'నాన్నా' రా! (కథ)
ప్రతి చిన్న విషయానికీ కొడుకు, కోడలూ తనని తిడుతున్నారని, అవమానపరుస్తున్నారని భర్త దగ్గర మొరపెట్టుకుంది అరవై సంవత్సరాల రాజ్యం.
"ఏమండీ...ఇంకాసేపు కూడా నేను ఇక్కడ ఉండలేనండి. మన అబ్బాయి, కొడలూ మనల్ని కష్ట పెడుతుండటం నేను సహించలేకపోతున్నాను. రండి...ఎక్కడికైనా వెళ్ళిపోదాం!" ఏడుస్తున్న భార్య రాజ్యం ను చూసిన సుబ్రమణ్యానికి గుండె పగిలిపోయేటట్టు అనిపించింది.
"నా పెన్షన్ డబ్బుతో మనం ఎలాగైనా కాలం గడపవచ్చు రాజ్యం. కానీ, అరవై ఏళ్ళు దాటిన మన వొళ్ళు మనకి సహకరించటంలేదే"
"అయినా పరవాలేదండి. మీకు నేను, నాకు మీరు, ఇద్దరం ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఏలాగో కాలం గడిపేద్దాం.కానీ ఈ ఊరిలోనే మనం ఉండకూడదు. వీళ్ళ మొహాలనే చూడకూడదు. వీళ్ళ కళ్ళకు కనిపించనంత దూరం వెళ్ళిపోదాం"
“సరే రాజ్యం...నువ్వు ఏడవకు. నేను ఏర్పాటు చేస్తాను"
భార్య చెప్పినట్లు దూరంలో ఉన్న ఒక వృద్దుల వసతి గ్రుహంలో భర్త వాళ్ళు ఉండటానికి ఏర్పాటు చేశాడు. కొడుకూ, కోడలుకూ కనిపించనంత దూరానికి వెళ్ళిపోయారు...తీరా అక్కడికి వెళ్ళాక అక్కడ వాళ్ళకు జరిగింది ఇంకొకటి?.....అదేమిటో, ఎందుకుజరిగిందో తెలుసుకోవటానికి ఈ కథ చదవండి.
"అమ్మా...ఎప్పుడు చూడు నా భార్యతో గొడవపెట్టుకోవటం ఆపుతావా...లేదా? ఇక మీదట దాన్ని తిడితే నాకు పిచ్చి కోపం వస్తుంది!"---ఆవేశంలో కోపాన్ని కక్కుతున్న కొడుకు శ్రీకాంత్ ను చూసి ఆశ్చర్యపోయి, షాక్ తిన్నది తల్లి రాజ్యం.
"ఏమిట్రా చెబుతున్నావు...సునీతతో నేను గొడవ పడుతున్నానా? దాన్ని తిడుతున్నానా? అదే, 'నువ్వు ఇక్కడ కూర్చోకూ! ఇది తీయకు... అది తీయకు, దాన్ని తాకకు అని ఏదో ఒకటి చెబుతూనే ఉంటోంది"
పొంగుకు వస్తున్న కన్నీటిని తిరిగి కళ్ళల్లోకే పంపటానికి ప్రయత్నించి ఓడిపోయింది.
"సునీతా తోనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావని చూస్తే...నాతోనూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా?"
"ఏమిట్రా అబ్బాయ్...ఏదేదో మాట్లాడుతున్నావు! వయసైన కాలంలో, వొంట్లో బాగుండక ఏదో కష్టపడుతూ కాలం గడుపుతున్నాము...దాంతో పాటు ఎందుకురా మమ్మల్ని మాటలతోనే చంపుతున్నావు? మేము ఇక్కడ ఉండటం మీ ఇద్దరికీ ఇష్టం లేకపోతే చెప్పు. నేనూ, నాన్నగారూ ఎక్కడైనా వృద్దాశ్రమంలోకి వెళ్ళి జేరిపోతాము"
"........................" మౌనంగా నిలబడ్డాడు శ్రీకాంత్.
"ఏమండీ...ఇంకాసేపు కూడా నేను ఇక్కడ ఉండలేనండి. మన అబ్బాయి, కొడలూ మనల్ని కష్ట పెడుతుండటం నేను సహించలేకపోతున్నాను. రండి...ఎక్కడికైనా వెళ్ళిపోదాం!" ఏడుస్తున్న భార్య రాజ్యం ను చూసిన సుబ్రమణ్యానికి గుండె పగిలిపోయేటట్టు అనిపించింది.
."నా పెన్షన్ డబ్బుతో మనం ఎలాగైన్న కాలం గడపవచ్చు రాజ్యం. కానీ, అరవై ఏళ్ళు దాటిన మన వొళ్ళు మనకి సహకరించటంలేదే"
"అయినా పరవాలేదండి. మీకు నేను, నాకు మీరు, ఇద్దరం ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఏలాగో కాలం గడిపేద్దాం.కానీ ఈ ఊరిలోనే మనం ఉండకూడదు. వీళ్ళ మొహాలనే చూడకూడదు. వీళ్ళ కళ్ళకు కనిపించనంత దూరం వెళ్ళిపోదాం"
“సరే రాజ్యం...నువ్వు ఏడవకు. నేను ఏర్పాటు చేస్తాను"
రాజమండ్రి నుండి బయలుదేరిన రైలు హైదరబాద్ చేరుకుని నిట్టూర్పు విడిచింది. రైలుకు పలు గంటులు ప్రయాణం చేసిన బడలిక. వీళ్ళకు పలు సంవత్సరాలు శ్రమ పడ్డ బడలిక.
రైల్వే స్టేషన్లో నుండి బయటకు వచ్చారు.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకును క్లిక్ చేయండి:
"నాన్నా...రా"...(కథ) @ కథా కాలక్షేపం-1
***************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి