దాగుడు మూతలు (పూర్తి నవల)
జీవితమే ఒక దాగుడుమూతల ఆట. 'ప్రేమ' కూడా ఆ ఆటలో ఒక భాగమే.
జీవితం యొక్క మొదటి దశ అయిన బాల్య ప్రాయములో మనం దాగుడుమూతల ఆట ఆడుంటాము… జీవితం యొక్క తరువాతి దశలలో, జీవితం మనతో పలు దాగుడుమూతలాట ఆడుతుంది. జీవితం మనతో ఆడుతున్న దాగుడుమూతలాట మనకు ఇష్టమున్నా లేకున్నాఆడుతూ పాడుతూ
జీవించాల్సిందే…మనము ఆ ఆటలోని భాగమే.
విద్యార్థి దశలో, ఒక వ్యక్తి కోరిన చోట చదవలేకపోవడం, కోరిన వస్తువులను పొందలేకపోవడం, చెయ్యాలనుకున్న ఉద్యోగం చేయలేకపోవడం… జీవితం మనతో ఆడుతున్న దాగుడుమూత.
యవ్వనంలో వున్న వారు కోరిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందే తరుణము.. ఒక దాగుడుముత ఆటే .
మధ్య వయస్కుడు తాను ఊహించిన శైలిలో బ్రతకలేక పోవడం .. జీవితం మనతో ఆడే దాగుడుమూతే.
వయసు మల్లిన కాలములో, తన తరువాతి తరం వారికి అన్ని సమకూర్చాక…వారి మధ్య వుంటూ…మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ గడపగలగడం కూడా…జీవితం మనతో ఆడుకునే దాగుడుముత ఆటలోని భాగమే.
జీవితంలో దాగుడుమూతలు లేకుండా, అన్ని ఒక పద్దతిగా, ఏదో శాసనములో తెలిపిన విధముగా సాగితే, జీవితం నీరుగారి అంతే నిరుత్సాహంగా తయారవుతుంది. జీవితం మనతొ ఆడే ఈ ఆటను ద్వేషించక, ఆటలోని మెలుకువలు మరియు కిటుకులు తెలుసుకొని, పూర్వ అనుభావాల పాఠాలు గుర్తుంచుకొని, పెద్దలు చెప్పే అనుభావాలను చక్కగా అమలుపరిచి ఆడితే.. గెలుపు మనదే…..
'ప్రేమ 'కూడా జీవితంలో ఒక భాగమే. కానీ 'ప్రేమ' మాత్రం జీవితం అడే దాగుడుమూతల ఆటను జయించి, కావలసిన వారిని చేరుకుంటుంది...ఏలా? ఈ పూర్తి నవలను చదివితే మీరే ఆశ్చర్యపోతారు.
సంవత్సరం: 1955
చోటు: హైదరాబాద్.
“ప్రియమైన
దేవుడా...ఈ
మంచి సమయంలో, ఇక్కడున్న
అందర్నీ నీ
బంగారు చేతులలో
పెడుతున్నాను. మీరు
మా జీవితంలో
ఎంత మంచివారుగా
ఉన్నారో, ఎలాగైతే
మా పాపాలన్నిటినీ
మన్నించారో...అదేలాగా
ఇక్కడున్న ఒక్కొక్క
వ్యక్తి కుటుంబంలోనూ, జీవితంలోనూ
ప్రవేశించి, వాళ్ళ
పాపాలను మన్నించి
ఆశీర్వదించు. వాళ్ళను
శాపాల నుండి, వ్యాధులు-అనారోగ్యం
నుండి, మానసిక
పోరాటాల నుండి
వాళ్ళకు విముక్తి
ప్రసాదించి, వాళ్ళకు
సుఖాలాను అందించు!”
ఆ పాతకాలం
నాటి క్రైస్తవ దేవాలయంలో
ప్రొద్దుటి పూట
ప్రార్ధన జరుగుతున్నది.
ప్రార్ధన చేస్తున్న
వారు సిస్టర్
అమీలియా. విరామం
లేకుండా దైవ
కార్యాలలో ఆమె
చేస్తున్న సేవల
వలన ఆమె
మొహంలో ఒక
తేజస్సు, ప్రశాంతత
కనిపిస్తోంది. చూసేవాళ్ళందరూ
చేతులెత్తి నమస్కరించే
-- దైవీక మొహం
ఆమెది.
ఆమె ఎదురుకుండా
ఉన్న కుర్చీలలో, దేవుని
దగ్గర పలు
కోర్కెలను ముందుంచి,
జనం కూర్చోనున్నారు.
మతాలు ఏదైనా
ప్రశాంతతను వెతుక్కుని
తిరుగుతున్న మనసులు ప్రపంచ వ్యాప్తంగా కోకొల్లలు!
అక్కడున్న వారినందరినీ
వరుసగా చూస్తూ
వస్తే చివరి
వరుసకు ముందు
వరుసలో ఐదవ
వ్యక్తిగా కూర్చోనున్నది
మన కథా
నాయకి ప్రశాంతి.
క్యారట్ రంగులో
చిన్న చిన్న పసుపు
చుక్కలు పెట్టిన
కొత్తగా కొనుక్కున్నచీర, దానికి
మ్యాచింగ్ గా
పసుపు రంగు
బార్డర్ వేసిన
జాకెట్టు వేసుకోనున్నది.
పొడుగైన జడే
అందం అని
అనుకుంటున్న వారందరి ఆలొచన
ఆమె యొక్క
ఒత్తుగానూ, చిన్నదిగానూ
ఉన్న జుట్టును
చూస్తే మారిపోతుంది.
అందంగా కట్
చేయబడ్డ జుట్టుతో, రెండు
జడలు వేసుకుని
నల్ల రంగు
రబ్బర్ బ్యాండును
చుట్టుకోనుంది.
ప్రశాంతి యొక్క
ఎత్తు తక్కువని, ఆమె
వేసుకున్న హీల్స్
వేసుకున్న చెప్పులే
చెబుతాయి.
రేగి పండు
రంగుతో, బాణం
ఆకారంలో దిద్దుకున్న
కురులు, గుండ్రంగా
ఉన్న మొహం, ఆహా...అందులో
అందమైన తిలకం
బొట్టు క్రింద, నుదుటిపైన
ఉన్న తల
వెంట్రుకల దగ్గర
ఉన్న కుంకుమ, ‘ఈమె
ఇక్కడ ఏం
చేస్తున్నది?’ అనే
ప్రశ్నను మిగిలిన
వారి మనసులలో
ఏర్పరిచింది. ఆమె
పెద్ద పెద్ద
కళ్ళల్లో అశాంతి నిండిపోయున్నది.
అవును! ఎప్పుడూ
ప్రశాంతంగా ఉండే అమె మొహం ఈ
రోజు కొంచం
వాడిపోయే ఉంది.
చూసిన వెంటనే
ఈమె మంచిదా...లేక
చెడ్డదా అని
లెక్క వేయలేని
వ్యత్యాసమైన ముఖ
అమరిక.
కారణం. మన
ప్రశాంతి మంచివారికి
మంచిది...చెడ్డవారికి
చెడ్డది. గంభీరంగానూ, పట్టుదలగానూ, శాంతంగానూ
ఉంటూ మనల్ని
ఆశ్చర్యపరుస్తుంది.
ప్రార్ధన ముగియగానే, ఆఫీసుకు
వెళ్ళిన ప్రశాంతి
‘సిస్టర్’
అమీలియా ను
కలుసుకోవాలని సెక్యూరిటీ
దగ్గర చెప్పి
పంపి కాచుకోనున్నది.
ఆమె ఆ
కాలేజీ మాజీ
విధ్యార్ధిని మాత్రమే
కాదు...అక్కడ
పనిచేస్తున్న వాళ్ళకూ
పరిచయస్తురాలు.
అందువలన తెలిసిన
వారందరూ ఆమెతో
మర్యాదగా నడుచుకుంటారు.
“అమ్మగారూ, కొంచం
ఆలశ్యం అయ్యేటట్టు
తెలుస్తోంది. బయటకు
ఎక్కడకైనా వెళ్ళాలంటే
వెళ్ళి ఒక
గంట తరువాత
రండి?” అని
ఎంతో వినయంగా
చెప్పాడు సెక్యూరిటీ.
ఇంకొంచం వివరంగా
“రేపు
జరపాల్సిన ప్రార్ధన
గురించి, లారన్స్
ఫాదర్ తో
మాట్లాడుతున్నారమ్మా.
ఆయనతో పాటూ
చాలా మంది
ఉన్నారమ్మా. అందుకనే...” అంటూ తల
గోక్కున్నాడు.
“పరవాలేదు. నేను మన కాలేజీ అంతా ఒక చుట్టు చుట్టొస్తా. టైము సరిపోతుంది. చాలా రోజులైంది అటువైపు వెళ్ళి...” అంటూ బయలుదేరింది ప్రశాంతి.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
దాగుడు మూతలు...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి