11, ఆగస్టు 2022, గురువారం

దాగుడు మూతలు...(సీరియల్)...(PART-9)

 

                                                                         దాగుడు మూతలు...(సీరియల్)                                                                                                                                                                 (PART-9)

పుల్లాయమ్మ కు భర్త తీసుకు వచ్చిన పది రూపాయల కాగితాలను చూడ చూడ ఆనందం పొంగి పొర్లింది. గ్రామంలో డబ్బుతో పెద్దగా అవసరంలేదు. చాలా వరకు సరకు మార్పడి వ్యాపారమే ఆచారం. ప్రొద్దున పాలు పితికి పోసేసి, కోడి గుడ్లు లెక్కపెట్టి ఇచ్చేసి, దానికి మార్పిడిగా షాపతని దగ్గర నుండి వారానికి ఒకసారి బియ్యం, పచారి సరకులు తీసుకు వస్తాడు.

పార్వతమ్మ ఇంటికి పోసే పాలుకు బదులుగా ఆమె తోటలోని చేమదుంప, క్యాబేజీ, క్యారెట్టు, బంగాళదుంప సీజన్ కు తగినట్టు కాయగూరలు వస్తాయి. ఇలా ఒక్కొక్కరూ సరకు మార్పడే  ఇస్తారు.  చేతికి చిల్ల గవ్వ ఇవ్వరు. కానీ అప్పుడప్పుడు, సమయం దొరికినప్పుడు, కూలీ పనికి వెళ్ళి రావటంతో వచ్చే డబ్బును  చేర్చి పెట్టి, ఆమె, ఆమె  భర్త రెండు సంవత్సరాలకు ఒకసారి ఎండాకాలం సెలవులప్పుడు తిరుపతికి వెళ్ళి వస్తూ ఉంటారు. ఆమె యొక్క అతిపెద్ద కోరిక అదే.   

రెండు పది రూపాయల నోట్లు, వాళ్ళ రెండు నెలల సేవింగ్స్.

ఇప్పుడైనా చెప్పు మామా...నీకెక్కడిది ఇంత డబ్బు?”

భార్య యొక్క సంతోషాన్ని చూస్తూ, నవ్వుతూ చెప్పాడు మన ఎర్ర ఇంటికి ఎవరో కొత్తగా అద్దెకు వచ్చారు. రోజూ పాలూ, కాయగూరలు, కోడిగుడ్లు ఇమ్మని అడిగారు

భర్త చెప్పిన ఆ మాటలు విని పుల్లాయమ్మ మొహంలోని సంతోషమంతా అనిగిపోయి సూదితో గుచ్చిన బలూన్ లాగా సన్నబడి పోయింది.

ఏం మావా... దయ్యాల కొంపకా అద్దెకు వచ్చారు? పోయిన వారం కూడా ఇంటివైపు వెళ్ళిన మన మంగమ్మ కొడుకు, అదే నండి రాజు గాడికి పూజారి మంత్రం వేసి పంపాడే. నీక్కూడ తెలుసు! నువ్వైనా ఇంటి గురించి ఆ ఇంట్లో వాళ్ళకు చెప్పకూడదా?”

చెప్ప కుండా ఉంటానా. చెబితే వినే రకంగా తెలియల. వాళ్ళకు ఇదంతా నమ్మకం లేదనుకుంటా. వాళ్ళింటి మగాడు మాట్లాడుతున్నప్పుడే, అమ్మ అటూ, ఇటూ వెళ్ళింది. వాళ్ళబ్బాయి ఒకచోట నిలబడకుండా అటూ, ఇటూ పరిగెత్తుతున్నాడు. చూడటానికి పాపం అనిపించింది. ఏం చేయగలం...కొంతమందికి పడితే గానీ తెలియదు

వాళ్ళు ఎలా తెలుసుకుంటారో మనకు వద్దు...వాళ్ళ డబ్బూ మనకు వద్దు. నువ్వు అక్కడికి వెళ్ళి పాలు పొయద్దు

తానుగా వస్తున్న మహాలక్ష్మిని వద్దని చెప్పటానికి తయారైయ్యింది. 

సరే, పాలు పోయటానికి వెళ్ళను. డబ్బులకోసం నేను ఆశపడలేదు పుల్లాయమ్మా...చిన్న పిల్లలు ఉన్న ఇంటికి పాలు ఇవ్వను అని చెప్పటం తప్పు. నువ్వు పాలు పితికి కూజాలో పోసుంచు. అలాగే కూరగాయలు పెట్టు. బడ్డీ కొట్టు మూర్తి నగరానికి వెళ్తున్నప్పుడు బ్రెడ్ తీసుకు రమ్మని చెప్పు. అన్నిటినీ సంచీలో ఉంచు. వాళ్ళే ప్రొద్దున వచ్చి తీసుకు వెడతారు

పుల్లాయమ్మా చేతికి ఒక ఎవర్ సిల్వర్ కూజానూ, పసుపు సంచీనీ ఇచ్చాడు. అవి తీసుకుని  జాగ్రత్తగా ఉంచింది ఆమె.

కనక దుర్గమ్మ తల్లీ... కుటుంబానికి ఎలాంటి చావు రాకుండా చూసుకోమ్మా అంటూ మొహాలు తెలియని వారి కోసం ప్రార్ధన చేసుకున్నాడు.

ఎప్పుడూ మేఘాలతో ఉండే చోటు, ప్రశాంతికు ఇప్పటికి కొంచం అలవాటు అయ్యింది. తెల్లవారు జామా...లేక ఇంకా రాత్రేనా అనేది అంత సులభంగా చెప్పలేని సీతల వాతావరణం తన పని వాళ్ళ నడవడిక గురించి ప్రొద్దే  తెలిపింది.

నిద్ర రాక, మంచం మీద దొర్లి లేచి వస్తున్నప్పుడు ప్రొద్దుటి టిఫెన్ ను సరసు సహాయంతో మల్లి తయారు చేసి, అందంగా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుంది. వాటికి దగ్గరగా రంగు రంగుల గిన్నెలున్నాయి.

కానీ, ప్రశాంతికి నోట్లో పెట్టుకున్న ఏదీ లోపలకు పోక గొంతులోనే ఆగిపోతోంది. ఆమెకు మాత్రమే కాదు...పిల్లలకు కూడా ఆ తిండి నచ్చలేదు. రకరకాల వంటలతో తినే వాళ్ళకు ఉప్మానూ, బ్రెడ్ ముక్కలు తినటానికి విసుగ్గా ఉన్నది.

అమ్మ కోపానికి భయపడి ఒకటి రెండు ముద్దలు నోట్లోకి తోసేసి, తరువాత ఆడుకోవటం మొదలుపెట్టారు. పాత బంగళాను పరిశోధించటం వాళ్ళకు ఎంతో సంతోషం ఇచ్చింది. కొంచం సేపు చదువు. దాని కోసమే చాలా కథల పుస్తకాలు కొని పడేసింది ప్రశాంతి. పిల్లలుకూడా మేరీ టీచర్ సహాయంతో వాటిని ఆసక్తిగా చదివారు.

మధ్యాహ్నం భోజనంలో అన్నం,కూర,పులుసు, పచ్చడి అని ఉంటుంది. వాటిని పిల్లలు హాయిగా తిన్నారా? అనేది ప్రశాంతికి తెలియదు. ఎందుకంటే ఆమె అది పట్టించుకునే ఆలొచనే రాదు!

ఏదో డైనింగ్ టేబుల్ మీద పెట్టుంటారు -- వచ్చి కొంచం సేపు కూర్చుని -- తినింది చాలు అనిపించినప్పుడు లేచి వెళ్ళి పోతుంది.

సాయంత్రం పిల్లలు చదువుకోవాలి అనే విషయంలో ఖచ్చితంగా ఉండేది ప్రశాంతి. పిల్లలకు పాఠాలు చెబుతారు మేరీ టీచర్ మరియు ప్రశాంతి. వెంకటస్వామి కూడా పిల్లలకు ఏదైనా కథ చెబుతాడు. వయసైన ఆయన కాబట్టి పాత కోడైకానల్ ఎలా ఉండేది అనేది ఆసక్తిగా చెప్పేవాడు. తరువాత అందరూ వాళ్ళ వాళ్ళ గదికి వెళ్ళి పడుకుంటారు.

పిల్లలకు ఒక గది, వాళ్ళ గది పక్కనే ఉన్న గదిలో ప్రశాంతి ఉండేది. ఏదో కలలో నడుస్తున్నట్టు ఒక్కొక్క పని చేసి ముగించేది ఆమె.

రోజు గిరిజను పిలిచి, టేబుల్ మీదున్న పాలను తాగి వెళ్ళమని చెప్పింది. ఆటను వదిలేసి వచ్చిన గిరిజ, చూస్తూ ఉన్నప్పుడే ఆమె గ్లాసులో ఉన్న పాలు మొత్తాన్ని ఎవరో స్ట్రా వేసి పీల్చి తాగుతున్నట్టు పాలు గబగబ మని తగ్గిపోయింది. ఆశ్చర్యంతో నోట మాట రాక అలాగే నిలబడిపోయింది గిరిజ.

భయంతో మెల్లగా అమ్మా అని పిలిచింది.

పరిగెత్తుకొచ్చిన తల్లి పాలు తాగేశావా, సరే...సరే! గ్లాసు తీసుకు వెళ్ళి సింకులో పడేయ్ అని చెప్పేసి కదిలింది. గిరిజకు ఎలా చెప్పాలో...ఏం చెప్పాలో అని తెలియలేదు.

కొన్నిసార్లు డైనింగ్ హాలులో కూడా అలాగే జరుగుతుంది. పిల్లలకు వడ్డించిన ఆహార పధార్దాలను, కళ్ళకు తెలియని ఎవరో తినేసి వెళ్ళిపోతారు. ఎవరి దగ్గర చెప్పాలని అయోమయంలో పడ్డ పిల్లల్ను ఏదైనా ఆట చెప్పి వాళ్ళ ఆలొచనను మార్చేది సరసు.

ప్రశాంతి వీటిని దేనిని గమనించలేదు. గిరిజ అప్పుడప్పుడు చెప్పిన దానిని, ఆమెకు మామూలుగా చెప్పే కల్పిత కథే అనిపించింది.   

గదిలోని గాజు అద్దాల అలమరాలో పాత కాలపు రాజులు వేసుకునే దుస్తులు ఉతికి, ఇస్త్రీ చేసి, అందంగా మడిచి పెట్టబడి ఉన్నాయి. అందులో నుంచి తలపాగా లాంటిది ఒకటి తీసి, తలకు తగిలించుకుని రాజ నడక వేస్తూ అటూ ఇటూ తిరుగుతున్నది గిరిజ. ఎవరో మేడ మెట్లపై నుండి పరిగెత్తుకు వచ్చారు. ఎవరా అని చూసిన గిరిజకు అక్కడ పాతకాలపు దుస్తులు వేసుకున్న ఒక కుర్రాడు కనబడ్డాడు.

గిరిజా, నా బట్టలను ఎవరైనా వేసుకుంటే నాకు నచ్చదు. ఇక మీదట అవి తీయమోకు! వెళ్ళి అలమరాలో పెట్టేయిఅన్నఆ కుర్రాడు, గిరిజ తలపాగా తీసేసి అలమరాలో పెట్టేంత వరకు మౌనంగా నిలబడ్డాడు. ఆమె తలపాగా పెట్టేసి వెనక్కి తిరిగినప్పుడు, అతను కనిపించలేదు. జ్ఞాపకం వచ్చేసింది! ముందు గదిలో ఉంచబడ్డ రాజవంశ ఫోటోలలో కుర్రాడ్ని చూసున్నది గిరిజ.

అమ్మా అని అరిచిన గిరిజ దగ్గరకు పరిగెత్తుకు వచ్చారు ప్రశాంతి, మేరీ. తడబడతూ జరిగింది చెప్పిన కూతుర్ను చూసి నవ్వింది.

నువ్వు చాలా ఊహించుకుంటున్నావు గిరిజా. పక్క గదిలో ఆడుకుంటున్న  రాఘవ్ కు కనబడనది నీకు కనబడిందా? నేను మేడ మీదున్న ముందు గదిలోనే కుర్చోనున్నాను. నువ్వు చెప్పినట్టు పిల్లడు మేడ మీద నుంచి వచ్చుంటే నేను చూసుండాలే! ఏదైనా ఊహించుకుని మనసు పాడుచేసుకోకుండా ఉండు

అమ్మను ఎలా నమ్మించేది?’ అనేది అర్ధం కాలేదు గిరిజకు. ప్రశాంతి వెళ్ళిపోవటంతో... గిరిజ బుర్రను వేడెక్కించింది మేరీ.

మీరూ నన్ను నామ్మటం లేదా టీచర్?”

నేను నిన్ను నమ్ముతున్నా గిరిజా. నేను కుర్రాడ్ని చూశాను

నిజంగానా? అమ్మకు మాత్రం ఎందుకు కనబడటం లేదు?”

జీవితంలో మనమందరం ఒక విధంగా దాగుడు మూతలు ఆట ఆడుకుంటున్నామమ్మా. మన కంట్లో ఉండే కట్టు ఊడిపోయేంతవరకు, జరిగేదేమీ కనబడదు. మనకంటే ముందు వాళ్ళను చూసిన వారు నిజం చెప్పినా ఒప్పుకునే మనస్తత్వం చాలా మందికి లేదు. కళ్ళల్లోని కట్టు ఊడిపోయి పడిపోయిన తరువాతే మనకి నిజం తెలుస్తుంది. మీ అమ్మకూ అంతే. ఆమే తన కళ్ళతో చూస్తే గానీ నమ్మదు. కానీ, మీ అమ్మగారి కళ్ళు ఇప్పుడు కట్టబడి ఉన్నాయి. అవతలి వాళ్ళు చెప్పేదాన్ని ఒప్పుకునే మనో పరిస్థితి ఆమెకు లేదు

ఇది ఆమె ఎప్పుడు గ్రహిస్తుంది?”

అది తెలియదు. కానీ రోజు చాలా దూరంలో లేదనేది మాత్రం తెలుసు

                                                                                                        Continued...PART-10

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి