27, ఆగస్టు 2022, శనివారం

దాగుడు మూతలు...(సీరియల్)...(PART-17)

 

                                                                             దాగుడు మూతలు...(సీరియల్)                                                                                                                                                             (PART-17)

అమావాస్య రాత్రి ప్రారంభమైన రోజు, కోడైకానల్ హెయర్ పిన్ బెండు లో తేలికగా కారు నడుపుకుంటూ వచ్చాడు శ్రీనివాస్.

హఠాత్తుగా కుంభవృష్టి మొదలైయ్యింది.

దగ్గరగా స్నేహలత కూర్చోనుంది.

శ్రీనివాస్ ఆమెను పెళ్ళి చేసుకుంటానని రెండు రోజుల క్రితం చెప్పటంతో, ఆమె చాలా ఆనందంలో ఉంది. మొదట కోడైకానల్ లో హనీ మూన్. తరువాత పెళ్ళి అని చెప్పటంతో ఆమెకు అది నచ్చింది.

మధురై నుండి ఒక పత్రికా విలేఖరి ఒకరికి ఇంకెవరో మాట్లాడుతున్నట్టు ఫోన్ చేసి... శ్రీనివాస్, తనూ ఒంటరిగా బయలుదేరి వస్తున్నట్టు చెప్పుంచింది. ఎవరైనా చూడాలనే కారణంగా శ్రీనివాస్ తో బాగా క్లోస్ గా ఉన్నట్టు నటించింది.

అతని ఆస్తి మొత్త వివరం తెలిసున్న ఆమెకు మనసులో కొంత ఉత్సాహంగా ఉన్నది. మొదటి పనిగా ఆస్తులన్నిటినీ తన పేరుకు మార్చాలని అనుకుని, దానికైన పధకమూ వేసింది.  

కానీ, పరిస్థితిని బట్టి, మొహాన్ని కొంచం శోకంగానే పెట్టుకుంది. అన్నీ కలిసి వచ్చేటప్పుడు శ్రీనివాస్ కు ఎటువంటి అనుమానమూ రాకూడదుఅనే విషయంలో హెచ్చరికగానే ఉన్నది.

స్నేహలతా, నాలో ఉన్న కొన్ని అనుమానాలకు జవాబు కావాలి -- అని నిదానంగా చెప్పాడు శ్రీనివాస్.

స్వరం ఏదో ఒకటి జరగబోతోంది అనే వార్నింగ్ సమాచారం అనేది గ్రహించింది.

ప్రశాంతి ఇంటి నుండి వచ్చే రోజు ఏం జరిగింది?”

కారును ఒక పక్కగా ఆపి అడిగాడు.

మేలుకుంది స్నేహలత.

నాకెలా తెలుసు?”

నిజంగానే నీకు తెలియదా?”

అతని స్వరం మరికొంత కఠినమైంది.

తెలియదు ఖచ్చితంగా చెప్పింది.

నిజంగానే నీకు తెలియదు?”

అతని మాటల్లో వేడి తెలుస్తోంది.

నిజంగానే తెలి...

చెంప మీద తగిలిన దెబ్బ కారణంగా స్నేహలత యొక్క చెవిలో గుయ్అని శబ్ధం వచ్చింది.

జేబులో ఉన్న తుపాకీని మెల్లగా తీసాడు.

నువ్వు ఎలా చావాలనుకుంటున్నావు స్నేహలతా? తుపాకీనా లేక కత్తా?”

ఆమె కళ్ళల్లో మరణ భయం కనబడింది.

నిజం చెప్పేస్తాను. కోడైకానల్ కు వస్తున్న ప్రశాంతి కారును దారిలోనే అడ్డగించి, ఆమెను బెదిరించి, విడాకుల కాగితాల్లో సంతకాలు మాత్రమే తీసుకోమన్నాను. కానీ, రౌడీలు ఇంకేదో చెయ్యటానికి ప్రయత్నించారనుకుంటా. ఆమె, కారును వేగంగా నడుపుకుంటూ వచ్చి దారి కనబడక కొండపై నుండి లోయలోకి పడిపోయి చచ్చిపోయింది. అందులో నా తప్పేమీ లేదు

ఛీ ఛీ...నువ్వు ఒక అమ్మాయివేనా? మనిద్దరం ఇచ్చిన ట్రబుల్ తట్టుకోలేక, ఆరోగ్యం బాగుండని నా పిల్లలను తీసుకుని ఎవరికీ తెలియని చోటుకు పరిగెత్తుకు వచ్చిన ఆమెను -- రౌడీలను పెట్టి భయపెట్టావు.

ప్రశాంతి భయపడిపోయి -- అలవాటులేని చోట, తప్పించుకోవటానికి వేగంగా కారు నడిపి, బెంబేలు పడి అదః పాతాళంలో పిల్లలతో పాటూ పడిపోయింది.  

ప్రశాంతిని హత్య చేసేసి...కొంచం కూడా నేర భావనే లేకుండా ఆమె భర్తనీ, ఆస్తిని అనుభవించటానికి ఆశపడిన నీకు ఏం శిక్షో తెలుసా...?”

“...................”

నేను పెళ్ళికి అంగీకరించకపోతే నన్ను చంపేస్తానని బెదిరించావని పోలీసుల దగ్గర నీ మీద ఒక కంప్లైంట్ రాసిచ్చే వచ్చాను. ఇప్పుడు నాకేదైనా అయితే నువ్వు తప్పించుకోలేవు. కానీ నీ క్రిమినల్ బుర్ర గురించి నాకు బాగా తెలుసు. నువ్వు తప్పించుకోవటానికి ఏదైనా చేస్తావు.  అందుకనే నువ్వు చేసిన తప్పులకు నేనే నీకు శిక్ష వేయాలని నిర్ణయించుకుని, నిన్ను నాతో పాటూ తీసుకు వచ్చాను...దిగు, కారొలో నుంచి దిగవే... అని చెబుతూనే కారులో ఉన్న స్నేహలతని కిందకు తొశాడు.

స్నేహలత రోడ్డు మీద పడింది.

వెంటనే రోడ్డు మీద పడిన ఆమె కాళ్ళ మీద వేగంగా కారును ఎక్కించాడు.

రెండు కాళ్ళూ కారు చక్రాల క్రింద పడి చితికిపోగా........

అమ్మా... అంటూ కేకలేసింది స్నేహలత.

నీకిప్పుడు నొప్పి పుట్టినట్లే కదా...అమాయకులైన నా చిన్న పిల్లలిద్దరికీ నొప్పి పుట్టుంటుంది? అందుకని నువ్వు త్వరగా చావకూడదు. చేసిన తప్పును తలుచుకుంటూ జీవితాంతం కాళ్ళు లేకుండా, నీ పనులు నువ్వు చేసుకోలేక జీవించాలి. అందుకే నీకీ శిక్ష.

నేనూ, నా భార్యా-పిల్లల దగ్గరకు వెడతాను. జీవితంలో దేవుడిచ్చిన స్వర్గాన్ని  పారేసుకుని నిలబడ్డ మగవాళ్ళకు నా కథ ఒక పాఠం కావాలి

గిలగిలా కొట్టుకుంటున్న స్నేహలత వైపు కోపంగా చూస్తూ ప్లీజ్...ఇక్కడే చచ్చిపోయి -- నేను వెళ్తున్న చోటుకు వచ్చి నాకు ట్రబుల్ ఇవ్వకు

కారులో వెనక్కి వెళ్ళిన అతను, పదిరెట్లు వేగంతో హెయర్ పిన్ బెండ్ వైపు కారును వేగంగా నడిపాడు.

ప్రశాంతి పిల్లలతోటి కారులోంచి కింద పడిపోయిన అదే చోట,

శ్రీనివాస్ కారు కింద పడి...విరిగి ముక్కలయ్యింది.

ప్రశాంతి నిలయం నుండి కొంచం దూరంలో కిందపడి విరిగి పోయిన కారును చూసి ప్రశాంతికి వొణుకు పుట్టింది.

ఆమెకు ఇరువైపులా రాఘవ్గిరిజ ఉండగా---------

ఎదురుగా మేరీ, వెంకటస్వామి, సరసు, మల్లి .

ఇదేలాగానే మేము వచ్చిన కారు కొండపై నుండి కింద పడి పోయంది. కొంచం తట్టుకోలేని నొప్పి పుట్టింది. తరువాత ఏమి జరిగిందనేదే తెలియలా! కళ్ళు తెరిచి చూసినప్పుడు, నా పక్కన నా పిల్లలిద్దరూ ఉన్నారు.

దేవుడు మమ్మల్ని కాపాడేడని చాలా సంతోష పడ్డాను. కంటికి ప్రశాంతి నిలయం ఇల్లు తప్ప ఇంకేదీ కనబడలేదు. మేము ముగ్గరమూ ఇక్కడికి వచ్చాము. తరువాత మిమ్మల్ని చూశాము  అన్నది ప్రశాంతి.

ప్రేమగా ఆమె దగ్గరకు వచ్చిన మేరీ మేమూ కొండ చెరియ జారుడు వలన ఒకే రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. నువ్వు వచ్చినప్పుడు నిన్ను చూడటానికి వచ్చాము. కానీ, నువ్వు ప్రాణాలతో లేవని నీకు తెలియలేదు. ఇది మామూలే. చాలా మంది తాము చనిపొయామని తెలియక మామూలుగా చేసే పనులు చేస్తారు.

వాళ్ళ మనో పరిస్థితిని బట్టే వాళ్ళకు జరిగింది గురించి వాళ్ళకు తెలియవస్తుంది. మనల్ని మూసేసున్న మాయ అనే కట్టు, కొంచం కొంచంగానే మనల్ని వదిలి వెడుతుంది.

నీకు నిదానంగా చెబుదామని మేమూ కాచుకోనున్నాము. ఇంతలో ఇల్లు కొనడానికి వచ్చిన వాళ్ళ రాకపోకలు ఎక్కువ అయిపోయింది.

మీ కారు కింద పడిపోయిన వెంటనే, వారసులు లేని ఈ ఆస్తులను, ఆక్రమించుకోవటానికి కుటుంబంతో సహా వచ్చాసారు వాళ్ళు.   

కొన్ని సమయాలలో మనుషులు మనలాంటి ఆత్మలకంటే కృరమైన వాళ్ళు. వాళ్ళింటి అబ్బాయి రామూకు న్యాచురల్ గానే ఆత్మలను చూసే శక్తి ఉంది. కొంతమందికి అలాగే ఉంటుంది. మనల్ని చూడటం, మనతో మాట్లాడటం, అవసరమైతే మనల్ని నొక్కి గుప్పెట్లో పెట్టుకోవటం కూడా కుదురుతుంది. భవిష్యత్తులో ఆత్మలతో మాట్లాడగలిగే శక్తి గలవాడుగా ఎదుగుతాడు.

అలాంటి అపూర్వ శక్తి ఉండటం వలనే ఇక్కడ జరుగుతున్న విషయాలు అన్నీ తెలిసి కూడా, చిన్న కుర్రాడైనా  ఇక్కడ్నుంచి వెళ్ళిపోదామని తల్లి-తండ్రులను తొందర పరచలేదు. కానీ, వాళ్ళమ్మా-నాన్నకు శక్తి తక్కువగా ఉన్నందువలన, వాళ్ళ వలన మనల్ని గుర్తించలేకపోయారు. కానీ, ఇక్కడ ఏదో జరుగుతున్నదని గ్రహించినా వారసులే లేని, కోట్లు విలువ చేసే ఈ బంగళాను విడిచి వెళ్ళటానికి ఇష్టపడక, ఆక్రమించుకోవటానికి మంత్రవాదిని తీసుకు వచ్చారు.   

మీరు ముగ్గురూ ఇక్కడ ఉన్నారని మంత్రవాది గుర్తించాడు. మిమ్మల్ని అణగదొక్కాలని మంత్రవాది పూజ ఏర్పాటు చేశాడు. రోజు నీ వీపు వెనుక ఏదో వాత పెట్టినట్టు ఉన్నదని చెప్పావు కదా?

అది ఇంకేదీ కాదమ్మా. వాళ్ళు వేసుకున్న దేవుడి లాకెట్టు. అది నీ మీద తగిలి నిన్ను నిప్పులాగా కాల్చింది. నువ్వు దాన్ని తెలుసుకోలేకపోయావు. కానీ, రోజు నువ్వు వేసిన కేకతో భయపడిపోయి, ఇంట్లోంచి పారిపోయిన వాళ్ళు మంత్రవాదిని పిలిచి నిన్ను కట్టి వేయటానికి ప్రయత్నించారు.

కానీ, మంత్రవాది పూజ మొదలుపెట్టటానికి మునుపే దాన్ని ఆపే శక్తి నీకు మాత్రమే ఉంది. ఎందుకంటే...అకాల మరణం చెందినా ఇంకా శాంతియాగం ఉన్న ఆత్మవు నువ్వు.

నీకే మాకంటే వేగమూ, శక్తి ఎక్కువ. అందువలన అతని వలన నిన్ను ఎక్కువసేపు కట్టి ఉంచలేకపోయాడు. నిన్ను పెట్టుకుని వాళ్ళను తరిమేశాము. వాళ్ళ ఉనికి గిరిజకూ, నాకూ ముందే తెలిసింది.

అంతేకాదు...ఇక్కడ మనలాగా తిరుగుతున్న మిగిలిన వాళ్ళను కూడా గిరిజకు తెలియటం మొదలయ్యింది. ఎందుకంటే గిరిజ ఆడిన దాగుడుమూతల ఆటలో, ఆమెకు కళ్ళకు కట్టిన కట్టు తొందరగా ఉండిపోయింది. నీకు కొంచం  ఆలస్యమైంది

కానీ, నాకు ఏమీ అర్ధం కాలేదు! నేను మిగిలిన మనుష్యులలాగా వంటచేశాను, తిన్నాను...అన్ని పనులూ చేశానే?”

అది అలాగే. ఉయ్యాల అలవాటు కొన్ని సమయాలలో శ్మశానం దాటి వస్తుంది. నువ్వా వంట చేశావు? లేదు. సరసు వంట చేయలేదు. ఇక్కడ వంట చేసింది ఇంటిని కొనడానికి వచ్చి, తరువాత ఆక్రమించి ఇక్కడ బస చేసిన కుటుంబం. నువ్వు శుభ్రం చేసి వెళ్ళిన గదులను ఉపయోగించింది, రోజూ వంట చేసింది, రాఘవ్ బెడ్ మీద పడుకుని నిద్రపోయింది అన్నీ వాళ్ళే.

బాగా ఆలొచించి చూడు. రోజూ భోజనం చేసింది ఒక కలలాగానే ఉంటుంది. ఇకపోతే నువ్వు కరెక్టుగా కూర్చుని కడుపు నిండా భోజనం మీ ఇంట్లో వాళ్ళు పదో రోజు నీకొసం పెట్టిన పిండ భోజనమే. రోజే నీకు నిజమైన ఆకలి. అంతవరకు దాహం మాత్రమే

నాకూ, పిల్లలకూ మాత్రలు ఏవీ అవసరం లేకుండా ఆయసమూ, నా తలనొప్పి పోయింది దానివలనేనా? అయితే నేనూ, నా పిల్లలూ ప్రాణాలతో లేమా? నన్ను దయ్యం అనుకుని భయపడ్డ వారే నిజమైన మనుష్యులా?

నా శ్రీనివాస్ ను  వదిలి నేను నిజంగానే విడిపోయి చాలా దూరం వచ్చాశానా? ఆయన ఇంట్లో నా ఫోటోకి ముద్దు పెట్టినట్టు అనిపించింది, మాకు ఇష్టమైన వంటను అమ్మ ఏడుస్తూ వంటచేసినట్లు ఉన్నది, శ్రీనివాస్  భోజనం వద్దని చెప్పి ఏడ్చింది, నేను ఆయన చెంపల నుండి వస్తున్న కన్నీటిని తుడిచింది ఖచ్చితంగా నా కలకాదు.

అప్పుడు రోజు స్నేహలత  మీద ఉన్న కోపంతో చూసినప్పుడు ఒక్కొక్క ప్లేటు విరగటానికి కారణం నేనేనా? అమానుషమైన శక్తి నేనేనా? ”

ఆలొచించి చూసిన ప్రశాంతి, అన్నీ అర్ధమయినట్టు తెలుపడానికి తల ఊపింది.

అందరూ చిన్నగా నవ్వారు.

కాలం ఇంతే. మనం దేవుడ్ని చేరుకునేంత వరకు చోటు మనకు ఆశ్రయం. ఇక్కడకు మనలాంటి వారు చాలా మంది వస్తారు. కొంతమంది మన కంటికి కనబడతారు. కొందరు కనబడరు. వాళ్ళు ఇష్టపడినట్టు వాళ్ళ పనిని వాళ్ళను చేసుకోనిద్దాం. మనపని మనం చూసుకుందాం. సరేనా ప్రశాంతీ?”

నవ్వుతూ అడిగింది మల్లి.

నేనూ మీతో చేరిపోవచ్చా?” అనే స్వరం వినబడి అందరూ వెనక్కి తిరిగి చూశారు.

అక్కడ శ్రీనివాస్.

ప్రశాంతి అతనికి మొట్టమొదటగా కొనిచ్చిన బూడిద రంగు సూటు దుస్తులు వేసుకుని నిలబడున్నాడు.

ప్రశాంతీ...నేను తప్పు చేసేశాను. నువ్వూ, రాఘవ్--గిరిజ అందరూ నన్ను క్షమించాలి. నా వల్లే మీకు ఇంత కష్టం? నేను మాత్రం సరిగ్గా ఉండుంటే -- మనం ప్రాణాలతో -- శరీరంతో సంతోషంగా ఉండి ఉండవచ్చు.

నువ్వు ఇక్కడున్నావని నిన్న రాత్రి నేను ఇక్కడకు వచ్చినప్పుడే నేను పసిగట్టాను. కానీ, నేను నీ దగ్గరకు రావటానికి ముందు చెయ్య వలిసిన కొన్ని పనులూ, ఇవ్వవలసిన శిక్షలూ ఉన్నాయి. అన్నీ ముగించుకుని వచ్చాశాను. నేను ఇంకా రాముడ్నే ప్రశాంతీ. నా సీతను కష్టపెట్టినందుకు శిక్షగా ఇప్పుడే తగలబడ్డాను

అలాగంటే...ఇప్పుడు కింద పడిన కారులో నుండి....

ఏం చేయను? ప్రశాంతికి జీవిత భాగస్వామి అయినప్పుడు ప్రశాంతి నిలయానికే కదా రావాలి? నన్ను క్షమించి, నీతో ఉండనిచ్చి నన్ను ఏలుకుంటావా?”

తమ తండ్రి దగ్గరకు పరిగెత్తారు పిల్లలిద్దరూ.

ఆమె ఎలా మిమ్మల్ని ఏలుకోకుండా ఉంటుంది? ఆమె ప్రాణాలతో లేదనేది ఆమెకు తెలియకుండా పోయింది మీ జ్ఞాపకాల వలనే కదా అని మల్లి చెప్పగా.......

అక్కడ గలగల మంటూ నవ్వుల శబ్ధం లేచింది.

వెనుక ఉన్న చింత చెట్టూ ఆడుతూ-ఊగుతూ నవ్వుతో చేరిపోయింది.

దూరంగా నిలబడి ప్రశాంతి నిలయాన్ని చూస్తున్న మునీశ్వరుడి గుడి పూజారికి వొళ్ళంతా జలదరించింది.

రోజు రోజుకూ ఇంటిని చూడటానికి భయంగా ఉంది. ఎన్ని ఆత్మలు అక్కడికి ఆకలితో వచ్చి కాచుకోనున్నాయో?’ అని అనుకుంటూనే చేతులో ఉన్న పిండాలను ప్రశాంతి నిలయాని కి కొంచం దూరంలో ఉంచేసి, తిరిగి చూడకుండా వచ్చాశాడు.

అరిటాకున ఉన్న ఆహారాన్ని చూశారు. ఒక్కొక్కటీ కనబడకుండా పోవడం మొదలుపెట్టింది.

గుడికి తిరిగి వచ్చిన పూజారి దగ్గరకు అడవి పనులకు వెళ్ళి భయపడిపోయిన ఒక యుక్త వయసు స్త్రీని పిలిచుకు వచ్చారు.

మొహం పీక్కుపోయి ఏదో ఒక దిక్కుకు చూస్తున్న ఆమెను చూస్తూ డప్పు వాయించి అమ్మవారి స్తొత్రం ఆలపించాడు పూజారి.

మెల్లగా ఆకులు కదల....

క్షుణ్ణంగా చూస్తున్న చింత చెట్టూ తన వేగమైన ఆటను ప్రారంభించింది.

యుక్త వయసు స్త్రీలో మామూలు చూపు రావటం మొదలయ్యింది.

ప్రశాంతి నిలయం ప్రశాంతంగా మారింది.

                                                                                సమాప్తం

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి