18, డిసెంబర్ 2022, ఆదివారం

చైనాను వదలనంటున్నకరోనా...(సమాచారం)


                                                                         చైనాను వదలనంటున్నకరోనా                                                                                                                                                           (సమాచారం) 

చైనాలో కరోనా వ్యాప్తి విలయతాండవం చేస్తోంది. కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రజలు వైరస్ బారినపడుతున్నారు. ఈ క్రమంలో మళ్లీ లాక్‌డౌన్‌లను విధిస్తోంది చైనా ప్రభుత్వం.

చైనాలో జీరో-కోవిడ్ విధానం కోసం అక్కడి ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. కరోనా ఉన్న ప్రతి పట్టణంలోనూ కఠినమైన లాక్‌డౌన్ విధిస్తున్నారు. ఐనప్పటికీ కోవిడ్ అదుపులోకి రావడం లేదు. పైగా కొత్త కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.

ప్రస్తుతం మనదేశంలో కరోనా వైరస్ ప్రభావం లేదు. కోవిడ్ వ్యాప్తి పూర్తిగా తగ్గిపోయింది. మళ్లీ 2020కి ముందున్న సాధారణ పరిస్థితులే ఇక్కడ ఉన్నాయి. కానీ కరోనావైరస్ పుట్టినట్లుగా చెబుతున్న చైనాలో మాత్రం ఇంకా కరోనా కల్లోలం కొనసాగుతోంది

చైనాలో ఒకేరోజు 31,454 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రపంచంలో కరోనా-19 వెలుగు చూసినప్పటి నుంచీ ఈ స్థాయిలో కొత్త కేసులు రావడం ఇదే తొలిసారి. పెరుగుతున్న కేసులను చూసి చైనా ప్రభుత్వం కలరవపడుతోంది.

ప్రస్తుతం బీజింగ్, షాంఘై, గువాన్జౌ, చాంగ్‌కింగ్ నగరాల్లో కేసులు సంఖ్య ఎక్కువగా ఉంది. అక్కడ కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆంక్షలతో చైనా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర వస్తువులను కూడా కొనుగోలు చేయడం ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు.

కరోనా పుట్టిల్లు చైనా అనే సంగతి తెలిసిందే. అయితే ప్రపంచమంతటా కరోనా ప్రభావం తగ్గినా...పుట్టింటిపై కరోనాకు ఇంకా మమకారం పోనట్టుంది. అందుకే ఇంకా చైనాను కరోనా వేధిస్తూనే ఉంది. ఇంకా చైనాలో కొవిడ్ లాక్ డౌన్లు కొనసాగుతూనే ఉన్నాయి. చైనాలోని చెంగ్డూ నగరంలో కరోనా కేసులు పెరగడంతో ఇప్పుడు మళ్లీ లాక్ డౌన్ విధించారు. చెంగ్డూ నగరంలోని 2 కోట్ల 10 లక్షల మంది జనాభా ఉన్నారు. వారంతా ఇళ్లలోనే ఉండాలని తాజాగా చైనా అధికారులు ఆదేశించారు

నగరంలో నిత్యావసర దుకాణాలు మినహా మిగిలిన షాపింగ్  మాళ్లు, దుకాణాలు మూతపడ్డాయి. ఎవరైనా చెంగ్డూ నగరం నుంచి బయటకు వెళ్లాలంటే తగిన కారణాలు చూపించాలి. రెస్టారెంట్లలో పార్సిల్ సర్వీసులను మాత్రమే అనుమతిస్తున్నారు. నిత్యావసరాలు కొనేందుకు కుటుంబంలో ఒకరిని మాత్రమే అనుమతి ఉంది. వారు కూడా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ చూపించాల్సిందే. ప్రస్తుతం చెంగ్డూ నగరంలో వెయ్యి కేసులు నమోదయ్యాయి. ఎలాంటి మరణాలు నమోదు కాకపోయినా చైనా అధికారులు మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

చివరికి, జీరో కోవిడ్ చాలా వరకు వ్యర్థమని నిరూపించబడింది. జీరో- కోవిడ్ విధానాల యొక్క నిలకడలేని సామాజిక మరియు ఆర్థిక వ్యయాల కారణంగా చివరి డొమినో చైనా త్వరలో పతనమవుతుంది. వైరస్ ఇతర చోట్ల చేసినట్లుగా చైనాలో వ్యాపిస్తుంది, దాని నేపథ్యంలో వ్యాధి, మరణం మరియు జనాభాలో చేదు విభేదాల ట్రేడ్మార్క్ను వదిలివేస్తుంది.

Images Credit: To those who took the original photos.

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి