నీకంటూ ఒకరు (కథ)
ఈ
లోకంలో ప్రతి మనిషీ తమకంటూ చివరి వరకు ఒకరుండాలని అనుకుంటారు…ఒకరైనా
ఉండాలి...మనసిచ్చేందుకు. ప్రాణమిచ్చేందుకు. అదీ ఇదీ అని కాదు. ఏదైనా ఇచ్చేందుకు, ఏమైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా...! అవును. అలాంటివారు ఒకరుంటే జీవితం ఎంత
హ్యాప్పీగా ఉంటుందో! అలా తనకి ఒక్కరూ
లేరనే బాధే కౌశల్యకు నరక ప్రాయంగా మారింది. కారణం తనని మనస్ఫూర్తిగా ప్రేమించిన
అనుభవ్ ను వదులోకోవలసి వచ్చింది.
ఆమె
వదులుకున్నా ఆమె చేసిన న్యాయమైన త్యాగం ఆమెను వదిలిపెట్టలేదు. ఆమె చివరి రోజున నీ
కంటూ నేనున్నాని ఆమె ఎదురుగా వెళ్ళి నిలబడ్డ
అనుభవ్ ను చూసిన తరువాత ఆమె ప్రశాంతత చెందింది.
కౌశల్య, నిన్ను ప్రేమిస్తున్నాను అని వచ్చిన అనుభవ్ ను ఎందుకు వదులుకుంది? ఆమె చివరి రోజున నీ కంటూ ఒకరున్నారని చెప్పినట్టు వచ్చింది నిజానికి ఎవరు? తెలుసుకోవాలంటే ఈ కథను చదవండి.
భార్య అందించిన కాఫీ
గ్లాసును ఎడం చేత్తో పుచ్చుకుని, వరాండాలో పడున్న ఆ రోజు న్యూస్ పేపర్ను కుడి చేతిలోకి
తీసుకుని సోఫాలో కూర్చోబోయాడు అనుభవ్.
"డాడీ ఫోన్"
అంటూ తండ్రి సెల్ ఫోన్ను తీసుకుని అక్కడికి వచ్చింది ఆరేళ్ళ రంజని.
"ఎవర్రా ఫోనులో?"
కూతురు అందించిన సెల్ ఫోన్ను తన చేతిలోకి తీసుకుంటూ
ముద్దుగా అడిగాడు తండ్రి అనుభవ్.
"తెలియదు
డాడీ...పేరు రాలేదు" చెప్పేసి అమ్మ దగ్గరకు వెళ్ళిపోయింది రంజని.
"ఇంత ప్రొద్దున్నే
ఎవరు చేసుంటారు" అనుకుంటూ ఫోన్ ఆన్ చేసి హలో అన్నాడు అనుభవ్.
"అనుభవ్ గారు
ఉన్నారా?" ఆడ గొంతుక.
"అనుభవ్ నే
మాట్లాడుతున్నా...మీరెవరు?"
"సార్ నేను
నిమ్స్ హాస్పిటల్ నుండి నర్స్ మాలతిని మాట్లాడుతున్నాను. కౌశల్య అనే ఆవిడ చాలా
సీరియస్ కండిషన్లో ఉన్నారు. మీరు తెలుసని, చివరిగా మిమ్మల్ను
చూడాలని ఆశపడుతున్నారు. మీ నెంబర్ ఇచ్చి ఫోన్ చేసి చెప్పమని అడిగారు"
".................." షాక్ లో ఉండిపోయాడు
అనుభవ్.
"హలో….లైన్లో ఉన్నారా?"
"ఆ...ఆ...లైన్లోనే
ఉన్నాను. ఇప్పుడు ఆమె పరిస్తితి ఎలా ఉంది..." బొంగురుపోతున్న కంఠాన్ని
సరిచేసుకుని అడిగాడు.
"చెప్పాను
కదండి...చాలా సీరియస్ కండిషన్"
"జబ్బేమిటో?"
"ఫోనులో
చెప్పలేను సార్...ఇక్కడికి వస్తారు కదా. అప్పుడు చెప్తాను"
"సరే ఇప్పుడే
వస్తాను"
"సార్ నిజంగా
వస్తారా? ఎందుకు అడుగుతున్నానంటే ఇంతవరకు ఆమెను
చూడటానికి ఎవరూ రాలేదు సార్. రెండు నెలలుగా ఎవరూ రాలేదు. అందుకని
అడుగుతున్నాను"
"లేదమ్మా వస్తాను...వస్తున్నా...హాస్పిటల్
కు వచ్చి ఫోన్ చేస్తాను"
అనుభవ్ షాక్ లో
ఉన్నప్పుడే అక్కడికి వచ్చిన అతని భార్య రమ్య "హాస్పిటల్లొ ఉన్నది ఎవరండి?"
ఆదుర్దాగా అడిగింది.
"కౌశల్య...చావుబ్రతుకుల్లో
ఉన్నదట"
"నేనూ
వస్తానండీ" భర్తతో అన్నది.
అనుభవ్ మౌనంగా
ఉండటంతో రమ్య "ప్లీజ్" అంటూ
ప్రాధేయ పడింది.
అనుభవ్
భార్యతో కలిసి నిమ్స్ హాస్పిటల్ చేరుకున్నాడు. ఆ నర్సుకు
ఫోన్ చేసి వార్డు నెంబర్ తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు.
ఈ కథను చదవాలంటే ఈ క్రింది లింకును క్లిక్ చేయండి:
నీకంటూ
ఒకరు...(కథ) @ కథా కాలక్షేపం-1
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి