30, డిసెంబర్ 2022, శుక్రవారం

ఆర్గానిక్ …(కథ)


                                                                                     ఆర్గానిక్                                                                                                                                                                           (కథ) 

ఎటువంటి రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులుతో పండిచే పంటనే ఆర్గానిక్ పంట అంటారు. రసాయన ఎరువులు, పురుగుమందు వాడిన పంట వలన మానవులకు హానికలుగుతోందని తెలుసుకున్న కొందరు రైతులు తమ పంటలను ప్రకృతి సేద్యపు విధానాలను అనుసరించి వ్యవసాయం చేసి పంటలు పండిస్తున్నారు.

ఈ మధ్య ప్రజలలో కూడా ఎక్కువ మంది ఆర్గానిక్ విధానాలను అనుసరించి పండిచే పంటతో వచ్చే ఆహారపధార్ధలపైన మక్కువ చూపుతున్నారు.

ఆలాంటి వారిలో ఈ కథలోని సరోజను ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఈమెకు ప్రతీదీ ఆర్గానిక్ ద్వారా సేద్యం చేసినవే కావాలంటుంది. ఆమె భర్త శేఖర్ ఆమె కోరికకు గౌరవం ఇచ్చి ఇంట్లో వాడే ఆహారపధార్ధలో ఎక్కువ ఆర్గానికి కోవకు చెందినవే తెస్తాడు.

అంతా పృక్రుతిగా ఉండాలని ఆశపడే సరొజకు అనుకోని సమస్య ఎదురవుతుంది. ఆమెకు పృక్రుతిగా పిల్లలు పుట్టరని, కావలంటే కృత్రిమ పద్దతిలో పిల్లల్ను కనవచ్చని డాక్టర్లు సలహా చెబుతారు.

అన్నీ పృక్రుతిగా ఉండాలని ఆశపడే సరొజ, ఈ అనుకోని జీవ సమస్యకు డాక్టర్లు చెప్పినట్లు కృత్రిమ పద్దతిలో పిల్లల్ను కనాలని నిర్ణయించుకుందా? లేక ఇంకేదైనా నిర్ణయం తీసుకుందా?.....ఈ కథ చదివి తెలుసుకోండి.

"ఇది 'ఆర్గానిక్' పండే కదా?"

ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళిన శేఖర్, చేతిలో ఉన్న సంచీని భార్య సరోజకు అందించిన వెంటనే అడిగింది. అవి ద్రాక్ష పండ్లు.

ఆమె వేడిగా  వేడిగా కాఫీ తీసుకు వచ్చి ఇచ్చింది. కాళ్ళూ-చేతులూ-మొహమూ కడుక్కుని...ఆమె అందించిన కాఫీ తాగుతూ చెప్పాడు........

"అవును...ఫోనులోనే పదిసార్లు చెప్పాను. ఇప్పుడు పూర్తిగా ఇంట్లోకి రాక ముందే అడుగుతున్నావు. 'ఆర్గానిక్' పండ్లే! కానీ నువ్వు ఇంత పెద్ద 'ఆర్గానిక్' పిచ్చిదానివిగా ఉండకూడదు" అన్నాడు.

"ఆర్గానిక్ కే నండి శరీరానికి మంచిది. కృతిమంగా తయారు చేసింది ఏదైనా సరే ఆరోగ్యానికి హాని చేస్తుందండి. అందులోనూ ఇప్పుడు పంటలకు వేస్తున్న రసాయన ఎరువులు, రసాయన పురుగుల మందూ వేసి పండించేది ఏదీ మంచిది కాదు. మన శరీరానికి చాలా ప్రమాదకరం.

ఆ కాలంలో మన తాతా-అమ్మమ్మలు తొంబై ఏళ్ళకు పైన ఆరొగ్యంగానే ఉన్నారే...ఎలా? ప్రకృతి రీతిగా పండించిన పంటలను తినటం వలనే. ప్రకృతితో ఒకటిగా జీవించారు.

మన తరం వాళ్ళో ఏది పడితే అది తిని, ముప్పై - నలభై ఏళ్ళకే బి.పి., సుగర్ అంటూ వ్యాధిగ్రస్తులవుతున్నారు

ఆమె చెప్పింది విని, శేఖర్ భార్యకు చేతులెత్తి నమస్కరించాడు.

"ఒసేయ్ అమ్మడూ...చాలు నీ ఉపన్యాసాలు! నన్ను వదిలి పెట్టు" ---భర్త శేఖర్ చెప్పేటప్పటికి నవ్వుకుంటూ లోపలకు వెళ్ళింది సరోజ.

సరోజకు ఏదైనా సరే 'ఆర్గానిక్' గానే ఉండి తీరాలి. హోటల్లో తినడానికి వెళ్ళినా 'ఆర్గానిక్' హోటల్ కే వెళ్ళాలి అని చెప్తుంది. 'గ్రామంలో పెరిగింది. అది ప్రకృతే కదా?' అని శేఖర్ తనకి తాను సమాధాన పరుచుకుంటాడు.

తినే ఆహారంలోనే మాత్రం కాదు...అన్నీ ప్రకృతిగా ఉంటేనే ఆమెకు నచ్చుతుంది. ప్లాస్టిక్ పువ్వులు, ప్లాస్టిక్ ఆకులు, ప్లాస్టిక్ బొమ్మలూ, పూసలు...ఏదీ పక్కకు రాకుడదు.

"సృష్టి యొక్క మొత్త అందాన్నీ, సంతోషాన్నీ ప్రకృతిలోనే చూడగలం, అనుభవించగలం. కృతిమంలో ఏముంది? ఒక పువ్వు యొక్క వాసన, అందం ప్లాస్టిక్ పువ్వులో ఉన్నదా?" అంటుంది.

ఆమె చెప్పేది నిజమే కనుక, ఆహారానికి సంబంధించిన వస్తువుల ఖర్చు ఎక్కువైనా, ఆరొగ్యం విషయం కాబట్టి పెద్దగా పట్టించుకునేవాడు కాదు శేఖర్.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ఆర్గానిక్...(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి