20, జనవరి 2023, శుక్రవారం

దృశ్యం… (పూర్తి నవల)

 

                                                                                      దృశ్యం                                                                                                                                                                                                                           (పూర్తి నవల) 

అనుకోకుండా ఒక దృశ్యాన్ని తన కెమేరాలో బందించింది ఈ నవలలోని నాయకురాలు. ఆ దృశ్యం: హీరో ఒక అమ్మాయిని హత్య చేయడం. ఆ హీరో, ఈ నవలలోని నాయకురాలి అక్కను పెళ్ళి చేసుకోబోతాడు.

ఒక హంతకుడు తన అక్కయకు భర్తగా రాకూడదని ఈ నవలలోని నాయకురాలు  పెళ్ళిని ఆపటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ, ఏమీ చేయలేకపోతుంది. వివాహం జరిగిపోతుంది.

వివాహాం జరిగిన తరువాత నిజం తెలుస్తుంది. తన పెళ్ళిని నాయకురాలి అక్క ఆనందంగా అంగీకరిస్తుంది. నాయకురాలు ఆశ్చర్యపోతుంది.

అసలు జరిగింది ఏమిటి? హత్యను తన కెమేరాలో బంధించినా నాయకురాలు ఎందుకు ముందే నిరూపించలేకపోయింది? అక్కయ్య హంతకుడైన ఒకడ్ని ఎందుకు పెళ్ళి చేసుకుంది? అంటే పెళ్ళికి ముందే అతను హంతకుడని ఆమెకు తెలుసా?

వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకోవటానికి ఈ నవలను చదవండి.

ప్రియంవద తనని అందంగా అలంకరించుకుంది!

వేసుకున్న మేకప్ సరిగ్గా ఉన్నదో, లేదో తెలుసుకోవటానికి తన గదిలోనే ఉన్ననిలువెత్తు అద్దంలో ఒకసారి చూసుకుంది.

వెనుక వచ్చి నిలబడ్డాడు తమ్ముడు గౌతం.

"సూపర్ గా ఉన్నావు ప్రియా! పెళ్ళి అక్కయ్యకా...నీకా?"

"ఏరా...నేను అలంకారం చేసుకోకూడదా?"

"రాత్రి పడుకునేటప్పుడు కూడా 'మేకప్' లేకుండా పడుకోవే! నిన్ను పోయి అలంకారం చేసుకోకూడదని చెప్పగలనా?" వెక్కిరించాడు తమ్ముడు గౌతం.

"రేయ్...నిన్ను" అంటూ తన చేతిలో ఉన్న దువ్వెనతో చిలిపిగా తమ్ముడ్ని కొట్టింది ప్రియంవద.

ఇంతలో తల్లి పిలుపు వినబడింది.

"ప్రియా, గౌతం...టిఫెన్ తినాడానికి రండి..." 

ఇద్దరూ బయటకు వచ్చారు.

"అమ్మా! త్వరగా టిఫెన్ పెట్టు. నేను బయటకు వెళ్ళాలి" వాష్ బేసిన్ దగ్గర చేతులు శుభ్రం చేసుకుంటూ తొందర పడింది ప్రియంవద.

"టిఫెన్ కు రమ్మన్నది నేను. నన్నే హడావిడి పెడుతున్నావా...అసలు ఎక్కడికే వెడుతున్నావు?" అడిగింది తల్లి రాజేశ్వరి.

"ఇలా అడిగితే...వెళ్ళే పని సక్సస్ అవుతుందా...?"

అక్కాతమ్ముళ్ళిద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు.

తండ్రి రామకృష్ణ టెన్షన్ పడుతూ అక్కడికి వచ్చాడు.

డాన్స్ మాస్టర్ కి మధ్యే జాతీయ అవార్దు లభించింది...అందుకే ఇంటర్ వ్యూ!

అంతస్తు నుండి సిటీ మొత్తం కనబడుతోంది.

ప్రియ, కెమెరా మాన్ జోసఫ్...మరో ఇద్దరు స్టాఫ్ డాన్స్ మాస్టర్ కోసం కాచుకోనున్నారు.

ప్రియా మెళ్ళగా నడుచుకుంటూ ఓపన్ టెర్రస్ నుండి సిటి అందాలను తిలకిస్తోంది.

సిటీ అందాలు ఆమెను మురిపించడంతోతన దగ్గరున్న తన పర్సనల్, లేటస్ట్ టెక్నాలజీ కెమెరాను బయటకు తీసింది. దానికి ఒక అతి నవీన లెన్స్ ఫిక్స్ చేసి దూరంగా కనబడుతున్న ఎత్తైన భవనాల అందాలను చూస్తూ, అందాలను రికార్దు చేస్తోంది.

అలా చూస్తూ వస్తున్న ప్రియంవద చూపులు సడన్ గా ఒకచోట ఆగినై.

దూరంగా పూర్తికాని ఒక ఎత్తైన భవనం...దాని చివర్లో మనిషిని భయపెట్టే ఒక దృశ్యం.

ఒక అమ్మాయిని ఒక మగమనిషి గొంతు పిసికి చంపుతున్నాడు. ఆమ్మాయి గింజుకుంటోంది. మగమనిషి వెనుకభాగమే కనబడుతోంది. మొహం తెలియటం లేదు.

ప్రియంవద శరీరంలో కొద్దిగా వణుకు మొదలయ్యింది.

ధైర్యం తెచ్చుకుని కెమెరాలో నుండి మళ్ళీ చూసింది.

ఈసారి...పిట్టగోడ చివరి అంచుపై ఆమె గొంతును నిక్కొ పెట్టి తన పూర్తి బలంతో బలంగా నొక్కుతున్నాడు.

అమ్మాయి కళ్ళు తేలేసి క్రిందకు ఒరుగిపోతున్న సమయం, అతని మొహం ముందుకు వచ్చింది.

ప్రియ తన కెమేరా ఫోకస్ ను పెంచింది. 

ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

దృశ్యం… (పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి