13, డిసెంబర్ 2022, మంగళవారం

ప్రేమ సుడిగుండం...(పూర్తి నవల)

 

                                                                                   ప్రేమ సుడిగుండం                                                                                                                                                                                             (పూర్తి నవల)

'ప్రేమ' అనే రెండక్షరాల మాట చాలా ప్రమాదకరమైనది. అది సుడిగుండం లాంటిది. ప్రేమలో పడ్డవారు ఎవరైనా సరే ప్రేమ సృష్టించే సుడిగుండంలో చిక్కుకోక తప్పదు. ప్రేమ అనే సుడిగుండం లో చిక్కుకుని తప్పించుకున్న వారు చాలా తక్కువ మంది. నవలలో ప్రేమించుకున్న హీరో, హీరోయిన్లు హీరో తల్లికి ఎంతో ప్రీతిమంతులు, బంధువులు, కావలసిన వాళ్ళూ అయినా వాళ్ళు కూడా ప్రేమ సుడిగుండంలో చిక్కుకున్నారు. ఎందుకు ప్రేమ సుడిగుండంలో చిక్కుకున్నారు, ప్రేమ సుడిగుండం  నుండి ఎలా బయట పడ్డారు? వారి ప్రేమ సుడిగుండంలో వారిద్దరూ ఎదుర్కొన్న సమస్య ఏమిటో మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. 

 

కళ్ళు తెరిచిన వెంటనే కిరణ్ జ్ఞాపకాలే వచ్చినై ప్రతిమకు.


 ప్రతిమ కిటికీలో నుండి కనబడుతున్న మామిడి చెట్టును చూసింది. పదేళ్ళ కిరణ్ జారిపోతున్న నిక్కర్ను పైకి లాక్కుంటూ మామిడి చెట్టును ఎక్కుతున్నట్టు ప్రతిమ అంతరంగ కళ్ళకు కనబడింది...చిరునవ్వుతో లేచింది ప్రతిమ.

  రోజు కిరణ్ జన్మ నక్షత్రం. క్రింద వంటింట్లో ప్రతిమ మేనత్త రామలక్ష్మి పాయసం రెడీ చేస్తోంది. అమెరికాలో మొదటి సంవత్సరం చదువు ముగించుకుని కిరణ్ ఇండియాకి తిరిగి వస్తున్నాడు. ఇంకో మూడు గంటలలో అతను వచ్చే విమానం హైదరాబాద్ నేలను తాకుతుంది. తరువాత మరో గంటలో అతని కారు ఇంటి పోర్టికోలోకి వచ్చి ఆగుతుంది.

 

వచ్చిన వెంటనే ఏం చేస్తాడు? అమ్మతో అరగంట సేపు మాట్లాడి, హడావిడి పడుతూ మేడమీదకు వచ్చి ప్రతిమతో గొడవపడతాడు. ఆమెను ఏడిపించకపోతే అతనికి రోజులు గడవవు.

 

అమెరికా వెళ్ళే ముందు కూడా ఆమెను ఏడిపించాడు.

 

"వారానికి రెండు సార్లు ఫోన్ చెసి మాట్లాడు కిరణ్"

 

"ఎందుకమ్మా...ఫోనులో కూడా నీ సుత్తి వినాలనా? నీ దగ్గర నుండి తప్పించుకోవటానికే కదా సముద్రాలు దాటి దూరంగా వెడుతున్నాను. నో...ఫోన్, ‘నో...ఈమైల్!"

 

"ఉత్తుత్తి మాటలు చెప్పకు. నాతో మాట్లాడకుండా నువ్వు ఉండలేవు"

 

ఇక్కడున్నప్పుడు వేరే నాధి లేక నీతో మాట్లాడి ఉండొచ్చు. కానీ, ఇకమీదట అలా జరగుతుందా? అయ్యగారు ఎక్కడికి వెడుతున్నారో తెలుసుగా? అమెరికా! నీకంటే స్మార్టుగా ఉండే అమ్మాయులు నా చుట్టూ తిరుగుతారు. వాళ్ళతో మాట్లాడటానికే సమయం చాలదట. అవన్నీ వదులుకుని పనిగట్టుకుని పాత మనిషితో ఫోన్ చేసి మాట్లాడాలా?"

 

"ఎవర్ని చూసి పాత మనిషి అంటున్నావు?"

 

"నిన్ను చూసే!"

 

"నువ్వెలా అమెరికా వెల్తావో చూస్తాను!"

 

"ఫ్లయిట్ లోనే వెల్తాను. టెర్రస్ పైకి వెళ్ళి చూడు. వీలైతే పై నుండి చేతులూపుతా"

 

"నిన్నూ..." అంటూ చెయి పైకెత్తి ముద్దుగా కిరణ్ చేతిపై ఒక దెబ్బ వేసింది ప్రతిమ.

 

" జిడ్డు మొహాన్ని ఎవరు పెళ్ళి చేసుకుంటారు? నాకు వద్దు బాబూ! నువ్వు కావాలంటే చూడు ప్రతిమా....అమెరికా నుండి తిరిగి వచ్చేటప్పుడు జాలీగా ఊరి అమ్మాయితో వస్తాను

 

అక్కర్లేకపోతే పోవయ్యా! జిడ్డు మొహానికి కూడా ఒకడు దొరుకుతాడు"

 

"దొరుకుతాడంటావా! నాకు నమ్మకం లేదు! అలా ఎవరూ దొరకకపోతే చెప్పు...పోతేపోనీ పాపం అనుకుని ఒకళ్ళకి ఇద్దరుగా నేనే నిన్ను చేసుకుంటా. నా అంతఃపురంలో చిన్న మహారాణిగా ఉండిపో!"

 

ప్రతిమ మొహం ఎరుపెక్కి కళ్ళల్లో నీరు కారింది...గబుక్కున లేచి పరుగుతీసింది. ఆమె వెనుకే నవ్వుతూ వెంటపడ్డాడు కిరణ్.

 

రోజు ప్రతిమ కిరణ్ తోపాటు ఏర్ పోర్టుకు కూడా వెళ్ళలేదు. అంత కోపం. అతనూ రమ్మని పిలువలేదు. అత్తయ్య, ఆమె పెద్ద కొడుకు వరుణ్ ఎక్కిన తరువాత కారు వేగంగా బయలుదేరింది. మేడ మీదున్న కిటిలో నుండి ఏడుపు, బాధతో చూస్తూ ఉండిపోయింది ప్రతిమ. వాళ్ళు తిరిగి వచ్చేంతవరకు కిటికీని విడిచిపెట్టి రాలేదు.


ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:


ప్రేమ సుడిగుండం...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2 


***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి