15, డిసెంబర్ 2022, గురువారం

110 సంవత్సరాల క్రితం రష్యాలో జరిగిన పేలుడుపై...(మిస్టరీ)

 

                                                      110 సంవత్సరాల క్రితం రష్యాలో జరిగిన పేలుడుపై                                                                                                                                               (మిస్టరీ)

110 సంవత్సరాల క్రితం రష్యాలో సంభవించిన ప్రపంచంలోనే అతిపెద్ద పేలుడుపై మిస్టరీ తీవ్రమైంది.

ప్రపంచంలోనే అతిపెద్ద పేలుడు - రష్యాలో 185 హిరోషిమా బాంబుల పరిమాణంలో జరిగిన పేలుడు యొక్క శబ్ధమూ, భూతాకిడి స్పర్శ బ్రిటన్ మరియు అమెరికా దేశాల దూరం వరకు సాగిందట - నిపుణులు అది ఒక ఉల్క అనేరుజువును తొలగించిన తరువాత ఇది ఒక మిస్టరీగా ఉండిపోయింది.

రష్యాలోని సైబీరియాలొ జూన్ 20, 1908 ఆకాశాన్ని దాటుతున్న ఒక పెద్ద ఫైర్బాల్ కనిపించింది. భూమికి ఆరు మైళ్ల ఎత్తులో కనబడ్డ ఫైర్బాల్ అతిపెద్ద శబ్ధంతో పేలింది. పేలుడు ఏర్పడిన ప్రదేశంలో 80 మిలియన్ చెట్లను చదును చేసింది. కాలిపోయిన ధ్రువజింక మృతదేహాలు లక్షల సంఖ్యలో కనబడ్డాయి.

తుంగస్కా సంఘటన అని పిలవబడే పేలుడును పరిశోదిస్తూ ఇటాలియన్ శాస్త్రవేత్తలు 21 సంవత్సరాలు గడిపారు. నీలం రంగు కలిగిన నీరు గల 'చెకో సరస్సు' ఒకతప్పిపోయినఅగ్నిపర్వత బిలం ప్రభావం వలన ఏర్పడిందని పేర్కొన్నారు - దృగ్విషయం ఉల్క వల్ల సంభవించిందనే సిద్ధాంతానికి దారితీసింది.

రష్యన్ భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు జరిపిన కొత్త అధ్యయనం పై ఆలోచన లోపభూయిష్టంగా ఉందని సూచిస్తోంది. అంటే భారీ పేలుడు - ఐరోపాలోనూ మరియు అమెరికాలోనూ రాత్రి ఆకాశాన్ని వెలిగించింది - ఇది ఇప్పటికీ ఒక మర్మం అని మాస్కోలో వచ్చిన కొత్త నివేదికలు ప్రకటించాయి.

అరిజోనాలోని టక్సన్లోని ప్లానెటరీ సైన్స్ ఇనిస్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్త నటాలియా ఆర్టెమివా, ఎర్త్ అండ్ ప్లానెటరీ సైన్సెస్ యొక్క వార్షిక సమీక్షలో 2016 లో ప్రచురించిన  పునర్విచారణలో, సంఘటన స్పష్టమైన మార్గమును అనుసరించిందని వివరించింది.

సంఘటనను ఏర్పరచినది ఏదైనా కావచ్చు. కానీ అగ్ని బంతి సెకనుకు 9-19 మైళ్ళ వేగంతో వాతావరణంలోకి ప్రవేశించి, చాలా పెళుసుగా ఉండి, భూమికి ఆరు మైళ్ళ ఎత్తులో తానుగా నాశనం అయి ఉంటుంది.

సంఘటన జరిగిన 20 సంవత్సరాల తరువాత, ఒక చిన్నగ్రహము వలన ఇలా సంభవించే అవకాశాం ఉన్నదని 1927 లో శాస్త్రవేత్త లియోనిడ్ కులిక్ ప్రతిపాదించాడు.

మరికొందరు ఏదో ఒక అంతరిక్ష-వస్తువు, రాతితో కాకుండా మంచుతో తయారైన తోకచుక్క అయి ఉండవచ్చు. అది భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు ఆవిరైపోయుండొచ్చు.

కానీ, కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు వికారమైన పేలుడు గురించి ఖచ్చితంగా వివరించలేదని హెచ్చరిస్తున్నారు - ఉల్కాపాతం తరచుగా సంభవించడంతో, నమూనాలు చాలా చిన్న, గుర్తించబడని సంఘటన యొక్క అవశేషాలు కావచ్చు.

కొంతవరకు, తుంగస్కా సంఘటన ఇప్పటికీ ఒక మర్మంగానే ఉంది, దీనిని శాస్త్రవేత్తలు నిరంతరం పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు - కాని, ఇది ఒక కామెట్ లేదా గ్రహశకలం నుండి అయినా, ఒక పెద్ద విశ్వ శరీరం భూమి యొక్క వాతావరణంలోకి దూసుకెళ్లడం వల్ల పేలుడు సంభవించి ఉంటుందని చాలా మంది అంగీకరిస్తున్నారు.

Image Credits: To those who took the original photos

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి