19, డిసెంబర్ 2022, సోమవారం

చిన్నారి కోరిక...(కథ)

 

                                                                                       చిన్నారి కోరిక                                                                                                                                                                                     (కథ)

వాస్తవం కంటే ఊహే గొప్పది...నిజ ప్రపంచం కంటే మనసు సృష్టించుకునే ప్రపంచమే గొప్పది.

అనాధ బాలుడైన పిచ్చాయికి ఒక చిన్న కోరిక. ఆ కోరిక కూడా వాడికి,  వాడ్ని దగ్గరకు చేర్చుకుని ఆదరణ చూపిన బొమ్మల బామ్మ వలన కలిగింది. రోజూ బొమ్మల బామ్మ తో కలిసి ఆమె బొమ్మలమ్ముకునే చోట ఆమెతో పాటూ కూర్చుంటాడు. కానీ మద్యాహ్నం ఒంటిగంట అయ్యేసరికి పక్కనున్న స్కూలు దగ్గరకు వెడతాడు. అక్కడ లంచ్ టైములో తల్లులు  తమ పిల్లలకు లంచ్ పెడుతున్న దృశ్యం చూడటానికి. లంచ్ టైము అయిపోయిన తరువాత, బామ్మ దగ్గరకు తిరిగి వస్తూ మార్కెట్ వీధిలో ఉన్న బట్టలకొట్టు లోని అలంకారపు బొమ్మను కాసేపు చూస్తూ నిలబడతాడు.

పిచ్చాయి రోజూ లంచ్ టైముకు ఆ స్కూల్ గేటు దగ్గరకు ఎందుకు వెల్తున్నాడు? అడుక్కోవడం నచ్చని పిచ్చాయి, పిల్లలు మిగిల్చిన ఆహారాన్ని వారి తల్లులు ఇస్తుంటే ఎందుకు తింటున్నాడు? బట్టల కొట్టు దగ్గర నిలబడి అలంకార బొమ్మను ఎందుకు తదేకంగా చూస్తాడు?... వీటన్నిటికీ సమాధానం కోరిక!

ఆరేళ్ళ పిచ్చాయికి ఉన్న ఆ కోరిక ఏమిటో? తెలుసుకోవటానికి ఈ కథను చదవండి.

అది బాల నేరస్థుల న్యాయస్థానం.

పోలీసులు ఆరేళ్ళున్న ఒక కుర్రాడిని జడ్జి ముందు నిలబెట్టారు.

గుమాస్తా అందించిన కేసు ఫైలును తీసుకున్న జడ్జి, కేసు ఫైలును చదివి ఆశ్చర్య పోయాడు. దెబ్బలను చూసుకుంటూ, ఏడుస్తూ బోనులో నిలబడున్న కుర్రాడిని చూశాడు. న్యాయ మూర్తికి ఆగ్రహం వచ్చింది. వాడిని న్యాయ స్థానం లోకి తీసుకు వచ్చిన పోలీసులను చూసి మీ స్టేషన్ ఇన్స్ పెక్టర్ వచ్చారా?” అని అడిగాడు.

లేదు యువరానర్...స్టేషన్ లోనే ఉన్నారు చెప్పాడు ఒక కానిస్టేబుల్.

న్యాయ స్థానానికి వెంటనే రమ్మని కబురు పెట్టండి..మీ ఇన్స్ పెక్టర్ వచ్చిన తరువాత కేసు విచారణ మొదలు పెడతాను అని కానిస్టేబుల్ తో చెప్పి కేసు ఫైలును పక్కన పెట్టారు జడ్జి.

అర గంట తరువాత వచ్చిన ఇన్స్ పెక్టర్ను చూసి కుర్రాడి మీద కేసు ఫైలు ప్రిపేర్ చేసింది మీరేనా?” అడిగాడు జడ్జి.

ఎస్. సర్ అన్నాడు ఇన్స్ పెక్టర్.

 ఏం మనుషులయ్యా మీరు. చిన్న పిల్ల వాడిని పట్టుకుని గొడ్డును బాదినట్టు బాదారు. వాడేం తప్పు చేశాడని అలా కొట్టారు. దొంగ తనం చేశాడా? దోపిడీ చేశాడా?మాన భంగం చేశాడా? లేక జేబులు కొట్టాడా? లేదే... మహిళ బొమ్మను కౌగలించుకున్నాడు. అంత మాత్రానా వాడు పాడు బుద్ది గలవాడని మీరంతా ఎలా ఒక నిర్ణయానికి వచ్చారు?”… ఇన్స్ పెక్టర్ను చూసి గట్టిగా అరిచాడు.

వయసులో వాడికి పాడు బుద్ది ఆలొచన వస్తుందా?...వీడికే కాదు...వీడి వయసులో ఉన్న పిల్లలకైనా అలాంటి ఆలొచన వస్తుందా? మీ ఇళ్ళల్లో వీడి వయసు పిల్లలు లేరా?...వాళ్ళకి కూడా ఇలాంటి బుద్దులే ఉన్నాయా...ఏం పోలీసులయ్యా మీరు?”

పోలీసులంటే నేరారోపణలో ఎంత నిజముందో అక్కడికక్కడే కనుక్కునే మొదటి వ్యక్తులయ్యా. నేరస్తుల తల రాతలను రాసే వారిలో మీరే మొదటి వారు. అలాంటి బాధ్యత గల పదవులు నిర్వర్తిస్తూ నేరారోపణలో నిజముందో లేదో తెలుసుకోకుండా కళ్ళు మూసుకుని నేరం మోపబడిన వ్యక్తిని ఖైదు చేస్తూ ఎందుకయ్యా న్యాయస్థానాన్ని అవమానిస్తారు?”

మొదటి సారి కాబట్టి మీమీద చర్య తీసుకోవటం లేదు...ఇక మీదటైనా కేసులలో నిజమెంతుందో తెలుసుకుని మీ విధులను నిర్వహించండి...దిస్ కేస్ ఈజ్ డిస్ మిస్సెడ్. కుర్రాడిని విడిచి పెట్టండి ఆర్డర్ వేశారు జడ్జి.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకును క్లిక్ చేయండి:

చిన్నారి చిన్న కోరిక...(కథ)@ కథా కాలక్షేపం-1   

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి