31, డిసెంబర్ 2022, శనివారం

ముఖా ముఖి...(కథ)


                                                                                         ముఖా ముఖి                                                                                                                                                                                    (కథ) 

ముఖా ముఖి ఇంటర్ వ్యూ కు నాలుగవ క్యాండిడేట్ గా వచ్చిన అభ్యర్ధిని చూసిన వెంటనే "యూ ఆర్ సెలెక్టడ్ అండ్ అప్పాయింటడ్ " అని చెప్పాడు ఎం.డి. ప్రవీణ్ కుమార్.

ప్రశ్నలేమీ అడగకుండా ఉద్యోగమా?”.... మనసులోనే అనుకున్న విక్రమ్ నోట మాట రాక ఆశ్చర్యపోయి నిలబడ్డాడు.

"మిస్టర్. విక్రమ్.... మీరు ఏమాలొచిస్తున్నారో అర్ధమయ్యింది. ఫైలు చూడకుండా, ప్రశ్నలేమీ అడగకుండా, నీ అర్హతలేమిటో తెలుసుకోకుండా నీకు ఉద్యోగం ఇస్తున్నందుకు ఆశ్చర్యపోతున్నావు కదూ?. దానికి కారణం నిన్ను రెకమండ్ చేసింది ముఖా ముఖి బగవంతుడే కనుక. రెపే ఉద్యోగంలో జాయిన్ అయిపో..." అంటూ చెయ్యి చాపి షేక్ హ్యండ్ ఇస్తూ చెప్పాడు కంపెనీ ఎం.డి. ప్రవీణ్ కుమార్.

ఎం.డి ప్రవీణ్ కుమార్ కి రెకమండేషన్ అంటే ఇష్టం లేదు. రెకమండేషన్ పుచ్చుకుని ఎవరు తన కంపెనీ ఇంటర్ వ్యూ కి వచ్చినా వాళ్ళని ఉద్యోగంలోకి తీసుకోడు. అదేమిటో తెలుసుకోవాలంటే

కానీ విక్రమ్ విషయంలో అలా చేయలేకపోయాడు. కారణం రెకమండేషన్ చేసింది భగవంతుడేనని అభిప్రాయపడ్డాడు ఎం.డి ప్రవీణ్ కుమార్.

భగవంతుడేమిటి?...ఉద్యోగానికి రెకమండ్ చేయడమేమిటి?!...అని అనుకుంటున్నారు కదూ. నిజమే సుమా.

ఆరు గంటల క్రితం ఎం.డి ప్రవీణ్ కుమార్ కు ఏం జరిగిందో తెలుసుకోవాలి.

ప్రొద్దున ఆరుగంటలకే గుడికి వెళ్ళిన ప్రవీణ్ కుమార్ తల్లి , ఎనిమిదైనా ఇంటికి రాలేదు.

రోజూ అదే టైముకు గుడికి వెళ్ళటం ఆమెకు అలవాటు. గుడి పెద్ద దూరంలో ఏమీ లేదు. నడిచి వెల్తే పావు గంట. కార్లో వెల్తే ఐదు నిమిషాలు. ఒకటికి రెండు కార్లున్నా ఆమె నడిచే వెడుతుంది. గుడిలో పావుగంట గడిపి, పావు గంటలో మళ్ళీ ఇంటికి చేరుకుంటుంది. ఏది ఏమైనా ఒక గంటలొ, అంటే ఏడుగంటల లోపే ఆమె ఇంటికి తిరిగి వస్తుంది.

కానీ రోజు సమయం ఎనిమిది దాటుతున్నా అమె ఇంటికి తిరిగి రాలేదు .

ప్రవీణ్ కుమార్ కి కంగారు మొదలైయ్యింది.

ఇంకో పావుగంట చూద్దాం అన్నది భార్య.

భార్య చెప్పిన టైము కూడా దాటింది.

ఇక ఉండబట్టలేక భార్యను చూసి "నేను గుడి వరకు వెళ్ళి చూసొస్తాను" అని చెప్పి కారు తీసుకుని గుడికి బయలుదేరాడు ప్రవీణ్ కుమార్.

" నారాయణమ్మగారు పూజ ముగించుకుని అప్పుడే వెళ్ళిపోయిందే " అలవాటుపడ్డ పూజారి చెప్పటంతో ప్రవీణ్ కుమార్ కు గాబరా ఎక్కువైంది.

గుడి మొత్తం ఒకసారి వెతికాడు. విపరీతమైన ఆలొచన రావడంతో గుడి లో ఉన్న కొలను చుట్టుతా కూడా వెతికాడు.

తెలిసినవాళ్ళందరి ఇళ్ళకూ ఫోన్ చేసి అడిగాడు. ఎవరింటికీ ఆవిడ వెళ్ళలేదని తెలుసుకున్నాడు.

లోపు భార్య దగ్గర నుండి ఫోన్.

"ఏమండి...అత్తయ ఇంకా ఇంటికి రాలేదు. భయంగా ఉందండి" అని చెప్పటంతో ప్రవీణ్ కుమార్ కి ధడ మొదలయ్యింది.

గుడిలో ఉన్న అరుగు మీద కూర్చుండిపోయాడు. తల్లి ఇంకెక్కడికి వెళ్ళుంటుందో ఎంత ఆలొచించినా అతనికి జవాబు దొరకలేదు.

చాలా సేపు ఆలోచించి, ఆలోచించి అలసిపోయి, నీరసించిన ప్రవీణ్ కుమార్ నిరాశతో ఇంటిదారి పట్టాడు.

ఇంటికి వెళ్ళిన వెంటనే కనీళ్ళతో ఎదురైన భార్య "ఏమండీ నాకు చాలా భయంగా ఉందండి...ఎక్కడికి వెళ్ళినా మనతో చెప్పే కదా వెల్తుంది అత్తయ్య" అన్నది.

తొమ్మిదో క్లాసు చదువుతున్న మనుమరాలు కూడా..."బామ్మను చూడకుండా నేను స్కూలుకి వెళ్ళను" అని మారం చేసింది.

తల్లి గుడికి వెళ్ళి ఎంత సమయం అయ్యిందో నని గడియారం వైపు చూస్తున్న ప్రతిసారి తన ఆఫీసులో రోజు ముఖా ముఖి ఇంటర్ వ్యూలు ఉన్నాయంటూ ప్రవీణ్ కుమార్ కు గుర్తు చేస్తోంది గడియారం.

ఏదైనా ప్రమాదంలో ఉన్నదా? పోలీసుకు వెడదామా? బయట ఇది ఒక న్యూస్ అయిపోతుందేమో? పలురకాల ఆలొచనలతో సతమతమవుతున్నప్పుడు లాండ్ లైన్ ఫోన్ మోగింది.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ముఖా ముఖి...(కథ)@ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి