20, డిసెంబర్ 2022, మంగళవారం

ఎక్కడ నా ప్రాణం...(సీరియల్)...(PART-6)


                                                                               ఎక్కడ నా ప్రాణం...(సీరియల్)                                                                                                                                                               (PART-6) 

ఉలిక్కిపడ్డ దివ్యా ద్వారానికి పక్కకు జరిగింది.

గుండె వెగంగా కొట్టుకుంటోంది.

'ఎవరో చెడు ఆలొచనతో ద్వారాన్నే చూస్తున్నారే?'

ఎవరై ఉంటారు?

మేము ఇక్కడకు వచ్చామని తెలుసుకుని డాక్టర్. సుధీర్ గారు ఎవరినో పంపి గూఢచర్య చేస్తున్నారా?

నాన్నను కిడ్నాప్ చేసినట్లు గంగయ్య స్వామి గారిని కూడా కిడ్నాప్ చేయటానికి ప్రయత్నిస్తున్నారా?

డాక్టర్. సుధీర్ తలచుకునుంటే మేము ఇక్కడకు రాక ముందే  ఆయన గంగయ్య స్వామి గారిని కిడ్నాప్ చేసుండొచ్చే?

డాక్టర్. సుధీర్ ఇక్కడకు వచ్చి నిదానంగా గంగయ్య స్వామి గారితో ఏదైనా మాట్లాడి చూసుంటారో?

నాన్న దగ్గర అలాగే మాట్లాడటం మొదలుపెట్టారు. దీని గురించి గంగయ్య స్వామి గారి దగ్గర అడిగిచూస్తే?

మర్మ మనిషి ఒకరు ఆశ్రమాన్ని గూఢచర్య దృష్టితో చూస్తున్నారనే విషయాన్ని కూడా చెప్పాలి.

సమయంలోనైనా, ఏదైనా జరిగే అవకాశం ఉన్నట్లుందే?

మళ్ళీ మెల్లగా ద్వారం నుండి బయటకు చూసింది.

నల్లటి ఆకారం చుట్ట కాల్చుకుంటున్నట్టు, చిన్న నిప్పు మంట గుండ్రంగా కనబడింది.

గాలితో కలిసి చుట్ట కంపు వచ్చి ఆమె మొహం మీద తగిలింది.

'ఊహూ! కచ్చితంగా దీని గురించి చెప్పి, హెచ్చరిక చేయాలి

మొదట అర్జున్ ను తీసుకు వచ్చి, ఇక్కడ జరిగేది చూపించాలి

ద్వారం దగ్గర నుండి వేగంగా తప్పుకుంది.

ఆమె వచ్చి నిలబడ్డ వేగం చూసి కురులు ఎగరేసి "ఏమిటి?" అన్నట్లు చూశాడు అర్జున్.  

సమాధానంగా సైగ చేసి తనతో రమ్మని పిలిచింది. చేతిలో ఉన్న మెడికల్ పుస్తకాన్ని  కింద పెట్టి,ఆలొచిస్తూ ఆమె వెనుకే వెళ్ళాడు.

"ఏమైంది దివ్యా?" చిన్న స్వరంతో అడిగాడు.

"నాకు భయంగా ఉంది అర్జున్ " అంటూ ద్వారం వైపు చూపింది.  

"ఎందుకు భయపడుతున్నావు? ఒక వేల ద్వారం నుండి పాములు, విష జంతువులు లాంటివి ఏవైనా దూరతాయని భయపడుతున్నావా?"

"ఛఛ...అలాంటిదేమీ కాదు.  ఏదో ఒక నల్లటి ఆకారం, ద్వారం వైపే చూస్తోంది. సిగిరెట్టో, చుట్టో తాగుతున్నాడు. నిప్పు చుక్క ప్రకాశంగా కనబడింది"

"అలాగా?" అంటూ అతను కూడా ద్వారంలో నుండి ఆసక్తిగా బయటకు చూసాడు.

"ఎక్కడ...? నా కంటికి ఏమీ కనబడట్లేదే దివ్యా?"

"అదిగో... అక్కడే! ఎదురుకుండా కనబడే చెట్టు క్రిందే ఆకారం నిలబడుంది"

"ఎవరూ లేరే?"

ఆమె కూడా ద్వారంలో నుండి చూసింది.

'అరెఎవరూ లేరే...! ఇంతలోనే నల్లటి రూపం మాయమయ్యిందే?"

అడవి మధ్యలో వచ్చి గుడారంలో తలదాచుకున్నమే అన్న భయం నీ మనసులో జేరింది. అందుకనే చెట్టు క్రింద పడ్డ చెట్టు కొమ్మల నీడను చూసి నల్లటి ఆకారం నిలబడున్నదని భయపడ్డావు. అంతా భయబ్రాంతులే"

"భయబ్రాంతనే అనుకోండి...చెట్టు కొమ్మల నీడ అయితే చుట్ట తాగుతుందా? అందులో నుంచి కంపు వస్తుందా? అది కూడా బ్రమే నంటారా?"

"అవును కదా? ఆలొచించవలసిన విషయమే"

డాక్టర్ సుధీర్ మనుషులులో ఎవరో ఒకరు వచ్చి గూఢచారి పని చేసుకుని వెళ్ళారు. ఏదో ఒక విపరీతం జరగబోతోందని నా మనసుకు అనిపిస్తోంది అర్జున్!

గంగయ్య స్వామి దగ్గర దీని గురించి చెప్పేద్దామా? ఇది తెలుసుకుంటే ఆయన కూడ కాస్త హెచ్చరికగా ఉంటారు కదా?"

"ఏయ్ ట్యూబ్ లైట్! మనం వెళ్ళి చెబితేగానీ ఆయన తెలుసుకోలేరా?  ఆయనే తన జ్ఞానదృష్టితో అన్నీ చూస్తూనే ఉంటారు...తెలుసా?

సీతమ్మను కలుసుకోవాలి. ఆమె ఉండే గుహను చూడాలని ఆశగా ఉన్నది. స్వామి దగ్గర సమయం చూసి అనుమతి తీసుకోవాలని ఉన్నాను.

పౌర్ణమి దగ్గర పడుతోంది కదా, చంద్రుడి వెన్నల కాంతి బాగానే ఉంది. రోజు మధ్య రాత్రికి గంగయ్య స్వామి, మూలికల కొరకు బయటకు వెళ్ళిపోతారట" 

"ఇది మీకు ఎవరు చెప్పారు? ఆయన ఒంటరిగానా వెల్తున్నారు?"

ఆందోళనతోనూ, దిగులుతోనూ అడిగింది దివ్యా.

" పురుషోత్తం గారు నా దగ్గర చెప్పారు. ఎప్పుడూ ఆయనొక్కరే వెల్తారట. తెల్లవారుతున్నప్పుడు బ్రహ్మ ముహూర్తంలో తిరిగి వస్తారట. కొన్ని సార్లు రావటానికి ఒక వారం కూడా పడుతుందట.

ఎక్కడికి వెల్తున్నారో? ఆడవిలో ఎక్కడ నివాశముంటారో పురుషోత్తం గారికి కూడా తెలియదట"

"అర్జున్! ఆయన తప్ప మనకు ఇంకెవరూ తెలియదు. నాన్న గురించిన వార్త ఇంకా దొరకలేదు. పరిస్థితుల్లో ఆయన ఒక వారం రోజుల తరువాత తిరిగి వస్తే....మనం ఏం చేయగలం?"

"అందుకని...నువ్వు ఏం చెప్పటానికి ట్రై చేస్తున్నావు?"

"మనమూ ఆయనతో వెల్దాం"

"ఆయన మూలికలు తీసుకురావటానికి వెడుతున్నారట. పురుషోత్తం గారినే ఇంతవరకు తీసుకు వెళ్ళలేదట. మనల్ని ఎలా అనుమతిస్తారు?"

"ఒకవేల ఆయన అనుమతిస్తే...! వొప్పుకుంటారనే నమ్మకం నాకు ఉంది. భగవంతుడి అనుగ్రహం దొరుకుతుందనేది-పంచలింగ దర్శనం చేసుకునేటప్పుడే తెలుసుకున్నామే?"

"సరే...నీ ఇష్టం. ఆయన దగ్గరే అడిగి చూద్దాం"

దివ్యా ఉన్న చోటు నుండి ఇద్దరూ బయలుదేరి గంగయ్య స్వామి గారు కూర్చున్న చోటు దగ్గరకు వచ్చి నిలబడ్డారు.

చిన్నటి వెలుతురులో, తనవైపు పడిన నీడను గమనించి తలెత్తి చూశారు గంగయ్య స్వామి గారు.

"ఎలా మాటలు ప్రారంభించేది?" అనే సంశయంతో దివ్యా, అర్జున్ ఒకర్ని ఒకరు చూసుకుంటున్నారు. కానీ, ఈలోపు గంగయ్య స్వామి గారే కనిపెట్టారు.

"ఇది మీకు ఉత్తమం అనిపిస్తోందా? అలా మీకు అనిపిస్తే...మీరు కూడా నాతోపాటూ మధ్య రాత్రి బయలుదేరి రావచ్చు"  

"సరే స్వామీ"  ఇద్దరూ ఒకేసారి చెప్పారు.

కానీ ఇద్దరి మనసుల్లో ఏదో భయం చోటు చేసుకున్నది నిజం.

                                              **********************************

వెన్నలనే అమ్మాయి, పాల తెలుపు వెలుతురుతో, నక్షత్రమనే పక్షులతో చుట్టూ తిరుగుతోంది.

కొండ ప్రదేశ నేల అంతా ఆకుల తివాచిలాగా పచ్చగా ఉంది. ముగ్గురూ నడుస్తుంటే గల గల మని శబ్ధం వస్తోంది.

శబ్ధం విని దాక్కున్న కుందేళ్ళూ, ఎలుకలూ ఒక్కసారిగా అటూ ఇటూ పరిగెత్తినై. దివ్యా కు కొంచం భయం వేసింది.

వెన్నెల వెలుతురు కొంచంగా దారి చూపుతున్నా, మంచు పొగ పెద్దగా దానికి అడ్డుపడింది.

గంగయ్య స్వామి గారికి పక్కనే నడుస్తున్న అర్జున్, టార్చ్ లైట్ ఆన్ చేశాడు.

అతనికి వెనుక నడుస్తున్న అర్జున్, అటూ ఇటూ చూసుకుంటూ జాగ్రత్తగా నడుస్తోంది.

'వెన్నల వెలుతురులో మధ్య రాత్రి సమయంలోనే మూలికలను కొయాలా? పగటి పూట వెలుతురులో సులభంగా కనిపెట్టి కొసుకోవచ్చు కదా?

ఎందుకు ఇప్పుడొచ్చి, ఎక్కడున్నయ్యో వెతుక్కుని కష్టపడాలా?

దివ్యా మనసులో చాల ప్రశ్నలు.

"వెన్నల వెలుతురుకు ఒక శక్తి ఉన్నది. అప్పుడు కొన్ని మూలికలు భూమి నుండి బయటకు వస్తాయి. అందులోనూ పౌర్ణమి రోజు అరుదైన మూలికలు ఒక విధమైన మెరుపుతో మురిపిస్తాయి. పగటి వెలుతురులో అరుదైన మూలికలు బయటకు కనబడవు. అందుకే పౌర్ణమి రోజు రాత్రి పూట ఇక్కడికి వస్తాను"

గంగయ్య స్వామి గారి వివరణ వలన  దివ్యా మనసులో తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం దొరికింది.

తలతిప్పి గంగయ్య స్వామి గారిని చూసి "స్వామీ! చాలా ఆశ్చర్యంగా ఉన్నది. వెన్నెల వెలుతురుకు అంత శక్తి ఉందా?" అని అడిగిన అర్జున్ ను చూసి.

"ఏమిటి అలా  అడిగావు? పౌర్ణమి వెలుతురుకు విశేష శక్తి ఉన్నదని నీకు తెలియదా? ఉదాహరణకు చెబుతున్నా: కార్తీక పౌర్ణమి విశేషం గురించి నీకు తెలియదా?"

వేసివి కాలం ఎండల తాపం తెలుసుకుని చాలా చెట్లు వేర్ల మూలం వీలైనంతవరకు తడిని పీల్చుకుని తమ బోదెలో కూడబెట్టుకుంటాయి. నేల విస్తారంలో ఉన్న పలు పొరలలో  పలు రకాల తేమ ఉంటుంది. అలా ఉన్న తేమలలో అట్టడుగునున్న తేమను వాడుకుని పూసేదే చంద్రకాంత పువ్వు (రుద్రాక్ష పూవులు).

చాలా అరుదైన మూలిక కలిగిన పుష్ప చెట్టు. అది దొరికితే, దాన్ని ఉపయోగించి వైద్యం చేస్తే ఎన్నో రోగాలను గుణపరచవచ్చు. మనసును వస పరచుకునే కాటుకను కూడా తయారుచేయవచ్చు. ఇలాంటి ఎన్నో ఔషదాలను తయారుచేయవచ్చు తెలుసా?"

"ఆశ్చర్యంగా ఉందే...మనసును వసపరచుకునే కాటుకను తయారుచేయొచ్చా? సైన్స్ కు కూడా అర్ధంకాని శక్తిలాగా ఉన్నదే మూలికల శక్తి?”

"ఖచ్చితంగా. ప్రపంచంలో మూలికలతో చేయలేని పని అంటూ ఏదీ లేదు. కానీ, మూలికకు శక్తి ఉన్నదని తెలుసుకో గలగాలి. అలా తెలుసుకో గలిగితే ఏదైనా చేయవచ్చు"

"వినడానికే ఆశ్చర్యంగా ఉన్నది స్వామి" అని చిన్నగా గొనిగిణ దివ్యాని చూసిన గంగయ్య స్వామి చిన్నగా నవ్వుతూ.......

"దీనికే ఆశ్చర్యపోతే ఎట్లా? ఒక మూలిక యొక్క వేరు ఉంది. దాన్ని వాసన చూస్తేనే మనం మాయమైపోయి తిరగొచ్చు. నమ్మగలరా మీరు?"

"మీరు చెప్పిన తరువాత...నమ్మకుండా ఎలా ఉండగలం? మీరు చెబుతుంటే-- వేరును కళ్ళతో చూడాలనే ఆసక్తి ఎక్కువ అవుతోంది. ఇలాంటి మూలికలు, వేర్లు,  డాక్టర్ సుధీర్ లాంటి వాళ్ళ చెతికి దొరికితే ఇంతే సంగతులు"

"నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. నేను నా శిష్యుడు పురుషోత్తం దగ్గర కూడా ఎక్కువగా మాట్లాడను. మీ ఇద్దరికీ పవిత్రమైన మనసు. అందుకనే నా మనసు విప్పి మీతో  మాట్లాడుతున్నాను. మీకు ఒక నిజం చెబుతా వినండి.

అపూర్వమైన విషయాలు, అపూర్వమైన మనుష్యులకు మాత్రమే దొరుకుతాయి. అందరికీ దొరకదు. అలా దొరికితే ప్రతి ఒక్కరూ తప్పు చేసేసి...మూలిక వేరుతో మాయమైపోయి తప్పించుకుంటారే?

మాట్లాడుతూనే నేలవైపు జాగ్రత్తగా చూస్తూ వస్తున్న గంగయ్య స్వామి గారు అక్కడక్కడ కనబడ్డ మూలిక చెట్లను కోసి తన వెదురు బుట్టలో వేసుకున్నారు.

ఆయన చూపులు అటూ ఇటూ వెతికినై. ఆయన కళ్ళల్లో...పెద్దగా దేనికోసమో  వెతుక్కుంట్టూ వచ్చినది దొరకలేదనే నిరాశ, ఆశాభంగం కనబడుతోంది.

మధ్యలో నీటి ప్రవాహం అడ్డుబడింది. గలగల మని నీరు పారుతున్న శబ్ధం చెవ్వుల్లో పడుతుంటే...ముగ్గురూ అటువైపు నడిచారు.

ఎటువంటి మురికి లేకుండా క్లియర్ గా ఉన్న నీటిలో కాలు మోపిన మరుక్షణం జివ్వుమని చల్లదనం తలవరకు పాకింది.

చల్లటి నీటీని దోసిలితో తీసుకుని గొంతు తడుపుకుని ఆనందతో అర్జున్ ను చూసి "ఎంత తియ్యగా ఉన్నాయో తెలుసా. నువ్వు కూడా తాగు" అన్నది దివ్యా.

"అందాలను ఎంజాయ్ చేసింది చాలు దివ్యా. రా వెలదాం. మనం ఆలశ్యం చేస్తే గంగయ్య స్వామి గారు మనల్ని వదిలి చాలా దూరం వెళ్ళిపోతారు...ఏం కాళ్ళు బాగా నొప్పి పుడుతున్నాయా?"  

నీటిలో తడిసిపోకుండా చీరను ఒకచేత్తో కొంచం గా పైకెత్తి పుచ్చుకుని, మరో చేతితో అర్జున్ చేయి పుచ్చుకుని తడబడతూ నడిచింది దివ్యా.

"వచ్చిన దగ్గర నుండి విశ్రాంతి లేకుండా తిరుగుతూనే ఉన్నం కదా...అందుకే"

ఇద్దరూ కాలువను దాటారు.

దట్టంగా ఉన్న చెట్ల కొమ్మలను, మొక్కలనూ తోసుకుంటూ నడిచి వెడుతున్న గంగయ్య స్వామి గారు ఒకచోట చటుక్కున ఆగారు.

వీరు కూడా తడబాటుతో ఆగారు..

                                                                                                                     Continued...PART-7

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి