18, డిసెంబర్ 2022, ఆదివారం

తొలిచూపు...(పూర్తి నవల)

 

                                                                                        తొలిచూపు                                                                                                                                                                                   (పూర్తి నవల)

లవ్ ఎట్ ఫస్ట్ సైట్: తొలిచూపు ప్రేమ నిజమేనా? ఒకరిని చూడగానే.. వీళ్లు మన జీవితంలో లేకుంటే అసలు బతకడమే వృథా అనిపించేస్తుంది. తొలి చూపుకే జీవితమంతా చేయాల్సిన ప్లానింగ్ గురించి మనసులో అలజడి మొదలవుతుంది. ఎవరి ముఖమైనా ఒకసారి చూడగానే, వారిపై ఒక అభిప్రాయానికి రావడానికి మెదడుకు సెకనులో పదో వంతు సమయం పడుతుంది.

ఫస్ట్ ఇంప్రెషన్లో కేవలం వ్యక్తిలో ఆకర్షణ కోణాన్ని అంచనా వేయడమే కాదు, వారి వ్యక్తిత్వం గురించి చాలా కోణాలు ముందుకు వస్తాయి.  అలాంటిదే నవలలోని హీరోకు జరుగుతుంది. కానీ హీరోయిన్ కు అలాంటిది ఒకటి జరిగిందనేదే తెలియదు(తనని ఎవరో ఒకరు చూశారని). హీరోయిన్ను తప్పుగా అర్ధం చేసుకున్న ఆమె తల్లి, తాను చూసిన అబ్బయినే పెళ్ళిచేసుకోవాలని క్షోబ పెడుతుంది. ఆమె చూసిన అబ్బాయినే పెళ్ళి చేసుకుంటానని తల్లికి ప్రమాణం చేసిస్తుంది. ఈలోపు కుటుంబంలో ఎన్నో సంఘటనలు. సంఘటనలు హీరోయిన్ని భాధ్యతలకు దగ్గర చేస్తుంది.

మరి తొలిచూపులోనే హీరోయిన్ని చూసిన హీరో ఆమెను పెళ్ళిచేసుకో గలిగాడా? హీరోయిన్ ఎలాంటి సంఘటనలను ఎదుర్కొంది? చివరికి ఏం జరిగిందిఈ నవలను చదివి తెలుసుకోండి.

ఇక్కడ చీఫ్ డాక్టర్ గాయత్రి మొదలు పనిమనిషి ఎల్లమ్మ వరకు అంతా ఆడవాళ్ళ రాజ్యమే. ఒక్క వాచ్ మ్యాన్ తప్ప. మగవాళ్ళకు ఎక్కువగా అనుమతి లేని అన్య ప్రదేశం ఇది. ఇవన్నీ చీఫ్ డాక్టర్ గాయత్రీ యొక్క ఏర్పాట్లే. గర్భిణీ స్త్రీల యొక్క భర్తలైతే తప్ప మిగిలిన మగవాళ్ళకు అనుమతిలేదు. చీఫ్ డాక్టర్ గాయత్రీ గురించి ఇప్పుడు మీకు కొంచం అర్ధమై వుంటుంది అనుకుంటున్నాను.

 ఇలాగే రెండు వైపులా నెంబర్లు వేసున్న రూములను దాటుకుంటూ వెళ్ళి కుడివైపుకు తిరిగి మరో ఇరవై అడుగులు నడిస్తే...అదిగో, డాక్టర్ గాయత్రి బాపిరాజు, గైనకాలజిస్ట్(స్త్రీ మరియూ శిశు సంరక్షణ నిపుణులు). 'బాధ్యత, కర్తవ్యము... ఇవి రెండూ, రెండు కళ్ళు లాంటివిఅనేది మనకు జ్ఞాపకం చేసే విధంగా గాయత్రి యొక్క ప్రొద్దుటి పూట ఆమెలో ఉండే చురుకుదనం ఆమె పెట్టుకున్న కళ్ళద్దాలలో నుండి కూడా కనబడుతుంది.

 

అంతస్తు, పెద్ద గుర్తింపు వచ్చిందనే గర్వం కొంచం కూడా అమెలో కనబడదు. వైద్యసేవలకు తనని పూర్తిగా అర్పించుకున్న మరొక మదర్ తెరేసా అని ఆమెను చెప్పొచ్చు. జరిగి ముగిసిన కాలంలో ఆమె పడ్డ కష్టాలను, ఇప్పుడు జరుగుతున్న కాలంలో ఆమె అనుభవిస్తున్న సంతోషాలతో పూడ్చి పెట్టింది డాక్టర్ గాయత్రి.


మెడికల్ రిపోర్ట్ ఒకటి తీసుకుని తన కుర్చీలో నుండి లేస్తున్నప్పుడు, "లోపలకు రావచ్చా...డాక్టర్ గాయత్రీ బాపిరాజు?" అని చాలా క్లియర్ గా వచ్చిన మాటలు వినబడి తలెత్తి చూసింది.

 

తలను మాత్రమే లోపలకు పెట్టి, నవ్వు మొహంతో సమాధానం కోసం ఎదురుచూశాడు అతను.

 

"ఎస్...కమిన్" అని పిలిచి, తన కళ్ళద్దాలను తీసి టేబుల్ మీద పెట్టింది డాక్టర్ గాయత్రీ బాపిరాజు.

 

"థాంక్యూ" అంటూ లోపలకు వచ్చి చొరవుగా కుర్చీ లాక్కుని కూర్చున్న అతని చర్య కంటే, అతను తనను పిలిచిన విధమే ఆమెను కొంచం ఆశ్చర్యానికి గురిచేసింది

 

"నాపేరు రమేష్"

 

"ఏం కావాలి?"


నవలను చదవటానికి క్రింది లింకుపై క్లిక్ చేయండి: 


తొలిచూపు...(పూర్తి నవల)@ కథా కాలక్షేపం-2

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి