18, డిసెంబర్ 2022, ఆదివారం

ఎక్కడ నా ప్రాణం...(సీరియల్)...(PART-5)

 

                                                                         ఎక్కడ నా ప్రాణం...(సీరియల్)                                                                                                                                                                  (PART-5)

పొత్తి కడుపులో భయం బంతిలాగా వెగంగా దొర్లింది.

"వద్దు అర్జున్. మనం ఎందుకు చూడాలి? ఆవిడ మందు కొండకు అవతలి వైపుకు గబగబా నడిచి వెళ్ళిపోతారుట. అంత వేగంగా ఎవరి వలన దిగటం కుదరదట. ఆవిడ ఉన్న గుహను ఇంతవరకు ఎవరూ చూడలేదని విన్నాను.

ఎందుకు మనం శ్రమ పడాలి? వెళ్ళే దారిలో ఏదైనా ఆపద వస్తే...?

అంతే కాదు...మనం సీతమ్మను చూడటానికి చేస్తున్న ప్రయత్నం కరెక్టేనా...తప్పా అనేది తెలుసుకోకుండా ఎలా దిగగలం?

అనవసరంగా సమస్యను కొని తెచ్చుకుంటున్నామో?

ఏదైనా దేవుడి ద్రోహం అయిపోతే మనం ఏం చేయాలి? మనం నాన్నను వెతుక్కుంటూ కదా వచ్చాము. పని మాత్రం చేద్దాం అర్జున్ "

దివ్యా యొక్క భయం ఆమె కళ్ళల్లో కనబడింది.

"దైవ ద్రోహం ఏర్పడుతుందేమోనని భయపడుతున్నావో. డాక్టర్ సుధీర్ లాగా మనమేమీ చెడు ఆలొచనతో వెళ్ళటం లేదే?

మనకు ఎటువంటి ఆపద రాదని నా మనసు చెబుతోంది దివ్యా. ఎందుకో తెలుసా...?

వచ్చిన వెంటనే పంచలింగ దర్శనం చేసుకునేటప్పుడు ఒక పెద్ద అద్భుతం మన కళ్ళ ముందు జరిగింది?  

డాక్టర్ సుధీర్ యొక్క ఉద్దేశ్యమే యుక్త వయసు మారకుండా ఉండాలని, చావును వాయిదా వేయటానికి కావలసిన మూలికలు దక్కించుకోవాలనే?

రహస్యం తెలుసినవారు అడవిలో ముగ్గురే ఉన్నారు. గంగయ్య స్వామి, సీతమ్మ, తరువాత ఆవిడ భర్త.

డాక్టర్ సుధీర్ తన గూండాలతో ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు. అతడు దొరికిన ఛాన్స్ ను  వూరికే వదిలి పెడతాడా?

వాళ్ళ దగ్గర తన బలాన్ని చూపించి, తాను అనుకున్నది సాధించటానికి  పూనుకుంటాడు"   

"అయ్యో! అతనివల్ల వీళ్ళ ముగ్గురికీ ఆపద రానుందని చెబుతున్నారా...? అత్యాశపరుడు హత్య చెయడానికి కూడా వెనుకాడడు లాగుందే?"

"భయపడద్దు దివ్యా. డాక్టర్ సుధీర్ ఇలాగే పధకం వేసుంటాడని చెప్పటానికి వచ్చాను. ఆయన అనుకున్నదంతా అలాగే జరిగిపోతే...తరువాత దైవం అనేది ఏదీ లేదే?

నువ్వు చెప్పడం బట్టి చూస్తే, సీతమ్మ ఒక దైవ శక్తి కలిగిన మహిళ అనిపిస్తోంది.

ఆమెకే ఈపాటికి అన్నీ విషయాలూ తెలిసుంటాయి. ఇంకా చెప్పాలంటే తన జ్ఞాణ దృష్టితో డాక్టర్ సుధీర్ యొక్క గూండాల గురించి, మామయ్య గురించి, మనల్ని గురించి ఆమె తెలుసుకోనుంటుంది.

మనసులో ఎటువంటి కల్మషం లేకుండా నిజాయితీగా, మనస్పూర్తిగా సీతమ్మను చూడాలని మనం ఆశపడుతున్నాం...కదా?

అందువలన, ఆమె తానుగానే ముందుకు వచ్చి మనకి దర్శనం ఇస్తారని నా మనసుకు అనిపిస్తోంది. చిన్నగా ఒక ప్రయత్నం చేసి చూద్దామే? మనం ఒక అడుగు వేస్తే...దైవం మనల్ని చూసి పదడుగులు వేస్తుందని పెద్దలు చెబుతారు. ధైర్యంగా ఉండు. అంతా మంచే జరుగుతుంది"

ఇక వాదాడటం ఇష్టంలేక మౌనంగా నడిచింది దివ్యా.

కొండ దిగి క్రింది ప్రాంతానికి వచ్చేవరకూ ఇద్దరి మధ్యా మౌనమే గట్టికి నిలబడింది.

కొండ క్రింద గంగయ్య స్వామి గారి గుడారం కొట్టొచ్చినట్టు కనబడింది. ప్రదేశంలో ఎలాంటి భవనాలు,ఇళ్ళు, గుడారులూ లాంటివి ఏమీ లేవు. జన సంచారమే లేని ప్రాంతం అని చూసిన వెంటనే చెప్పవచ్చు.  ' గంగయ్య మూలిక వైద్యశాల అనే బోర్డు మాత్రం ఎవరికైనా ఇట్టే కనబడుతుంది. అక్కడ చాలా పెద్ద గుడారం. గుడారంలోకి వెళ్ళబోయే ముందు గుడారం వాకిట్లో ఉన్న అరుగు మీద కావి రంగు దుస్తులు వేసుకున్న ఒక వ్యక్తి కూర్చుని చాలా శ్రద్దగా రోకలి బండలో ఏవో అకులు, చెక్కలూ వేస్తూ రుబ్బుతున్నాడు.

"నమస్తే నండి. మేము విజయవాడ నుండి గంగయ్య స్వామి గారిని చూడాలని వచ్చాము. గురువుగారు ఉన్నారా?" --- అర్జున్ భవ్యంగా అడిగాడు. 

ఇద్దరినీ ఒకసారి ఎగాదిగా పైకి కిందకూ చూసిన వ్యక్తి " మధ్య కాలంలో  చాలా మంది గురువుగారిని వెతుక్కుంటూ వస్తున్నారు. అందరినీ చూడటానికి ఆయన ఇష్టపడరే?

మీరు విషయంగా ఆయన్ని చూడటానికి వచ్చారు. గురువుగారు ఇస్టపడి మిమ్మలని కలుస్తానని చెబితేనే, మిమ్మల్ని నేను లోనికి పంపిస్తాను..."

"నేను డాక్టర్ విఠల్ రావ్ గారి ఒకే కూతుర్ని. ఈయన నా కాబోయే భర్త. మా నాన్నను..."

దివ్యా చెప్పి ముగించేలోపు, లోపల నుండి ఒక గొంతు వినబడింది.

"పురుషోత్తమా! వాళ్ళను లోపలకు పంపు"

"దివ్యా! వంగి రా...తల తగులుతుంది" అన్న అర్జున్ వెనుకే వెళ్ళింది.

సంకోచంతొనే లోపలకు వెళ్ళారు ఇద్దరూ.

ఆశ్రమం గది చాలా పెద్దదిగానే ఉంది. గది మధ్యలో పులి తోలు మీద కూర్చున్న ఆయన మీదే వీళ్ల చూపు పడింది.

నుదుటి మీద పూర్తిగా విబూది రాసుకుని మధ్యలో కుంకుమ బొట్టుతో ఒక ఋషి లాగా దర్శనమిచ్చారు గంగయ్య స్వామి గారు. నడుముకు వెలిసిపోయిన కావి రంగు పంచ, భుజాల మీద చిన్న తుండు ఉంది.

అక్కడున్న రాతి రుబ్బురోలులో ఏవో విత్తనాలు, విబూది పోసి పొడి లాగా దంచుతున్నారు.

సుమారుగా తండ్రి విఠల్ రావ్ వయసు ఉంటుంది గంగయ్య స్వామి గారికి. ఆయనను చూసిన వెంటనే తండ్రినే చూసినట్లు అనిపించటంతో కన్నీళ్ళు పెట్టుకుంది దివ్యా.

ఆమె నోరు తెరవకు ముందే, "ఏవమ్మా దివ్యా! తండ్రి కనిపించకుండా పోయారని, ఆయన్ను వెతుక్కుంటూ అడవి దాకా వచ్చేశావా?" అని గంగయ్య స్వామి గారు తల ఎత్తకుండానే అడిగారు. గంగయ్య స్వామి గారు ప్రశ్న అడిగేటప్పటికి ఒక్క క్షణం ఆశ్చర్యపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది దివ్యా.  

                                     **********************************

భుజాలకు తగిలించుకున్న బరువైన సంచిని క్రింద పడేసి, పరిగెత్తుకుని గంగయ్య స్వామి గారి ఎదురుగా వెళ్ళి మోకాళ్ళపై కూర్చుంది దివ్యా.

"స్వామీ...నేను మిమ్మల్నే నమ్ముకుని వచ్చాను. నాన్నగారు కనిపించకుండా పోయారు. ఆయనకు ఏమైందో తెలియటం లేదు. మిమ్మల్ని చూస్తే, నా కష్టాలకు ఒక జవాబు దొరుకుతుందని నమ్మి ఇక్కడకొచ్చాము"

"నమ్ము నమ్ముకుని మందు కొండకు వచ్చారా? శివ...శివా! మందు కొండపైనున్న శివుడ్ని నమ్మండి. ఆయన్ను దర్శనం చేసుకుని, నీ కష్టాలు చెప్పుకున్నావు కదా...ఇక ఆయన చూసుకుంటారు"

శాంతంగా ఉన్న ఆయన చూపలను చూసి మరోసారి ఆశ్చర్యపోయింది.

"మేము ఏమీ చెప్పకుండానే మా గురించి అన్ని విషయాలూ మీరే క్లియర్ గా చెప్పారు. మీరు సాధారణ మూలిక వైద్యులు కాదు. దానికీ పైన...అన్ని తెలిసిన జ్ఞాని, ఒక రుషి. చెప్పండి స్వామి. మా నాన్న జాగ్రత్తగా తిరిగి దొరుకుతారా...ఆయన ఎప్పుడు వస్తారు?"

గబుక్కున చేయెత్తి నవ్వుతూ 'ఆపు అన్న సంకేతం చూపించారు.

"అన్నీ తెలిసిన జ్ఞానినా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడకమ్మా. 'నేను ఎవరు?' అనేది నేనే ఇంకా తెలుసుకోలేకపోతున్నాను. దాని కొసం నేను చేస్తున్న వెతుకులాట కొనసాగుతూనే ఉన్నది. దానికే ఇంకా నాకు ఒక జవాబు దొరకలేదు!  నువ్వు అడిగే ప్రశ్నలకు నేను ఎలా సమాధానం చెప్పగలను? చెప్పలేను. చెప్పకూడదు.

అడవికే వచ్చావుకదా? పోను పోను నువ్వే అన్నీ అర్ధం చేసుకుంటావు. నీ అన్ని ప్రశ్నలకూ జవాబు తానుగా దొరుకుతుంది"

"సూక్ష్మంగా మీరు మట్లాడేది, నాకు అర్ధం కాలేదు. అయినా కానీ మిమ్మల్ని చుసిన వెంటనే మా నాన్ననే చూసినట్లు నాకు ఒక అనుభూతి, ఆనందం కలిగింది. మనసు ప్రశాంతంగా ఉన్నది. ఇక అన్నీ భగవంతుడే చూసుకుంటాడని కూడా చెప్పారు. నాకు అది చాలు"

ఇప్పుడు అర్జున్ మాట్లాడాడు.

"స్వామీ! మామయ్యను వెతకాలనే వేగంతో బయలుదేరి వచ్చాశాము. 'నాన్నను చూడకుండా అడవిని వదిలి వెళ్ళను అంటూ దివ్యా మొండికేస్తోంది.

ఎక్కడ స్టే చేయాలో తెలియటం లేదు. మాకు మిమ్మల్ని తప్ప ఇంకెవర్నీ తెలియదు. పెద్ద మనసు చేసి మీరే సహాయపడాలి. దివ్యా స్టే చేయడానికి కాస్త చోటు దొరికితే చాలు.  నేను చెట్టు క్రిందైనా ఉంటాను"  

"ఎప్పుడూ  రాత్రి పూట పచ్చని చెట్ల క్రింద పడుకోకూడదు. విదేశాలకు వెళ్ళి మెడిసన్ లో పెద్ద చదువు చదివి వచ్చావు నువ్వు. ఇది కూడా నీకు తెలియదా అర్జున్?"

'బయట చూసే వారికి మాత్రమే ఈయన ఒక మూలిక వైద్యుడు. నిజానికి ఈయన ఒక ఆరొగ్య శాస్త్రవేత్త

అర్జున్ మనసులో అంచెలంచెలుగా ఆలొచనలు పరిగెత్తాయి. గంగయ్య స్వామి గారి మీద ఎనలేని మర్యాద పెరిగింది.

"లేదు అర్జున్. నేను సాధారణ మూలిక వైద్యుడ్నే"

అర్జున్ ఒక్క క్షణం స్థానువులా నిలబడ్డాడు.

కానీ వెంటనే తేరుకున్నాడు.

"స్వామీ! నేను మనసులో అనుకున్నది....మీరు తెలుసుకుని కరెక్ట్ గా సమాధానం చెబుతున్నారు? ఇది ఎవరికి సాధ్యం? మీరు ఒక రుషి. సందేహమే లేదు"

ఇద్దర్నీ మార్చి మార్చి చూసిన దివ్యా "నాకు వొళ్ళంతా పులకరిస్తోంది. ఇదొక వింత అనుభవం" అన్నది.

అర్జున్ ఆశ్చర్యంతో చూశాడు.

"దీనికే పులకరించిపోతే ఎలా? ఇంకా బోలెడు సంఘటనలు చూడబోతావే? సరే...అంతా దైవ లీలలు దివ్యా! నువ్వు ఇక్కడ మాతోనే పడుకోవచ్చు"  

"దివ్యా...అదిగో అలా కుడి చేతివైపు ఒక చెక్క అడ్డుంది చూడు. దాని పక్కన పడుకో"

"స్వామీ...చాలా ధ్యాంక్స్ అండి. సహాయాన్ని ఎన్నటికీ మర్చిపోము"  గంగయ్య స్వామి గారికి చేతులెత్తి దన్నం పెట్టాడు అర్జున్.

" పురుషోత్తమా...వీళ్ళు పాపం. ఎప్పుడు తిన్నారో ఏమో. వీళ్ళు తినడానికి ఏదైనా చేసి తీసుకురా"

తన శిష్యుడి దగ్గర చెప్పారు గంగయ్య స్వామి.

నిజంగానే ఇద్దరికీ విపరీతంగా ఆకలి వేస్తోంది. అడవి ప్రాంతంలో దొరికిన పండ్లు, కాయలు దేవామృతంగా తియ్యగా ఉన్నాయి. చాలా దూరం ఎచ్చుతగ్గులుగా ఉన్న కొండ దోవలలో ఎక్కీ దిగిన అలసట మరో పక్క.

విశ్రాంతి లేకుండా చాలా దూరం నడిచినందు వలన, కాళ్ళు రెండూ సూదులు గుచ్చినట్లు నొప్పి బాధపెడుతోంది.

వెలుతురు సెలవు తీసుకుని వెళ్ళటంతో చీకటి వేగంగా అలుముకుంది.

చిన్న వెలుతురులో గంగయ్య స్వామి గారు, పురుషోత్తం కలిసి మూలికలను పొడి చేసి, పిండి చేసి మందు తయారుచేస్తున్నారు.

అర్జున్ వాళ్ళ ఎదురుకుండా కూర్చుని తన ఒడిలో ఒక మెడికల్ పుస్తకం పెట్టుకుని తిరగేస్తూ, అప్పుడప్పుడు వాళ్ళిద్దర్నీ చూస్తున్నాడు.

చెక్క పక్కన తనకోసం ఇవ్వబడిన చోటుకు వెళ్ళి అక్కడ తన సంచీ క్రింద పెట్టింది దివ్యా.

మూలలో ఏవో మూటలు...కొన్ని ఆకులతోనూ, కొన్ని మూలికలతోనూ, కొన్ని చెక్కలతోనూ నిండి ఉన్నాయి.

దానికి దగ్గరగా గడ్డి పరకలు లాగా ఏవో పరకలు కట్టబడి వరుసక్రమంలో ఉంచబడున్నాయి.

పక్కనున్న చిన్న ద్వారంలో నుండి బయటకు చూసింది దివ్యా.

బలంగా గాలి వీస్తూ ఉండటంతో చెట్లు అటూ ఇటూ ఉగుతున్నాయి.

మినుగురు పురుగులు గుంపుగా ఎగురుతున్నాయి. ఒక చెట్టు క్రింద నిలబడున్న ఒక నల్లటి ఆకారం గుడారంలోని చిన్న  ద్వారాన్నే క్రూరంగా చూస్తున్నది.

                                                                                                       Continued...PART-6

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి