5, ఆగస్టు 2022, శుక్రవారం

దాగుడు మూతలు...(సీరియల్)...(PART-7)

 

                                                                          దాగుడు మూతలు...(సీరియల్)                                                                                                                                                                 (PART-7)

నవంబర్ నెల పొగమంచు, ఎదుట వస్తున్న వ్యక్తుల ముఖం కూడా సరిగ్గా కనిపించనివ్వకుండా కష్టపెడుతోంది. ఇద్దరు పిల్లలను చేత్తో పట్టుకుని చిన్న కాంపౌండ్ గోడను దాటి బాగు చేయబడి ఉన్న ఒంటరి బాటలో ఇంటివైపుగా నడవటం మొదలుపెట్టింది ప్రశాంతి.

ఇల్లు ఏమంత దూరంలో లేకపోయినా, చాలా దూరం నడిచే వచ్చిన ఒక భావం. దూర ప్రయాణం వలన బాగా అలసిపోయినట్లు తెలుసుకుంది. తనకే ఇలాగంటే, చిన్న పిల్లలకు ఎంత కష్టంగా ఉండుంటుంది.

ఇంకా ఎంత దూరమమ్మా?”

ఇదిగో వచ్చాశాము. అక్కడ చూడు అంటూ ఎదురుగా కనిపించే ఇంటిని చూపించింది.

మోస్తరు శుభ్రంగానే కనబడింది ఇల్లు. దుప్పట్లు అందంగా వేయబడి, బెడ్ రూములు రెండూ మేడ మీద అందంగా ఉన్నాయి. దీనికి జనకరాజ్ కు అభినందనలూ, ఇల్లు తాళం వేయకుండా తలుపులను మాత్రం దగ్గరకు వేసినందువలన ఒక మొట్టికాయ వేయాలి అని ఆలొచిస్తూ ఇంట్లోని మిగిలిన ప్రదేశాలను చూసింది.

పాతవి, ఉపయోగించలేని వస్తువులు మేడ మీద ఒక గదిలో పడేసి తాళం వేయబడి ఉంది. అక్కడున్న తాళం చెవుల గుత్తిలో గదుల వరుసలో తాళం చెవులు వేలాడుతున్నాయి. వంట గదిలోకి వెళ్ళింది. అక్కడ కిరసనాయల్ తో పాటూ స్టవ్వు రెడిగా ఉండటం చూసి తృప్తి పడింది. తాను కొనిపెట్టి వెళ్ళిన కొత్త గిన్నెలను ఎవరో ఉపయోగించినట్లు గుర్తులు కనబడ్డాయి.

తాను బయలుదేరేటప్పుడు అక్కడ పనిచేస్తున్న వాళ్ళ దగ్గర కొత్త స్టవ్వుపై కాఫీ పెట్టుకోమని చెప్పింది జ్ఞాపకానికి వచ్చింది. వాళ్ళు కాఫీ మాత్రం పెట్టుకున్నట్టుగా కాక...వంట కూడా చేసుకున్నది -- సగం కట్ చేయబడున్న ఉల్లిపాయ, టమేటో, గోడకు చివర కనబడకుండా వంచి పెట్టిన కత్తిపీట చెప్పకనే చెబుతున్నది.

మొదట కొంచం కోపం వచ్చినా --- పాపం... అద్వాన్నమైన అడవిలో వాళ్ళు మాత్రం తిండికి ఎక్కడికి వెడతారు?’ అనే ఆలొచనా వచ్చింది.

పరవాలేదులేఅని తనలో తానే చెప్పుకుంది.

ఇంకొకొరు ఉపయోగించినది ఏదీ ప్రశాంతికి నచ్చదు. తన నెక్లస్ను ఒకరోజు ఆమె వదిన పెట్టుకున్నదని తెలుసుకున్న ప్రశాంతి తరువాత దాన్ని ఆమెకే ఇచ్చేసింది. చిన్న వస్తువులనే అవతలి వాళ్ళు ముట్టుకుంటే ఇష్టపడని ప్రశాంతి -- ఐదడుగులు, ఎనిమిది అంగుళాల ఎత్తులో -- దానికి తగిన శరీర ధారుఢ్యం కలిగి రాజుగారి గంభీరంలో తన మనసును పూర్తిగా ఆక్రమించిన భర్తను, పూర్తిగా ఇంకొక ఆమెకు ఇచ్చేసి ఒంటరిగా నిలబడింది.

స్నేహలత ముట్టుకుంది కాబట్టి తన శ్రీనివాస్ ను ఒక వస్తువు లాగా ఆమెకు ఇవ్వగలదా ఏమిటి?’

కుదరదు! నా శ్రీనివాస్ నాకు మాత్రమే సొంతం

చిన్నగా...కానీ, ఖచ్చితంగ చెప్పుకుంది.

హైదరాబాదులో, తన భార్య గురించిన ఆలొచనలలో ఉండి కొంచం నిద్రకు లొంగిన శ్రీనివాస్ కలలో ప్రశాంతి కనబడి ఖచ్చితమైన స్వరంతో చెప్పింది.

నా శ్రీనివాస్ నాకు మాత్రమే సొంతం -- ప్రశాంతి శ్రీనివాస్ ను గట్టిగా కౌగలించుకుంది.

నిద్రలోనూ శ్రీనివాస్ మొహంలో నవ్వు పరిగెత్తింది. 

నన్ను పట్టుకుని ఇన్ని కష్టాలు పెడుతున్నావే! ఇంట్లో ఉంటే కౌగలించుకుని వేలాడుతున్నావు. ఉద్యోగానికి వెళ్ళినా, ఎటు చూసినా నీ మొహమే తెలుస్తోంది. నా మీద ఎటువంటి వసీకరణ మంత్రం వేశావో?”

వసీకరణ మంత్రం వేయాలని ఏమీలేదు డియర్. మీ మనసులో చాలా రోజులుగా నేను ఉన్నాను. బావిలో ఉన్న నీరులాగా బయటకు కనబడకుండా ఉన్నాను. మీ మట్టి బుర్రకు ఇప్పుడే అర్ధమవుతోంది

ఏదైనా నీకు ధైర్యం ఎక్కువ. నా ఒడిలో పడుకుని, నన్నే మట్టి బుర్ర అని చెబుతున్నావు. ప్లీజ్ ప్రశాంతీ, రోజు నాకు ముఖ్యమైన మీటింగ్ ఉంది. ప్రొద్దున మాత్రం ఆఫీసుకు వెళ్ళి వచ్చేస్తాను

మనసు లేక పోయినా లేచింది.

నిద్రలో కూడా ఏదేదో వాగుతున్నాడు శ్రీనివాస్.

నడిచి రావటం వలన గొంతు ఎండిపోయింది. మొదట ఒక చెంబుడు నీళ్ళను గడగడమని తాను తాగేసి, తరువాత పిల్లలకు కూడా ఇచ్చింది. ముగ్గురూ కలిసి సగం బిందెను ఖాలీ చేశారు. అదే వాళ్ళ కడుపును నింపగా, తరువాతే అలసట తెలిసింది.

ముగ్గురూ పెద్ద సోఫాలోనే అలసిపోయి నిద్రపోయారు. కొంచం సమయం తరువాత లేచింది ప్రశాంతి. మొదట ఏదైనా వంట చేయాలిఅని అనుకుంటూనే వంట గది అలమరాలో సర్ది పెట్టబడ్డ ఎర్ర డబ్బాలను తీసి ఊపింది.

పరవాలేదు! పచారి సరకులేమీ అంతగా తగ్గి పోలేదుఅని తృప్తి పడింది.

హాలులో పిల్లలు ఆడుకోవటం సంగీతంలా వినబడింది.

చాలా రోజుల తరువాత మనసులో ఒక ప్రశాంతత ఉండటం అనుభవించింది. ఎవరి ఇబ్బందీ లేదు. శ్రీనివాస్ ని స్నేహలత తో అక్కడ చూశాను, ఇక్కడ చూశానుఅని చెప్పి ఆమె మనసును కష్టపరిచే ఫోన్ పిలుపులు ఇక ఉండవు. దేంట్లోంచో విడుదల అయిన ఫీలింగ్. కొన్ని సార్లు సంతోషం కూడా కలిగింది.

హైదరాబాద్ లో ఇరుకైన పరిస్థితిలో పెరిగిన పిల్లలకూ అలాగే ఉండుంటుంది!

ఆకలేస్తే, అలమరాలో బిస్కెట్లు ఉంచాను. తీసుకు తినండి. అమ్మ ఇప్పుడెల్లి వంట చేస్తుంది. వంట సుమారుగానే ఉంటుంది.మంచి పిల్లలుగా అడ్జెస్ట్చేసుకుని తింటారట

వద్దమ్మా...ఆకలే లేదు

అలాగంతా చెప్పకూడదు రాఘవ. తింటేనే కదా ఇంకా బాగా ఆడుకోగలవు. లేకపోతే నీరస పడిపోతావు. ఇద్దరూ రోజు బాగా రెస్టు తీసుకోండి. రేపట్నుంచి రోజూ ప్రొద్దున రెండు గంటలూ, సాయంత్రం రెండు గంటలూ చదువుకోవాలి. మీకు చదువు చిప్పించే టీచర్ వచ్చేంత వరకు, నేను చెప్పిస్తాను. ఆవిడ వచ్చిన తరువాత ఇద్దరం చెప్పిస్తాం

సరేమ్మా అని తల ఊపటాన్ని చూసి గర్వంగా అనిపించింది! ఎంత కష్టం వచ్చినా, ముఖం మాడ్చుకోని పిల్లలు. దేవుడు నాకిచ్చిన వరం.

ఇంటి చుట్టూ ఉన్న పొదలను పని వాళ్ళు బాగు చేశారు. ఎండిపోయిన చెట్ల మొక్కలను ఏరకుండా వదిలేసి ఉన్నారు. అవి, ముందు రోజు కురిసిన వర్షానికి తడిసిపోయి -- నేల మీద అక్కడక్కడా అంటుకోనున్నాయి.

దీన్ని మొదటగా శుభ్రం చేయాలి. చలికాలం మొదలైంది. ఆకాశం ఇంకో నాలుగైదు నెలలు మేఘాలు కప్పబడే ఉంటుంది. చలి కాచుకోవటానికి కొంచం కట్టెలు కొని ఉంచాలి

ఇలా ఆలొచిస్తే కూర్చోని ఉన్న ఆమెను 'రింగ్...రింగ్' అనే గంట ఆశ్చర్యపరిచింది.

                                                                                                    Continued...PART-8

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి