ప్రేమ కలలు (పూర్తి నవల)
సుధీర్ అనే ఒక అనాధ, జీవితంలో విజయం సాధించటమే కాకుండా సమాజంలో
విడిచిపెట్టబడ్డ మహిళలకు ఆదరణగా ఉంటాడు. అతను స్థాపించిన మహిళా హోమ్ లో జీవిస్తున్న
మహిళలలో తన తల్లిని చూసుకునే అభిమానం కలిగినవాడు.
అంజలి అనే ఒక యువతి, తన తల్లిని మహిళా హోమ్ లో చేరుద్దామని వస్తుంది.
తనకు ఉద్యోగం దొరికేంత వరకు తాను హోమ్ లో అమ్మతో ఉండటానికి అనుమతి అడుగుతుంది.
మొదట అనుమతించని సుధీర్ తరువాత అంగీకరిస్తాడు.
కొన్ని రోజులలో
సుధీర్-అంజలి ఒకరినొకరు ఇష్టపడతారు. కలలు కంటారు. ధైర్యం చేసి సుధీర్ ఒక రోజు తన
ప్రేమను అంజలి దగ్గర చెబుతాడు. తన తల్లి 'మన ప్రేమను అంగీకరిస్తేనే తాను పెళ్ళికి ఒప్పుకుంటాను ' అని చెబుతుంది. కానీ అంజలి తల్లికి 'ప్రేమ ' అంటేనే ఇష్టం లేదు. వాళ్ళిదరీ ప్రేమను అంగీకరించదు.
అంజలి అందరిలాగానే
ఆశాప్రీతికి కట్టుబడినదే. కానీ ఆమె తల్లి యొక్క కథ మిక్కిలి అసాధారణమైనది. ప్రేమను
విపరీతంగా ఎదురిస్తుంది. ప్రేమంటే ఆమెకు ఎందుకంత విరక్తి? ఆ విరక్తి మారిందా? అంజలి
యొక్క నిజమైన ప్రేమ కల నెరవేరిందా? లేదు తన తల్లి కోసం అంజలి
ప్రేమను త్యాగం చేసిందా?
‘రంగుల
కలలు’ అనే
పేరు రాయబడ్డ
ఇంటి ముందు
పెద్దగా అరుస్తున్నాడు
సుధీర్. అందంగా
ఉండే అతని
ముఖం, విపరీతమైన
కొపంతో ఎర్రబడింది.
అతను చూపులు
లోపలకు రావడంతో
అక్కడ పనిచేస్తున్న
గోపి , రాజా
దాక్కున్నారు.
“బాబాయ్...ఎక్కడికెళ్ళారు? చాలా
సేపటి నుండి
అరుస్తున్నాను.
ఇక్కడ నేను
వృద్దాశ్రమం నడుపుతున్నానా...లేక
హాస్టల్ నడుపుతున్నానా? దీన్ని
ఇల్లులాగా చూసుకోవాలని
చెప్పాను కదా? ఇప్పుడు
మీరు నా
ముందుకు వస్తారా
లేకపోతే పనిలోంచి
తీసేయనా?”
రాజా మెల్లగా
తల బయటకు
పెట్టాడు.
“ఏం
తమ్ముడూ...ఎందుకు
అరుస్తున్నారు?”
“నిదానంగా అడగండి.
నన్ను మీకు
తెలియదా? ఈ
రోజు ప్రొద్దుటి
టిఫిన్ బాగుండలేదని
చెబుతున్నారు. గోపి
బాబాయ్ ఎక్కడ?”
“ఇదిగో
ఇక్కడున్నా తమ్ముడూ”--కుంటుకుంటూ
నడిచి వచ్చాడు.
“ప్రొద్దున
ఏం టిఫిన్
పెట్టారు?”
“ఉప్మా’. నిన్న
కరెంటు కట్.
అందువల్ల పిండి
రుబ్బలేకపోయాము.
రేపు ఇడ్లీ
వేస్తాను తమ్ముడూ”
“అది
సరే. ఎందుకు
ఉప్మాను ఉడకకుండా
పెట్టారు? చూడండి...ఇక్కడున్న
కొందరికి పడలేదు.
నేను ఎన్నిసార్లు
చెప్పాను...’ఇక్కడున్న
వాళ్ళందరూ వృద్దులు.
బాగా ఎనర్జిటిక్
ఫుడ్ పెట్టాలి’
అని?”
“ఈ
రోజుకు క్షమించు
తమ్ముడూ. రేపటి
నుండి బాగా
చేస్తాను” అనటంతో లోపలకు
వెళ్ళాడు సుధీర్.
అతని తల
కనుమరుగయ్యాక మాట్లాడాడు
గోపి.
ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
ప్రేమ కలలు...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి