11, డిసెంబర్ 2022, ఆదివారం

వీధి మధ్యలో ఒక మర్మమైన సమాధి...(మిస్టరీ)

 

                                                                   వీధి మధ్యలో ఒక మర్మమైన సమాధి                                                                                                                                                              (మిస్టరీ)

మానవులలో నమ్మకానికి గల శక్తి ఏమిటో టర్కిష్ వీధి మధ్యలో ఉన్న ఒక మర్మమైన సమాధిని చూసి తెలుసుకోవచ్చు.

ఎవరైనా రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు మధ్యలో ఏదైతే చూడటానికి ఇష్టపడరో, దాన్నే టర్కిష్ నగరమైన శివస్లో ఉన్న ఒక రోడ్డులో, రోడ్డు మధ్యన చూస్తారు. అది సమాధిపై పెట్టబడు స్మారక చిహ్నమైన రాతిబండ కలిగిన ఒక సమాధి.

మధ్య టర్కీలోని సివాస్ పట్టణంలో కొత్తగా నిర్మించబడిన సర్కిస్ లామండలంలో ఉన్న అనేక వీధుల్లో యెని మహల్లె హమ్జావోలుఒక వీధి. కానీ వీధిలో ఒక ప్రత్యేకత ఉంది. వీధిలో ప్రయాణం చేసే వాహన  డ్రైవర్లు రోడ్డుకు అడ్డుగా కూడలి మధ్య ఉన్న సమాధిపై ఢీ కొట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇది చాలా సంవత్సరాలుగా ఉంది, కానీ ఇటీవలే సమాధి ఫోటోలు మరియు డ్రోన్ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఇది జాతీయ దృష్టిని ఆకర్షించింది.

పెద్ద సమాధి అక్కడెందుకున్నదో ఎవరికీ తెలియదు. అది ఒక మిస్టరీ.

పెద్ద సమాధిపైన పెట్టబడున్న స్మారక చిహ్న రాయిపై "గరీబన్ అమరవీరుడు బాబా" అనే శాసనం ఉన్నప్పటికీ, సమాధి ఎవరికి చెందినదో, అమరవీరుడు గరీబన్ బాబా ఎవరో ఎవరికీ తెలియదు. 'సర్కిస్ లా' మండలాన్ని నిర్మించడానికి, ప్రాంతంలో ఇంటి యజమానుల నుండి కొన్ని భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. మర్మమైన సమాధి వాస్తవానికి స్వాధీనం చేసుకున్న ఒకరి భూమిలో ఉందని నమ్ముతారుదానికి కొన్ని మీటర్ల దూరంగా రోడ్డును నిర్మించడానికి బదులుగా దాని చుట్టూ రోడ్డు ఎందుకు నిర్మించబడిందనేది మరొక మిస్టరీ.

పరిసరంలో ఉన్న కండెమిర్ మండల అధిపతి అహ్మత్ హార్క్, టర్కిష్ వార్తాపత్రిక హబెర్తో మాట్లాడుతూ, మర్మమైన సమాధి చుట్టూ ఉన్న కథలు రోడ్డు వేసే కార్మికులను సమాధి లో ఉన్న  అవశేషాలను తరలించడానికి బదులుగా దానిని అక్కడే వదిలేయమని ఒప్పించాయి. సమాధి ఒకప్పుడు పవిత్రమైన బలిపీఠం అని కార్మీకులలో ఒకరికి ఎవరో కలలో కనబడి చెప్పారని, అందువలన సమాధి తరలించబడలేదని వారికి చెబుతూ, భూమి యొక్క చివరి యజమానుల కలలో అక్కడ ఖననం చేయబడిన వ్యక్తి కనిపించాడని కూడా చెబుతారు. అంతకు ముందు యజమానులకు అదే జరిగిందని, కాబట్టి అందరూ సమాధిని ఒంటరిగా వదిలేశారు, రోడు వేసే కార్మీకులు కూడా.


ఒక అమరవీరుడు లేదా పండితుడు అక్కడ ఖననం చేయబడ్డారని స్థానికులు నమ్ముతారు. కొందరు స్థానికులు అప్పుడప్పుడు సందర్శించి పువ్వులు తీసుకువస్తారు, ప్రార్ధన చేస్తారు. ఇది రహదారి మధ్యలో చతురస్రంగా ఉన్నా వాస్తవానికి ఇది ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదు.

Images and video Credits: To those who took them.

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి