దాగుడు మూతలు...(సీరియల్) (PART-14)
‘ఈ
ఇంట్లో ఏం
జరుగుతోంది?’ అనేది
ప్రశాంతికి అర్ధం
కాలేదు. మేడ
మీద నుండి
దిగుతున్న ప్రశాంతిని
పట్టించుకోకుండా
ఆమెను పక్కకు
తోసేసి గాలిలాగా
పరిగెత్తాడు ఒక
కుర్రాడు. తనలో
నుండి ఏదో
దూరి వెళ్ళినట్లు
ఫీలయ్యింది ప్రశాంతి.
తన పిల్లలు
కింద మొదటి
గదిలో ఉన్నారనేది
ఆమెకు తెలుసు.
ఇంకోక సారి
స్నేహలత చేసిన
చెడు పనులను
గురించి ప్రశాంతి
ఆలొచిస్తున్నప్పుడు. డైనింగ్
టేబుల్ మీద
సర్ది పెట్టున్న
ప్లేట్లు ఒక్కొక్కటిగా
క్రింద పడి
విరిగున్నాయి. ఏదో
పిల్లి తోసేసుంటుందని
అనుకుని మళ్ళీ
తన జ్ఞాపకాలలోకి
వెళ్తూనే డైనింగ్
టేబుల్ వైపు
చూసిన ప్రశాంతి, ఏదో
మ్యాజిక్ లాగా
-- గాలిలోకి ఎగిరిన
ప్లేట్, ఎవరో
వేగంగా విసిరి
వేస్తున్నట్టు
గోడకు తగిలి
విరిగింది చూసి
ఆశ్చర్యపోయింది.
ఆ రోజు
అలాగే మేడపై
కూర్చుని ప్రశాంతి
వేడుక చూస్తున్నప్పుడు, రాజులాగా
ధుస్తులు ధరించిన, పదిహేడేళ్ళు
ఉన్న ఒకతను
రాజ శభలో
నడుస్తున్నట్టు
ఇల్లంతా చుడుతూ
నడుస్తున్నాడు.
‘ఇతనే
గిరిజను భయపెట్టి
ఉంటాడులాగుంది.
వీడికి అలా
ఏం కావాలి? తనని
భయపెట్టి ఇక్కడ్నుంచి
ఎవరైనా తరమటానికి
ప్రయత్నిస్తున్నారో?’
వేగంగా క్రిందకు
వెళ్ళి
-- వాడు
వెళ్ళిన దిక్కు
వైపు నడిచింది.
ఆ బాట
తీసుకు వెళ్ళిన
చోటు ఆ
చింత చెట్టు
వెనుక ఎవరూ
గమనించలేని పాడుబడ్డ
శ్మశానం!
మొట్టమొదటి సారిగా
ప్రశాంతికి ఒక
భయం ఏర్పడింది.
శ్రీనివాస్ కు
ప్రశాంతిని, పిల్లల్నీ
తలచుకుంటుంటే మనసు
నొప్పి పుడుతోంది.
అతనికి
మామగారు రాజా మార్తాండ
చక్రవర్తిని చూడటానికి
ఇష్టం లేకపోవటానికి
కారణం, ఆయన
తన అత్తను
బలవంత పెట్టి
పెళ్ళి చేసుకున్నాడని
నమ్మటమే. అలా
పెళ్ళి చేసుకున్న
అత్తయ్య ఎప్పుడూ
సంతోషంగా ఉన్నట్టు
అతనికి అనిపించలేదు.
మార్తాండ చక్రవర్తి గారు
ఆ తరువాత
శ్రీనివాస్ కుటుంబానికి
ఎంతో మంచి
చేసున్నా, శ్రీనివాస్
వల్ల చక్రవర్తి
గారిని క్షమించటానికి
మనసు రాలేదు.
ప్రశాంతి,
శ్రీనివాస్ ను వదిలి ఎక్కడికో వెళ్ళిపోయిందని తెలుసుకున్న ఒక
రోజు మార్తాండ
చక్రవర్తి స్నేహితుడు
రహీం బాయ్ శ్రీనివాస్ ను
కలుసుకోవటానికి
వచ్చాడు. ఇద్దరూ
కొన్ని ముఖ్యమైన
విషయాల గురించి
మాట్లాడుకున్నారు.
స్నేహలత
గురించి, ఆమె
డబ్బు ఆశ
గురించి చెప్పారు
రహీం బాయ్. దానికి
కొంచం ముందు
శ్రీనివాస్ కు
దొరికిన ‘పోలీస్
రిపోర్ట్’ స్నేహలత
గురించి రహీం
బాయ్ చెప్పిన
ప్రతి విషయమూ
కరెక్ట్ అనేది
తెలిపింది.
బయలుదేరే ముందు
ఆయన “శ్రీనివాస్, ప్రశాంతి
నాకూ కూతురు
లాంటిదే. మీరు
నాకూ అల్లుడే.
మీ అత్తయ్యను
చక్రవర్తి బలవంతపు
పెళ్ళి చేసుకున్నారని
ఎవరో నీతో చెప్పారని
తెలుసుకున్నాను. అది నిజం కాదని చెప్పటానికే వచ్చాను. నిజం
చెబుతా విను.
పెళ్ళికి వెళ్ళిన
చోట, ఆకలితో
ఉన్న ఒక
బిచ్చగాడికి, మీ
అత్తయ్య పండ్లు
ఇవ్వటం చూశాడు
చక్రవర్తి...ఆ
క్షణమే చక్రవర్తికి
మీ అత్తయ్య
కుమారి పైన ఇష్టం
ఏర్పడింది.
కానీ, ఆమే
పెళ్ళి కూతురు
అని తెలుసుకుని
తన మనసును
అణుచుకున్నాడు.
పెళ్ళికి ముందే
పెళ్ళి కొడుక్కి
పెద్ద ఉద్యోగం
దొరికిందని చెప్పి
అతని తల్లి-తండ్రులు
ఇంకా ఎక్కువ
కట్నం అడిగి
గొడవ పడి
దగ్గర దగ్గర
పెళ్ళి ఆగిపోయింది.
ఈ విషయం
మీ అత్తయ్యకో, మిగిలిన
వారికో తెలియదు.
మీ మావయ్య
చక్రవర్తి వెంటనే
కలుగజేసుకుని ‘మగ
పెళ్ళి వాళ్ళు
పెట్టిన గొడవ
గురించి బయటకు
తెలిస్తే అందరూ నీ
చెల్లి కుమారి నే తప్పుగా
మాట్లాడతారు. అందుకని
మగపెళ్ళి వాళ్ళు
అడిగిన అదనపు
కట్నం డబ్బును
నీకు సహాయంగా
ఇస్తాను, పెళ్ళి
చెయ్యి’
అని మీ
నాన్నకు చెప్పినప్పుడు,
“మగపెళ్ళి
వాళ్ళు ఈ
విషయాన్ని
ఈజీగా తీసుకుని
ప్రతి విషయానికి
నన్ను పీడించుకు
తింటారు. అందువలన
పెళ్ళి ఆగిపోనీ.
ఇంకో సంబంధం
చూసుకుందాం” అని చక్రవర్తితో
గట్టిగా చెప్పారు.
అందరూ పెళ్ళి
ఎందుకని ఆగిపోయిందని
అడిగితే నేనే
కారణం అని
చెప్పాడు మీ నాన్న.
అదే ముహూర్తానికి
నా స్నేహితుడు
చక్రవర్తిని ఇచ్చి
నా చెల్లికి
పెళ్ళి చేస్తాను
అని చెప్పి
మీ నాన్న
కుమారిని చక్రవర్తికి
ఇచ్చి పెళ్ళి
చేశాడు. అందరూ
మీ నాన్నను
తిట్టారు, నిందించారు.
మీ నాన్న
అవేమీ పట్టించుకోలేదు.
మీ అత్తయ్య
కూడా మీ
నాన్న చెప్పింది
నమ్మలేదు. కానీ
మీ నాన్న
చెప్పాడు కదా
అని చక్రవర్తిని
పెళ్ళి చెసుకోవటానికి
తలవంచింది మీ
అత్తయ్య.
కానీ మీ అత్తయ్య
జీవించినంతవరకు
ఒక మంచి
భార్యగా జీవించలేదు.
నా స్నేహితుడితో
నలభై ఏళ్ళు
కాపురం చేసిన
తరువాత కూడా మీ
అత్తయ్య చక్రవర్తిని
అర్ధం చేసుకోలేదు.
నీ
బిడ్డలను మోసి, స్నేహలతని
నువ్వు పెళ్ళి
చేసుకోకుండా ఆపి, నీ
జీవితం అదఃపాతాళానికి
పడిపోకుండా నిన్ను
కాపాడిన ప్రశాంతిని
నువ్వూ అర్ధం
చేసుకోలేదు.
మీ కుటుంబానికి
మంచి చేసే
చేసే, నా
స్నేహితుడి కుటుంబం
కష్ట పడింది.
ప్రశాంతికి
ఉన్న మనసు, నాన్న
లాంటి రూపం, గుణమూ
మాత్రమే కాదు
-- జీవితం కూడా
అలాగే ఏర్పడింది” -- అని
బాధతో చెప్పి
వెళ్ళినతని కళ్ళల్లో, నిండిన
నీటిని చూశాడు.
‘ఇది
ఆయన కొంచం
ముందు వచ్చి
చెప్పుంటే, నా
ప్రశాంతిని ఇంటి
నుండి వెళ్ళ
నిచ్చేవాడిని కాదు?’ అని
ఒక మనసు
చెప్పగా, ‘నీ
భార్యను నువ్వు
నమ్మటానికి, ఇంకొకరు
వచ్చి ఆధారాలు
ఇవ్వాలా? ఇంతేనా
నీ స్వభావం...?’ అని
మరో మనసు
క్షొభ పెట్టింది.
‘ప్రశాంతీ...నువ్వూ, పిల్లలూ
ఎక్కడున్నారు? ఎలా
ఉన్నారు?’ అని
తలచుకుంటూ పడుకున్నతను, అలాగే
నిద్ర పోయాడు.
అతనికి అందమైన
కల వచ్చింది.
కలలో ఒక
ఇల్లు. అందులో
భార్యా, పిల్లలూ
సంతోషంగా మేడమెట్లు
ఎక్కి ఆడుకుంటున్నారు.
అతనికి నచ్చిన
పచ్చ రంగు
చీర కట్టుకోనుంది
ప్రశాంతి. ఇల్లు
రాజ భవనం
లాగా ఉన్నది.
వాళ్ళ దగ్గరకు
వెళ్ళాడు. వాళ్ళో
అతని చేతికి
చిక్క కుండా
పరిగెత్తుతున్నారు.
‘ఇది
ఏ చోటు, ఏ
చోటు?’ అని
బుర్ర వేడేక్కేలాగా
ఆలొచించాడు. కలలో
మెల్లగా ఒక స్వరం
అతని చెవిలో
గుసగుసలాడింది.
‘ఇది
ప్రశాంతి నిలయం’
గబుక్కున లేచాడు.
‘ప్రశాంతి నిలయం, ప్రశాంతి
నిలయం...అవును!
అతని భార్య
యొక్క రాజ
భవనం ఇల్లు.
మరిచిపోలేని చోటు.
ఇదంతా నిజమా? అలాగూ
ఉంటుందా? లేదు...ఖచ్చితంగా
అలాగే ఉంటుంది!’
చేయాల్సిన పనులను
వేగంగా చేశాడు.
స్నేహలతకి సమాచారం
పంపి మధురై
కి రమ్మన్నాడు.
ఒక నిర్ణయంతో
కారు తీసుకుని
బయలుదేరాడు.
మధురైలో స్నేహలతని
కలిసిన అతను
-- ఆమెను అక్కడ
కాచుకోమని చెప్పి, ‘అర్జెంటు
పని’ అని
ఆమె దగ్గర
అబద్దం చెప్పేసి----కోడైకానల్
రోడ్డులో వెళ్ళటం
మొదలు పెట్టాడు.
Continued...PART-15
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి