28, జనవరి 2023, శనివారం

కన్న రుణం… (కథ)

 

                                                                                    కన్న రుణం                                                                                                                                                          (కథ)

తల్లిదండ్రులు చనిపోతే కొడుకులు అంత్యక్రియలు నిర్వహించడం సర్వ సాధారణం. కొన్ని సంధర్భాలలో కూతుళ్లు కూడా చేయొచ్చని చాటిచెప్పారు కొందరు కూతుళ్లు. కన్న తల్లి-తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి రుణం తీర్చుకోవటం అతిపెద్ద పుణ్యం. ఈ కథలో ఇద్దరు అన్నదమ్ములకు ఆ పుణ్యం కూడా దొరకలేదు. ఎందుకో తెలుసుకోండి.

"రేపు మీ అమ్మా, నాన్నలను చూసిన వెంటనే ప్రేమంతా ఒలకబోసి కరిగిపోయి సంబరపడిపోకండి. ఏదో చూశామా...పత్రిక ఇచ్చామా అనుకుని వెంటనే బయలుదేరాలి..."  స్వర్ణ ఖచ్చితంగా ఉరమటంతో... సుందరం ఎప్పటిలాగా మౌనంగా రోజు దినపత్రికలో తల దూర్చాడు.

కొద్ది నిమిషాల తరువాత.......

"రండి...రండి..." అంటూ భార్య ఎవరినో ఆహ్వానిస్తున్న శబ్ధం విని తలెత్తి చూశాడు.

అతని తమ్ముడు మోహన్, అతని భార్య వనజ ,కూతురు శ్రీదేవితో కలిసి లోపలకి వస్తూ కనిపించాడు.

"రా రా... మోహన్ "

"అన్నయ్యా...రేపు అమ్మా-నాన్నలను చూడటానికి వెడుతున్నట్టు వదిన నిన్న 'ఫోన్ చేసింది. మేమూ మీతో వస్తాం. నా కూతురు పెద్ద మనిషి అయిన విషయం వాళ్ళకు తెలియదు. దాన్ని నేరుగా తీసుకువెళ్ళి చూబిద్దామని అనుకున్నాను" అని మోహన్ చెప్పగా....    

'నేను మాత్రం చేసిందేమిటి...ఇళ్లు కట్టుకోవటానికి స్థలం కొన్న విషయం కూడా చెప్పకుండా గృహప్రవేశానికి ఆహ్వానపత్రిక ఇవ్వబోతున్నాను నేను...' అని మనసులోనే గొణుకున్నాడు సుందరం.

ఏంటన్నయ్యా...ఆలొచిస్తున్నావు?  ‘కూతురు పెద్ద మనిషై ఒక సంవత్సరం అవబోతోంది...ఎందుకు ఇంతవరకు చెప్పలేదు?’అనే కదా ఆలొచిస్తున్నావు! వెంటనే చెప్పాలనే నాకు ఆశ. కానీ వనజ...'అది చిన్న పిల్ల. విషయం తెలిస్తే మీ అమ్మ వెంటనే సంబరాలు అంటూ సంప్రదాయాలు ప్రారంభిస్తుంది. నాకు అది ఇష్టం లేదు అని చెప్పి ఒక్కసారిగా నా నోరు నొక్కేసింది!  

ఇక్కడ మాత్రం ఏమిటి జరుగుతోంది? స్థలం కొన్న వెంటనే చెప్పాలనే అనుకున్నాను. దాని గురించి మాట్లాడిన వెంటనే మీ వదిన దయ్యంలాగా ఉగిపోయింది. 'చెప్పిన వెంటనే మా నాన్నలాగా మీ నాన్న పది లక్షల రూపాయలు తీసిచ్చి 'ఉంచుకోబ్బాయ్!' అని చెబుతారా ఏమిటి?' - అంటూ ఎన్నో మాటలు మాట్లాడింది. అన్నీ విని ఇలా ఏమీ చేయలేని దద్దమ్మగా ఉన్నాను...'అని మళ్ళీ గొణుక్కున్నాడు సుందరం.  

ప్రేమ చూపించటానికి కూడా డబ్బులు కావాలనే వలయంలోకి తోయబడ్డట్టుగా ఇద్దరం మారిపోయామే? డబ్బు ముందు ప్రేమ, అభిమానం అన్నీ ఓడిపోతున్నాయే!'

వీళ్ళిద్దరూ భార్యల దగ్గర చేతకాని వాళ్ళులాగా ఉండటానికి వాళ్ళ అమ్మ ఒక కారణమో?

అమ్మ చాలా మమకారం గలది. చిన్న వయసులో పిల్లలు చేసే తప్పులకు దండన అని ఏమీ ఇవ్వక ప్రేమ మాటలతో కొట్టి...అభిమానంతో భయపెట్టేది. ఆడవాళ్ళను గౌరవించటాన్ని నేర్పించింది.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

కన్న రుణం… (కథ) @ కథా కాలక్షేపం-1

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి