13, ఆగస్టు 2022, శనివారం

దాగుడు మూతలు...(సీరియల్)...(PART-10)

 

                                                                          దాగుడు మూతలు...(సీరియల్)                                                                                                                                                               (PART-10)

కొన్ని రోజులు ప్రశాంతికి  కొంచం ఎక్కువగానే ఆకలేస్తుంది. కానీ, ఏదైనా నీరాహారం తాగిన వెంటనే ఆకలి అనిగిపోతుంది. కొన్ని రోజులైతే అసలు ఆకలే ఉండదు. లేక అలసటతో కొట్టి పడేసినట్టు బండ నిద్ర పోతుంది.మధ్య మధ్యలో శ్రీనివాస్ జ్ఞాపకాలు ఆమెను పీడిస్తుంది.

కొత్తగా బంగళాకు వచ్చేవారికి మొదట అలాగే ఉంటుంది అని మల్లి చెప్పింది. ఆమెకూ అలానే ఉండేదట...ఇక్కడ కొచ్చిన కొత్తల్లో ఆకలే ఉండేది కాదట. తరువాత చోటు అలవాటు అయిన తరువాత నుంచి తట్టుకోలేనంత ఆకలి  వేసేదట. ఒకేసారి ఆరేడు పండ్లు తినేదట. అప్పుడు కూడా ఆకలి తగ్గేది కాదట.

వెంకటస్వామి కూడా కొన్ని రోజులు ఆహారాన్ని ఆమెకే ఇచ్చేవాడట. చాలా రోజులుగా ఉన్న సమస్య, ప్రస్తుతం తీరిపోయిందని ఆమె చెప్పింది.

మీకైనా వంట చేసి పెట్టటానికి ఇంట్లో మనిషి ఉంది. నాకు అలా కాదు. చోటుకు వచ్చినప్పుడు తెలిసిన వారు ఎవరూ లేరు. ఆలయంలో అప్పుడప్పుడు ఇచ్చే భోజనాన్ని తిన్నాను అన్నది మేరీ.

నేనే అడగాలనుకున్నాను. మీరందరూ ఎలా స్నేహితులు అయ్యారు. ఎవరికీ ఒక చిన్న సంబంధం కూడా లేదే?”  అని అడిగేసి వాళ్ళు ఎక్కువసేపు మౌనంగా ఉండటంతో ఏదైనా తప్పుగా అడిగేశానా?’ అని వెనక్కి తిరిగింది ప్రశాంతి. వాళ్ళందరూ ఏదైనా అనాధ ఆశ్రమం నుండి వచ్చుండచ్చు. తాను అలా అడిగింది వాళ్ళ మనసును బాధ పెట్టుంటుందిఅనుకుని పశ్చాతాపంతో తప్పుగా అడుగుంటే క్షమించండిఅన్నది.

తప్పే లేదమ్మా. మహాబలేశ్వర్ లో పుట్టిన గోదావరి ఆంధ్రా వచ్చి సముద్రంలో కలవటం లేదా? అదేలాగా ఆదరించే వాళ్ళే లేని వేరు వేరు చోట్ల నుంచి పనికోసం ఇక్కడికి వచ్చిన మాకు, ఒకే చోట ఉండి పనిచేసే అవకాశం వచ్చింది. అలా స్నేహితులయ్యాము

ఆదరించే వాళ్ళే లేని మేము...అని మేరీ చెప్పింది ప్రశాంతి మనసును వేధించింది. ఇంక మీదట వాళ్ళను ఏమీ అడగకూడదు అని నిర్ణయించుకుని ...వేరే విషయం గురించి మాట్లాడటం మొదలుపెట్టింది.

పిల్లలు టాబ్లెట్లు ఇంకా వేసుకోలేదనే విషయాన్ని వాళ్ళ మూలం తెలుసుకున్న ప్రశాంతి, సరసు ను పిలిచి విచారించింది.

మాత్రలు అయిపోయినై అమ్మా

నా దగ్గర అడిగి తీసుకోనుండచ్చు కదా?”

లేదమ్మా! నిన్న కూడా మాత్ర ఇవ్వలేదు. ఇద్దరూ బాగానే ఉన్నారు. అందుకనే మీ దగ్గర చెప్పలేదు

సరసు చెప్పిన తరువాతే తనకి రోజూ వచ్చే తలనొప్పి కొద్ది రోజులుగా రాలేదనేది ప్రశాంతి జ్ఞాపకానికి వచ్చింది. అయినా కూడా పిల్లల విషయంలో ఆమె మెతకగా ఉండటం ఇష్టపడలేదు.

పరవాలేదు...కానీ, మాత్రలు ఆపద్దు. ఖాలీ సీసా తీసుకురా, మాత్రలు నింపి ఇస్తాను అని చెబుతూ గదిలోకి వెళ్ళింది.

ప్రశాంతి, కళ్ళ నుండి కనిపించకుండా వెళ్ళిన తరువాత, మాత్ర బాటిల్ తీసిన సరసు -- అందులో ఉన్న, ఇంకా కొంచం కూడా తగ్గని మాత్రలను తీసి అలాగే పారేసింది. 

ఇంటి పరిస్థితిలో కొంచం కొంచం మార్పు రావటం మొదలయ్యింది. అయోమయంలో ఉన్న ప్రశాంతికి ఏదీ తెలియలేదు. దాన్ని మొదటిగా కనిపెట్టిందేమో గిరిజనే. ప్రశాంతి దానిని పూర్తిగా గ్రహించే లోపు అన్నీ చేతులు దాటి పోయాయి.

రోజు పిల్లలిద్దర్నీ ఒంటరిగా వేరు వేరు గదుల్లో కూర్చోబెట్టి, లెక్కలు ఇచ్చేసి లైబ్రరీలో వచ్చి కూర్చుంది. అప్పుడు గాజు వస్తువు ఒకటి విరిగే శబ్ధం విన్నది.

దాంతో పాటూ ఎవరో అని అరిచిన శబ్ధము. పడిపోయే పరిస్థితిలో ఉన్న పాత గాజు లైటు క్యాండిల్స్, ఒంటరిగా కూర్చుని చదువుతున్న పిల్లలను గుర్తుకు తెచ్చుకుని, వేగంగా పరిగెత్తింది. క్రింద కూర్చుని ప్రశాంతంగా చదువుకుంటున్నాడు రాఘవ్.

గిరిజా... అని పిలుస్తూ మేడమీదకు వేగంగా వెళ్ళింది.

ఏమైంది గిరిజా, అరిచావా?”

లేదే!

అమ్మ దగ్గర అబద్దం చెప్ప కూడదు. ఇప్పుడు నిజం చెప్పు

నేను అరవలేదు. కానీ అరిచింది ఎవరో నాకు తెలుసు

సరే...ఎవరు?”

పిల్లాడే

ఎవరు? రోజేమో రాజాలాగా దుస్తులు వేసుకుని వచ్చాడని చెప్పావే...వాడా?” ఎగతాలిగా అడిగింది.

ఏది చెప్పినా తన తల్లి నమ్మబోయేది లేదు అనే ఆలొచనలో, వేరే విధంగా చెప్పింది.

లేదు...ఇతను వేరు

గిరిజను నమ్మకుండా చూసిన ప్రశాంతి, “దేనికి అబ్బాయి అరుస్తున్నాడు? అది కూడా చెప్పు...విందాం

వాడికి ఇల్లు నచ్చలేదట. అందరం వాడిని విసిగిస్తున్నామట. ఒకటి వాడు వేరే చోటుకు వెళ్ళాలట, లేదు మనం ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాలట. అరుస్తూ ఫోటోలన్నిటినీ విరక్కొట్టాడు

గిరిజ చూపించిన చోట నాలుగైదు ఫోటోలను ఎవరో కింద పడేసి విరకొట్టారు. 

                                                                                                        Continued...PART-11

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి