14, ఆగస్టు 2022, ఆదివారం

పవిత్ర…(పూర్తి నవల)

 

                                                                                       పవిత్ర                                                                                                                                                                      (పూర్తి నవల)

సతీసావిత్రి జీవించిన కాలం నుండి...భర్త ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో జీవించి తిరిగి వచ్చినా, అతని పాదాలు తాకి కళ్ళకద్దుకుని అతనే తన భర్త అని చెప్పే మహిళనే పతివ్రత అంటున్నారు. కన్యాత్వం అనేది మగవాడికీ, ఆడదానికీ సమం కాదా?

పెళ్లైన జీవితం అందరికీ విజయవంతంగా ఉండటం లేదు. నవలలోని హీరోయిన్ పవిత్రకు కూడా అదే జరిగింది. కానీ అందులో ఆమె తప్పేమీ లేదు. పెళ్ళి చూపులకు వచ్చి, పవిత్రను పలుమార్లు చూసి, ప్రశ్నలతో పాటూ కట్నకానుకలు అడిగి పెళ్ళిచేసుకున్న తరువాత, ఆమె బాగుండలేదని, రోజు మహిళలాగా లేదని విదిచిపెట్టాడు పవిత్ర భర్త రామ్మోహన్.

తనకు ఏర్పడిన ఓటమిని విజయవంతంగా చేసుకునేందుకు తనని తాను పక్వ పరుచుకుంది పవిత్ర. మెరుగు దిద్దబడ్డ వజ్రంలాగా  మారిపోయింది. ఆమెకు పక్క బలంగా నిలబడ్డాడు ఆమె తమ్ముడు మనోహర్. కొన్నేళ్ళలలో ఆమె 21 శతాబ్ధపు మహిళలా మారిపోయింది.

అనుకోకుండా ఒక ఆసుపత్రిలో రామ్మోహన్, పవిత్రను చూస్తాడు. తిరిగి ఆమెతో కలిసి కాపురం చేద్దామని ఆమె వెనుక పడతాడు. అత్తగారిని తన మాటలతో ఒప్పిస్తాడు. అల్లుడితో తిరిగి కలిసిపొమ్మని తల్లి పవిత్ర మీద ఒత్తిడి తెస్తుంది.

తల్లి ఒత్తిడికి తలవొగ్గిందా పవిత్ర? 'కొట్టినా, తిట్టినా భర్తే' అనే పాత వాదనను నిజం చేస్తూ తిరిగి రామ్మోహన్ తో కలిసిపోయిందా? లేక తన జీవితాన్ని విజయవంతం చేసుకొవాలనుకున్నట్టుగా తాను పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకుందా? రామ్మోహన్ తిరిగి పవిత్రతో ఎందుకు కలిసి జీవించాలనుకున్నాడు?.....వీటన్నిటికీ సమాధానాలు నవల చదివితే దొరుకుతుంది

నవలను చదవటానికి క్రింది లింకుపై క్లిక్ చేయండి:

 పవిత్ర...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి