దాగుడు మూతలు...(సీరియల్) (PART-16)
ప్రొద్దున శ్రీనివాస్
ఆ ఇంటి
నుంచి వెళ్ళిపోయాడు.
అతని దగ్గర
మాట్లాడాలని అనుకుంది
ప్రశాంతి. అది
ఆమెకు చాలా
మానసిక కష్టాన్ని
ఇచ్చింది. పిల్లలు
‘నాన్న
ఎక్కడ?’ అనే
అడిగిన ప్రశ్నకు
జవాబు చెప్పలేక
వాళ్ళను రెండు
తిట్లు తిట్టి
ఆడుకోవటానికి పంపించింది.
ఆమెకు మనసు
కష్టంగా ఉండటంతో, లైబ్రరరీకి
వెళ్ళి బుక్స్
అలమరాను కెలకటం
మొదలు పెట్టింది.
ఎంత సమయం
పట్టిందో ఆమెకే
తెలియదు. అక్కడున్న
పాత పేపర్లు
ఆమెను ఆకర్షించ...ఒక్కొక్కటీ
తీసి, అందులో
ఒక్కొక పేజీనూ
తిప్పి చూడటం
మొదలుపెట్టింది.
ఒక పెద్ద
భూకంపమే అందులో
దాగున్నదని ఆమెకు
తెలియదు!
ఆ పాత
న్యూస్ పేపర్
లోని నాలుగో
పేజీలో ఉన్న
ఒక వార్త
ఆమెను ఆందోళనకు
గురిచేసింది. వెళ్ళకావియల్
నుండి కొంచం
క్రింద, కరెక్టుగా
చెప్పాలంటే ప్రశాంతి
నిలయానికి వెనుక
వైపు జరిగిన
కొండచరియల విరుగుబాటలో
నలుగురు మరణించారు.
వాళ్ళ ఫోటోలు, దాని
కింద పేరు, ఆ
పాత న్యూస్
పేపర్ కాగితంలో
ప్రింట్ అయ్యుంది.
వాటి వివరాలు:
1. శ్రిమతి
మేరీ జాన్. వయసు
యాభై ఎనిమిది, నర్స్.
2. వెంకటస్వామి, వయసు
అరవై ఐదు
-- సెక్యూరిటీ.
3. సరసు, వయసు
ముపై మూడు.
4. మల్లి, వయసు
ఇరవై ఎనిమిది.
హాస్పిటల్ నుండి
ఎవరో ఒక
గ్రామ మహిళకు
ప్రసవం చూడటానికి
వెళ్ళిన మేరీ, ఆమెకు
తోడుగా వెళ్ళిన
వెంకటస్వామి, ఆ
రోడ్డు మీద
నడుచుకుంటూ వస్తున్న
సరసు, మల్లి
అనుకోకుండా కొండ
చెరియ విరిగి
పడిన చోట
అప్పటి కప్పుడే
మరణించారు.
----ఈ
వార్తను చదివిన
ప్రశాంతి షాక్
లో ఉండిపోయింది.
‘ఇన్ని
రోజులు నేను
సన్నిహితంగా ఉన్నది
మనుష్యులతో కాదా?’
తన పిల్లలు
జ్ఞాపకానికి రాగా, క్రిందనే
ఒక మారు
మూల ఉన్న
లైబ్రరీ వదిలిపెట్టి
పెనుగాలిలాగా బయటకు
వచ్చింది.
“గిరిజా, రాఘవా...ఎక్కడున్నారు?” అని
అరుచుకుంటూ బయటకు
వచ్చిన ఆమె, ఆ
ఇంట్లో ఏదో
ఒక వ్యత్యాసమైన
పరిస్థితి ఉండటాన్ని
తెలుసుకోలేదు.
ఇంటి బయట
పొగమంచు నాలుగు
వైపులా నేల
కూడా కనబడకుండా
మూసుకుపోయింది.
అమావాస్య చీకటి
సాయంత్రం, అప్పుడే
ప్రారంభమయ్యింది.
దాంతో పాటూ
త్వరలో వర్షం
రావడానికికైన సూచనలుగా
మెరుపులు మెరిసి
కనబడకుండా పోతున్నాయి.
పెల పెల
మని ఊడిపోయి
పడిపోయిన ఆకులను
తొక్కు కుంటూ
వస్తున్న శబ్ధం
విని వెనక్కి
తిరిగింది.
ఆమె వైపుకు
వస్తున్నారు మేరీ, వెంకటస్వామి, సరసు, మల్లి
అనే ఆ
నలుగురూ!
తన చేతిలో
దొరికిన దాన్ని
వాళ్ళపై ఎగరేస్తూ
“ఎవరు
మీరు? ఎందుకు
నన్నూ, నా
పిల్లలనూ కష్టాలు
పెడుతున్నారు? మమ్మల్ని
వదిలి వెళ్ళిపొండి” అని అరుస్తూ
ఇంటిలోపలకు దూరి, తలుపు
వేసుకుంది.
కుంబవృష్టిగా కురుస్తున్న
వర్షంతో పాటూ
వీస్తున్న గాలి
ఆ ప్రదేశాన్నే
కదిలిస్తోంది.
పరిగెత్తి వంట
గదిలోకి వెళ్ళిన
ఆమె -- కత్తి
ఏదైనా ఉన్నదాని
వెతుకగా.,
తాళం వేసున్న
తలుపులను తోసుకుంటూ
లోపలకు వచ్చారు
నలుగురూ.
నవ్వుతూ చెప్పాడు
వెంకటస్వామి.
“ఏమిటి
ప్రశాంతీ....కత్తిని
వెతుకుతున్నావా? పది
సంవత్సరాల క్రితమే
చనిపోయిన మమ్మల్ని
కత్తితో చంపాలనుకుంటున్న
నువ్వు తెలివిగల
దానివా...లేక
మూర్ఖురాలివా?”
“చెప్పండి...ఎక్కడ
నా పిల్లలు? ఏం
చేశారు నా
పిల్లలను?” అని
అతి గట్టిగా
కేకలేసింది.
“ఏం
చేశామా? మేము
ఏమీ చెయ్యలేదు...చెయ్యం
కూడా. కానీ, వాళ్ళ
దగ్గర నుండి
నీ పిల్లలను
కాపాడటం నీ
వల్ల మాత్రమే
అవుతుంది. అందుకు
ఇదే సరైన
సమయం. పో...పోయి
కాపాడు”
అన్నది మేరీ.
“అమ్మా...”
మేడమీద తమ
గదిలో నుండి
పిల్లల అరుపులు
కేకలు వేస్తూనే
వేగంగా మెట్ల
మీద ఎగురుకుంటూ
వెళ్ళింది.
అక్కడ...
మేడమీద ఆమె
ఉండే గదిలో
నలుగురైదుగురు
ఉన్నారు. ప్రశాంతి
వయసులో ఒక
స్త్రీ, ఆమె
ఆ రోజు
స్నానాల గదిలోని
అద్దంలో చూసిన
మొహం. ఆమె
చేతిని గట్టిగా
పట్టుకుని ఉన్న
ఒక మగాడు.
అతడు ఆమెకు
బాగా పరిచయమున్న
మనిషి.
అవును! గుర్తుకు
వచ్చింది. ‘ప్రశాంతి
నిలయాన్ని’ చాలా
రోజులుగా తనకి
అమ్మమని అడుగుతుండే
వాడు. అతని
ఇంకో చేయి
పుచ్చుకున్నది
ఆ కుర్రాడు.
ఆ పైన
ఇద్దరు గూండాలు.
అందులో ఒకడు
పూజారి లాగా
డ్రస్సు వేసుకుని
ఉన్నాడు. ముగ్గువేసి, దాని
చుట్టూ పువ్వులు.
ఒక కోడి
బలి ఇవ్వబడింది.
మంత్రాలను ఉచ్చరిస్తున్న
మనిషి ఎదురుగా
పిండితో చేయబడ్డ
మూడు బొమ్మలు.
ఒకటి పెద్దది, రెండు
చిన్నవి.
“తల్లిని
కట్టిన తాడు
విడిపోబోతోంది.
అది పూర్తిగా
ఊడిపోయేలోపు, చిన్న
వాళ్ళ ఇద్దరినీ
అనిచేద్దాం. ఆ
తరువాత వాళ్ళను
చూపించి బెదిరించి
తల్లిని ఒక
ఆట ఆడిద్దాం” అని చెబుతూనే, దగ్గరగా
ఉన్న సూదిని
తీసి ఆ
బొమ్మలపైన గుచ్చాడు
ఆ మంత్రవాది.
“అమ్మా, నొప్పి
పుడుతోందమ్మా” అని అరిచిన
తన పిల్లలను
చూసి ఆవేశ
కచ్చె పుట్టి, “ఏయ్...ఎంత
ధైర్యం రా
నీకు? నా
పిల్లలను కట్టిపడాశావు” అంటూనే సుడిగాలిలా
తిరిగింది ప్రశాంతి.
అక్కడున్న పూజ
సామాన్లు, పువ్వులూ
చక్రంలా తిరిగి, తిరిగి
ఒక మూలకు
ఒకటిగా ఎగిరినై.
దీన్ని ఎదురు
చూడని వాళ్ళందరూ
భయంతో చెరో
పక్కకు పరిగెత్తేరు.
ఎక్కడ్నుంచి ఆమెకు
అంత బలం
వచ్చిందో తెలియలేదు!
“నీ
బలం తెలియక
నీతో పెట్టుకున్నాం.
మమ్మల్ని వదిలేయ్.
ఇక మీదట
నీ దారికే
రాము”…. ప్రశాంతి అతని
గొంతు పట్టుకు
నొక్కుతుండగ, ఆమెను
విడిపించుకోలేక, గాలిపీల్చుకోలేక
ఆయస పడుతూ
చెప్పాడు ఆ
మంత్రవాది.
“ఇక
మీదట ఇలాంటి
తప్పుడు పనులు
చేయటానికి ‘ప్రశాంతి
నిలయం’ పక్కకు
వచ్చావో...ఆ
తరువాత నీ
శరీరంలో నుండి
ప్రాణం తీసేస్తాను”
రాణిలాగా మారి
కింది గొంతులోంచి
ఉరుమింది ప్రశాంతి.
“రానే
రాను తల్లీ!
నేను మాత్రమే
కాదు...మా
మనుషులు కూడా
ఈ ఇంటి
లోపలకే చొరబడరు.
ఇది ప్రామిస్...ప్రామిస్...ప్రామిస్”
నేల మీద
మూడుసార్లు కొడుతూ
సత్యం చేసినతను
వణికిపోతూ పారిపోయాడు.
జరిగిన వాటికంతా
కారణం ప్రశాంతికి
తెలిసిపోయింది.
ఇప్పుడు ఆమె
మొహంలో ఉన్న
కోపం, చీకటి
కనుమరుగయ్యింది.
ప్రకాసవంతమైన కాంతితో
ఆ చోటే
ఒక ఇంద్ర
భవనంలా కనబడింది.
Continued...FINAL PART-17
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి