ఎక్కడ నా ప్రాణం...(సీరియల్) (PART-9)
మధ్యగా చెయ్యి చాపి అడ్డుకున్నాడు పురుషోత్తం.
"ఎక్కడకమ్మా వెడుతున్నావు? అర్జున్ ని వెతుక్కుంటూ తిరుగుతారా? వయసు ఆడపిల్లను తనతో పాటు తీసుకు వెళ్ళటం మంచిది కాదని అనుకునే ఆయన మిమ్మల్ని ఇక్కడే వదిలి వెళ్ళారు? ఆశ్రమంలో మీరు బద్రంగా ఉంటారని నమ్మి, మధ్యరాత్రి లేచి వెళ్ళారు. ఆయన ఎలాగైనా తిరిగి వస్తారనే నమ్మకంతో వోపికగా వేచి ఉండండి"
"నా మనసంతా దఢగా ఉన్నదే? ఎలా సహజంగా ఉండగలను?"
"అందుకోసం....? దిక్కు తెలియని అడవిలో ఎక్కడకెళ్ళి వెతుకుతారు? గంగయ్య స్వామి గారు ఏ సమయంలోనైనా తిరిగి వచ్చేస్తారు. ఆయన వచ్చిన వెంటనే మీరెక్కడ అని అడిగితే...నేను ఏం సమాధానం చెప్పను? వయసు పిల్లను అడవిలోకి పంపటానికి నువ్వు ఎలా అనుమతించావు? అని అడిగి నాపై కోపగించుకుంటారు"
"మా నాన్నగారు గురించి ఎటువంటి వివరమూ తెలియలేదు. నాకోసం అడవికి వచ్చిన అర్జున్ నూ కనబడకుండా పోయారే? నేను ఒక్కదాన్నీ ఇక్కడ బద్రంగా ఉండి ఏమి సాధించబోతాను?
బొంగురుపోయిన కఠంతో చెప్పిన దివ్యా, ఏడుపును ఎంత అనుచుకోవాలనుకున్నా అనుచుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది.
"గంగయ్య స్వామి అయ్యగారికి మీమీద ఒక గౌరవం. ఇంతవరకు ఆయన ఎవర్నీ తన ఆశ్రమంలో ఉండటానికి అంగీకరించలేదు. ఈ ఆశ్రమానికని ఒక పవిత్రత ఉంది. అడ్డమైన వాళ్ళకు అనుమతిస్తే...ఈ ఆశ్రమం పవిత్రత చెడిపోతుందని ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తారు. మిమ్మల్ని అనుమతించారంటే దానికి ఏదో ముఖ్య కారణం ఉంటుంది.
కల్లాకపటము లేకుండా నిజాయితీగా - భక్తిగా బగవంతుని అనుగ్రహానికి నోచుకున్నవారంటే అయ్యగారికి చాలా ఇష్టం. అలాంటివారిని ఎక్కువగా ఏడిపించి ఆయన వేడుక చూడరు. కొంచం ఓర్పుగా ఉండండి. ఆయన వచ్చేస్తే మీ సమస్యలన్నింటికీ ఒక ముగింపు దొరుకుతుంది. బాధపడకండి. దయచేసి మీ మనసు పాడుచేసుకోకండి. లోపలకు వెళ్ళండమ్మా"
సానుభూతిగా మాట్లాడిన పురుషోత్తం ను ఒకసారి తలెత్తి చూసిన దివ్యా, చీర కొంగుతో కళ్ళు తుడుచుకుని ఆశ్రమంలోకి వెళ్ళి తనకని కేటాయించిన చోటులో కూర్చుంది.
దివ్యా మనసు కళ్లకు అర్జున్ నవ్వు మొహంతో వచ్చి వచ్చి వెడుతున్నాడు.
శరీరంలో ఉన్న ప్రాణం బయటకు వెళ్ళినట్లు, హృదయం బండబారి పోయినట్లు ఉన్నది.
'అర్జున్! నా గతి చూశారా? నాన్న కనబడటంలేదు. వెతకటానికని వచ్చిన చోట మిమ్మల్నీ పోగొట్టుకుని ఎవరూ లేని అనాధలాగా-నిర్గతి గా నిలబడున్నానే?'
నాకోసం...మీ ఇంట్లో అబద్దం చెప్పి నాతో వచ్చారే? నన్ను ఇక్కడ బద్రంగా వదిలేసి, ఆపదను వెతుక్కుంటూ వెళ్ళేరే? మీది ఎలాంటి త్యాగ గుణం?
నిప్పులాంటి వేడిలో చిక్కుకున్న పురుగులాగా తల్లడిల్లిపోతున్నాను.
మీ గురించి ఏదైన చెడువార్త వస్తుందేమోనని భయంగా ఉన్నది. అది విని నేను ప్రాణాలతో ఉండను. ఇదే అడవిలో నా ప్రాణాన్ని వదిలేస్తాను.
నాన్ననూ, మిమ్మల్నీ పోగొట్టుకుని నేనెందుకు జీవించాలి? భగవంతుడా...ఏ అమ్మాయికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు.
మోకాళ్ళపై చేతులు పెట్టుకుని, ఆ చేతులపై తల పెట్టుకుని మౌనంగా కన్నీళ్ళు కారుస్తూ కూర్చుంది.
అప్పుడప్పుడు గుడార రంద్రంలో నుండి చూస్తూ అన్వేషణ చేస్తోంది.
ఆమె తినడానికి అడవి నుండి తెచ్చిన పండ్లను ఒక బుట్టలో ఉంచి తీసుకు వచ్చి ఆమె పక్కన ఉంచిన మట్టి మంచి నీటి కూజాకు పక్కగా పెట్టి, బయటకు వెళ్ళి నిలబడ్డాడు పురుషోత్తం.
'ప్రేమికుడ్ని వెతుక్కుంటూ అడవిలోకి దివ్యా వెళ్ళిపోతే... గంగయ్య స్వామి గారికి ఏం సమాధానం చెప్పాలి?' అనే భయంతో అటుపక్కకో, ఇటుపక్కకో జరగకుండా వాకిట్లో నందిలాగా కూర్చుండిపోయాడు పురుషోత్తం.
దాన్ని దివ్యా బాగా అర్ధం చేసుకుంది.
ఎంతసేపు ఏడ్చిందో? ఆమెకే తెలియలేదు.
ఏడ్చి ఏడ్చి మనసూ, శరీరమూ అలసిపోయి అలాగే ఒరిగి ముడుచుకుని పడుకున్నది---మైమరచి నిద్ర పోయింది.
కొన్ని గంటల తరువాత గబుక్కున లేచింది.
సన్నని వెలుతురు మాత్రం మిగిలి ఉండటాన్ని చూసిన వెంటనే గడియారాన్ని పరిశీలించింది.
'రాత్రి పదకొండు గంటలయ్యిందా?'
‘ఇంతసేపు నేనెలా నిద్ర పోయాను?'
‘మనసులో చిన్న కష్టం ఏర్పడినా, రాత్రంతా నిద్ర పట్టక మెలుకువతోనే ఉంటానే?’
నాన్నని, అర్జున్ ను పోగొట్టుకుని కష్టపడుతున్నాను. ఇంత పెద్ద అవస్త, బండరాయిలాగా మనసును నొక్కుతుంటే - నేను ఎలా ఇలా ఆదమరచి నిద్రపోగలిగాను?
కళ్ళళ్ళో ఇంకా నిద్ర మత్తు మిగిలుందే?
గాఢ నిద్ర ఎలా సాధ్యం?'
ఎడం చేత్తో కళ్ళను నలుపుకుని తనున్న చోటు నుంచి లేచి మెల్లగా బయటకు వచ్చింది.
'ధ్యానం' చేసే చోటుకు దగ్గరగా వచ్చి నిలబడ్డది.
అక్కడ ఒక చిన్న శివలింగం, దానికి దగ్గరగా చిన్న అమ్మవారు విగ్రహం కనబడినై.
అడవి పువ్వులు జల్లబడి ఉన్నాయి. వాటికి ఎదురుగా, వెడల్పాటి హోమ గుండం లో నుంచి ఏదో పోగ పైకి లేచి సువాసనను వెదజల్లుతున్నది.
ఆ సువాసన వ్యత్యాసంగా ఉండటం గ్రహించింది దివ్యా.
'ఓ...ఇప్పుడే నాకు అర్ధమవుతోంది. ఎప్పుడూ సదా ఏడుస్తున్న నన్ను ఎలా ఓదార్చాలో తెలియక అవస్తపడుతున్న పురుషోత్తం, ఈ పొగను వేసుంటారు.
గుడారంలోని అడ్డుగోడను దాటి ఆ పొగ యొక్క సువాసన వ్యాపించింది. నేను ఏదో పూజ కోసం సాంబ్రాణి పోగ వేసేరని కదా అనుకున్నాను?
ఇది ఏదో మూలిక వాసనే. ఈ పొగే నన్ను ఆదమరచి నిద్ర పోయేట్టట్టు చేసిందో?
ఎప్పుడూ పడుకునే చోట పురుషోత్తం గారు లేరేంటి?
ఆశ్రమం తలుపులు మూయబడి ఉన్నాయి. తెరిచి చూద్దాం'
మామూలుగా దగ్గరకు వేసున్న తలుపును మెల్లగా తెరిచింది.
బయట అరుగు మీద తెల్లని దుప్పటితో తల నుండి కాలు వరకు కప్పుకుని , చలికి ముడుచుకుని పడుకోనున్నాడు పురుషోత్తం.
బయటకు వచ్చి తలుపును లాగి మెల్లగా మూసేసి, గట్టిగా తన చూపుడు వేలుతో తలుపు మీద తట్టింది.
గొంతు సవరించుకుని మెల్లగా దగ్గింది.
ఊహు...అతనిలో కొంచం కూడా కదలిక లేదు.
'నన్ను క్షమించండి పురుషోత్తం. మీ మాటను కాదని నేను వెడుతున్నాను. ఏం జరిగిందో...ఏమైందో? అనే భయంతో క్షణం క్షణం భయపడి చావటం కంటే, ఆపదను వెతుక్కుంటూ ఆడవిలోకి వెళ్లటం మేలు అనే నిర్ణాయినికి నేను వచ్చాసాను’
మనసులో గొణుక్కుంటూ శబ్ధం రాకుండా నడిచింది.
పదడుగుల దూరం వరకు తిరిగి తిరిగి చూసుకుంటూ నడిచిన దివ్యా తడబడి ఆగింది.
చుట్టూ ఒకసారి చూసింది. పౌర్ణమి చంద్రుడు, పాలలాంటి చిక్కటి తెల్లటి కాంతితో ఉన్నది.
దూరంగా మేఘాలు ఒకటికి ఒకటి ఢీకుని ఉరుమినై.
దిక్కు తెలియని అడవిలో...ఏ దిశలో పయనించాలో అనేది తెలియటం లేదే?
కళ్ళు పెద్దవిగా చేసుకుని వెవ్వేఱు కాలిబాటలను క్షుణ్ణంగా గమనించింది.
'ఇదిగో...ఈ బాట ద్వారానే పయనించే ఆ రోజు పంచ లింగ దర్శనం చేసుకుని తిరిగి వచ్చాము?'
'అర్జున్ బహుశ ఈ బాట ద్వారానే వెళ్ళుంటారు...'
మనసులో యూహించుకున్నట్టు ఆ కొండ బాటలోనే తడబడుతూ ఎక్కి నడవటం మొదలుపెట్టింది.
ముళ్ళ పొదలు అప్పుడప్పు ఆమె చీరను చింపుతూ చీర నాణ్యతను పరీక్షిస్తున్నాయి.
రాళ్ళూ, రప్పలూ ఆమెను అక్కడక్కడ తోస్తూ జారేటట్టు చేస్తున్నాయి.
ఒక చోట తడబడుతూ జారి క్రింద పడింది....మోకాళ్ళ దగ్గర గీరుకుపోయింది.
చురుక్కు చురుక్కు మంటూ నొప్పి పుట్టటంతో---చీరను కొంచంగా పైకెత్తి గీరుకున్న చోటును చూసుకుంది. నెత్తురు కారుతోంది.
నడిచే ఓపిక లేక అక్కడే కూర్చుండిపోయింది.
Continued...PART-10
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి