7, ఆగస్టు 2022, ఆదివారం

దాగుడు మూతలు...(సీరియల్)...(PART-8)

 

                                                                             దాగుడు మూతలు...(సీరియల్)                                                                                                                                                                (PART-8)

1800 లలో ఆంగ్లేయులు కోడైకానల్ కు విజయం చేశారు. మిగిలిన చోట ఎండ వేడి వాళ్ళను కష్ట పరిచింది. ఐరోపాలోని కొన్ని దేశాలలోని చల్లదనం, మితమైన ఎండ వాళ్ళను అక్కడ కట్టి పడేసింది.

కనుక, చాలా మంది వాళ్ళ దేశం ధోరణిలో కోడైకానల్లో ఇల్లు కట్టి ఉంచి,  భరించలేని ఎండ ఉన్నప్పుడు, కోడైకానల్ కు వచ్చి ఉండే వాళ్ళు. కొండ జాతి వారి అధికార హక్కు కలిగిన కొండ ప్రాంతం, బోటింగ్ క్లబ్, గోల్ఫ్ గ్రౌండ్ అంటూ మెల్ల మెల్లగా అభివ్రుద్ధి చెందింది. అలాగే కరెంటును నమ్మకుండా కట్టబడిన ఇళ్ళల్లో, కాలింగ్ బెల్ కూడా, చేతితో లాగితే లోపలి వాళ్ళకు వినబడుతుంది. 

బెల్ కొట్టే మోత వినబడి హడావిడిగా లేచింది. ఇటువైపు రెగులర్ గా వెళ్ళే వ్యక్తులు, ఇంట్లో మనుషులు తిరగటం చూసి వచ్చుంటారుఅనుకుంటూ తనని తాను సమాధాన పరుచుకుంది

తలుపు తెరిచిన ప్రశాంతి బయట నిలబడ్డవారిని చూసి ఇంకొంచం ఎక్కువగానే ఆశ్చర్యపోయింది.

గుడ్ మార్నింగ్ మ్యాడం

లోపలకు రండి. మీరొస్తారని పోయిన వారం సిస్టర్అమీలియా చెప్పింది. కానీ, ఇంత తొందరగా వస్తారని అనుకోలేదు. మంచు బాగా పడుతున్నందు వలన ఇంకా కొన్ని రోజులు పడుతుందని అనుకున్నాను అని చెప్పి వాళ్ళను స్వాగతించిన ప్రశాంతి, పరిశోధనా చూపుతో చూసింది.

అరవై ఏళ్ళ వృద్దుడు ఒకరు. ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల వయసు లోపు ఉన్న స్త్రీ, ముప్పైలలో ఒక మహిళ -- యాభై-యాభై ఐదు సంవత్సరాల వయసున్న ఒక ఆంగ్లో ఇండియన్ మహిళ.

ఆంగ్లో ఇండియన్ మహిళ మోకాలి వరకు నల్ల కోటు వేసుకోనుంది. మిగిలిన మహిళలు చీరలు కట్టుకుని దాని మీద స్వటర్వేసుకోనున్నారు. మగ మనిషి చాలా పాత ప్యాంటు -- శరీరానికి నల్ల రంగులో పూర్తిగా గుడ్డ కప్పుకున్నాడు .  దాన్ని స్వటర్అనీ చెప్పలేము, చొక్కా అని చెప్పలేము. రెండింటికీ మధ్య ఒకటి.

నలుగురిలో ఆంగ్లేయ మహిళ మాట్లాడటం మొదలు పెట్టింది.

హలో మ్యాడం...నా పేరు మేరీ జాన్. ఈమె సరసు, ఈమె మల్లి, ఇతను వెంకటస్వామి అని పరిచయం చేసింది.

వెంకటస్వామీ, మీరే తోటమాలా?”

అవునమ్మా

మీలొ ఎవరు వంట చేస్తారు?”

మల్లి ముందుకు వచ్చింది. ఆమె ముప్పై ఏళ్ళున్న మహిళ.

వణుకు పుట్టిస్తున్న చలిలో వచ్చారు. మొదట అందరికీ ఒక టీవేసి ఇవ్వు. నేను సహాయ పడతాను. తరువాత మాట్లాడుదాం

వంట గది చూపించింది. అక్కడున్న అలమరా తెరిచుండటాన్ని చూసి కొంచం విసుగ్గా చెప్పింది ప్రశాంతి.

నా పిల్లలు కొంచం అల్లరి పిల్లలు. చూడండి...అలమరాను తెరిచుంచి పరిగెత్తుకు వచ్చాశారు అని చెబుతూ పాల పౌడర్, టీ పొడి లాంటివి తీసి పెట్టింది.

అలమరా తెరిచుండటం చూసి  ప్రశాంతి కొంచం ఆలొచించి ఉండచ్చు! తానే ఎగిరి ఎగిరి మూసే అలమరా, తన పిల్లలకు ఎలా అందుతుందని...? ప్రొద్దుట్నుంచి వెలిగించబడని స్టవ్వుఇప్పుడు వెలుగుతున్నది... ఎలా? ఎవరు వెలిగించరు?  దానిపైన ఇదివరకే ఒక గిన్నెలో నీళ్ళు కాగుతున్నాయేఎందుకు? ఎవరు ఉంచారు?అని.  

బిస్కెట్ ప్యాకెట్టును ఒకటి చింపి ప్లేట్లో పెట్టి రాఘవ-గిరిజలను తినమని చెప్పి, మొదటి గదికి వచ్చింది ప్రశాంతి. వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటున్న నలుగురు, ఆమెను చూసి మౌనం వహించారు.  

అక్కడ పులుముకున్న మౌనాన్ని చేధించింది ప్రశాంతి.

టీ తాగారా?”

తాగేం మ్యాడం

మిసస్ జాన్. మీరు టీచర్ కదా?”

అవును...టీచర్నే

పిల్లలిద్దర్నీ పిలుచుకు వచ్చి వాళ్ళ దగ్గర పరిచయం చేసింది.

మీకు తెలుగు తెలుసనే అనుకుంటున్నాను

బాగా తెలుసు

నా ఇద్దరు పిల్లలకూ పాఠాలు నేర్పించాలి. తెలుగు పాఠాలు నేనే నేర్పిస్తాను. వాళ్ళకు కావలసిన మిగిలిన పుస్తకాలన్నీ కొనుంచాను. వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాల్సింది మీ బాధ్యత

ఖచ్చితంగా మ్యాడం

నన్ను మీరు ' ప్రశాంతి ' అనే పిలవచ్చు

ఆమె దగ్గర స్నేహ పూర్వ నవ్వు నవ్వుతూ, వెంకటస్వామి వైపు తిరిగింది ప్రశాంతి......

మీకు పని. చెత్తంతా ఊడ్చి శుభ్రంగా ఉంచుకోవడం. పిల్లలిద్దరికీ డస్ట్ పడదు. ఆయసం వచ్చేస్తుంది. అందువలన వాళ్ళు తిరిగేచోట చాలా శుభ్రంగా ఉండాలి. కిటికీ తలుపులు తెరవక్కర్లేదు. వాకిలి తలుపు మూసే ఉంచండి. తరువాత వెంకటస్వామీ...ఇక్కడ పక్కన ఎక్కడన్నా పాలు, కూరలూ రోజూ కొనుక్కోగలమా చూడండి. బయటకు వెళ్ళే పనులను కొన్ని రోజులు మీరే చేయాలి. తరువాత కారు వస్తుంది

కొంచం ఆలోచనలో మునిగిపోయున్న ఆమె -- పిల్లల ఆటల శబ్ధం విని బయట పడింది. ఏదో సృతి తప్పినట్లు అనిపించిన ఆలొచనను పక్కకు నెట్టి, తాను మాట్లాడ దలుచుకున్నది మాట్లాడింది.

తరువాత...వెనుకవైపున్న అవుట్ హౌస్శుభ్రం చేసేసి మీరు అక్కడ ఉండండి. మల్లీ వంటకు కావలసిన వన్నీ ఉన్నాయి. సరసు ను నీ సహాయానికి ఉంచుకో. కాయగూరలు వచ్చేంత వరకు బఠానీలూ,వేరుసెనగ పప్పు -- ఇవన్నీ పెట్టుకుని అడ్జస్ట్ చెయ్యి. నువ్వూ, సరసు వంట గదికి పక్కనున్న గదిని శుభ్రం చేసుకుని ఉండండి. క్రింద డైనింగ్ హాల్పక్కనున్న ఇంకొక గదిని టీచర్ కు కేటాయించి ఇచ్చేయండి

సరేనని చెప్పి అక్కడ్నుంచి కదిలారు ఇద్దరు స్త్రీలు.

వెంకటస్వామి అప్పుడే తన పనిని చేయటం మొదలుపెట్టాడని వస్తున్న శబ్ధం బట్టి తెలుసుకుంది.

అక్కడున్న ఎర్ర డబ్బాలో వేసుంచిన గోధుమ రవ్వను వేయించి చేసిన ఉప్మాను, మూడు కొత్త ప్లేట్లలో పెట్టి, కొంచం పంచదారనూ ఉంచి డైనింగ్ హాల్ టేబుల్ మీద అందంగా పెట్టుంచింది సరసు. అది చూసి ప్రశాంతి బాగా తృప్తి చెందింది.

పనులుకు ఎవరెవరు కావాలో, పనివాళ్ళను పంపించినందుకు అమీలియా కు ఒక ఉత్తరం రాయాలి’ -- అని అనుకున్నది.

మామూలుగా పిల్లలిద్దరూ ఉప్మాని ఇష్టపడి తినరు. వేరే దారిలేక, ఏదైనా తినే కావాలని, మొహాన్ని చిట్లించుకున్న గిరిజను, రాఘవ్ నూ ఒత్తిడి చేసింది ప్రశాంతి. వాళ్ళు వేసుకోవలసిన మందులను వేసుకుని ఆ తరువాత ఆడుకోమన్నది.

మందు ఎందుకమ్మా?” అడిగింది సరసు.

వాళ్ళకు కొంచం ఒంట్లో బాగుండలేదు సరసు. అందుకనే

రోజూ వేసుకోవాలా?”

అవును

నాకు పిల్లలంటే చాలా ఇష్టమమ్మా. ఇంకమీదట పిల్లలను చూసుకోవలసిన బాధ్యతను నాకు అప్పగించండి

సరసు మాట్లాడిన తీరుతో ఆనందపడిన ప్రశాంతి సరే, నువ్వే చూసుకో అని సమ్మతం తెలిపింది........

తన ఉప్మా ప్లేటు ముందు కూర్చున్న ఆమె తినకుండా ఏదో ఆలొచిస్తోంది.తరువాత రెండు ముద్దలు మాత్రం తిని, టీ గ్లాసును తీసుకుని వచ్చి సోఫాలో వాలిపోయి, బయట  తెలుస్తున్న దృశ్యాలను చూడటం ప్రారంభించింది.

టీ తాగుతూ ఉన్నప్పుడు, వంట గదిలో నుండి మెల్లగా వచ్చిన ఒక గొలుసు శబ్ధం, హాలుకు వచ్చిన తరువాత స్విచ్ వేసినట్టు ఆగిపోయింది. సరసు గానీ, మల్లీ గానీ కాళ్ళకు వేసుకున్న గొలుసై ఉంటుంది అని అనుకున్న ప్రశాంతి -- దాన్ని పెద్దగా పట్టించుకోలేదు.  

కానీ, వాళ్ళిద్దరూ కాళ్ళ గొలుసులే వేసుకోలేదు. గొలుసు వేసుకున్న వ్యక్తే వేరుఅనేది ప్రశాంతి ఎప్పుడు గ్రహిస్తుంది?

వ్యక్తి గురించి తెలుసుకున్నప్పుడు ప్రశాంతికు ఏర్పడ బోయే షాక్ ఎలా ఉంటుంది?

                                                                                                                Continued...PART-9

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి