మానసిక ధర్మం (కథ)
“అరవై
అరవైగానే ఉండాలి...శారీరక మానసిక ధర్మాలు ఆయా వయసులను బట్టి ఉండాలి. వృద్ధాప్య
దశలోకి అడుగుపెడుతున్నప్పుడు అహాన్ని, ఆధిపత్య ధోరణిని,
తాపత్రయాల్ని, నేను-నాది అనే భావనల్ని
ఒక్కొకటిగా వదిలేయాలి. అలా వదిలేయలేకపోతే ఆ మనిషి చింతలు, చికాకులు,
అలజడి, అశాంతితో...ప్రశాంతతను కోల్పోతారు”
“పెద్దతనం
అనేది సాత్విక స్వభావానికి, ఆలొచనకూ, సంయమనానికి
స్థానం. మంచిని పిల్లలు చెప్పినా...పెద్దవాళ్ళు ఆహ్వానించాలి”
“బోసినవ్వు
పసిబిడ్డకు అందం. ఆటా, పాటా పిల్లలకు అందం. గిలిగింతలు
పెట్టే ఊహలు యౌవనానికి అందం.బాధ్యతలు మోయడం గృహస్థుకు అందం”
“అలాగే-
సమాజానికి మంచి చెబుతూ, స్ఫూర్తి కలిగిస్తూ, మానసికంగా రుషి జీవనం గడపడమే వృద్ధాప్యానికి అందం"
ఈ కథలో
మానసిక ధర్మాన్ని మర్చిపోయి, తన సొంత కొడుకుని, కోడల్ని...మరీ పంతంగా మనవరాలుని
మానసికంగా ఏడిపించిన బామ్మ ఎలా తన మానసిన ధర్మాన్ని అర్ధం చేసుకోగలిగింది?....తెలుసుకోవటానికి ఈ కథ చదవండి.
ఆఫీసు నుండి ఇంటికి తిరిగి వచ్చిన లావణ్య గుమ్మం దగ్గర చెప్పులు విప్పి ఇంటి లోపలకు వచ్చి సోఫాలో వాలిపోయింది. ఇది రోజూ ఉన్న తంతే అయినా, ఆ రోజు ఆఫీసులో లావణ్యకు ఊపిరాడనంత పని.
లావణ్య అలా సోఫాలో వాలిపోగానే, చేతిలో మంచి నీళ్ళ గ్లాసుతొ అక్కడ ప్రత్యక్ష మయ్యేది లావణ్య ఎనిమిదేళ్ళ కూతురు గౌతమి. కూతురు అందించిన మంచి నీళ్ళు తాగిన తరువాత లావణ్యకు అప్పటివరకు ఉన్న అలసట ఒక్క క్షణంలో తగ్గిపోయేది. కూతుర్ని దగ్గరకు లాక్కుని, ముద్దాడి తన పక్కన కూర్చోబెట్టుకుని ఆ నాటి కబుర్లలోకి వెళ్ళిపోయేది లావణ్య.
ఆ రోజు సోఫాలో వాలిపోయి ఐదు నిమిషాలు అయినా, కూతురు గౌతమి మంచి నీళ్ళ గ్లాసుతో తన దగ్గరకు రాకపోయేసరికి గాబరా పడ్డది లావణ్య. సోఫాలో లేచి కూర్చుని "గౌతమి... గౌతమి" అంటూ పిలిచింది.
కూతురు రాకపొయేసరికి, అదే హాలులో దివాన్ మీద ఎటువంటి చలనమూ లేకుండా, ఇవేమీ పట్టించుకోకుండా పడుకుని టీ.వీ చూస్తున్న అత్తగారిని చూసి "అత్తయ్యా... గౌతమి స్కూల్ నుండి వచ్చేసింది కదా...?"
అని అడిగింది.
"ఆ...వచ్చింది" టీ.వీ ప్రొగ్రాములో నుండి తల తిప్ప కుండానే జవాబు
చెప్పింది లావణ్య అత్తగారు సుజాతమ్మ.
"ఎక్కడికి వెళ్ళుంటుంది!...ఇంట్లో ఉండుంటే ఈ పాటికి మంచి నీళ్ళ
గ్లాసుతో వచ్చుండేదే...?!" అనుకుంటూ సోఫాలో నుండి లేచి ముందుగా తన బెడ్ రూము లోకి వెళ్ళింది లావణ్య.
అక్కడ మంచం మీద
కుర్చొనున్న కూతురు గౌతమిని చూడగానే సంతోష పడింది...వెంటనే ఆశ్చర్య పడింది.
మంచం మీద కూర్చుని
హోమ్ వర్క్ చేసుకుంటున్న కూతురు దగ్గరకు వెళ్ళి, పక్కనే కూర్చుంది లావణ్య. కూతురి ముఖం
ఎందుకో వాడిపోయి ఉన్నది.
“ఏంటి నాన్నా...ఎందుకలా ఉన్నావు. నాకు మంచి నీళ్ళు కూడా
తెచ్చి ఇవ్వలేదు. నేను పిలిచినా పలుకలేదు. ఓంట్లో బాగలేదా?...అమ్మ మీద కోపం వచ్చిందా?" కూతుర్ని అడిగింది లావణ్య.
"ఏమీ లేదు..." ఒక్క ముక్కలో సమాధానం ఇచ్చింది గౌతమి.
"టీచర్ ఏదైనా
అన్నదా?"
"లేదు"
"మరి"
"బామ్మ
తిట్టింది"
"బామ్మ తిట్టిందా?" అని లావణ్య అన్నవెంటనే, అంతవరకు గౌతమిలో అణిగి ఉన్న దుఃఖం, ఏడుపుగా బయటకు వచ్చింది.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
మానసిక ధర్మం…(కథ) @ కథా కాలక్షేపం-1
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి