30, డిసెంబర్ 2022, శుక్రవారం

అమెరికాలో మంచు తుపాను బీభత్సం…(న్యూస్)


                                                                   అమెరికాలో మంచు తుపాను బీభత్సం                                                                                                                                                           (న్యూస్) 

మంచు తుపాను కారణంగా అగ్రరాజ్యం అమెరికాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అతిశీతల గాలులతో ఇప్పటివరకు 60మంది అమెరికన్లు చనిపోగా, ఒక్క న్యూయార్క్లోనే 28 మరణాలు చోటుచేసుకున్నాయి.

రోడ్డుపై పేరుకుపోతున్న మంచుతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిచిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా నగరాల్లో మైనస్ 40 డిగ్రీల కంటే తీవ్రమైన చలి నమోదవుతోంది. తుపాను కారణంగా ఇప్పటివరకు 16వేల విమాన సర్వీసులను అమెరికా రద్దు చేసింది.

అమెరికా తీవ్రమైన మంచు తుపాను నుంచి ఇంకా కోలేదుతాజా మంచు తుపాను కారణంగా జనజీవనం అతలాకుతలం అవుతోంది. ప్రభుత్వం చేపట్టే అత్యవసర సేవలకు కూడా అంతరాయం ఏర్పడుతోంది.

మిలియన్ల కొద్ది అమెరికన్లు శీతాకాలపు మంచు తుపాను కారణంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోలేక పోయారు. విద్యుత్ అంతరాయం, చలికారణంగా ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో ఇళ్లకే పరిమితమయ్యారు. క్రిస్మస్ వేడుకలను జరుపుకునేందుకు వారాంతంలో వేసుకున్న ప్రణాళికలు అన్ని ఇళ్లకే పరిమతయ్యాయి.

అమెరికాలోని తూర్పు ప్రాంతం సోమవారం వరకు తీవ్ర స్తంభనలోనే ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం వరకు పరిస్థితులు అదుపులోకి వచ్చే పరిస్థితులు లేవని పేర్కొన్నారు.

మంచుతో కప్పబడిన ఇళ్లలో నివాసితులతోపాటు సెలవులకు వచ్చిన యాత్రికులు సైతం చిక్కుకుపోయారు. గంటల తరబడి మంచు కురుస్తుండటంతో మంచు గడ్డల కింద కొంత మంది చిక్కుకుపోయి ప్రాణాలు వదిలినట్లు.. వారికోసం డిజాస్టర్ సిబ్బంది కనిపెట్టేందుకు కృషి చేస్తున్నారు. మంచు తుఫాను 1977 నాటి భయంకరమైన మంచుతుఫానును సైతం దాటి తీవ్రంగా ఉన్నట్లు.. భయంకరమైన గాలులతోపాటు మంచు తుఫాను కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంచు కారణంగా స్తంభించిన విద్యుత్ సబ్స్టేషన్ల పునరుద్ధరణ మంగళవారం వీలుకాదని ప్రభుత్వం తెలిపింది. 18 అడుగుల మేర మంచు కప్పివేయడంతో విద్యుత్ పునరుద్ధరించేందుకు వీలుకావడం లేదని అధికారి తెలిపారు.

Image Credit: To those who took the original photos.

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి