15, ఆగస్టు 2022, సోమవారం

దాగుడు మూతలు...(సీరియల్)...(PART-11)

 

                                                                        దాగుడు మూతలు...(సీరియల్)                                                                                                                                                                (PART-11)

ప్రశాంతి, పిల్లలూ 'ప్రశాంతి నిలయం'కు వచ్చి ఒక వారం పైనే అయ్యింది. రోజు ఆమెకు నచ్చిన వంటను చేసి వడ్డించి ఆమెను ఆశ్చర్యపరిచింది మల్లి. అక్కడకు వచ్చిన తరువాత ప్రశాంతి ఒక్క పూట కూడా సరిగ్గా తినలేదు. ప్రొద్దున లేచిన దగ్గర నుంచే ప్రశాంతికి  మంచి ఆకలి. దానికి తగినట్లు వంట  బ్రహ్మాండంగా ఉంది. చాలా రోజుల తరువాత ముగ్గురూ కడుపు నిండుగా లాగించారు. ఆనందంగా ఆడుకున్నారు. ముగ్గురికీ పొద్దున నుండి మారి మారి శ్రీనివాస్ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి.

నాన్న మనల్ని తలుచుకుంటారా అమ్మా? మనం ఇక్కడున్నది ఆయనకు తెలుసా? అయితే ఎందుకు ఇంకా మనల్ని చూడటానికి రాలేదు?” అని పిల్లలు అడిగే ప్రశ్నలకు విలవిలలాడిపోయింది తల్లి. 

సమాధానమెదురు చూసి కాచుకోనున్న పిల్లల దగ్గర, “ఖచ్చితంగా మీ నాన్న మిమ్మల్ని చూడటానికి వస్తారు. ఇప్పుడు మీకు ఇష్టమైన పాయాసం ఇదిగో అని చెప్పి, వేరే కథలను మాట్లాడటం ప్రారంభించారు మల్లీ, సరసు.

ఇక్కడకు వచిన ఎవరూ ప్రశాంతి దగ్గర, ఆమె భర్త గురించి ఒక్క మాట అడగలేదు. నాగరీకం తెలిసిన వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉన్న గుణం, హైదరాబాదులో ఆమె చుట్టూ ఉన్న వాళ్ళకు ఉండుంటే ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని అనాధలాగా చోటు మారి వచ్చేది కాదు.

పెళ్ళికి ముందు శ్రీనివాస్ ని చాలా ఇష్టపడింది ప్రశాంతి. శ్రీనివాస్, ప్రశాంతి మేనమామ కొడుకు. కానీ, అతను ప్రశాంతిని ఇష్టపడలేదు. అతనికి ఎందుకో ప్రశాంతి యొక్క తండ్రి -- అంటే కొంచం కూడా ఇష్టం ఉండదు. అత్తయ్యను చూడటానికి మాత్రం మాటి మాటికి ప్రశాంతి ఇంటికి వచ్చి వెడతాడు. తన అమ్మమ్మ వేసే దూపం వలన, మేనమామ ఇచ్చిన వాగ్ధానం వలన ప్రశాంతికి శ్రీనివాస్ మీద ఉండే ప్రేమ మూడు కాయలూ, ఆరు పండ్లు లాగా రంగురంగులుగా మారటానికి కారణమయ్యింది.     

ప్రశాంతి తండ్రి మార్తాండ చక్రవర్తికి సినిమా మనుషులతో సంబంధం ఉన్నందువలన, అప్పుడప్పు డు ఆయన్ని చూడటానికి కలల ప్రపంచానికి చెందిన చాలా మంది డబ్బుకొసం వచ్చి వెడుతుంటారు. మార్తాండ చక్రవర్తి మాట సహయం చేస్తే తన కూతురు, సినిమాలలో సహనటిగా నటిస్తున్న స్నేహలత తల్లి -- తన కూతురు స్నేహలతకి ఒక హీరోయిన్ ఛాన్స్ ఇప్పించమని మార్తాండ చక్రవర్తిని బ్రతిమిలాడి అడిగింది. కానీ చూద్దాంఅని చెప్పి పంపించారు చక్రవర్తి గారు. తల్లితో పాటూ వచ్చిన స్నేహలత కళ్ళు మాత్రం అక్కడ దూరంగా, తన అత్తతో మాట్లాడుతున్న శ్రీనివాస్ చుట్టూ తిరిగింది.   

చాలా సేపు తనని ఎవరో గమనిస్తున్నారని ఊహించిన శ్రీనివాస్, కళ్ళతోనే తనను ఆరాధించిన అమ్మాయిపైన చూపులు పెట్టాడు. ఏమీటీ?’ అంటూ కురులు పైకెత్తి అడిగిన అతన్ని చూసి సిగ్గుతో తలవంచుకుంది అమ్మాయి.  శ్రీనివాస్ కి ఆశ్చర్యం. అతన్ని చూసి ఎవరూ సిగ్గుపడింది లేదు. అతని మేనమామ కూతురు ప్రశాంతి కూడా తలెత్తుకుని నడవటం, తిన్నగా శ్రీనివాస్ కళ్ళల్లోకి చూడటం చేస్తుంది. 

అతను గనుక ఇలా ప్రశాంతిని చూసుంటే ఆమె తటపటాయించకుండా, ‘ఏమిటి బావా మీకు ఏం కావాలి?’ అని అడుగుంటుందే తప్ప, ఇలా సిగ్గుపడి నిలబడదు.

తన కూతుర్ని చూసి ఆనందపడుతున్న శ్రీనివాస్ ని చూసిన స్నేహలత తల్లి ఒక క్లియర్ లెక్క వేసింది.

తమ్ముడు, అయ్యగారి అల్లుడే కదా?” అని అడిగి క్లియర్ చేసుకున్న ఆమె బాగున్నారా? వారం మా స్నేహలత యొక్క నాట్య ప్రోగ్రాం ఉన్నది మీరు తప్పకుండా రావలి అని శ్రీనివాస్ దగ్గర అభ్యర్ధన పెట్టింది.

స్నేహలత తల్లి యొక్క మనోలెక్క ఖచ్చితంగా ఫలించింది. శ్రీనివాస్, స్నేహలత చాలా చోట్ల కలుసుకోవటం మొదలుపెట్టారు. ప్రశాంతికి విషయం తెలియటంతో... రోజే ఆమె మొట్ట మొదటిసారిగా ఏడ్చింది. 

నీ బావ పెద్ద మత్తులో ఉన్నాడు. అతన్ని కాపాడటం కష్టం -- అన్నాడు తండ్రి మార్తాండ చక్రవర్తి.

ప్రశాంతీ, పెళ్ళి విషయంలో మాత్రం -- ఇష్టంలేని వాళ్ళను బలవంతం చేయకూడదు. అలా చేస్తే మీ ఇద్దరి జీవితం అతకదు. శ్రీనివాస్ అతని మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకోనీ"  -- అన్నది తల్లి  కుమారి.

"అతని మనసుకు నచ్చింది బంగారంగా ఉంటే పరవాలేదు! నేనే పెళ్ళి చేసే వాడిని. అది కనీసం బంగరు రేకు కూడా కాదు. ఇనుప రేకు. ఎలా పెళ్ళి చేయను?" అన్నాడు మార్తాండ చక్రవర్తి. 

ఇది అతని జీవిత సమస్య. అతనే ఒక నిర్ణయానికి రావాలి

నాన్నా, నేను బావను చాలా ఇష్టపడుతున్నాను. బావను వదిలేసి నేను  ఉండలేను. నాకు ఎలాగైనా బావను ఇచ్చి పెళ్ళి చేయండి అన్న ప్రశాంతి యొక్క దృఢమైన మాటలు అక్కడ చివరగా గౌరవించ బడ్డాయి.

స్నేహలతకి హిందీ సినిమాలో పిలుపురాగా, ఆమె శ్రీనివాస్ ను తప్పించుకోవటం మొదలుపెట్టింది. మనో భారంతో ఉన్న అతను, ఆరొగ్యం క్షీణించిన బామ్మ మాటకు కట్టుబడి పెళ్ళి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు.  

కానీ, ప్రశాంతి తనకు వద్దని చెప్పాడు. సొంత వారిని పెళ్ళి చేసుకోవటం మంచిది కాదన్నాడు. దానికి కారణం కూడా చెప్పాడు. పుట్టే పిల్లలకు అంగవైకల్యం ఏర్పడటానికి అవకాశం ఉందన్నాడు.

కానీ, శ్రీనివాస్ తండ్రి సత్యాగ్రహం చేసి ప్రశాంతికి, శ్రీనివాస్ కూ పెళ్ళి చేసారు.

పై చదువులు కారణం చూపి ఇద్దరినీ ఇంగ్లాండ్ కు పంపారు మార్తాండ చక్రవర్తి. బయలుదేరే ముందు తన కూతురితో ఒంటరిగా మాట్లాడాడు.

ప్రశాంతీ తల్లీ! చాలా కష్టపడి స్నేహలతకి హిందీ సినిమాలో నటించటానికి ఛాన్స్ ఇప్పించి, ఆమెను నీ భర్త దగ్గర నుండి వేరు చేశాను. దీనికి పూర్తిగా ముప్పై లక్షలు ఖర్చు అయ్యింది. కాబట్టి, నువ్వెళ్ళే చోటునే - అంటే లండన్ లోనే పిల్లా పాపలతో సెటిల్ అయిపో. స్నేహలత, వాళ్ళ అమ్మ చాలా చెడ్డవాళ్ళు. వాళ్ళ వలన నీకు రోజైనా ఆపద రావచ్చు. అల్లుడి మనసులో చోటు పట్టుకోవటం మాత్రమే నువ్వు వాళ్ళ దగ్గర నుండి తప్పించుకోవాటానికి ఒకేదారిఅని చెప్పి వాళ్ళను లండన్ కు పంపించాడు.

ఇంగ్లాండుకు వెళ్ళిన వెంటనే పై చదువుకు యూనివర్సిటీలో చేరాడు శ్రీనివాస్. ఇంటి నిర్వాహం చూసుకుంటూ, పక్కనే ఉన్న ఒక ఆఫీసులో ఉద్యోగం వెతుక్కుంది ప్రశాంతీ.

వొళ్ళు హూనమయ్యేటట్టు పనిచేసి, ఎక్కువ డబ్బు సంపాదించి సంపాదనతో శ్రీనివాస్ కు ఒక ఖరీదైన, కొత్త డిజైన్ డ్రస్సు కొనిచ్చింది.

పచ్చ రంగు చీరలో దేవతలా కనిపించిన ఆమె దగ్గరకు ఆశగా చేరుకున్నాడు. పసుపుతాడు మంత్రం, శ్రీనివాస్ దగ్గర పనిచేయటం మొదలుపెట్టింది. నది అక్కడ సముద్రంలో కలిసింది. స్నేహలత చూపిన మాయ అంతా  కనుమరుగయ్యిందిఅంటూ తప్పుడు లెక్క వేసుకుని కుతూహలమయ్యింది ప్రశాంతీ యొక్క ప్రేమ మనసు.

సంతోషంగా సాగిపోతున్న ఆమె జీవితంలో మొదటి తుఫాన మొదలయ్యింది. గిరిజకు ఆయసం వచ్చింది. దగ్గర బంధుత్వంలో పెళ్ళి. అందుకనే వద్దని చెప్పానుఅన్న భర్తను ఎలాగో సమాధానపరిచి, సాగించిన జీవితంలో రెండోవాడుగా పుట్టిన రాఘవ్ కు కూడా అదే ఆరొగ్య సమస్య వచ్చింది. ఇది వారసత్వ సమస్యేఅని చెప్పింది మందుల ప్రపంచం.

మందులు రెగులర్ గా వాడితే పరిస్థితి కట్టుబాటులో ఉంటుంది అని వివరణ ఇచ్చింది. ఇది శ్రీనివాస్ యొక్క వాదనకు మరింత బలం చేకూర్చింది -- దీని వలన అతనికీ, ప్రశాంతీకి మనసులో బీట్లు పడటం మొదలయ్యింది. అప్పుడే ప్రశాంతీ తప్పు చేసింది. శ్రీనివాస్ మాటలు విని అతనితో పాటూ ఇండియాకు వచ్చింది. స్నేహలత కూడా వాళ్ళ జీవితంలోకి మళ్ళీ జొరబడింది.

తన గ్లామర్ను మాత్రమే నమ్ముకున్న స్నేహలత, పోటీ నిండిన హిందీ సినీ ప్రపంచంలో విజయం సాధించలేకపోయింది. తెలుగులోనూ తనకున్న స్థానాన్ని పోగొట్టుకుంది. కనుక గ్లామర్ కలిగిన -- రెండు, లేక మూడవ హీరోయిన్ గానూ, విల్లీగానూ నటించటం మొదలు పెట్టింది. 

పరిస్థితుల్లో ఒక ఫంక్షన్ లో తిరిగి శ్రీనివాస్ ను కలిసింది స్నేహలత. అతని యొక్క ప్రస్తుత అంతస్తు, డబ్బు, ఊర్లో అతనికున్న మర్యాద ఆమెను ఆశ్చర్యపరిచింది. తల్లి మాట విని అతన్ని వదులుకున్నది మూర్ఖత్వంగా భావించింది. శ్రీనివాస్ తో కలిసి నిలబడ్డ ప్రశాంతీని చూసి ఈర్ష్య పడింది. తన  జీవితాన్ని ప్రశాంతీ కైవసం చేసుకుందని విసుగు పడ్డది.    

స్నేహలత అతన్ని పెళ్ళి చేసుకోనుంటే, శ్రీనివాస్ ఎక్కడో ఒక గుమాస్తా గానే  ఉండేవాడని మూర్ఖత్వ మహిళకు అనిపించలేదు.

ఎప్పుడైనా సరే తెలివిగల వాడితో యుద్దం చేస్తే అది ఎంతో గౌరవంగా ఉంటుంది. మూర్ఖులు నిజంగా ప్రమాదకరమైన వాళ్ళు. స్నేహలత కూడా గుంపులో ఒకత్తే. ఆమె బుర్ర దొడ్డి దోవలోనే పనిచేసింది.

శ్రీనివాస్ ని వెంబడించి వెళ్ళి అతన్ని కలిసిన ఆమె -- అతన్ని వద్దన్నందుకు ఒక పెద్ద కారణం చెప్పింది. ఆ కారణం శ్రీనివాస్, ప్రశాంతి ని విడిచి స్నేహలతని పెళ్ళి  చేసుకోవాలనేంత శక్తి కలిగినిదిగా ఉన్నది.  

                                                                                                           Continued...PART-12

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి