4, జనవరి 2023, బుధవారం

స్వర్గం-నరకం...(కథ)


                                                                                     స్వర్గం-నరకం                                                                                                                                                                    (కథ)

"నాకొక ఆశ! నెరవేరుస్తారా...? పుట్టింట్లో నెరవేరలేదు. మీరైనా నన్ను అర్ధం చేసుకుని నెరవేర్చండి"......కొత్తగా పెళ్ళి చేసుకున్న భార్య, భర్తను అడిగింది.

"మొదట నీ ఆశ ఏమీటో చెప్పు?"....అన్నాడు భర్త.

విన్న తరువాత తిట్టకూడదు. అదే సమయం పిచ్చి ఆశ అని తోసేయకూడదు"

"నువ్వు విషయం చెప్పు?"

భార్య చెప్పిన విషయం విని ఉలిక్కిపడ్డాడు భర్త.

ఒకరోజంతా ఆలొచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. మరుసటి రోజు భార్యతో అన్నాడు.

"తాలి కట్టినందువలన ఒకరి ప్రతిభను చంపటం, అది మహా పాపంతో సమానం. అందువలన నీ ఇష్టానికి విరుద్దంగా నేను నిలబడ దలుచుకోలేదు. కానీ...నేను సాధారణ, సరాసరి మనిషిని.  నాకు సొంతమైన వస్తువును ఇంకొకరు ముట్టుకునేటప్పుడు ఏర్పడే న్యాచురల్ వికారం నాలోనూ ఉన్నది కనుక నేనొక నిర్ణయం తీసుకున్నాను. దానికి నువ్వు కట్టుబడాలి"

భర్త నిర్ణయం విన్న భార్య ఉలిక్కిపడ్డది. "వద్దండి నా ఆశ నెరవేరకపోయినా పరవాలేదు" అన్నది.

అప్పుడు భర్త...భార్యతో అన్నాడు "జీవితమే సమస్య అనుకుని తప్పుకుంటే. నీ ఆశ, పట్టుదల లేనిది.  నేను నిన్ను ఎలా అర్ధం చేసుకున్నానో...అదేలాగా నువ్వు నన్ను అర్ధం చేసుకుని యుద్ద భూమిలో దిగు. ఆల్ ద బెస్ట్..."

భార్య చెప్పిన ఆశ ఏమిటి? దానిని నెరవర్చడానికి భర్త తీసుకున్న నిర్ణయమేమిటీ? ఉలిక్కిపడ్డ భార్య కు ఆల్ ద బెస్ట్ చెప్పి యుద్ద భూమిలోకి దిగమని భర్త ప్రోత్సహించిన ఆ యుద్ద భూమి ఏమిటి?......తెలుసుకోవాటానికి ఈ కథ చదవండి.

సింధుజాకి పట్టు శాలువా వేసి సత్కరించి అవార్డు ఇచ్చిన వెంటనే ఆ శభలో ఉత్సాహంతో చప్పట్లు మారుమోగినై. మొదటి వరుసలో కూర్చోనున్న లక్ష్మీప్రసాద్ మొహంలో మాత్రం ఎటువంటి సంతోషమూ లేదు. అందరూ చప్పట్లు కొడుతున్నారు కాబట్టి ఇష్టంలేకపోయినా శబ్ధం రాకుండా అతనూ చప్పట్లు కొట్టాడు.

"సింధుజా సంవత్సరం జాతీయ ఉత్తమ నటిగా ఎన్నుకోబడి, అవార్డు తీసుకున్నట్లే, రాబోవు సంవత్సరాలలో కూడా సాధించి, తన కళా సేవను దేశానికి అంకితం చేయాలని ఆమెను దీవిస్తున్నాను" అంటూ కత్తిలాగా మాట్లాడి తప్పుకున్నాడు మంత్రి.

తరువాత దర్శకుడు చక్రవర్తి మాట్లాడటానికి లేచాడు.

లక్ష్మీప్రసాద్ తన సీటు నుండి మెల్లగా లేచి, బయటకు నడిచాడు. వేదికపై కూర్చున్న సింధుజా అది గమనించింది. అప్పుడు ఆమె మనసులో ఏర్పడిన భారం ఆమె మొహంలో తేడా తెప్పించింది.

"సింధుజాని సినిమా ఇండస్ట్రీకి మొట్ట మొదట పరిచయం చేసిన నేను, ఆమెకు జాతీయ బహుమతి తెచ్చిపెట్టిన ఇరవై ఐదో చిత్రాన్ని కూడా నేనే నిర్మించి, దర్శకత్వం వహించానని అనుకుంటున్నప్పుడు నా మనసులో ఒక మంచి నటిని పరిశ్రమకు పరిచయం చేసేననే గర్వం కలుగుతోంది..." --- దర్శకుడు చక్రవర్తి మాట్లాడుతున్న  మాటలు చెవులలో మెల్లమెల్లగా సన్నగిల్లి చెవులకు తగలటం తగ్గుతుండగా......

లక్ష్మీప్రసాద్ వాహనాలు పార్క్ చేయబడ్డ మైదానంలో అత్యంత ఖరీదైన తన కారులో ఎక్కి, గాజు డోర్ దింపుకుని, సిగిరెట్టు వెలిగించి బయటకు పొగ వదిలాడు. మనసు పాత జ్ఞాపకాలలోకి వెళ్ళింది.

పెళ్ళై పది రోజులే అయిన ఒక రోజు రాత్రి. వేరు కాపురం. వైష్ణవి ఇంటి పనులు ముగించుకుని భర్త దగ్గరకు వచ్చి ఆనుకుని కూర్చుంది. అతని భుజాల మీద తల పెట్టుకుని "...మండీ..." బ్రతిమిలాడుతున్నట్టు పిలిచింది.

"ఏమిటి?"--- చేతితో ఆమె మొహాన్ని పైకెత్తి చూశాడు.

"నాకొక ఆశ! నెరవేరుస్తారా...?"

".................."

"పుట్టింట్లో నెరవేరలేదు. మీరైనా నన్ను అర్ధం చేసుకుని నెరవేర్చండి"

"మొదట నీ ఆశ ఏమీటో చెప్పు?"  

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.

'స్వర్గం-నరకం'...(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి