దాగుడు మూతలు...(సీరియల్) (PART-5)
రెండు రోజులు
కాస్త ప్రశాంతతగా
ఉన్నట్టు అనిపించింది
ప్రశాంతికి. ఆ
రోజు ప్రొద్దున
రాఘవ్, ఫాదర్
లారన్స్ ఇచ్చిన
గొలుసును పెట్టుకుని
ఆడుకుంటూ తెంపాశాడు.
దాన్ని టేబుల్
సొరుగులో పడేసింది.
మనసే సరి
లేదు. తాను
చేసేది కరెక్టా...తప్పా
అనే అయోమయం
ఆమెను చుట్టు
ముట్టుంది. ఆ
అయోమయం విసుగ్గా
మారింది.
ఆ విసుగును
మరింత పెంచే
విధంగా ఎవరో
ఫోన్ చేసి
“మేడం!
మీరు విడాకులు
ఇవ్వకపోయినా, మీ
భర్త శ్రీనివాస్
తోనే జీవిస్తానని
స్వప్ణ సుందరి
స్నేహలత చెప్పిందే...దాని
గురించి మీ
అభిప్రాయం ఏమిటి?” -- అని
అడుగ....
“అలాగా? అయితే
అలాగే జీవించమని
చెప్పండి”
“అంటే
మీరు విడాకులు
ఇవ్వటానికి ఇష్టపడటం
లేదా?”
“నేను
అలా చెప్పలేదే!”
“మీరు
చెప్పిన దానికి
అదేగా అర్ధం
మేడం. అలాగైతే
మీరు విడాకులు
ఇవ్వటానికి తయారుగా
ఉన్నారా?”
“నేను
అలాగనీ చెప్పలేదే!
వాళ్ళు చెప్పిన
దానికి నేను
అభిప్రాయం చెప్పదలచుకోలేదు.
సారీ” అని చెప్పింది.
కానీ, ఆమె
కోపం కొంచం
కూడా తగ్గలేదు.
సాయంత్రం న్యూసులో, ‘భర్తకు
విడాకులు ఇవ్వటానికి
యువరాణి ప్రశాంతి
ఒప్పుకోలేదు. కావాలంటే
పెళ్ళి చేసుకోకుండానే
జీవించ వచ్చు
అని ఇద్దరూ
చేరటానికి పరోక్షంగా
సమ్మతం తెలిపింది’ అని
వచ్చిన న్యూస్
ను చూసి
మరింత నొచ్చుకుంది.
ఎంత తొందరగా
కుదురుతుందో, అంత
తొందరగా ఊరు
వెళ్ళటానికి ఏర్పాట్లు
చేయటం మొదలు
పెట్టింది. ఆమె
ఎక్కడికి వెడుతున్నదీ
ఎవరికీ చెప్పలేదు!
స్నేహలత విడాకుల
పత్రంలో సంతకం
తీసుకోవటానికి
ప్రశాంతిని ఏదైనా
చెయ్యటానికి రెడీగా
ఉంది. ‘కుదరదు, నా
శ్రీనివాస్ ను
వదిలి నేను
పర్మనెంట్ గా
విడిపోయి ఉండలేను.
దానికి ఈ
టెంపరరీ విడిపోవటం
పరవాలేదు’ -- అని
అనుకుంటూనే
ట్రావల్స్ కు
ఫోన్ చేసి
వాళ్ళు రేపు
బయలుదేరుతున్నట్టు
చెప్పి, ప్రయాణాన్ని
ఖాయపరచింది ప్రశాంతి.
‘ప్రశాంతతను
వెతుక్కుని ప్రశాంతి
నిలయానికి వెళ్ళాలనుకుంటున్న ఆమెకు
అక్కడ ప్రశాంతత
దొరుకుతుందా? లేక...కాస్తో,గీస్తో
ఉన్న ప్రశాంతతను
కోల్పోతుందా?’ అనేది
తెలియటం లేదు.
ఎందుకంటే, ఆమె
హైదరాబాద్ కు
తిరిగివచ్చిన నాలుగు
రోజుల్లో, ‘ప్రశాంతి
నిలయం’ బంగళా
వెనుకవైపు కొంచం
దూరంలో ఉన్న
పెద్ద సమాధుల
తోటను చూసి
భయపడి పోయి, అక్కడ పనిచేస్తున్న పనివాళ్ళందరూ
అక్కడ్నుంచి తిరిగి
వెళ్ళిపోయింది
పాపం ప్రశాంతికి
తెలియదు కదా!
బత్లగుండు -- పెరియకులం
నుండి కోడైకానల్
కు గాడిదల
మీద మిరియాలు, బెల్లం, ఏలకాయలు, పనస
పండ్లు, అరటిపండ్లు
-- ఇంకా మరికొన్ని
వస్తువులు కలిగిన
చిన్న చిన్న
మూటలను ఎక్కించి, చిన్న
వ్యాపారస్తులు
తీసుకు వెళ్ళటం
మామూలు.
వాళ్ళకు దగ్గరి
దోవ కుంబకరై
నుండి మొదలవుతుంది.
కొన్ని చోట్ల
రాళ్ళూ రప్పలుగా
ఉన్న బాటను
దాటి వెల్లకావి
దారి ద్వారా
కోడైకానల్ వచ్చి
చేరటం వాళ్ళకు
నిత్య గండం
పూర్ణ ఆయుషే!
అక్కడ ఉండే
పలురకాల కొండజాతి
కుటుంబాలు -- తాము
ఎప్పుడూ చేసే
పనులతో పాటూ
ఈ వ్యాపారస్తులకు
సహాయపడటం కూడా
చేస్తూ వచ్చారు.
అంతే కాకుండా
మంచి లాభంతో
వ్యాపారం జరిగితే, సహాయపడిన
ఆ కుటుంబాలకు
ఆడంబర విందు
ఉంటుంది.
ఆ వ్యాపారులు
వచ్చే దోవలో
ఒక పాడుబడ్డ
మండపం దగ్గర
పనులకోసం తయారుగా
కూర్చోనుంటారు
కొండజాతి మగవారు.
వ్యాపారస్తులు
చెప్పే బేరం
నచ్చితే, మూటలూ, బుట్టలూ
తీసుకుని బయలుదేరుతారు.
ఎప్పుడు తగిన
బేరం దొరుకుతుందో
తెలియదు కనుక
ఒక కూజాలో
మంచి నీళ్ళు, ఇంకో
కూజాలో గంజి
తెచ్చుకుని కూర్చునే
అలవాటు వాళ్ళకు!
మంగమ్మ, ఒక
చిన్న కూజాలో
ఊరబెట్టి ఉంచిన
చేపల పులుసును
గరిటతో కలిపి, అరచేతి
సైజుకు చింపిన
అరిటాకును పెట్టి
కూజాను మూసింది.
కింద వాలకుండా
ఉండేందుకు -- అరటి
నార పెట్టి
కూజా మెడను
గట్టిగా కట్టింది.
వీధిలో బొంగరం
ఆడుకుంటున్న కొడుకు
రాజుని పిలిచింది.
“రాజూ, మీ
అయ్య ప్రొద్దున
నీరాహారం కూడా
తాగకుండా బయలుదేరాడు.
ఈ గంజిని, చేపల
పులుసును మండపానికి
వెళ్ళి ఇచ్చిరా
నాయనా” అంటూ వాడి
చేతికి బుజాన
తగిలించుకునే సంచీ
ఒకటి ఇచ్చింది.
బొంగరం ఆట
ముగించుకుని -- ఇంటికి
వచ్చిన వెంటనే
తినబోయే చేపల
పులుసు, అతను
చేయ బోయే
పనికి తల్లి
ఇచ్చిన సంచీలో
నుండి వస్తున్న
వాసన నోరు
వూరిస్తుంటే, నడుము
దగ్గర ఉండటానికి
శ్రమ పడుతున్న
లాగూను మొలతాడుతో
చుట్టి బయలుదేరాడు.
“ఆగండిరా...ఒక్క
పరుగున వెళ్ళి
వచ్చేస్తాను” అని స్నేహితులకు చెప్పి
సంచీని మెడలో
వేసుకుని -- వేగంగా
మండపం వైపు
నడవటం మొదలుపెట్టాడు.
‘వేగంగా
పరిగెత్తితే పులుసు
ఒలికిపోతుంది.
తరువాత అమ్మ తిడుతుంది’
మండపంలో ఉన్న
తండ్రి బయలుదేరి
వెళ్ళిపోయుండటంతో
తిరిగి మోత
బరువును మోసుకుని
రావలసి వస్తోందే
అని విసుక్కుని
ఇంటికి నడవసాగాడు.
అక్కడొక చోటకు
వచ్చిన తరువాత
ఆ బాట
రెండుగా విడిపోతుంది.
ఆ రెండో
బాటలో వెడితే
ఒక్క పరుగుతో
త్వరగా ఇల్లు
చేరుకోవచ్చు. మామూలు
దోవలో వెడితే
చాలా సమయం
పడుతుంది. కానీ, ఆ
రెండో బాటను
ఎవరూ వాడరు.
ఆ బాటలో
వెళ్ళొద్దని ఆ
గ్రామమే చెబుతుంది.
ఎందుకో రాజుకు
తెలియదు...కానీ
ఇంటికి త్వరగా
వెళ్ళాలి, స్నేహితులతో
బొంగరం ఆడాలి
ఆనే ఆశ
వాడిని అయోమయంలో
పెట్టింది.
ఆ రెండో
బాటలో వచ్చామని
తెలిస్తే, అంతే, అమ్మ
బెత్తం పుచ్చుకుని
వొళ్ళు వాచిపోయేటట్టు
కొడుతుంది. దానికంటే, స్నేహితుల
ఆటలు ముగిసిపోతాయే
నన్న బాధ
ఎక్కువగా ఉండటంతో, భయపడుతూనే
ఆ రెండో
బాటలో నడవసాగాడు.
ఆ రెండో బాటలో ఉన్న పాత
ఎర్ర రంగు
ఇల్లును దాటుతున్నప్పుడు, ఎవరో
“తమ్ముడూ” అని
పిలిచిన శబ్ధం
వినబడింది.
రాజు ఇంట్లోకి
వచ్చినప్పుడు, అతని
వెనుక అతని
స్నేహితులు గుంపుగా
రావటంతో మంగమ్మకి
ఏమీ అర్ధం
కాలేదు. గాలి
ఊదే గొట్టంతో
పొగలు వస్తున్న
తడి కట్టెలను
మంట కోసం
ఊదుతున్న ఆమె, కళ్ళు
నలుపుకుని, కొడుకును
బాగా చూసింది.
“ఎక్కడదిరా
కొత్త చొక్కా? మీ
నాన్న ఇచ్చాడా?”
“అమ్మా
రెండో బాటలో
ఆ ఎర్ర
రంగు ఇల్లు
ఉంది కదా!
అక్కడున్న ఒక
అన్నయ్య నువ్విచ్చిన
చేపల పులుసు
తీసుకుని...దానికి
బదులుగా ఈ
చొక్కా ఇచ్చాడు.
ఇక మీదట
చేపల పులుసు
రొజూ చేసిస్తావా? ఆ
అన్నయ్య చూడటానికి
రాజ వంశం
రాజులాగా బాగున్నాడు”
అధిరిపడ్డది మంగమ్మ.
“అరే
పాపిస్టి కొడకా!
ఆ రెండో
బాటలో ఆ
ఎర్ర రంగు
ఇల్లు ఉన్నదనే
ఆ రెండో
బాటను ఎవరూ
వాడరు. ఆ
బాటలో వెళ్ళ
కూడదని నీకు
తెలుసు కదా!
ఎందుకు వెళ్ళావు? మునీశ్వరుడా...నువ్వే
తండ్రీ నా
కొడుకును కాపాడాలి”
ఇంట్లోని దేవుని ఫోటోల దగ్గర కాగితోంలో తమ
కుల దేవుని మఠంలో ఇచ్చిన
విబూధిని పిడికిలితో
తీసుకుని కొడుకుపైన
జల్లి, నుదుటి
మీద అద్దింది.
వాడు వేసుకున్న
చొక్కాను విప్పి
-- మండుతున్న కుంపటిలో
వేసింది. గబగబ
అంటుకుంది ఆ
పట్టు చొక్కా.
తన తల
వెంట్రుకలను పైకెత్తి
ముడి వేసుకున్న
ఆమె, ఏడుస్తూ
– “రారా!
పూజారిని వెళ్ళి
చూసొద్దాం” అని కొడుకును
పిలుచుకుని పరుగు,నడకలతో
బయలుదేరింది.
---వాడు
అర్ధం కాకుండా
తల్లిని చూశాడు.
Continued...PART-6
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి