4, డిసెంబర్ 2022, ఆదివారం

రహస్యం…(కథ)

 

                                                                                        రహస్యం                                                                                                                                                                           (కథ)

బంగార్రాజు--ఈశ్వరయ్య మంచి స్నేహితులు. వాళ్ళిద్దరి స్నేహం గట్టిపడి, లోతుగా వెళ్ళటంతో ఇరు కుటుంబ బంధువులూ ఒకరికొకరు స్నేహంగా ఉన్నారు.

ఈశ్వరయ్యకు వ్యాపారంలో పెద్ద అండగా నిలబడింది బంగార్రాజే. అప్పుడప్పుడు వచ్చి ఆలొచన చెప్పేవాడు.‘ఇది కొని పడేయరా, అది కొని పడేయరా...’ అని ఆసక్తి చూపించి, డబ్బుతోనూ, మనసుతోనూ ఎక్కువగా తోడుగా ఉండేవాడు. ఇవేవి మరిచిపోవటమనేది జరగదు.

గుర్తుపట్టలేని కొన్ని సమస్యలు ఇద్దరి మద్యా మొలచినై. సమస్యలకు సంబంధమే లేని కొందరు వచ్చి, నీళ్ళుపోసి పెంచి పారేసారు. చెప్పుడు మాటలకు తల ఊపి, ఇద్దరూ ఒకొర్ని ఒకరు కోపంతో చూసుకుని  నిలబడ్డారు.

స్నేహం ముఖ్యంగా ఉండేటప్పుడు, డబ్బు పెద్దదిగా అనిపించదు. స్నేహం మొద్దుబారిపోయినప్పుడు, చిన్న విషయాలు కూడా పెద్దగా మాట్లాడబడి, ఒకరోజు షాపు ముందు ఒకరి మీద ఒకరు చేతులు చేసుకుని, పోట్లాడుకుని, కిందపడి మట్టిలో దొర్లుతున్న నిమిషంలో స్నేహానికి క్లోసింగ్ సెర్మనీ జరిగింది.

ఈశ్వరయ్య కుటుంబంలో జరిగిన ఒక సంఘటనను బంగార్రాజు అడ్డుకున్నాడు. సంఘటనను రహస్యంగా ఉంచమని సలహా ఇచ్చింది బంగార్రాజే.

స్నేహితుల ఇద్దరి మధ్యా గొడవ జరిగి స్నేహం చెడిపోయింది కాబట్టి వాళ్ళు స్నేహంగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన రహస్యంగానే ఉంచబడిందా, లేదా?

పని చేస్తున్న సమయంలో ఇంటి నుండి పిలుపు వచ్చినప్పుడు చురుక్కున కోపం వచ్చింది ఈశ్వరయ్యకు. క్యాష్ కౌంటర్ ను ఇంకొకరికి అప్పజెప్పి, సెల్ ఫోనును తీసుకుని షాపు బయటకు వచ్చాడు అతను.

వేస్తున్న ఎండకు నుదుటి నుండి నీళ్ళు కారి కనుబొమ్మలను స్నానం చేయించ, ఉప్పు, చింతపండు మూటల గోనె సంచి వాసన ఇంకా అతని శ్వాసను కష్టపెడుతున్నది.

ఏమిటి అంజలీ...? వ్యాపార సమయంలో పిలిచి ప్రాణం తీస్తున్నావు...?” ఘల్లుమని విసుగుతో అడగగానే, అవతలివైపు బంతాడక నిదానం చూప, కొంచం ఆశ్చర్యంగా ఉన్నది అతనికి.

అరే...! ఎందుకు పిలుస్తాను...? ముఖ్యమైన మాట చెప్పటానికే! కాకినాడ నుండి రాజేశ్వరరావు గారు వచ్చారు

నుదుటి మీద తడిగా ఆలోచన పరిగెత్త, అరచేత్తో తుడుచుకున్నాడు.

ఎందుకట...? వాడి గురించి ఏదైనా మాట్లాడారా...?”

ఎవరికి తెలుసు...? ఎప్పుడూలాగానే మాట్లాడారు. మజ్జిగ ఇచ్చి కూర్చోబెట్టాను.  మిమ్మల్ని చూసే వెళ్తానని చెప్పారు స్వరాన్ని తగ్గించి మాట్లాడినప్పుడే అర్ధమయ్యింది.

...! సరి పెట్టేయి. నేను పదినిమిషాల్లో వచ్చేస్తాను. భోజనం రెడీగా ఉందిగా...? వచ్చేటప్పుడు నంచుకోవడానికి ఏదైనా తీసుకు వస్తాను. మటన్, చేప ఏదైనా తీసుకురావాలా...?”

గురువారం నీచు తినరట. వచ్చిన వెంటనే చెప్పారు. ఉండేది పెట్టమ్మా, పనికట్టుకుని ఏదీ చెయ్యద్దు అన్నారు.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

రహస్యం…(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి