఆయన ఆత్మ
శాంతించటానికి
నేను దేవుడ్ని
ప్రార్ధిస్తాను”
వెక్కి వెక్కి
ఏడవాల్సిన ఆమె
చాలా శ్రమపడి
అతనికి ఓదార్పు
మాటలు చెప్పి
బయలుదేరింది.
“ఎవరురా
గోపీ?”
వెనుక,
మాట వినబడగా
తిరిగి చూసింది.
భర్త ఆమెను
ఒంటరి చేసేసి
వెళ్ళిన దుఃఖంతో
ఏడ్చి ఏడ్చి
ఎర్రబడ్డ కళ్లతో
వచ్చిన పెద్దమ్మను
చూసింది.
“ఉద్యోగం
ఇప్పిస్తానని నాన్న
చెప్పారట. అందుకోసం
వచ్చారు”
“ఊరంతటికీ
సహాయపడే ఉత్తముడిని, ఎందుకు
ఇంత త్వరగా
తీసుకుపోయాడు! ఇలాంటి
ఒక మనిషి
ఇక భూమికి
దొరుకుతాడా”
పెద్దమ్మ ఏడవగా, గోపీ
ఆమెను పట్తుకుని
లోపలకు వెళ్లాడు.
*******************
“కాలా
నా కాళ్ళ
దగ్గరకు రారా, చిన్న
గడ్డిమొక్క అనుకుని
చిన్నగా నిన్ను
కాలితో తంతా.
దీన్నే నేను
ఎలా పాడతానో
తెలుసా తులసీ?”
“........................”
“కాలా, నా
కాళ్ల దగ్గరకు
రారా, నన్ను
నువ్వు తాకివెళ్ళటాన్ని
చూసి నేనూ
సంతోష పడతాను”
తులసి వేగంగా
చప్పట్లు కొట్టింది.
“అబ్బా...సూపర్
నాన్నా. ఎంత
క్లారిటీయో నీకు!
మరణం దేహానికేనని
క్లారిటీగా ఉన్నవాడివల్ల
మాత్రమే ఇలా
వేరుగా నిలబడి
తన మరణాన్నే
సంతోషంతో పాడటం
కుదురుతుంది. ‘నువ్వు
గ్రేట్ నాన్నా!’ శ్రీశ్రీ
ఇప్పుడుండుంటే, ‘శభాష్
రా నాగభూషణం’ అని
నీ వీపు
మీద రెండు
ప్రశంశా దెబ్బలు
వేసి పొగడుంటారు”
తండ్రి తన
మరణం గురించి
సంతోషపడుంటారో...? ఎందుకు
ఇలా సగంలో? ఈ
కాలానికి ఎందుకంత
తొందర? ఆయన
పిలిస్తే వెంటనే
కాళ్ల దగ్గరకు
వెళ్ళిపోవాలా?
మంచివాళ్ళు అంటేనే
ఎక్కువ రోజులు
ఉంచకూడదు అనేది
యమలోక చట్టమా? ఇక, ఆయనలాగా
ఎవరు సకలమూ
చెప్పిచ్చి స్నేహితుడులా
మాట్లాడేది? ఎవరి
భుజం మీద
నేను ఇక
పిల్లలా తల
వంచుకోగలను?
ఇప్పుడు ఏడవటానికి
ఒక చోటు
కావాలే! మనసు
విప్పి, నోరు
విప్పి గట్టిగా
ఏడవాలే. ఎక్కడికి
వెళ్తాను? అమ్మ
దగ్గర ఈ
విషయం ఎలా
చెప్పగలను? ఆమె
తట్టుకుంటుందా?
విన్న మరు
క్షణం ఆమె
కూడా చనిపోతే? ఆ
రోజు ఆమె
అనాధగా నిలబడ్డట్టు, నేను
కూడా నిలబడతానో? అలాంటి
ఒక శాపం
ఉందా మాకు?
ఛఛ...ఏమిటీ
పిచ్చితనం? నేను
భయపడుతున్నానో? భయం
ఎందువల్ల ఏర్పడుతోంది? బద్రత
గురించి బాధ
పడుతున్నప్పుడు
మనకు ప్రియమైన
వాళ్ళను పోగొట్టుకోవటం
ఏర్పడే ఎమోషన్స్
బద్రత లేనివా? అందువలనే
భయమా?
లేదు...భయం
లేదు. నాన్న
నన్ను అలాగా
పెంచారు? లేదే...!
నెలలో కొన్ని
రోజులే అయినా
ఎంత నేర్పించారు!
ఇలాంటి ఒక
తండ్రి ఎవరికి
దొరుకుతారు? ఎందుకు
ఇంత త్వరగా
వెళ్ళిపోయారు? అలా
ఏమిటి ఆయనకు
తొందర? దీన్ని
అమ్మ దగ్గర
ఎలా చెప్పబోతాను?
తులసి హృదయం
భారం అవగా
తలెత్తి ఆకాశంవైపు
చూసింది. అదికూడా
ఏడుస్తున్నట్టు
తుపర్లు జల్లుతోంది.
మళ్ళీ రైలు
స్టేషన్ వచ్చింది.
‘అన్
రిజర్వ్’ కోచ్‌లో
ఎలాగైనా ఎక్కి
ఉరువెళ్ళి జేరాలి.
నాన్న అనే
ఉన్నతమైన ఆత్మాను
ఇక అదేరూపంలో
చూడలేము.
పోర్టరుకు కొంచం
డబ్బులిచ్చి ఒకసీటు
పట్టుకుంది. దుఃఖంలోనూ
చిన్న సుఖంలాగా
కిటికీ సీటు
దొరికింది.
కిటికీ ఊచలలో
మొహంపెట్టుకుని
పిచ్చి చూపులు
చూస్తూ కూర్చుంది.
“మీ
అమ్మలాగా నువ్వు
పిరికిదానివిలాగా
ఉండకూడదు తులసీ.
జీవితమనేది స్పీడు
బ్రేకర్లను దాటుకుంటూ
వెళ్ళే ఒక
పరుగు పందెం
లాగా. స్పీడు
బ్రేకర్లను జంప్
చేసి జంప్
చేసి పరిగెత్తటం
కష్టమే! కానీ, అందులోనే
త్రిల్ ఎక్కువ.
సమస్యలే లేని
జీవితం ఒక
జీవితమే కాదు
అని చెప్ప
వచ్చు.
జీవితం యొక్క
గొప్పతనం తెలియాలంటే
కష్ట పడాలి.
ఒక్కొక్క కష్టమూ
ఒక స్పీడు
బ్రేకర్. దాన్ని
దాటి వచ్చి
గంభీరంగా తిరిగిచూడాలి.
అందులో అర్ధం
నిండి ఉండాలి.
అభిమానంతో అందరినీ
కట్టి పడేయాలి.
నిజాయితీగా ఉన్న
మనిషినని అహంకారంతో
ఉండటం కంటే, మిగిలిన
వాళ్లకు సహాయం
చేసే లక్ష్యంలో
చిన్న చిన్న
తప్పులు చేసినా
తప్పులేదు! మీ
అమ్మ గురించిన
నిజాన్ని మీ
పెద్దమ్మ దగ్గర
చెప్పకుండా ఉన్నాను
చూడు. అదేలాగా!”
“ఇది
చిన్న తప్పా
నాన్నా? పెద్దమ్మకు
తెలిస్తే రోలు
పగులుతుంది”
“తెలిస్తే
కదా?”
“ఏం
నాన్నా...చెబితే
ఏమవుతుంది? పెద్దమ్మ
చాలా మంచిదనేగా
చెబుతున్నావు! ఆ
తరువాత ఎందుకు
భయం?”
“ఆమె
మంచిదిగా ఉండటమే
సమస్య! ఆ
మంచి మనసు
దీన్ని అంగీకరించినా
మొదట్లో కొంచమైనా
షాక్ అవుతుందే!
ఆ నొప్పిని
ఆమెకు ఇచ్చే
శక్తి నా
దగ్గర లేదురా...అందుకనే!
నామీద పెట్టుకున్న
నమ్మకం, విరిగిపోకుండా
పూర్తిగా అలాగే
ఉండిపోవాలని వదిలేసాను.
అది చెప్పటం
వల్ల మన
మనసులోని భారం
తగ్గుతుంది. కానీ, ఆమె
మనసు బరువు
అవుతుందే! ఆ
బరువును బయటకు
చూపుకోలేక ఆమె
ఎలా గిలగిల
లాడుతుందో నాకు
తెలుసు. ఖచ్చితంగా
ఏవగించుకోదు. లాగి
హత్తుకుంటుంది.
అయినా మనసు
ఖచ్చితంగా గాయపడుతుంది.
నా మనసు
తెలికపడటం కోసం
ఆమె మనసును
హింసపరచటం మహాపాపం!
ఒక మనిషికి
ఇద్దరితో జీవించే
పరిస్థితి ఏర్పడితే, ఆ
అవస్త ఉండే
తీరుతుంది. మోసం
చేయాలనే ఉద్దేశం
లేదు, అబద్దం
చెప్పాలనే ఆశ
లేదు.
నిజం చెప్పకుండా
ఉండటానికి కారణం
కూడా ఆమె
దగ్గర నాకున్న
ఎక్కువ ప్రేమ
వలనే! నిజం
చెప్పటం కంటే
అందరూ సంతోషంగా
ఉండటమే నాకు
ముఖ్యం అనిపించింది.
ఇప్పుడు అందరూ
సంతోషం గానే
కదా ఉన్నాము...సరే
కదా?”
తులసి కన్నీటిని
తుడుచుకుంది.
తన చేష్టకు
ఆయన డొంక
తిరిగుడు సమాధానం
చెప్పలేదు. లోతుగా
ఆలొచించే ఆయన
అన్నీ చెప్పారు.
చెప్పినట్టే రెండు
ఇళ్ళకూ పక్షపాతం
లేకుండా అభిమానం
చూపించారు.
ఇంట్లో మాత్రమేనా!
ఇంకా ఎంతోమంది
దగ్గర అభిమానం
చూపించారు. ప్రచార
ప్రకటనలు లేకుండా
ఆయన చేసిన
మంచి పనులు
ఎన్ని?
తీయను, తీయను
తరగని అక్షయ
పాత్ర లాగానే
కదా ఆయన
మనసులో అభిమానం
ఊటలాగా ఊరి, పెరిగి
లోకాన్నే ముంచేలాగా
పొంగుతూ ఉండేది!
‘ఇలాంటి
ఒక మనిషా
తనకు పోటీగా?’ అంటూ
భగవంతుడికే ఈర్ష్య
ఏర్పడిందో ఏమో?
ఎక్కడ ఇతను
తన చోటును
పట్టుకుని వెళ్ళిపోతాడో
అనే భయం
ఏర్పడిందో? అందువలనే, ‘చాలు...నువ్వు
ఈ లోకాన్ని
ప్రేమించింది!’ అని
తీసుకు వెళ్ళిపోయినట్లు
ఉంది. ప్రేమభిమానాలతో
శ్వాసించుకుంటున్న
జీవి అనిగిపోయింది.
ముంబై వచ్చేంతవరకు
పచ్చి మంచి
నీళ్ళు కూడా
తాగకుండా పిచ్చి
పట్టిన దానిలాగా
కూర్చున్నది. ఎలా
అమ్మ మొహాన్ని
చూడబోతాము అనేది
అర్ధం కాక, చాలాసేపు
రైలు స్టేషన్
లోనే ఉండిపోయింది.
తరువాత, తప్పించుకునే
దారిలేదని అర్ధం
చేసుకుని లేచి
బయలుదేరింది.
తులసి తల
కనబడగానే అమ్మ
వేసింది వేసినట్లే
పడేసి పరిగెత్తుకు
వచ్చింది. ఆమె
కళ్ల చూపులు
వెయ్యి ప్రశ్నలతో
అన్వేషించ, మౌనంగా
ఆమె మొహం
చూసింది.
తులసి ఆమె
చూపులను తట్టుకోలేక
తల వంచుకుని
వేగంగా స్నానాల
గదిలోకి దూరింది.
షవర్ తెరుచుకుని
దాని కింద
శిలలా నిలబడిపోయింది.
కుళాయి లోనుండి
ఒక పక్క
నీళ్ళు కారుతున్న
శబ్ధంలో వెక్కి
వెక్కి ఏడ్చింది.
ఒక గంటసేపు
స్నానం చేసింది.
“ఏమిటి
తులసీ...వచ్చిన
వెంటనే స్నానానికి
వెళ్ళిపోయావు! ఎంతసేపు
స్నానం చేస్తావే? ఏమీ
చెప్పకుండా ఇలా
స్నానం చేస్తుంటే
ఏమిటే అర్ధం?”
అమ్మ తలుపు
తట్టి అడిగింది.
“తలకు
పోసుకుంటున్నానమ్మా”
“ఊరి
నుండి వచ్చీ
రాగానే ఎవరైనా
ఇలా తలకి
స్నానం చేస్తారా? వాళ్లందరూ
బాగుండొద్దూ?”
తల్లి తాలించి
పారేసింది!
Continued...PART-7
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి