18, ఆగస్టు 2022, గురువారం

దాగుడు మూతలు...(సీరియల్)...(PART-12)

 

                                                                        దాగుడు మూతలు...(సీరియల్)                                                                                                                                                               (PART-12)

పిల్లలను గమనిస్తూ వాళ్ళ ఆరొగ్యాన్ని మెరుగు పరిచి ప్రశాంతి ఒక పరిస్థితికి  వచ్చినప్పుడు, తన జీవితంపై శ్రద్ద పెట్టటం మొదలుపెట్టింది. అప్పుడు తెలిసింది పరిస్థితి చైదాటి పోయిందని. సగం రోజులు తన భర్త, స్నేహలతతో ఊరంతా తిరిగి ఇంటికి వస్తున్నది అర్ధం చేసుకుంది.

అలాగే వదిలేయటానికి మనసులేని ప్రశాంతి, ఒక రోజు మేలుకుని భర్తను నిలదీసింది.

నన్ను పెళ్ళి చేసుకోవటానికి నువ్వు చేసిన కుట్ర నాకు తెలిసిపోయింది-- విసుగు నిండిన స్వరంతో చెప్పాడు శ్రీనివాస్.

షాకై నిలబడ్డ ప్రశాంతితో, “నువ్వు అలా నడుచుకుంటావని నేను అనుకోలేదు. నీ మీద మంచి అభిప్రాయం పెట్టుకున్నా

... స్నేహలతని వదిలించుకోవటానికి నాన్న ముప్పై లక్షలు డబ్బు ఖర్చుపెట్టి, ఆమెను శ్రీనివాస్ దగ్గర నుండి వేరుచేసింది శ్రీనివాస్ దగ్గర చెప్పుంటుందని అనుకుంటా. అదే కోపం 

స్నేహలత ఏమి చెప్పుంటుందో కూడా తెలియని ప్రశాంతి మాటలను జార్చింది. 

ప్రేమకూ, యుద్దాలకూ ఇరువైపులా న్యాయం ఉన్నట్టు చెబుతారు అని మెల్లగా చెప్పింది...అది అతని కోపాన్ని ఇంకొంచం ఎక్కువ చేస్తుందని తెలియక.

ప్రశాంతి కాదని చెప్పి -- తన యొక్క వివరణ చెబుతుంది, బ్రతిమిలాడుతుంది అని అనుకున్న శ్రీనివాస్ కు ఆమె యొక్క జవాబు అతని కోపాన్ని తలకెక్కేటట్టు చేసింది. పెద్ద తప్పు చేసేసి, తాను చేసింది కరెక్టే నని వాదించే వాదనను అతను అంగీకరించలేకపోయాడు. 

ఉండచ్చు! దానికోసం నువ్వు ఇంత దిగజారి నడుచుకుంటావని అనుకోలేదు. ... టేబుల్ పైన బలంగా గుద్ది, ప్రశాంతి వైపు తిరిగి అది సరే, స్నేహితుని చెల్లి పెళ్ళి నిశ్చయ తాంబూళాలకు వెళ్ళి, అమ్మాయినే పెళ్ళిచేసుకున్న ఆయనే కదా మీ నాన్న. అలాంటి ఆయన కూతురైన నీ దగ్గర మంచి గుణాన్ని ఎదురు చూడటం నా తప్పే అన్నాడు.

తల్లీ-తండ్రి బాంధవ్యం ఎప్పుడూ ఒక తామర లేని నీళ్ళు లాగానే ఉంటోందని అనుకుంటూ వచ్చింది ప్రశాంతి. దానికి ఇదే కారణమా? తల్లి-తండ్రి గురించి కొత్తగా తెలిసిన విషయాన్ని విన్న ప్రశాంతికి షాక్ తగిలినట్లు అయ్యింది.

దాన్ని పట్టించుకోని శ్రీనివాస్ మళ్ళీ మాట్లాడటం మొదలు పెట్టాడు.  

సొంతవాళ్ళ మధ్యలో మీ నాన్న మాట్లాడిన తప్పుడు మాటల వల్ల మాకు చెడ్డపేరు. వేరే దారిలేక సొంత ఊరు వదిలేసి కుటుంబమంతా ఇక్కడకు వచ్చాశాము. నిన్ను పెళ్ళి చేసుకోవడం కూడా నాకు నచ్చలేదు. అత్తయ్య అడిగింది కదా నని మాత్రమే అంగీకరించాను. కానీ, నువ్వూ, నీ తండ్రి ఎంత నీచంగా ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నారు?”

ఏం చెబుతున్నారు? స్నేహలత డబ్బుకొసమూ, హింది సినిమాలో నటించటం కోసమూ మిమ్మల్ని వదిలేసి పారిపోయింది. డబ్బును చూసి పరిగెత్తిన ఆమె కంటే, తన కూతురు ఆశపడ్డ వాడినే పెళ్ళి చేసి ఇవ్వటానికి ప్రయత్నించిన మా నాన్న మీకు చెడ్డవారు అయిపోయారా?”

ఇది నేను నమ్మాలా? మీ నాన్న నన్ను కొంచంగా బ్రతిమిలాడుంటే కూడా పెళ్ళికి ఒప్పుకునే వాడిని. అది చెయ్యటానికి మీ రాజవంశానికి కుదురుతుందా? మనుషులను పంపి ఆమెను మిగిలిన మగవారితో దగ్గరగా ఉన్నట్టు ఫోటో తీసి బెదిరించారు.

బెదిరింపుకు భయపడిపోయి స్నేహలత వాళ్ళ అమ్మతో కలిసి ఊరు వదిలే వెళ్ళిపోయింది. సమయంలో నిన్ను నాకు ఇచ్చి పెళ్ళి చేశేసి మనల్ని దేశం నుండే పంపించారు. ఏమి గొప్ప రాజతంత్రం?”

మళ్ళీ విసుగ్గానే చెప్పాడు.

అర్ధం కాకుండా, ఏమీ తెలియనట్లు అతన్ని చూసింది.

అతని దగ్గర స్నేహలత అబద్ధం చెప్పింది. నటిని నమ్ముతున్న అతను, తన భార్యను నమ్మటానికి రెడీగా లేడు.  నిజం చెప్పాల్సిన ఆమె తండ్రీ, మామగారు ఇప్పుడు తిరిగి రాలేని లోకంలో ఉన్నారు!

ఇతనికి ఎలా అర్ధం అయ్యేటట్టు చేసేది?’ అంటూ ఆలోచించింది ఆమె.

ఒకటి మాత్రం ఖచ్చితం ప్రశాంతీ. నిజం తెలిసినప్పటి నుండి నిన్ను చూడటానికే నాకు నచ్చలేదు. నన్ను ప్రేమించిన పాపానికి -- తన జీవితాన్ని పోగొట్టుకున్న స్నేహలతకి న్యాయం చేయటానికి -- నిన్ను విడిచి పెట్టటమే ఒకే దారి అనుకుంటున్నా" అంటూ విడిపోవటం గురించి మాట్లాడేసి -- రోజు రాత్రే ఇంటి నుండి వెళ్ళిపోయాడు ఇద్దరు పిల్లల తండ్రి.

దంపతుల ఇద్దరి మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలను తెలుసుకున్న స్నేహలత, శ్రీనివాస్ తో కలిసి పలు చోట్ల తిరిగింది. పెద్ద రాజ కుటుంబంలో ఒక నటి యొక్క చొరబాటు పత్రికలు పెద్దవి చేసినై. ప్రశాంతికి శిక్ష వేస్తునట్టు అనుకుని విడాకుల పత్రం పంపించాడు అతను.

మనో కష్టంతో కృంగిపోయిన ప్రశాంతి, దాని తరువాతే ఎవరి కంటికి కనబడకుండా పిల్లలతో పాటూ ప్రశాంతి నిలయంకు వచ్చింది. ఆమె దగ్గర విడాకులు  తీసుకోకుండా, శ్రీనివాస్ స్నేహలతని పెళ్ళి చేసుకోవటం కుదరదు. ఆమె ఉండే చోటు తెలిస్తేనే కదా విడాకుల సమస్య పెద్దదవుతుంది.

'ఇక దానికి దారే లేదు ' అనే అనుకుంది ప్రశాంతి.

                                                                                                                Continued...PART-13

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి