12, జనవరి 2023, గురువారం

అక్షయ పాత్ర…(సీరియల్)..(PART-5)

 

                                                                      అక్షయ పాత్ర…(సీరియల్)                                                                                                                                                                      (PART-5)

ఇంటర్ అయిన తరువాత ఏం చదువుతావు తులసీ ఒకసారి నాన్న అడిగారు.

ఏం చదవాలి? నువ్వు చెప్పు?”

నా ఇష్టం కోసమా చదువుతావు? నీకు ఏది ఇష్టమో చెప్పు

మీకు ఖర్చు పెట్టే చదువూ దానికి వద్దు

మధ్యలో అమ్మ అడ్డుపడి అలా చెప్పటంతో తండ్రి కళ్ళు పెద్దవి చేసాడు.

ఏం మాట్లాడుతున్నావు నీరజా? ఇలాగే ఎన్ని రోజులు చెబుతావు? నిన్ను పెళ్ళిచేసుకున్నది చట్టరీత్యా నేరమే అయ్యుండచ్చు. కానీ, ఇది నా కూతురు. పిల్లలు ఎలా పుట్టినా పదినెలలు. తానెలా పుట్టిందో బిడ్డకూ తెలియదు. బిడ్డలందరూ దైవీకంతోనే పుడతారు.

పిల్లా అలాగే. నా నెత్తురు ఇది. దీనికి నేను ఖర్చుపెట్టకుండా ఎవరు పెడతారు? ఇంకోసారి నువ్వు ఇలా మాట్లాడితే నేను చాలా బాధపడతాను. ఇన్ని రోజులు నాతో జీవిస్తూ నన్ను అర్ధం చేసుకోలేదే నని బాధపడతాను

అర్ధం చేసుకున్నందువలనే నండి...

వద్దు...ఏదీ మాట్లాడొద్దు. నా కూతురి చదువు విషయంలో ఇక నువ్వు తల దూర్చకు. అది ఇష్టపడితే చదువుకోవటానికి సకల హక్కులూ ఉన్నాయి. సంవత్సరానికి పదిమంది పిల్లలకు హైదరబాదులో నా కంపెనీ స్కాలర్షిప్ఇచ్చి చదువుకు సహాయం చేస్తోంది. నా కూతురికి నేను చెయ్యకపోతే, ఎవరికి చేసి ఏం పుణ్యం?”

సరే...తప్పు, తప్పు, తప్పు! మీరూ...మీ కూతురూ ఏదైనా చేసుకోండి. నేను తలదూర్చను...చాలా?”

ఇలా కూర్చో నీరజా. ముగ్గురూ కూర్చుని మాట్లాడుకుందాం. మనం ఉత్సాహపరిచి, సభాష్ అంటేనే కదా దానికి ఉత్సాహం వస్తుంది

భార్యను తమతో కూర్చోమన్నారు.

నీ దగ్గర నేనొక ప్రశ్న అడగనా తులసీ?”

... అడుగు!

భవిష్యత్తు లక్ష్యం, లేక ఆశ అని ఏదైనా ఉందా?”

ఎందుకు అడుగుతున్నావు?”

మొదట చెప్పు. ఏం చదవాలని ఆశపడుతున్నావు?”

ఎం.బి.. చదవాలని ఆశ. దాంతో పాటూ కంప్యూటర్ కూడా చదవాలని ఉంది

ఎందువల్ల రెండూ?”

మంచిదే కదా! మంచి ఉద్యోగం దొరుకుతుంది కదా?”

కాబట్టి...ఉద్యోగం కోసమే క్వాలిఫికేషన్!

అన్ని చదువులూ ఏదో ఒక ఉద్యోగానికైన చదువే కదా నాన్నా! ఉద్యోగమే కదా జీవితానికి ఆధారం!

ఇప్పటి చదువులు అలాగే అయిపోయినై తులసీ. అదే కలతగా ఉంది. ఇంగ్లాడులో  జీవించిన సాహిత్యవేత్త రుస్కిన్ బాండ్ పుస్తకం ఒకటి మధ్యే చదివాను. చెల్లు చెల్లు మని దెబ్బకొడుతున్నట్టు వరుసగా ప్రశ్నలతో మనకి మనమే ప్రశ్నించుకోవాలి.

మనం ఎందుకు చదువుకుంటున్నాము? చదువు మనల్ని గొప్పగా మెరుగు దిద్దుతుంది అనా, లేక నేను ఎంత చదువుకున్నానో చూడండి అని నలుగురికీ తెలియపరచటానికా? మనం ఎందుకు పిచ్చి పట్టినట్టు డబ్బు సంపాదిస్తున్నాం? మన అవసరాల కోసమా? లేక...నేను డబ్బుగలవాడినైపోయాను చూడు, గెలిచాను చూడూ అని నలుగురినీ ఆశ్చర్యపరిచిచేసి నలుగురి మర్యాదా సంపాదించుకోవటానికా? మనమెందుకు నలుగురికి సహాయపడుతున్నాము? మనం సహాయం చేస్తున్నామన్న పొగడ్త కోసమా...ప్రకటనకోసమా?

ఇలా చాలా ప్రశ్నలు. ఆలొచించి చూస్తే, మనం చేసే సాధనలు నలుగురికీ తెలియాలనే ఉద్దేశం కొసం చేసేదిగా ఉంది. ఇది కరెక్టా...తప్పా అని మాట్లాడటం  మొదలుపెడితే వివాదం పెరుగుతూ పోతుంది. అది నా ఉద్దేశము కాదు. కానీ, ఒకటో రెండో విషయాలైనా మనం మనకోసం, మన తృప్తికోసం మిగిలినవాళ్లకు చూపించాలనే ఉద్దేశం లేకుండా చెయ్యాలని అనిపిస్తోంది

అలా వేటిని చెయ్యాలనుకుంటున్నారు?”

వేరే దారిలేక రోజు కాల ఘట్టంలో ఏదో ఒక ఉద్యోగం కోసం, కొన్ని అర్హతను  అందరూ ఏర్పరుచుకోవాలనే నిర్బంధం ఉంది. పోనీ...దాని గురించి మనం ఏమీ చెప్పలేము. కానీ, అర్హత కోసం మాత్రం కాకుండా తెలివి కోసం ఒక మనిషి చదువుకోకూడదా ఏమిటి? ఎంతో చదువుకోవచ్చు!  

ఇది చదివి నాకు దేనికీ ప్రయోజనం లేకుండా పోయిందీని చెప్పకుండా, కుదిరినంతవరకు, అన్ని పుస్తకాలూ చదువుకోవాలి తులసీ. అవన్నీ నీకు తెలుసు అని చూపించుకోవటానికోసం కాకుండా...అవన్నీ నువ్వు తెలుసుకోవటం కోసం చదవాలి. చదువుకు మాత్రం పులుస్టాప్ లేదు. నీ సంపాదనలో నీకు కుదిరినంత డబ్బును పుస్తకాలకోసం వేరుగా పెట్టాలి...సరేనా?”

ఖచ్చితంగా నాన్నా! -- తులసి వాగ్ధానం చేసింది.

ఇంటర్ అయిన తరువాత కాలేజీలో బి.బి.. చేరింది. దాంతోపాటూ కంప్యూటర్ కోర్సు. చదువుకు సంబంధించిన పుస్తకాలు కాకుండా బోలెడు రకాల పుస్తకాలను ఆసక్తిగా చదివింది. చదవను, చదవను ఒకవిధ క్లారిటీ, సంతోషమూ, మనసులో నెరవేరటాన్ని గ్రహించింది. దాన్ని తండ్రి దగ్గర చెప్పి ఆశ్చర్యపడింది.

నువ్వు చెప్పింది నిజమే నాన్నా మనకోసం మనం చేసే కొన్ని విషయాలు మనకు ఇచ్చే తృప్తి, సుఖం చెప్పలేనిది!

తండ్రి నవ్వుతూ తన బ్రీఫ్ కేసు తెరిచి కొత్త పుస్తకాన్ని ఒకటి తీసి ఇచ్చారు. తులసి ఆత్రుతతో అది తీసుకుని చూసింది.

సెవెంత్ సెన్స్!...అరె బాబూ...వ్యత్యాసమైన పేరుగా ఉన్నదే! 

ఆశ్చర్యపడ్డది. వి.రాజారావ్ అనే టీచర్ పేరు రాసుంది.

చదివి చూడు! జీవితాన్ని టీచర్ ఎంత క్షుణ్ణంగా చూసి అనుభవించారు అనేది తెలుస్తుంది. ఆయనే మంచి వ్యాఖ్యాత. సీనియర్ ..ఏస్. అధికారి కూడా!

నిదానంగా చదువుతాను

పుస్తకాన్ని ఆమె బద్ర పరుచుకుంది.

అదే నాన్న ఇచ్చిన చివరి పుస్తకం. తరువాత ఆయన రాలేదు.

ఆయన రాకపోవటం కారణంగా, పుస్తకాన్ని చదవటానికి కుదరలేదు. ఆందోళన, అలజడి ఆమెను చదవనివ్వకుండా చేసినై. రైలులో చదువుకుందామనుకుని చేతి సంచీలో తీసి వేసుకుని వచ్చిన పుస్తకాన్ని బయటకు తీసింది. మధ్యలో ఒక పేజీ దగ్గర ఆమె మనసు ఆగింది.

నేను నా భారాన్ని మోయటానికి మనిషిని వెతికేను. దొరికేడు. ఇప్పుడు అతన్నీ చేర్చి మోస్తున్నాను!

మనం వేటిని కాపలా అని అనుకుంటామో, అవే మనల్ని కాపలా లేని చోటుకు తీసుకు వెడుతున్నాయి. మనం వేటిని సేవింగ్స్ అని అనుకుంటామో, అవే పెద్ద నష్టం యొక్క గుర్తుగా మారుతున్నాయి. మనం ఒక్కొక్క సేవింగ్స్ నూ, మనం పారేసుకున్న వాటిని జ్ఞాపకంచేస్తున్నాయి. ఆనందమైన జీవితమనేది వస్తువులలో లేదు. సహజమైన జీవితాన్ని ముగించటంలో అవి కూరుకోనున్నాయి. కలతలూ భయంలేని జీవితం సంబరంగా ఉంటోంది.

విలువకట్టలేని ఆభరణాలు వేసుకున్న బిడ్డ తాను ఇష్టపడే చోట ఆడుకునే సంతోషాన్ని వదిలేస్తోంది. బిడ్డ యొక్క ఆనందం దుస్తులు, ఆభరణాలలో లేదు. తాను ఇష్టపడిన చోట ఆడుకోవటంలోనే ఉంది! బిడ్డ వయస్సులో  పిల్లతనాన్ని పోగొట్టుకునే పిల్లలు యుక్త వయసులో పిల్ల వయస్సులో  ఉండే వాళ్ల లాగా నడుచుకుంటారు. పిల్ల అనేది ఒక వయస్సు కాదు. అదొక కాలం. అందరి దగ్గర ఒక పిల్లతనం ఉంటూ సంధర్భం దొరికినప్పుడల్లా తుళ్ళి  గంతులేస్తుంది.

బ్రహ్మాండమైన జీవితమనేది, మామూలు, సాధారణంగా జీవించటమే. సాధారణంగా జీవించటమనేది న్యాచురల్ గా, సహజంగా జీవించటమే. ప్రయత్నాలు లేని జీవితం నిండిపోయిన చెత్త కుండీలాంటిది. కానీ, తనని సాధారణంగా, ఖలీగా ఉంచుకున్న వారి చెవులలో దూరే గాలి సంగీతమవుతోంది. ఖండితమైన జీవితానికి అలావాటైన వ్యక్తి కూడా మనసులో శ్రమ పడుతున్నాడు

తులసి ఆశ్చర్యపోయింది.

ఇలానూ విషయాలను రాయగలమా?’ అని షాకయ్యింది. నాన్న చెప్పినట్టు క్షుణ్ణంగా చూడటం, అలా క్షుణ్ణంగా చూసినప్పుడు దొరికిన లోతైన అనుభవాలుగా ఒక్కొక్క అక్షరవరుసా ఉంది.

పుస్తకం గురించి నాన్న దగ్గర చాలా మాట్లాడాలి అని అనుకుంటూ మళ్ళీ పుస్తకం చదవటంలో మునిగిపోయింది.

మామూలుగా యంత్రాలుగా మారిన ప్రభుత్వ అధికారులనే ఆమె చూసింది. పుస్తకాన్ని రాసిన అధికారి, యంత్రాలకు మధ్యలో ఒక రోజా చెట్టులాగా పెరిగి, ఉద్రిక్తభావంతో కనబడటం సంతోషంగా ఉంది. 

రెండు పగళ్ళు, ఒక రాత్రి ఎడతెరిపి లేకుండా నడిచిన రైలు హైదరాబాదు చేరి అలసటతో ఆగింది.

తులసి ఒక విధమైన గుండె దఢతో కిందకు దిగింది. రెండు రోజుల ప్రయాణంలో ఒళ్ళు హూనంతో గట్టి పడింది.

ప్రయాణీకుల వెయిటింగ్ రూములో స్నానం చేసి, వేరు డ్రస్సు వేసుకుని, తల దువ్వుకుని ఉత్సాహంగా బయటకు వచ్చింది. వచ్చి స్టేషన్ క్యాంటీన్ లో రెండు ఇడ్లీలు తిని, కాఫీతాగి బయటకు వచ్చింది.

హ్యాండ్ బ్యాగులో తండ్రి అడ్రస్సు తీసుకుని, నమ్మకమైన ఒక మనిషికి చూపించి దాని దారి అడిగింది.

గాంధీ కాలనీ.

ఆయన చదివి, ఆమెకు దారి చెప్పి పంపించారు.

బస్సు ఎక్కి యూసఫ్ గూడాలో దిగి, గాంధీ కాలనీకు దారి అడిగి నడిచింది. అర్ధంకాని ఒక గుండె దఢ మొదలయ్యింది.

మొట్టమొదటి సారిగా తండ్రిని, ఆయన ఇంట్లో ఉంచి ఎవరోలాగా చూడబోతాము. సహాయం అడిగేటట్టు మిగిలిన అందరి ముందు నిలబడబోతామూ అని అనుకున్నప్పుడు గుండె ధఢతో పాటూ చిన్న భయం కూడా ఏర్పడింది.

ఎవరికీ చిన్న సందేహం కూడా ఏర్పడకూడదు. ఆమెను చూసినప్పుడు నాన్న రియాక్షన్ ఎలా ఉంటుంది? మనసులో ఏర్పడే ఆశ్చర్యం, సంతోషం బయటపెట్టలేక తపిస్తారే?

భగవంతుడా! ఆయన ఆరొగ్యం బాగుండాలి. వ్యాపార నిర్బంధం వలన రాలేకపోయారు. ఇంకేమీలేదు అని ఆయన సర్వ సాధారణంగా ఆమెను సమాధాన పరచాలి.

మనసులో వేడుకుంటూనే గాంధీ కాలనీలోకి దూరింది. డోర్ నెంబర్లు చూసుకుంటూ నడుస్తున్న ఆమె ఒకచోట ఆగింది.

ఇదే... ఇల్లే! పద్మాలయంఅని బంగారు రంగు అక్షరాలతో నేమ్ బోర్డు ఉన్నది. అందమైన బంగళా, ముందు భాగం అంతా పెద్ద పెద్ద వృక్షాలతో, పచ్చగా ఉంది.

ఎవరమ్మా?”

వాచ్ మ్యాన్ లేచి నిలబడి అడిగాడు.

ఇక్కడ నాగభూషణం గారని

మీరు ఎవరు?”

ఆయన దగ్గర సహాయం అడగటానికి వచ్చాను. ఆయన్ను చూడాలే?”

వాచ్ మ్యాన్...ఎవరది?”

మేడమీద నుండి మగ స్వరం గట్టిగా విచారించింది.

తెలియదండి. అయ్యగారిని వెతుక్కుంటూ వచ్చారు

లోపలకు పంపు

స్వరం ఆదేశం ఇవ్వ, వాచ్ మ్యాన్ గేటును కొంచంగా తెరిచి ఆమెను లోపలకు పంపాడు.

కిందకు వచ్చిన రూపాన్ని తులసి ఆశ్చర్యంతో చూసింది.

అచ్చు గుద్దినట్టు నాన్న లాగనే ఉన్నాడు. గోపీ!

నాన్న కొడుకు. అన్నయ్యా అని పిలవాలనే ఆశ పొంగుకువస్తుంటే, దాన్ని అనిచిపెట్టుకుని అతన్ని చూసింది.

ఎవరు?”

అతను ఆమెను కిందాపైకీ చూస్తూ అడిగాడు.

సార్ లేరా?”

ఏమిటి విషయం?”

ఒక ఉద్యోగ విషయంలో సహాయం చేస్తానన్నారు. బిజినెస్ విషయంగా ముంబైకి వచ్చినప్పుడు ఆయనకు పరిచయమయ్యాను. హైదరాబాదుకు రా...చూద్దామని చెప్పారు. అందుకే...

ఎప్పుడు చెప్పారు?”

అది...ఒక ఐదారు నెలలు అయ్యుంటుంది. ఆయన యొక్క విసిటింగ్ కార్డు కూడా ఉంది. నా పేరు తులసి అని చెబితే అర్ధమవుతుంది

సారీ...ఆయన్ని ఎవరూ చూడలేరు!

ప్లీజ్...చాలా కష్టాలలో ఉన్నాను. కష్టంతోనే కష్టపడి వచ్చాను. రెండు నిమిషాలే! అంతకు మించి ఆయన్ని అవసరపెట్టను

ఆమె బ్రతిమిలాడింది.

నాన్న చనిపోయి రోజుకు ఆరు రోజులు అయ్యింది!

చిన్న స్వరంతో దుఃఖాన్ని అనిచిపెట్టుకుంటూ చెప్పగా... తులసి స్థానువు అయిపోయింది.

                                                                                                              Continued...PART-6

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి