19, ఆగస్టు 2022, శుక్రవారం

దాగుడు మూతలు...(సీరియల్)...(PART-13)

 

                                                                                  దాగుడు మూతలు...(సీరియల్)                                                                                                                                                              (PART-13)

స్నానం చేసేసి, పంపు తిప్పకుండా వెళ్ళిపోయిన పిల్లలపైన ప్రశాంతికి కోపం వచ్చింది.

ఏమిటంత బాధ్యత లేని తనం మీకు...?” అని తిట్టుకుంటూ పిల్లల గదిలోకి వెళ్ళిన ప్రశాంతికి అక్కడ కిటికీకి దగ్గరగా ఉన్న గిరిజ మంచంపైన ఆమె గొంతును చుట్టుకుని రాఘవ్ నిద్రపోతున్నది చూసింది. 

ఇద్దరూ ఇంకా లేవలేదు, అలాగైతే స్నానాల గది పంపును ఎవరు తెరిచుంటారు?’

ఆలొచిస్తున్నప్పుడే స్నానాల గది తలుపులు దఢేల్అనే శబ్ధంతో మూసుకున్నాయి. పంపును ఎవరో తిప్పుతున్న శబ్ధం. సన్నని గొంతుకతో పాటపాడుతున్న శబ్ధమూ వినబడింది.

ఎవరై ఉంటారు?’… ఆలొచన ఆమె బుర్రను తినేస్తోంది.

అమ్మా అన్న రాఘవ్ కేక ఆమె ఆలొచనలను చెదరగొట్టింది.

ఏమిటి రాఘవ్... నువ్వెందుకు గిరిజ బెడ్ మీదకు వచ్చి పడుకున్నావు?”

రాత్రి నిద్రపోతున్నప్పుడు ఎవరో నన్ను తిట్టేసి కిందకు తొసేశారమ్మా. నాకు భయం అనిపించింది. అందుకనే అక్కయ్య దగ్గరకు వచ్చి పడుకున్నాను అన్నాడు.

లోపు నిద్ర లేచిన గిరిజ నేను నిన్ననే చెప్పాను కదా. అది వాడి బెడ్. అక్కడ పడుకుంటే వాడొచ్చి నిన్ను కిందకు తొసేస్తాడని. నువ్వు వినలేదు. ఇక వాడి జోలికి వెళ్ళకు...నాతోనే పడుకో

ఎవరమ్మా వాడు?”

వాడేనమ్మా... రామ్. వాడితో పెద్ద గోల అయిపోయింది. బొమ్మను తీస్తే తిడుతున్నాడు. నేను కాగితం మీద రాస్తే, లాక్కుని అవతల పారేస్తున్నాడు. నాకు వాడంటనే నచ్చలేదమ్మా

గిరిజ చెప్పిందాంట్లో ఎంత నిజం ఉందో తెలియని తల్లి ఆశ్చర్య పడుతుండ --- స్నానాల గది తలుపు తానుగా తెరుచుకుని తరువాత వేగంగా మూసుకుంది.

మామగారి స్నేహితుడు రహీం బాయ్ వచ్చి వెళ్ళిన తరువాత నుండి శ్రీనివాస్, స్నేహలతను కలవకుండా తప్పుకోవటం చేస్తూ, భార్యను కష్టపెట్టినందుకు బాధ పడుతూ, తాగుడు మొదలుపెట్టి ఇంట్లోనే ఉండిపోయాడు.

గడ్డం గీసుకోని మొహంతో కుర్చీలో కూర్చుని ఎదురుకుండా ఉన్న గోడమీద వేలాడుతున్న పెద్ద ఫోటోను తదేకంగా చూస్తున్నాడు శ్రీనివాస్. ఎదురుగా ఉన్న ఫోటోలో రాజుగారూ, శ్రీనివాస్ తమ పిల్లల్ని దగ్గరకు చేర్చుకుని నవ్వుతూ ఉన్నారు.

భార్యా, పిల్లలు తనని విడిచి వెళ్ళి పలు సంవత్సరాలు అవుతున్న ఫీలింగ్. టెలిఫోన్ పిలుపులకు సమాధానం చెప్పలేక తనని ఎవరూ డిస్టర్బ్ చేయకుండా ఉండాలని, టెలిఫోన్ వయర్ ను పీకేసి మేడ మీద కూర్చున్నాడు.

ఎవరో గదిలోపలకు వచ్చారు. సెంటువాసన ముక్కును జలదరింప చేసింది. వాసనే, వచ్చేది ఎవరని చెప్పకుండా చెప్పింది! మంచం మీదున్న ఫోటోలు అన్నీ అతని మనో పరిస్థితిని ఎత్తి చూపింది స్నేహలతకి. అయినా కానీ సంధర్భాన్ని వదిలిపెట్టటానికి ఆమెకు మనసే లేదు.

మీరు బాధలో ఉంటారని తెలుసు. అందుకనే మీకు తోడుగా ఉందామని వచ్చాను అన్న ఆమెను, జవాబు చెప్పకుండా గుచ్చి చేశాడు. ఈమే, ఈమే పధకం వేసి తనని తన కుటుంబం నుంచి వేరు చేసింది. ఒక నటి చెప్పింది కాబట్టి, ఇంత కాలంగా భార్యా, పిల్లలూ అంటూ ఉత్సాహంగా కుటుంబాన్ని నడిపిన నాకు బుద్ది ఎక్కడికి వెళ్ళింది?’

అతని మనసులో ఏర్పడిన అయోమయం ఏమిటో తెలుసుకోకుండా ప్రశాంతిని ఇష్టం వచ్చినట్టు తిట్టింది స్నేహలత. విడాకుల పత్రంలో ఒక సంతకం పెట్టుంటే ఇప్పుడు నేను కష్టపడుతూ ఉండక్కర్లేదు కదా? పాటికి శ్రీనివాస్ యొక్క భార్య అయ్యుండేదాన్ని...బోలేడు ఆస్తికి యజమానిని అయ్యేదాన్ని

ఏది ఏమైనా అది ఇలా చేసుండకూడదు

ఎవరది?”

అదేనండీ... ప్రశాంతీనే. చూడండి మీకు ఇప్పుడు ఎంత చెడ్డ పేరు, మనసు కష్టం. కన్ ఫ్యూజన్ అంతా తీరడానికి, మనిద్దరం పెళ్ళి తరువాత మళ్ళీ లండన్ కే వెళ్ళిపోదాం.......లేని కన్నీటిని తుడుచుకుంది.

స్నేహలతా... అని గట్టిగా అరిచి ఒకటి బాగా గుర్తుంచుకో ...నువ్వంతా అది...ఇదిఅని మాట్లాడేంత దిగజారిపోలేదు నా భార్య ప్రశాంతి. ఆమె ఇంకా నా భార్యే. నా బిడ్డలకు తల్లే. రాజా మార్తాండ చక్రవర్తి యొక్క ఒక్కతే కూతురు. యువరాణి ప్రశాంతీ దేవి. ఆమెను నా దగ్గర తక్కువ చేసో, అమర్యాదగానో మాట్లాడకు. అలా కాదని మాట్లాడితే ఏం జరుగుతుందో నాకే తెలియదు. ఇక మీదట నన్ను వెతుక్కుని ఇక్కడికి వచ్చి నిలబడకు

షాకై నిలబడ్డ స్నేహలత చీకటి పడింది. రోజు ఇక్కడ ఉండిపోయి ప్రొద్దున్నే వెళ్దామని... చెప్పాలనుకున్నది ---కానీ అతని కళ్ళల్లోని అగ్ని కణ చూపులను చూసి, మధ్యలోనే ఆపేసింది. తరువాత వొణుకుతూ వెళ్ళిపోయింది.

నేను చేసిన పిచ్చి పనివలన నాకూ, శ్రీనివాస్ కూ పెళ్ళి అనేది కలగానే మిగిలిపోతుంది లాగుందే!అని అవేదన చెందింది స్నేహలత.

అవునే, నువ్వు చేసిన పనులన్నీ తెలిస్తే... శ్రీనివాస్ నిన్ను వూరికే వదలడు. ఎంతవరకు చేయగలవో, అంతవరకు చేసి, శ్రీనివాస్ ని అంతే త్వరగా పెళ్ళి చేసుకో. ఆస్తులను నీ పేరుకు మార్చుకో. తరువాత అన్నిటినీ అమ్మేసి, విదేశాలలో  సెటిల్ అయిపోవాలి. దానికి ఇంకా ఏం చేయాలిఅని ఆమె మనసు కుట్ర పధకాన్ని గీసి ఇచ్చింది.

అదే సమయం ప్రశాంతి యొక్క ఫోటోను తీసుకుని పరుపు మీద పడిపోయి ఆ ఫోటోను చూస్తూ శ్రీనివాస్ గొణుగుతున్నాడు.

నన్ను మన్నించు ప్రశాంతి. నిన్ను నేను చాలా కష్ట పరిచాను. ఇంకోసారి నాకు ఛాన్స్ ఇవ్వమ్మా ప్లీజ్...ప్లీజ్...ప్లీజ్

కళ్ళల్లో నీళ్ళతో ఫోటోలోని ఆమె ముఖంలో ఒక్కచోటును కూడా విడిచిపెట్టకుండా ముద్దులు పెట్టసాగాడు.

వదిలేయండి శ్రీనివాస్, గడ్డం గీసుకోకుండా...చూడండి, గడ్డం గుచ్చుకుంటోందీ -- ప్రశాంతి ముడుచుకుపోయింది. చేతులను వంచి అతని మెడ చుట్టూ వేయడానికి ప్రయత్నించింది. తానున్నది ప్రశాంతి నిలయంలో నన్న విషయం అర్ధం కావటానికే ఆమెకు కొంచం సమయం పట్టింది. ఎంత సుఖమైన కల. తమ హైదరాబాద్ ఇంటి పడక గదిలో శ్రీనివాస్ తన మొహంతో ఆమె మొహాన్ని ఎరుపెక్కిస్తున్నాడు.   

నవ్వుతూనే తన స్నానాల గదిలోకి మొహం కడుక్కోవటానికి వెళ్ళింది. ఎదురుగా కనబడుతున్న అద్దంలో చూసుకుంది. షాకయ్యింది. ఎందుకంటే, అందులో కనిపించింది ఆమె శరీరంతో ఉన్న వేరే స్త్రీ ముఖం.

గుండ్రని మొహం. అనిగిపోయున్న ముక్కు. నలుపు చాయలో ఉన్నా కళగా ఉన్న ముఖం. ఆమెను క్షుణ్ణంగా చూసింది.

ఇంకా నిద్ర మత్తు పోలేదా?’ అని అనుకుని కళ్ళపై వేగంగా నీరు కొట్టుకుని అద్దంలోకి మళ్ళీ చూడగా -- ఇప్పుడు క్లియర్ గా ఆమె మొహమే తెలిసింది.

కానీ, ఎవరో ఒకరు గబగబ వేగంగా వెళ్తున్నట్టు కదలిక తెలియగా, వెనక్కి తిరిగి చూసింది. అద్దంలో కనబడిన ఆమె ప్రతిభింబం ఒక క్షణం గడిచిన తరువాతే మెల్లగా తిరిగింది.

ప్రశాంతి, అది తెలిసుకోలేకపోయింది

                                                                                                         Continued...PART-14

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి