3, ఆగస్టు 2022, బుధవారం

దాగుడు మూతలు...(సీరియల్)...(PART-6)

 

                                                                           దాగుడు మూతలు...(సీరియల్)                                                                                                                                                               (PART-6)

కాటుకలాంటి చీకటి అలుముకున్న రాత్రిపూట, ప్రశాంతి నిలయం నుండి ఒక కిలో మీటర్ దూరంలో ఉన్న మునీశ్వరుడి గుడిలో, పూజరి ఎదురుగా రాజు తన తల్లి-తండ్రులతో నిలబడున్నాడు.

ఏరా పిచ్చి పిల్లాడా! ఎర్ర రంగు ఇంటి పక్కకు పోకూడదని చెప్పుంచాము కదా, దానిని అధిగమించి మిట్ట మధ్యాహ్నం సమయంలో చేతిలో చేపల పులుసుతో, బూతాల బంగళా దారిలో వెళ్ళావంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి?”

విరిగిపోయిన అద్దం ముక్కలను ఒక రేకు డబ్బాలో వేసి ఆడిస్తుంటే వచ్చే ఒక కర్న కటోర స్వరం పూజారికి. స్వరంతో అతను అరుస్తూ డోలు వాయిస్తుంటే, ఎదురుగా నిలబడ్డ వారికి వణుకు ప్రారంభమవుతుంది.

చిన్న పిల్లాడు...వివరం తెలియక చేశాడండి. ఇక మీదట అలా జరగదయ్యా. సారికి మీరు ఎలాగైనా సరిచేయాలి. బూత పిసాచాల గాలి సోకకుండా పిల్లాడ్ని మంత్రించి పంపండి కళ్ళల్లో నీరు పొంగుకు వస్తుంటే బ్రతిమిలాడింది మంగమ్మ.

మంగమ్మామనుషుల లాగానే దయ్యాలు కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి  మంచి దయ్యం. రెండోది చెడ్డ దయ్యం. మంచి దయ్యం ఒక ముద్ద తింటేనే తృప్తి పడుతుంది. చెడ్డ దయ్యం రక్తం వాసన చూడకుండా వదలదు. కొన్ని వెంటనే మనిషిని చంపేస్తాయి. ఇంకా కొన్ని వ్యక్తి మీద ఎక్కి కూర్చుని కొంచం కొంచంగా ప్రాణం తీస్తుంది.

మరికొన్ని చిన్న పిల్లలలాగా మనుషుల్ని భయపెట్టి ఆడుకుంటాయి. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం.  మీ అబ్బాయితో మాట్లాడింది మంచి దయ్యంగా ఉండబట్టే, నువ్విప్పుడు వాడ్ని తీసుకుని ఇక్కడికి వచ్చావు. లేకపోతే ఇంతే సంగతులు

కొడుకు రాజుని దగ్గరకు తీసుకుని హత్తుకుంది మంగమ్మ. అయినా భయంతో వణికిపోతూ నిలబడున్నారు కన్నవాళ్ళు.

ఇంట్లో కూర్చుని అంత గోల చేస్తున్నాయే, వాటిని ఏమీ చేయలేమా పూజారీ?ఆందోళనతో అడిగాడు రాజు తండ్రి.

ఒకటి అర్ధం చేసుకో. మట్టిలోనే బంగరమూ ఉంది, నీళ్ళూ ఉన్నాయి.కానీ, తవ్విన ప్రతి చోటా అవి దొరుకుతున్నాయా? దానికని ఇవ్వబడిన చోటులోనే అది దొరుకుతుంది. ఒక్కొక్క దానికీ ఒక మట్టి రకం కావాలి కదా? అదేలాగా ప్రశాంతత లేకుండా తిరిగే ఆత్మలకు ఇల్లు అవి ఉండటానికి బాగుంది. మీ ఇంట్లో నిద్రపోతున్న నిన్ను అవేమన్నా చేస్తున్నాయా, లేదే! వాటి దారిలో అడ్డు వెళ్ళే వాళ్ళను మాత్రమే అవి కష్టపెడతాయి.

రోజు పూజలో పాల్గొని ఇంటికి వెళ్ళు. రాజూ నువ్వు కూడా వాటిని ఇబ్బంది పెట్టకు. అవి కూడా నిన్ను ఇబ్బంది పెట్టవు. ఇక మీదట ప్రతి అమావాస్య రోజున పూజలు జరిపి వాటికి పిండాలు పెట్టిస్తాను. అవి కాస్త అయినా శాంతపడని

పూజారి డోలక్ తీసుకుని, దాన్ని కొడుతూ మునీశ్వర దేవుని పాట పాడుతున్న శబ్ధం వన ప్రాంతమంతా పూర్తిగా ప్రతి ధ్వనితో మునిగిపోయింది.

మెల్లగా మొదలై పాట వేగం పుంజుకోవటం మొదలయ్యింది. చీకటి వేళలో డోలు శబ్ధం, పూజారి గంభీర స్వరం వింటున్న వారికి పొత్తి కడుపంతా తిప్పటం జరిగింది.

పూజారి పాడగా, పాడగా ప్రశాంతి నిలయానికి దగ్గరలో ఉన్న  చింత చెట్టు పాటకు తగినట్టు గాలిలో ఊగింది. అది జల్లు,జల్లు మని కాళ్ళకు గొలుసు కట్టుకుని ఎవరో ఆడుతున్నట్టే ఉంది. పాట ఆగిన వెంటనే చెట్టు ఊగడం ఆగి ప్రశాంతత పొందింది.

ప్రశాంతీ! ఇప్పుడు నువ్వు కచ్చితంగా ప్రశాంతి నిలయానికి వెళ్ళాలసిందేనా? కావాలంటే మీ అన్నయ్యల దగ్గరకు వెళ్ళి ఉండవచ్చు కదా?”

లేదు పద్మా, మా అన్నయ్యలకు మొదటి నుంచే నాతో పెద్దగా మంచి  బంధుత్వం లేదు. ఇప్పుడు అక్కడికి వెడితే అగౌరవంగా ఉంటుంది

అయితే మీ అమ్మ దగ్గరకైనా వెళ్ళి ఉండు

చేదుగా నవ్వింది ప్రశాంతి.

ఇప్పుడు అమ్మ ఉండేది ఆమె అన్నయ్య ఇంట్లో. అంటే శ్రీనివాస్ వాళ్ళింట్లో! నేను ఇప్పుడు అక్కడికి వెడితే గొడవకు ఇంకొంచం చోటు ఇచ్చినట్టు అవుతుంది. నీ కొకటి తెలుసా? మా అమ్మ చెబుతోంది, శ్రీనివాస్ తో కొంచం సర్ధుకొని వెళ్ళు. నీ స్వార్ధం మాత్రం చూడకుండా, అతని మనసు కూడా చూడు. పెళ్ళి చేసుకుని పది సంవత్సరాలు అయినా అతని మనసు దాని దగ్గరకే వెడుతోందంటే...ఆమె మీద అతని లోతైన ప్రేమను అర్ధం చేసుకోమని చెబుతోంది

ఏమిటే...ఆంటీనా అలా చెబుతోంది? తన కూతురు దగ్గర ఎవరైనా ఇలా చెబుతారా?”

ఆమె నా తల్లి స్థానం నుండి, శ్రీనివాస్ యొక్క అత్తయ్య స్థానానికి వెళ్ళి చాలా  సంవత్సరాలు అయ్యింది. నిజం చెప్పాలంటే నేను పట్టుదల పట్టి శ్రీనివాస్ ను పెళ్ళి చేసుకున్నది అమెకు కొంచం కూడా ఇష్టం లేదు

అదెందుకని!?”

ఎందుకని...? ఒక్క క్షణంలో చెప్పేయచ్చు. కానీ ఇందులో తన కుటుంబ పరువు కూడా కలిసుంది! రాజా మార్తాండ చక్రవర్తి యొక్క పరువు, మర్యాద విధంగానూ తక్కువ కాకూడదు

మౌనంగా ఉన్న ప్రశాంతి చేతులను పట్టుకున్న పద్మ, “సరే, ఊరికి వెళ్ళే నీ నిర్ణయం గురించి నేనేమీ చెప్పను. కానీ, కోడైకానల్ లోనే ఏదో ఒక ఇల్లు తీసుకుని ఉండొచ్చుగా. ఒక అద్వాన్నమైన అడవి బంగళాలో వెళ్ళి నివాసముంటే, నిన్ను నేను ఎలా కాంటాక్ట్ చేయగలను. నువ్వు ఉండే చోటు మీ అమ్మకు కూడా  తెలియకూడదని చెబుతున్నావు. ఊరికి వెళ్ళటానికి ఏదో ఒక పిచ్చి ట్రావల్స్ నుండి కారు బుక్ చేసుకుని వెడుతున్నావు. నాకెందుకో భయంగా ఉందే

లేదు పద్మా. బంగళాను ఒక వ్యక్తి చాలా రోజులుగా కొనుక్కుంటానికి అడుగుతున్నాడు. ఏదో హోటల్ మొదలు పెడతాడట. కానీ, అతి తక్కువ ధరకు అడుగుతున్నాడు. నేను వెళ్ళి కొంచం ఇంటి లోపల, ఇంటి బయట సరి చేసి, వేరే ఎవరికైనా అమ్మగలనేమో నని ప్రయత్నిస్తాను

ఆమె చెప్పి ముగించేలోపు ఆమెకు కుడిపక్క ఉన్న గదిలోని డ్రస్సింగ్ టేబుల్  అద్దం జల్లుమని విరిగింది.

పద్మానూ, ప్రశాంతీనూ మాట్లాడుకుంటున్నది ఎడమ చేతివైపు ఉన్న అలమరా కర్టన్ వెనుక నిలబడి వింటున్నది పనిమనిషి వెంకాయమ్మ. మెల్లగా బయటకు జారుకుంది.

ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ లోకి దూరి మనసులో కంఠస్తం  పట్టి ఉంచుకున్న నెంబర్లను డయల్ చేసి మెల్లగా చెప్పింది. రాజమ్మేనా? నేనే వెంకాయమ్మ మాట్లాడుతున్నాను...అని పిలిచి వివరం చెప్పింది.

టెలిఫోన్ పెట్టేసిన రాజమ్మ  పరుగున తన యజమానురాలు స్నేహలత దగ్గర విషయం చెప్పింది. స్నేహలత ముఖం భయంకరంగా మారింది.

ప్రశాంతీ, నా దగ్గర నుండి తప్పించుకుందా మనుకుంటున్నావా? నిన్ను ఏం చేయాలో అది చేస్తాను

                                                                                                               Continued....PART-7

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి