12, డిసెంబర్ 2022, సోమవారం

చీటింగ్ పోలీస్...(పూర్తి నవల)

 

                                                                                          చీటింగ్ పోలీస్                                                                                                                                                                            (పూర్తి నవల)

హైదరాబాద్ కు పదిహేను కిలోమీటర్ల దూరం లో ఉన్న పారిశ్రామిక ఎస్టేట్ లో ఎనిమిదంతస్తుల ఎత్తుతో  ప్రపంచంలోనే అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబడ్డ మందుల తయారీ కంపెనీ "ఫార్మా రెమిడీస్" రంగు రంగు అలంకరణ దీపాల వెలుగులో కొత్త పెళ్ళి కూతురులా నిలబడుంది.

నాణ్యత కలిగిన మందుల కోసం మనదేశం వీదేశాల మీద ఆధారపడవలసిన అవసరం ఉండకూడదని, పలు రాజకీయ నాయకులు, పలు పెట్టుబడిదార్లు ఒకటిగా కలిసి ఆలొచించిన ప్రయత్నమే ఫార్మా రెమిడీస్కంపెనీ.

దీని మూలంగా మనదేశంలో మందుల దిగుమతి పూర్తిగా తగ్గిపోవటమే కాకుండా, మనదేశం నుండి ఇతర దేశాలకు మందులను ఎగుమతి చేసుకునే విధంగా అత్యధిక ఉత్పత్తి కలిగిన పారిశ్రామిక కంపెనీగా ఉండాలని నిర్మించేరు ఫార్మా రెమిడీస్ని.

కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించబడ్డ మందుల కంపెనీ మందుల ఉత్పత్తిలో విప్లవం తీసుకురాబోతోందని ప్రపంచంలోని ఫార్మా పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఇంకో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి చేతులతో ప్రారంభించబడి, మందుల తయారును మొదలపెట్టటానికి రెడీగా ఉన్నది ఫార్మా రెమిడీస్ కంపెనీ. 

'భారతం మా బానిస ' అనే పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ, ఫార్మా కంపెనీ వలన భార్తదేశం అర్ధీకంగా మరింత అభివృద్ది చెందుతుందని ఈర్ష్య తో కంపనీని ప్రారంభమించే ముందే బాంబు దాడితో నేలమట్టం చేయాలని ప్లాన్ వేస్తుంది........... ప్లానును భారతదేశ సెక్యూరిటీ ఎలా ఆపగలిగింది అనేదే నవల సారాంశం.

హైదరాబాద్ కు పదిహేను కిలోమీటర్ల దూరం లో ఉన్న పారిశ్రామిక ఎస్టేట్ లో ఎనిమిదంతస్తుల ఎత్తుతో  ప్రపంచంలోనే అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబడ్డ మందుల తయారీ కంపెనీ "ఫార్మా రెమిడీస్" రంగు రంగు అలంకరణ దీపాల వెలుగులో కొత్త పెళ్ళి కూతురులా నిలబడుంది.

నాణ్యత కలిగిన మందుల కోసం మనదేశం వీదేశాల మీద ఆధారపడవలసిన అవసరం ఉండకూడదని, పలు రాజకీయ నాయకులు, పలు పెట్టుబడిదార్లు ఒకటిగా కలిసి ఆలొచించిన ప్రయత్నమే ఫార్మా రెమిడీస్కంపెనీ.

దీని మూలంగా మనదేశంలో మందుల దిగుమతి పూర్తిగా తగ్గిపోవటమే కాకుండా, మనదేశం నుండి ఇతర దేశాలకు మందులను ఎగుమతి చేసుకునే విధంగా అత్యధిక ఉత్పత్తి కలిగిన పారిశ్రామిక కంపెనీగా ఉండాలని నిర్మించేరు ఫార్మా రెమిడీస్ని.

కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించబడ్డ మందుల కంపెనీ మందుల ఉత్పత్తిలో విప్లవం తీసుకురాబోతోందని ప్రపంచంలోని ఫార్మా పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఇంకో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి చేతులతో ప్రారంభించబడి, మందుల తయారును మొదలపెట్టటానికి రెడీగా ఉన్నది ఫార్మా రెమిడీస్ కంపెనీ

సమయం మధ్యరాత్రి రెండు గంటలు కావడంతో ఎప్పుడూ జన సంచారంతో కుతూహలంగా కనబడే పారిశ్రామిక ఎస్టేట్ ప్రదేశం పూర్తి నిశ్శబ్ధంతో నిద్ర పోతున్నట్టు ఉన్నది.

నిశ్శబ్ధానికి బంగం కలుగకుండా, పిల్లి నడకలాగా ఒక మోటర్ సైకిల్ వచ్చి ఆగింది.

ఫార్మా రెమిడీస్ కంపెనీ గేటు ముందు వైపు నలుగురు సెక్యూరిటీ గార్డులు నిలబడున్నారు. వాళ్ళను ఇస్టపడని  మోటార్ సైకిల్, ఫార్మా రెమిడీస్ కంపెనీ వెనుకభాగం వైపుకు వెళ్ళింది. అక్కడ కూడా నలుగురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. అప్పుడు మోటార్ సైకిల్ ఫార్మా రెమిడీస్ పక్కన ఉన్న పాత రసాయన ఉత్పత్తుల కంపెనీలోకి వెళ్ళి ఒక పక్కగా ఆగింది.  

ప్రమోద్ అనే పేరు కలిగిన అతను ,ఇరవైఏడు సంవత్సరాల వయసులో ఉన్నాడు. సిక్స్ ప్యాక్ శరీరం. కెమికల్ టెక్నాలజీ చదువులో గోల్డ్ మెడల్ పొందినవాడు. కంప్యూటర్ ఆపరేటింగ్ లో ఆరితేరినవాడు. మిడిల్ క్లాస్ ఫ్యామలీకి చెందినవాడు. చాలా మంది లాగానే ఇతను కూడా ఐదు అంకెల జీతం మీద ఆశపడ్డవాడు.

దానికోసం కంపెనీల మెట్లను ఎక్కి దిగిన అలసట అతని కళ్ళల్లో తెలుస్తోంది. ఉద్యోగం లేదనే ఒకే ఒక కారణం కోసం తల్లితండ్రులే అతన్ని వేరు చేసి చూడటంతో...ఎకాకిగా హైదరాబాదుకు మకాం మార్చుకున్నాడు. ఇంతవరకు ఫైలైన ఇంటర్ వ్యూ లను లెక్క కడితే సెంచరీ కొట్టుంటాడు. ఉద్యోగం దొరకలేదుదానివలననో ఏమో  అతనికి  ప్రభుత్వం మీద విరక్తి.

అతనిలోని బలహీనతను ఆసరాగా తీసుకుని  ఒక కంపెనీ, జీతంగా అతిపెద్ద మొత్తం-విదేశాలలొ పని రెండింటినీ ఎరగా పెట్టి వల విసరగా...ఖచ్చితంగా వచ్చి వాళ్ళ వలలో చిక్కుకున్నాడు అతను.

చుట్టుపక్కల చూశాడు. అతను అనుకున్నట్లుగానే రసాయన కంపెనీలోని ఒక వైపు నుండి, ఫార్మా రెమిడీస్ కంపనీలోకి వెళ్ళటానికి ఒక చిన్న మార్గం ఉన్నది.

రసాయన కంపెనీలో నుండి వెలువడ్డ వేస్ట్ ద్రవం, బయటకు వెళ్ళే కాలువాలో నుండి ప్రవహిస్తూ, చెడు వాసనతో వాయువును కక్కుతోంది. అంతకు ముందురాత్రి వర్షం పడిందేమో, అక్కడున్న వర్షపు నీరు కూడా జిడ్డుగా, చెడువాసతో నిండుకోనుంది.

బూట్స్ కు అంటుకున్న మట్టిని తుడుచుకుని, మెల్లగా నడుచుకుంటూ ఫార్మా రెమిడీస్ ప్రహరీ గోడను చేరుకున్నాడు

నవల చదవటానికి క్రింది లింకుపై క్లిక్ చేయండి:

చీటింగ్ పోలీస్...(పూర్తి నవల)@ కథా కాలక్షేపం-2

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి