దాగుడు మూతలు...(సీరియల్) (PART-15)
ప్రశాంతి కి వ్యత్యాసమైన
అనుభవం ఏర్పడింది.
ఆ రోజు
రాత్రి పరుపు
మీద బోర్ల
పడుకుంది. ఎవరో
ఆ గదిలోకి
చొరబడుతున్నట్టు
అనిపించింది. సన్నని
స్వరంతో రెండు
స్వరాలు వినబడినై.
కానీ ఎవరూ
కంటికి కనబడలేదు.
ఒక ఆడగొంతు
ఏదో అస్పష్టంగా
చెప్పింది. దానికి
ఒక మగ
గొంతు “బాధ
పడకు ఈ
ఇల్లు మనది.
ఇక్కడకొచ్చి మనల్ని
కష్టపెడుతున్న
వాళ్ళను మనం
తరిమి కొట్టాలి”
ఆ తరువాత
ప్రశాంతి వీపు
పైన ఏదో
తగిలినట్లు అనిపించింది.
మరుక్షణం ఆ
చోట భరించలేని
నొప్పి పుట్టడంతో
కేకలు వేసింది.
ఎర్రగా కాలిన
ఇనుప కడ్డీతో
వాత పెట్టినట్టు
ఉన్నది ఆ
నొప్పి.
అప్పుడు వెనుక
పక్క తలుపును
తెరుచుకుని ఎవరో
కొంతమంది బయటకు
వెళుతున్న ఫీలింగ్.
‘ఈ
ఇంట్లో ఏదో
ఒక అమానుష
విషయం ఉన్నది’ అని
ఖచ్చితంగా నమ్మటం
మొదలు పెట్టింది.
వేగంగా కిందకు
వచ్చింది. అంత
చీకట్లోనూ తోట
పని చేస్తున్నాడు
వెంకటస్వామి. ఆయన
పక్కన మేరీ
నిలబడున్నది.
“వెంకటస్వామీ, ఈ
ఇంట్లో ఏదో
మర్మ తిరుగుడ్లు
ఉన్నాయి. నేనే
చూశాను”
ఇద్దరూ ఆమెను
షాక్ తో
చూడగా:
“ఎవరో
నా గదికి
వచ్చారు. నా
వీపు మీద
బాగా కాలిన
కడ్డీతో వాత
పెట్టినట్లు ఉన్నది.
ఇంకా మంట
పుడుతోంది చూడండి”
వెంకటస్వామి దగ్గర
ప్రశాంతి తన
వీపును చూపించ:
అక్కడ ఒక
రూపాయి నాణెం
అంత సైజులో
కాలిన గాయం
ఉన్నది.
“ఈ
ఇంటికి పక్కన
ఒక శ్మశానం
ఉంది. అది
నేనే చూసాను.
మొదట్లో నాకు
దయ్యాలూ-భూతాలూ
పైన నమ్మకం
లేదు. ఇప్పుడు
జరిగిన అనుభవాలు
-- అదంతా నిజమనే
చెబుతోంది. వెంకటస్వామీ
రండి. పక్కన
కాలీమాత గుడి
ఒకటి ఉన్నదటగా!
అక్కడికి వెళ్ళి
పూజారిని పిలుచుకు
వద్దాం”
“బాగా
చీకటి పడిపోయిందమ్మా.
రేపు వెళదాం”
“వద్దు...నాకు
ఇప్పుడే వెళ్ళాలి.
మీరు రాకపోయినా
నేను వెళ్ళి
పుజారిని పిలుచుకు
వస్తాను”
వెనక్కి తిరిగి
నడవటం మొదలు
పెట్టింది.
చుట్టూ పొగలాగా
కమ్ముకోనున్న బాటలో
నడుస్తుంటే మేఘాల
గుంపులో తేలుతున్నట్టు
అనిపించింది. ఆ
చిన్న బాటలో
వాకిట్లో ఉన్న
ఇనుప గేటు
వైపుకు నడిచిన
ఆమె, ‘క్రీచ్’ అనే
శబ్ధంతో ఆ
గేటును తెరుచుకుని
వచ్చినతన్ని చూసి
ఆశ్చర్యపోయింది.
ఆ గేటును
పుచ్చుకుని ఆమెనే
చూస్తూ నిలబడ్డాడు
ఆమె ప్రియమైన
భర్త శ్రీనివాస్.
అతని చేతుల్లోకి
వెళ్ళిపోదామా అని
ఆమె మనసు
గెంతుతున్నా, ఏదో
అడ్డుపడ -గుడికి
వెళ్ళాలనుకున్న
ఆలొచనను మానుకుని ఇంటి
వైపుకు నడవటం
మొదలుపెట్టింది.
మెల్లగా జరిగి
తన పక్కకు
వచ్చిన అతని
దగ్గర నుండి
బ్రాందీ వాసన----
‘అతను
తన స్పృహలో
లేడు’ అని
తెలిపింది.
“ప్రశాంతీ!
నువ్వు ఇక్కడే
ఉన్నావా? సారీ...సారీ...నన్ను
వొంటరిగా వదిలేసి
వెళ్ళటానికి నీకు
ఎలా మనసొచ్చింది?”
ఇంటి వైపుకు
నడుస్తున్న ఆమెను, తూలుకుంటూనే
ఆమె వెనుకే
నడిచాడు. కష్టపడి
గదిలోకి వచ్చినతను, అంతకంటే
నడవలేక 'దబ్' అని
బెడ్ మీద
పడ్డాడు. నాన్నను
ఆశగా చూడటానికి
వచ్చిన పిల్లల్ని
ఆపుతూ----
“నాన్న
టయర్డుగా ఉండటంతో
పడుకున్నారు. రేపు
ప్రొద్దున చూద్దాం” అని చెప్పి
పంపించింది.
అతను తాగున్నది
పిల్లలకు తెలియకూడదనేది
ఆమె ఆలొచన.
“ప్రశాంతీ!
నాకు నువ్వూ, పిల్లలూ
కావాలి. స్నేహలత
వద్దు. నిన్ను
శిక్షిస్తున్నా
అనుకుని, నన్ను
నేనే శిక్షించుకున్నాను.
క్షమించు. ఇక
మీదట నీ
గురించి తప్పుగా
మాట్లాడను. తప్పుగా
ఆలొచించను. నన్ను
శిక్షించింది చాలు.
రా, మధ్యలో
జరిగింది మర్చిపో...మనం
కుటుంబంతో సహా
సంతోషంగా ఉందాం”---రాత్రంతా
ఇలాగే కలవరిస్తున్న
అతన్ని చూస్తూ
పక్కనే ఉన్న
సోఫాలో కూర్చుంది.
అదే సమయం
తోటలో కూర్చోనున్న
పనివాళ్ళు,
వాళ్ళల్లో వాళ్ళు
మాట్లాడుకుంటున్నారు.
“వెళ్ళి
పూజారిని పిలుచుకు
వస్తాను అని
చెప్పిన వెంటనే
నాకు లాగిపెట్టి
ఒకటిచ్చినట్టు
అనిపించింది. మంచికాలం...ఆమె
భర్త రావటం
వలన మనం
తప్పించుకున్నాం”
వెంకటస్వామి చెబుతుంటే, అందరూ
వింటూ ఉన్నారు.
“మనం
వచ్చిన పనిని
ఎప్పుడు ముగించేది? సమయం
పోతూనే ఉన్నదే?” అన్నది
మల్లి.
“ఆ
అమ్మను చూస్తే
పాపం అనిపిస్తోంది.
మనం ఇది
చెయ్యాలా?” అన్నది
సరసు.
“పాప-పుణ్యాలు
చూడటానికి మనమేమన్నా
మనుషులమా? మనం
చెయ్యలేకపోతే ఈ
ఇంట్లో ఉన్న
ఇంకెవరైనా ఆ
పని చేస్తారు.
అది ప్రశాంతికి
మరింత కష్టంగా
ఉంటుంది” అన్నది మేరీ.
“ఆ
అమ్మాయిని చూస్తుంటే
కొంచం కష్టంగానే
ఉంది...సరే
పని ముగించటానికి
రోజు ఖాయం
చేశారా?” అన్న
సరసుకు జవాబుగా-------
“అవును...సమయం, కాలమూ
కలిసొచ్చింది. మనం
చేయబోయేది పూర్తి
అమావాస్య రోజున.
అంటే రేపు” అన్నాడు వెంకటస్వామి.
“వెంకటస్వామీ, రేపటి
వరకు మనం
దొరకకుండా ఉండాలా? అయితే, ముందున్న
సమాధులను అన్నింటిని
ఆకులు వేసి
జాగ్రత్తగా మూయండి"
అన్నది మేరీ.
“ఊహు...వద్దు”. విసుకున్న
వెంకటస్వామి, అక్కడ
కుప్పగా పడున్న
ఎండిపోయిన ఆకులను
చూశాడు. అప్పుడు
హఠాత్తుగా వీచిన
గాలి ఆ
ఆకుల గుంపును
తీసుకు వెళ్ళి
బయటకు తెలుస్తున్న
సమాధులను అందంగా
కప్పింది.
ఆ సమాధులలో
ఒకదాని మీద
‘మేరీ
జాన్ -- జననం-మరణం’ అని
సరిగ్గా కనబడని
అక్షరాలు కనబడింది.
ఆ తరువాత
ఆ చోటే
శ్మశాన నిశ్శబ్ధంతో
నిండింది.
Continued...PART-16
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి