16, డిసెంబర్ 2022, శుక్రవారం

ఎక్కడ నా ప్రాణం...(సీరియల్)...(PART-4)

 

                                                                                ఎక్కడ నా ప్రాణం...(సీరియల్)                                                                                                                                                                 (PART-4)

సంగీతలయతో  '...' అనే అల్లరితో పాలులాగా పడుతున్న జలపాతంలో స్నానం చేసి, దగ్గరలో ఉన్న దుస్తులు మార్చుకునే గదిలోకి వెళ్ళి, దుస్తులు మార్చుకుని బయటకు వచ్చింది దివ్యా.

అర్జున్ నిగనిగలాడుతున్న తెల్ల రంగు టీ షర్టూ--నల్ల రంగు ప్యాంటు వేసుకుని, ఒక చెట్టు క్రింద ఉన్న బండరాయిపై చెట్టులాగా కుర్చోనున్నాడు.

"వచ్చే దారిలో...ఇడ్లీ, గారె కొనుకొచ్చింది మంచిదయ్యింది. తినేసి మన పని మొదలుపెడదాం" అంటూ టిఫిన్ ప్యాకెట్లు ఓపన్ చేశాడు.

"లేదు అర్జున్. మీరు తినండి...నాకు ఆకలిగా లేదు"

"అబద్దం చెప్పకు. జలపాతంలో స్నానం చేసిన తరువాత నాకే బాగా ఆకలి వేస్తోంది. ఎప్పుడో నిన్న రాత్రి తిన్న నీకు ఆకలి వేయదా ఏమిటి?

దారి తెలియదు కనుక అడవిలో ఎక్కువ తిరగవలసి ఉంటుంది. పస్తుంటే, వెళ్ళే దారిలో కళ్ళు తిరిగి పడిపోతే ఏం చేయగలం? మామయ్యను వెతకటంకోసం తిరగటానికి మనకి ఓపిక కావద్దా?

నువ్వు చదువుకున్న అమ్మాయివి. అందులోనూ ఒక డాక్టర్ వి. మొండి పట్టు వదిలేసి వచ్చి తిను"

తరువాత తన పట్టుదల వదిలేసి అర్జున్ దగ్గరకు వచ్చి ఇడ్లీలు తినడం మొదలుపెట్తింది దివ్యా.

చుట్టూ అడవి చెట్లు. దట్టంగానూ, ఆకాశాన్ని ఆంటేటట్టుగానూ ఆశగా పెరిగిన చెట్లు ఆడవికే అందాన్ని తీసుకొచ్చినై.

జలపాతంలో నుండి ధారగా పడుతున్న నీరు ఏరై, కొండ రాళ్లను ముద్దాడుతూ జత కట్టుకుని పారుతున్న అందం ....ఒక్క క్షణం మనసులోని సంగీత భావాన్ని తట్టిలేపుతుంది.

"నాన్న మాత్రం కనబడకుండా పోయుండకపోతే జలపాతం నుండి జరిగి వచ్చేదాన్ని కాదు అర్జున్ "  

"మామయ్యను కచ్చితంగా కనిపెట్టేయవచ్చు. ఆయన క్షేమంగా దొరికిన వెంటనే, మన పెళ్ళే. హనీమూన్ కు సిమ్లా వెల్దాం"

" కొండ ప్రదేశాన్నీ, మందుల కొండనూ పూర్తిగా చూసేసి, వైజాగ్, అన్నవరం చూసేసి వద్దాం. సరేనా?"

కొంటెతనంగా ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు.

"నాన్న క్షేమంగా దొరుకుతారని ఎలా అంత నమ్మకంగా చెబుతున్నావు?"

ఆమె గొంతులో నుండి ఇడ్లీ ముక్క పొట్టలోకి దిగటానికి మొరాయించింది.

"మామయ్యకు దేవుడు మీద నమ్మకం ఎక్కువ. అంతే కాకుండా కొండ ౠషులు, తిరిగే పుణ్య భూమి. మంచివాళ్ళను రోజూ భగవంతుడు కష్టాలలోకి తోయడు అనేది నా గట్టి నమ్మకం. చూస్తూ ఉండు...మనం అడవి వదలి వెళ్ళేటప్పుడు మామయ్యను కూడా తీసుకునే వెళ్ళబోతాం...సరేనా?"

"మీ నోటిమాట ఫలించని"

చెంపల మీదకు కారిని నీటిని తుడుచుకుంటూ, గబగబా తిని ముగించింది.

తడిసిన జుట్టును విరబోసుకుని, బ్యాగును భుజాలకు తగిలించుకుని అర్జున్ తో కలిసి నడవసాగింది.

"తల బాగా తుడుచుకో. చూడు ఇంకా ఎంత తడిగా ఉంది. నీళ్ళు చెవుల పక్క నుంచి భుజాలపైకి కారుతున్నాయి"

"ఇది అడవి ప్రాంతం. పరిశుద్దమైన గాలి ఎలా వీస్తోందో చూడండి. తల తుడుచుకో అక్కర్లేదు. గాలికి త్వరగా ఆరిపోతుంది"

అడవి చెట్లు వేగంగా తమ కొమ్మలను ఊపుతూ గాలితో ప్రేమ భాష మాట్లాడుకుంటున్నాయి.

వంకర టింకర గా తిరుగుతూ వెడుతున్న దారిలో.... అర్జున్ నడుస్తున్న వేగానికి ఈడుగా నడుస్తున్న దివ్యా, ఆలొచనతో అతన్ని చూసింది.

" అర్జున్! మనం ఇప్పుడు ఎక్కడికి వెడుతున్నాం?"

"మందుల కొండకు...అక్కడికి వెళ్ళటానికి ఎటువంటి వాహనాలూ లేవట. ఇంకా కొంచం దూరం వెడితే కొండకు వెళ్ళే దారి వస్తుందట.

దారీ వెంబడి వెల్తే ఒక గంట సమయంలో కొండకు వెళ్ళిపోవచ్చుట. జలపాతానికి వెళ్లే దారిలో ఒక చిన్న టీ కొట్టు ఉన్నది చూడు...అక్కడే విచారించేను"

" కొండ శిఖరంపై ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకుని మామయ్యను వెతకటం మొదలుపెడతామా?"

"అవును దివ్యా. శివలింగాన్ని దర్శించుకుని, అలాగే కొండ క్రింద గుడారంలో ఉన్న గంగయ్య స్వామి గారిని చూసి మాట్లాడాలి"

" మూలిక వైద్యుడ్ని తన దారికి తీసుకురావాలనే పేరాశతోనే కదా నాన్నను కిడ్నాప్ చేశాడు సుధీర్ డాక్టర్?"

"అవును..."

"నాన్నను కిడ్నాప్ చేసిన వాళ్ళు, ఆయన్ని విజయవాడ లోనే దాచిపెట్టక--అరుదైన మూలికలను అపహరించటానికి తిన్నగా కొండకు ఆయన్ని తీసుకు వచ్చుంటారని మీరు చెప్పారు కదా?"

"అవును...చెప్పాను"

"ఇంత పెద్ద కార్యం చేసిన వాళ్ళుమందు కొండల క్రింద ఉండే గంగయ్య స్వామి గారిని కూడా కిడ్నాప్ చేసుండరా? ఇంతసేపటి వరకు ఆయన్ని వూరికే విడిచిపెట్టి ఉంటారా?".

"నాకెందుకో అలా అనిపంచడం లేదు?"  

"ఆయన ఒకర్నీ మాత్రమే కిడ్నాప్ చేసి తీసుకు వెడితే వాళ్ళు అనుకున్న పని సాదించుకోవచ్చే? కాబట్టి ఆయన్ని కూడా కిడ్నాప్ చేసిన తరువాతే ఇంకో పని మొదలుపెట్టుంటారు"

"కావాలంటే చూడండి! గంగయ్య స్వామి వైద్యుడు తన గుడారంలో ఉండరని నేను అనుకుంటున్నాను. మనం అంత దూరం వెళ్ళి నిరాశతో తిరీగి వస్తాము"

"మామయ్య వైద్యుడి గురించి చెప్పింది తెలుసుకున్న తరువాత, గంగయ్య స్వామి గారి మీద నాకు ప్రత్యేక గౌరవం ఏర్పడింది. ఆయన అంత సులభంగా డాక్టర్ సుధీర్ గుంపు దగ్గర చిక్కుకోరని నా మనసు చెబుతుంది. సరే, మనం సరైన దారి పట్టుకున్నాం. ఇక దారి మార్చకుండా తొందరగా వెళ్ళిపోదాం"

మధ్య కురిసిన వర్షం వలన దారి పొడుగనా అక్కడక్క నీటి మడుగులు, బురద ఉండటంతో దారి అక్కడక్కడా చాల సన్నగా ఉన్నది. సన్నటి దారిలొ నడుస్తూ పక్కకు తిరిగి చూస్తే లోతైన లోయలు భయపెడుతున్నాయి.

"కొండదారి ఎత్తుగా పోవటం వలన నీకు నడిచి రావటం శ్రమంగా ఉన్నది కదూ...? రొప్పు వస్తోందా దివ్యా! కావాలంటే కొంచం సేపు కూర్చుని రెస్టు తీసుకుని వెలదామా?"

"...వద్దు. శ్రమ చూస్తే కుదురుతుందా? నాన్నను ఎలాగైనా కనిపెట్టాలి. శ్రమకే అలసిపోయి కూర్చోను

వైరాగ్యంతో ఆయాశపడుతూ నడుస్తున్న దివ్యాను చూసి "గుడ్...ఆడవాళ్ళు ఇలాగే వైరాగ్యంగా ఉండాలి" అంటూ ప్రశంసాపత్రం చదివాడు.

"నాకు తోడుగా మీరున్నారుగా? పెళ్ళికి ముందే కాబోవు భార్య యొక్క కష్ట నష్టాల్లో పాలు పంచుకోవటం చేస్తున్నారు...మీరు చాలా గ్రేట్"

"మనసుకు ఎంత బలంగానూ-ఓదార్పుగానూ ఉన్నదో తెలుసా? ధైర్యముతో హిమాలయా పర్వతాలనైనా ఎక్కేస్తాను తెలుసా...?"

అడవిలోని చల్లటిగాలి శరీరాన్ని చిల్లులు చేస్తొందే? దాని పైన నువ్వూ టన్నుల లెక్కలో ఐస్ పెడుతున్నావే...నేను తట్టుకోలేకపోతున్నాను బంగారం"

అతను అమయాకంగా మొహం పెట్టుకుని చెప్పిన ఆ మాటలు విని గలగలా నవ్వింది దివ్యా.

ఆమె అలా గలగలా నవ్వుతూనే "నేను నిజమే కదా చెప్పాను? నాకు ఐస్ పెట్టటం చేతకాదు" అన్నది.

"ఆటలాడుతూ నడవుకు దివ్యా. చూసి జాగ్రత్తగా ఎక్కు...నా చెయ్యి పుచ్చుకో" అంటూ ఆమె కుడిచేతిని గట్టిగా పుచ్చుకుని నడిచాడు.

అతి భయంకరమైన అడవిలో, మధ్యరాత్రి సమయంలో....అమె ఒక్కత్తిగా కష్టపడబోతోందని అప్పుడు ఆమె తెలుసుకోలేకపోయింది.

                                                                   **********************************

మందు కొండలో శివలింగం, తెరిచున్న ఒక గుడిలాగా ఒక రావి చెట్టు క్రింద ఉన్నది.

పెద్ద శివలింగానికి నాలుగు వైపులా చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి. పెద్ద శివలింగానికి ఎదురుగా గంభీరమైన నంది విగ్రహం ఉన్నది. కొండ ఎత్తులొ బలమైన గాలి చుడుతోంది.

"కొంచం నిర్లక్ష్యంగా ఉన్నామనుకో... గాలి మనల్ని లోయలోకి తోసేసే ఇంకో పని చేసుకుంటుంది" అని సనుగుతూ అటూ ఇటూ చూశాడు.

"కొండ పైఎత్తులోని అంచుల్లో నిలబడి చూస్తుంటే, చుట్టూ ఆకుపచ్చని...పెద్ద ప్రపంచాన్ని భగవంతుడు తీసుకు వచ్చి పెట్టినట్టు ఆశ్చర్యంగా ఉన్నది కదూ?"

అతను అడిగిన ప్రశ్నకు ఎటువంటి సమాధానమూ చెప్పక, గాలికి కొట్టుకుంటూ ఎగురుతున్న పైటను లాగి నడుము దగ్గర దోపుకుని పెద్ద శివలింగానికి దగ్గరగా వెళ్ళింది దివ్యా.

మోకాళ్ళ మీద కూర్చుని చేతులెత్తి నమస్కరిస్తూ కన్నీటితో ప్రార్ధించింది.

'నాన్నా...మీరు జాగ్రత్తగా నాకు తిరిగి దొరకాలి. కోటను వదిలి మేము తిరిగి వెడుతున్నప్పుడు, మీతోనే వెళ్ళాలి. దానికి నీ ఆశీర్వాదం కావాలి భగవంతుడా' శివలింగంపైన పసుపు రంగు గుడ్డ చుట్టబడి ఉంది.

శివలింగానికి ప్రొద్దున్నే ఎవరో పూజ చేసేసి, జిల్లేడు పూలమాల వేసి వెళ్ళారు!

శివలింగానికి పైన ఒక నాగలింగ పువ్వు ఉంచారు.

ఎంతో వేగంగా వీస్తున్న గాలికి కొంచం కూడా కదలని పువ్వును కళ్ళార్పకుండా చూస్తున్నాడు అర్జున్.

మోకాళ్ళపైన కూర్చుని హృదయం కరిగేటట్టు ప్రార్ధన చెసి దివ్యా లేచి నిలబడటానికి లేద్దామనుకున్నప్పుడు, శివలింగంపై ఉంచబడ్డ నాగలింగ పువ్వు ఆమె మోకాళ్ల దగ్గర వచ్చి పడింది.

మైమరచిపోయిన దివ్యా, గబుక్కున వెనక్కు తిరిగి అర్జున్ను చూసింది.

అదే సమయంలో 'గణ...గణ...గణ...'మని గంట శబ్ధం అడవి ప్రదేశమే అధిరిపోయేటట్టు వినబడగా--ఇద్దరూ ఒకే సమయంలో ఆశ్చర్యంతో ఆకాశంవైపు చూశారు.

నందికి దగ్గరగా రెండువైపులా బ్రహ్మాండమైన రాతి స్థంభాలు నిలబడున్నాయి. రెండు స్థంబాలపైన ఒక ఇనుప దూలం వేయబడుంది. దానికి వేలాడుతోంది ఒక పెద్ద ఇనుప గంట.

అంతపెద్ద గంటకు వేలాడుతున్న గొలుసు, దాన్ని సుమారు ఐదారుగురు కలిసి బలంగా లాగి కొడితే మాత్రమే గంట మోతను మోగించ వచ్చు!

కానీ...ఏమిటీ ఆశ్చర్యం? ఎంత బలమైన గాలి వీచినా కూడా, ఇంత పెద్ద గంట కదిలే అవకాశమే లేదే!

అలా ఉన్నప్పుడు-- గంట తానుగా కదలడం, గంట మోగటం ఇద్దరి శరీరాలనూ పులకింప చేసింది.

"... అర్జున్! ... ఆశ్చర్యాన్ని చూశావా?"

పరవశంతో ఆమెకు నాలుక తిరగలేదు.

"దివ్యా...అంతా దైవ లీల. మామయ్య తప్పిపోయారని, ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాము. ప్రదేశంలో ఇలాంటి ఒక అద్భుతం చూడాలనేది మన ప్రాప్తం! నిజంగానే మనం చాలా అదృష్టవంతులం కదా?

ఇక నువ్వు దేనికీ బాధపడకూడదు. మామయ్య పదిలంగా మనకు దొరుకుతారని నువ్వు మనస్పూర్తిగా నమ్మాలి. ఇది ఋషులు, మునులూ తిరిగే అడవి ప్రదేశం అని అందరూ చెబుతుంటే నేను విన్నాను. అది కళ్లారా నిరూపణ అయ్యిందీ.

"అవును... అర్జున్! ఋషులే ఇలాంటి ఒక అద్భుతాన్ని చేసుంటారు. వాళ్ళు అడవీ ప్రాంతంలోని మందుల కొండలో తిరుగుతున్నారని రుజువు చేశారు. రూపాలు కనిపించకుండా వాళ్ళు ఇక్కడ తిరుగుతున్నారనేది నిజం. అందువల్లే నాన్నకు ప్రదేశం నుండి తిరిగి రావడానికి మనసే రాలేదు కాబోలు"

మన పెళ్ళి జరిపించి, తరువాత మీ నాన్న ఇక్కడకు వచ్చి ఇక్కడే ఉండిపోతారని నువ్వు అన్నావే? ఇలాంటి అద్భుతాలు ఆయన కచ్చితంగా చూసుంటారు.

సరే దివ్యా. మనం కొండ నుంచి దిగుదామా? కొండ క్రింద ఉన్న గంగయ్య స్వామి గారిని చూడలి. ఆయన్ని మాత్రమే కాదు...కుదిరితే సీతమ్మను కూడా చూసేయాలి..."---సంచీని భుజానికి తగిలించుకుని నడవసాగాడు.

"సీ... సీతమ్మను మనం ఎలా చూడగలం? ఆవిడ పౌర్ణమికి మాత్రమే బటకు వస్తారే?"

"పౌర్ణమికి ఇంకా రెండు రోజులే ఉంది కదా?"

"ఏమిటి అంత ఈజీగా చెప్పాశారు? అంతవరకు ఎక్కడ ఉండగలం మనం?"

"గంగయ్య స్వామి గారిని చూడటానికేగా మనం వెడుతున్నాము...ఆయన దగ్గరే అడుగుదాం. మామయ్యకు స్నేహితుడే కదా...సహాయం చేయకుండానా ఉంటారు?"

జారుతూ క్రిందకు వెడుతున్న దారిలో జాగ్రత్తగా కాళ్ళు పెడుతూ మెల్లగా దిగుతూ ఆలొచనతో అతన్ని తలెత్తి చూసింది.

"డాక్టర్ సుధీర్ మన ఇంటికే వచ్చి, టీవీ ప్రోగ్రాం లో సీతమ్మ గురించి చెప్పిన సమాచారాన్ని నాన్న దగ్గర ఆశ్చర్యంగా చెప్పారు.

అప్పుడు కూడా అది నేను నమ్మలేదు. ఏదో ఒక కల్పిత కథ అయ్యుంటుందని అనుకున్నాను. జరుగుతున్నవి చూస్తుంటే అన్ని విషయాలూ నిజమై ఉంటాయేమోనని అనిపిస్తోంది."

"కచ్చితంగా. నాకు కూడా నమ్మకం వచ్చింది కాబట్టే సీతమ్మను చూసేయాలని చెబుతున్నా"

టీవీలో విషయాన్ని చెప్పి బట్టబయలు చేశారు. డాక్టర్ సుధీర్ లాంటి చెడ్డ వాళ్ళు ఇంకా ఎంతమంది బయలుదేరారో?"

"ఇవన్నీ తెలుసుకుని ఒక వేల సీతమ్మ సారి పౌర్ణమికి గుహ నుండి బయటకు రాకుండా ఉండిపోతే?"

శివలింగ దర్శనానికి పౌర్ణమి రోజు ఆవిడ వస్తేనే కదా మనం చూడగలం?"

"జాగ్రత్త...క్యార్ ఫుల్ గా ఉండండి. చెయ్యి పుచ్చుకో.నువ్వు చెప్పేదీ కరెక్టే. ఒక వేల ఆవిడ రాకుండా ఉంటే, మనం డీలా పడిపోకూడదు. ఎలాగైనా ప్రయత్నం చేసి ఆవిడ్ని చూసేయాలి"

"ఏం చెబుతున్నారు? ఆవిడ రాకపోతే, ఆవిడని ఏలా చూస్తాం?"

"ఆవిడున్న చోటుకు వెళ్ళాల్సిందే"

ఆశ్చర్యంగా చూస్తూ అలాగే నిలబడిపోయింది.

విపరీతమైన ఆటను ప్రారంబించటానికి ఉత్సాహంతో ఎదురుచూస్తోంది సమయం.

                                                                                             Continued....PART-5

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి