29, డిసెంబర్ 2022, గురువారం

ఎక్కడ నా ప్రాణం...(సీరియల్)...(PART-10)

 

                                                                          ఎక్కడ నా ప్రాణం...(సీరియల్)                                                                                                                                                                 (PART-10)

బలమైన గాలి వీసినందువలన...అడవి చెట్లు దయ్యాలు లాగా ఊగినై. గాలిలో మట్టి వాసన, మూలికల సువాసన కలిసి వచ్చి ముక్కుపుటలను అదరగొడుతున్నాయి.

'అయ్యో....వర్షం కూడా వచ్చేటట్టూందే? ఎలా బాటలో ఎక్కి వెళ్ళబోతానో? దారిలోని కొన్ని ప్రాంతాలలో నడుము ఎత్తుకు కాలు ఎత్తి పెట్టి ఎక్కాలి? అర్జున్ తో వచ్చినందువలన...ఆరోజు ఆయన చేతిని పిడిలాగా పుచ్చుకుని ఎక్కి వెళ్ళిపోయాను.

కానీ ఈరోజు...?

అర్జున్ ఎక్కడికి వెళ్ళిపోయావు?

'చూసి జాగ్రత్తగా కాలు మోపు దివ్యాలేకపోతే కాలు జారుతుంది' అంటూ ఎంతో ప్రేమతో-- క్షణానికి ఒకసారి చెప్పేరే? మధ్యరాత్రి మధ్య అడవిలో ఎలా క్రింద పడిపోయున్నానో చూశారా?

నాన్నా!

వయసులో ఉన్న ఆడపిల్లను ఇంట్లో ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళడానికి మనసు రావటం లేదమ్మా...పక్కింటి బామ్మ గారిని తోడుగా పడుకోమని చెప్పమ్మా...జాగ్రత్తగా ఉండమ్మా' - అంటూ మాటి మాటికీ చెప్పేవారుగా నాన్నా?

మిమ్మల్నీ పోగొట్టుకుని....నాకు జీవితం ఇస్తానన్న ఆయన్నీ పోగొట్టుకున్నాను....మధ్యరాత్రి ఆదరణ లేకుండా ఎలా కష్టపడుతున్నానో చూడండి నాన్నా.

నేను ఎవరికి---ఏం కీడు చేశాను? నాకే ఎందుకని గతి ఏర్పడింది?

దీనికి రోజు ఒక ముగింపు కావాలి. బ్రతుకా...చావా? అని తేల్చుకోవలసిందే!

పంచలింగ దర్శనం చేసుకునేటప్పుడు, దేవుని తల మీద నుండి పువ్వు జారి పడిందే?

అంతపెద్ద గంటలో నుండి అదృశ్య శక్తితో గంటమోత గట్టిగా వినబడిందే?

ఇవన్నీ...మంచి, అరుదైన శకునాలు కదా?

గంగయ్య స్వామి గారి ఆశీర్వాదమూ, దయ, అభిమానం దొరికిందే?

ఇదంతా జరిగిన తరువాత నాకు ఎందుకు గతి ఏర్పడింది?

సరే.....సొంత పశ్చాత్తాపం వలన ప్రయోజనం లేదు.

కింద పెదవిని నొక్కి పెట్టుకుని, వచ్చే ఏడుపును ఆపుకుంటూ మెల్లగా లేచి కుంటుకుంటూ అడుగులు వేసింది.

వేగంగా వీస్తున్న గాలితో చినుకులు మొదలై పెద్ద వర్షం మొదలయ్యింది.

చెవులు చిల్లి పడేలాగా పిడుగు శబ్ధం...

ఆకాశాన్ని గీరుతున్నట్టు మెరుపు ఒకటి మెరిసి కనుమరుగు అయ్యింది.

'అబ్బబ్బా! ఎంత వెలుతురు?'

ఎక్కడో నక్క ఒకటి దీనంగా ఏడుస్తున్న శబ్ధం వినబడగానే, దివ్యాకి సప్త నాడులు విరిగిపోయినై.

సగం చీకట్లో బాటకు ఇరుపక్కలా ఉన్న చెట్ల వేర్లు, చూడటానికి కొండచిలువ పాములాగా కనబడటంతో భయం పుట్టించింది.

కొండ బాటలో రాళ్ళూ, రప్పలూ మనిషిని తోసేయడానికి కంకణం కట్టుకోనుంటాయి.

వర్షం బాగా కురవడంతో,   అడవి బాటలోని మట్టి, వర్షం నీటితో కలిసి బురదగా మారడంతో కాలు తీసి కాలు వేయటానికి శ్రమ పడాల్సి వస్తూ ఉండటంతో ఇక చాలు చాలు అనిపిస్తోంది.

మళ్ళీ నక్క ఏడుపు శబ్ధం వినబడటంతో, వర్షంలో తడిసిన పావురంలాగా  వణికిపోయింది.

అడవి మృగాలు తిరిగే అడవి ప్రాంతమే ఇది? నక్కకో, వేరే ఏదైన ఒక కృరమృగానికో అర్జున్ ఆహారమైపోయేరో?

నాకే తెలియకుండానే నేనెందుకు వణికిపోతున్నాను? అలా ఏదైనా జరిగుంటే....అదే కృరమృగాలు నన్నూ వాటికి ఆహారంగా తీసుకోనీ.

విరక్తితో నడకను కొనసాగించింది.

'పౌర్ణమి రోజు పంచలింగ దర్శనానికి సీతమ్మగారు వస్తారా?

అమ్మను చూడటనికి మునులు, రుషులూ వస్తారని చెప్పటం విన్నామే?

అలాగైతే....కొండ శిఖరంపైకి వెలితే మిగితావాళ్లను చూడొచ్చా?

భక్తులు దారిలో వెళ్ళుంటారు?

'టక్కు మని అర్జున్ నిన్న మధ్యాహ్నం చెప్పింది గుర్తుకు వచ్చింది.  

'పురుషోత్తం ఒక విషయం చెప్పారు దివ్యా! మబ్బుగా ఉన్నది. వర్షం వచ్చేలాగుంది. వర్షం వచ్చే సమయంలో, జనం మందుల కొండ వైపుకే రారు. సారి పౌర్ణమి దర్శనానికి బక్తులు వచ్చేది సందేహమే'

అదొక తెరిచే ఉన్న గుడి. దానికి తోడు కొండను ఎక్కటానికి చాలా శ్రమ పడాలి. అందుకని అందరూ అక్కడికి రావటానికి భయపడతారు.

డాక్టర్ సుధీర్ గారి గూండా మనుషులు కూడా తిరుగుతున్నారు. టీ.వీ ప్రోగ్రాంలో హంగామా చేస్తూ వార్తలు వచ్చినై కనుక, సీతమ్మగారు ఇకమీదట బహిరంగంగా పౌర్ణమి రోజు రారని నాకు అనిపిస్తోంది.

అందుకనే ఆవిడ ఉన్న చోటును మనమే వెతుక్కుంటూ వెళ్ళి...'

అప్పుడు దివ్యా హడావిడిగా అడ్డుపడింది.

'ఏమిటి అర్జున్? చిన్న పిల్లోడిలాగా చెప్పిందే చెబుతున్నావు. రాత్రే కదా మనం ఆపద నుండి బయటపడి వచ్చాము. కొంచం నిదానంగా, ఓపికగా ఉండండి. గంగయ్య స్వామిజీ వచ్చిన తరువాత, ఆయన్నే అడుగుదాం. ఆయన ఏం చెబుతారో...దాన్ని బట్టి నడుచుకుందాం. అదే మనకు మంచిది. సరేనా...?'

మాటవరసకి తల ఆడించాడు! దాని తరువాత ఆమెతో ఏమీ మాట్లాడకుండా తీవ్ర ఆలొచనలతో మునిగిపోయున్నది తలచుకుంటూ - పెద్ద పెద్ద బండ రాళ్ళను శ్రమ పడుతూ జాగ్రత్తగా ఎక్కి నడుస్తోంది.

గలగలమని పెద్ద శబ్ధంతో చెట్ల కొమ్మలు ఏదో ఒక చెట్టు నుండి పడటాన్ని గమనించి అధిరిపడి నిలబడింది.

కాసేపు నిదానంగా ఉండి - మళ్ళీ పది నిమిషాల తరువాత ఏక్కి వెళుతూ - పది నిమిషాలు కష్టపడి నడిచిన తరువాత మామూలు బాట వచ్చింది.

ఇంకా కొంచం దూరం నడిచి వెళ్ళిన తరువాత, మళ్ళీ ఎత్తు బాట వస్తుంది. దాంట్లో పయనించి వెడితే మందుల కొండ లోని పంచలింగ బహిరంగ ఆలయమును చేరిపోవచ్చు.

మనసులో కొంచం ప్రశాంతత ఏర్పడటం నిజం.

మామూలు బాట అయినా, దట్టమైన చెట్ల వలన బాట అంతా ఎండిపోయి రాలిపోయిన చెట్ల ఆకులతో, విరిగిన కొమ్మలతో ఎచ్చు తగ్గులుగానే ఉన్నది.

వర్షం యొక్క వేగం కొంచం తగ్గింది.

ఎక్కువగా చెట్లు ఉండటంతో వెన్నల వెలుతురు భూమి మీద పడటంలేదు. కళ్ళు పెద్దవి చేసుకునే నడిచి వెళ్ళాల్సి వచ్చింది.

నడుము ఎతుకు పెరిగి విరుచుకోనున్న ముళ్ల పొద వలన దివ్యా మోచేతులపై గట్టిగా గీరుకున్నాయి.

"హుస్...అమ్మా!"

చిరు చిరుమని మంట పుట్టిన చేతిని, మెళ్లగా రుద్దుకుంటూ చుట్టూ చూసింది.

లోతు ఏది? అందులో పాతాళ లోయ ఏదీ అనేది తెలియటం లేదే?

కొద్ది సేపట్లో బాట కుడి చేతి వైపుకు తిరుగుతుంది కదా?

ఆలొచించుకుంటూ నడుస్తుంటే, బాట ఒక చోట తిరుగుతున్నట్లు అనిపించింది.

తడబడుతూ మెల్లగా నడిచినప్పుడు, అడవి కుక్క మెల్లగా మొరుగుతున్న శబ్ధం వినబడింది.

సడన్ గా శబ్ధం ఆగిపోయి, అదే ఏడుస్తున్న ద్వనిలాగా వినిపించింది.

'కుక్క ఏడుస్తున్నదే? ఇది అపశకునం కదా? ఎక్కడ్నుంచి వస్తోంది శబ్ధం?' నాలుగు దిక్కులలోనూ మార్చి మార్చి చూసేసి, బాటలో తడబడుతూ నడుస్తూ తలెత్తి చూసింది. ఎదురుగా చూసిన ఆమే భయంకరంగా అరిచింది

ఆమె అరుపుకు ప్రాంతమే కదిలినట్లు అయ్యింది.

                                                 ************************************

దివ్యా శరీరంలో వణుకు పుట్టింది. దిగులుతోనూ, భయంతోనూ కళ్లను గట్టిగా మూసుకుంది.

ఆమెకే తెలియకుండా ఒక్క దూకు దూకి, ఎదురుకుండా పక్కనే కనబడ్డ చెట్టును గబుక్కున రెండు చేతులతో కౌగలించుకున్నట్టు పట్టుకుంది.

'అయ్యయో!  అదేమిటి? తెల్లటి  రూపం ఏదో ఒకటి నిలబడుందే?

వెయ్యి ట్యూబులైట్లను వెలిగిస్తే ఎంత కాంతో అంత వెలుతురులాగ మెరుస్తోంది?

ఒకవేల అది మోహినీ పిశాచి అయ్యుంటుందో? లేక...ఇదే అడవి మోహినినా?

డబ్ డబ్ అంటూ కొట్టుకుంటున్న హృదయ స్పందన పలురెట్లు పెరిగింది.

చెట్టును కౌగలించుకునే గట్టిగా కళ్ళు మూసుకున్న దివ్యా 'నమః శివాయ... నమః శివాయ అంటూ పంచాక్షర మంత్రాన్ని వదలకుండా పఠిస్తునే ఉన్నది.

కొద్ది క్షణాల తరువాత తననితాను సమాధాన పరుచుకుని--బలవంతంగా ధైర్యాన్ని తెచ్చుకుంటూ, కళ్ళు తెరిచి చుట్టూ చూసింది.

గాలికి చెట్ల కొమ్మలూ, ఆకులూ ఆడుతున్నాయే?

ఇది...ఇది...అటవి మొహినీనూ కాదు...మోహినీ పిశాచీనూ కాదు.

ఏదో ఒక చెట్టులాగానే కదా ఉన్నది? కొమ్మలూ, ఆకులూ--ఆడుతూ బ్రహ్మాండమైన ప్రదర్శన ఇస్తున్నాయే?

'అవును...ఇది వృక్షమే. ప్రకాశవంతమైన కాంతిని విరజిమ్ముతున్న వృక్షం.!'

హృదయంలో స్పందన వేగం తగ్గి, మెదడు ఆలొచించటం మొదలుపెట్టింది.

అడివిలో ఇలాంటి వృక్షాలు ఉన్నాయి. మొండిగా, ఒంటరిగా అడవిలోకి వెళ్ళే యువతకు, ఇలాంటి వృక్షాలను సడన్ గా చూసినప్పుడు గుండె బెంబేలు ఎత్తుతుంది షాక్ కు గురౌతారు. కొన్ని సమయాలలో భయంతో రక్తం కక్కుకుని చచ్చిపోతారు.

ఒంటరిగా అడవిలోకి వెళ్ళిన వాడ్ని మోహినీ పిసాచాలు కొట్టే చంపేసినై అని బయట చెప్పుకుంటారు.

ప్రకాశవంతమైన వెలుతురును ఇచ్చే వృక్షానికి 'జ్యోతి వృక్షం' అని పేరు.

పూర్వకాలంలో ఇలాంటి వృక్షాలు ఉన్నాయనటానికి సాక్ష్యాలుగా గ్రంధాలూ, పుస్తకాలూ ఉన్నాయి. మహాకవి కాళిదాసు రచించిన రఘు వంశంలో కూడా దీని గురించిన గుర్తులు ఉన్నాయి తండ్రి విఠల్ రావ్ అంతకు ముందు ఈమె దగ్గర చెప్పింది ఇప్పుడు మెల్లగా గుర్తుకు వచ్చింది.

'ఇది ఒకరకంగా అరుదైన వృక్షం. చూడటానికి వీలు పడని వృక్షం. దగ్గర దగ్గర ఒక గుప్త నిధి అనుకో. ఇందులో విశేషం ఏమిటంటే...ప్రొద్దుటి పూట వృక్షాన్ని చూస్తే మామూలు వృక్షంలాగానే ఉంటుంది. ఎటువంటి తేడా కనబడదు.

రాత్రి సమయంలో మాత్రమే అద్భుత జ్యోతి లాగా కాంతిని ఇస్తుంది. బాగా విషయం తెలిసిన వాళ్ళు, జ్యోతి వృక్షం కొమ్మలను విరిచి రాత్రి పూట--వెలుతురుకోసం ఉపయోగించుకుంటారు.

సాధువులు, మునులు, రుషులు జాతి వృక్షాలను గుర్తించి ఉపయోగించుకోవటం తెలుసు. కొంతమంది అడవి మనుషులకు కూడా దీని గురించి తెలుసు.

తండ్రి యొక్క మాటలు...ఆమె చెవులో చక్కర్లు కొడుతున్నాయి.

భయము, దిగులు మరు క్షణమే మాయమైపోగా--మనసులో ప్రశాంతత, చిన్న తృప్తి తలెత్తింది.

'ఆహా...ఇన్ని కష్టాలలోనూ మనసులో చిన్న ఆనందం ఏర్పడుతోందే? అరుదైన జ్యోతి వృక్షాన్ని చూసే భాగ్యం ఏర్పడిందే?'

వృక్షం వైపు నిదానంగా నడిచింది.

కొద్దిసేపటి క్రితం చూసి బెంబేలెత్తిపోయిన ఆమెకు, ఇప్పుడు వృక్షాన్ని ముట్టుకుని చూడాలనే ఆశ ఏర్పడింది.

'ఇంకో పది అడుగుల దూరమే

జ్యోతి వృక్షం పక్కకు వెళ్ళిపోవచ్చు అని మనసు లెక్కవేసే సమయంలో, ఆమె కళ్ళు దేనినో చూసి బెదిరిపోయి ఆగినై.

మళ్ళీ నక్క ఏడుస్తున్న శబ్ధం చెవులను చిల్లి చేసింది.

కుక్కలూ, నక్కలూ ఏడుస్తున్నాయే? ఇది మంచిది కాదే?

మనసులో మళ్ళీ దిగులు పట్టుకుంది.

అదే సమయం, జ్యోతి వృక్షం ఇస్తున్న కాంతిలో చుట్టూ కొంతవరకు క్లియర్ గా చూడగలుగుతోంది.

వృక్షానికి వెనుక, సుమారు ఏడెనిమిది అడుగుల దూరంలో ఒక ఆకారం మెల్లగా జరుగుతూ వెడుతోంది.

'ఏమిటది?'

తీక్షణంగా చూసింది దివ్యా.

తెల్లటి ఆకారం జరుగుతున్నదే...ఎలా?'

'ఊహు...ఎవరో ఒకరు తెల్ల గుడ్దతో తలను కప్పుకుని ఉన్నట్లు అనిపిస్తోందే?

మెల్లగా నడిచి వెళ్లటం చూస్తే, మందుల కొండపై ఉన్న పంచలింగ బహిరంగ ఆలయానికి వెడుతున్నట్టు తెలుస్తోందే?

'ఎవరై ఉంటారు?'

డాక్టర్ సుధీర్ పంపిన గూండా అయ్యుంటాడా?

నడకా, స్టైలు చూస్తే అలా తెలియటంలేదే? సాధువుగా, శాంతంగా నడిచి వెలుతున్నారే?

ఇది మునులు,రుషులు సంచరించే అడవి ప్రాంతం కదా? రోజు పౌర్ణమి కదా? కుంభ వృష్టిగా కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్కచేయకుండా మందు కొండ శిఖరానికి పంచలింగ దర్శనానికి వెలుతున్నారే?

ఈయనా  రుషేనా?

కచ్చితంగా అలాగే ఉండాలి! అని నా మనసు చెబుతోందే?

ఆయన్ను వెంబడించి వెళ్లాల్సిందే.

ఏం జరిగినా సరే....'ధైర్యవంతులకి నిద్ర ఉండదు అని పెద్దలు చెబుతారు.

మన చూపుల నుండి అతను తప్పించుకోకుండా చూసుకోవాలి.

నడక వేగం పెంచింది.

జ్యోతి వృక్షం దాటి, ఆకారాన్ని వెంబడించి పయనించింది.

కొండ బాటలో పలుమార్లు నడిచిన అలవాటు పడిన మనిషిలాగా, నిదానంగా, తడబాటు లేకుండా ముందు వెడుతున్న ఆయన్ను వెంబడించి నడుస్తున్నప్పుడు, దివ్యాకు అంత శ్రమ అనిపించలేదు.

కొండ బాట మోకాళ్ళ పర్వతం లాగా ఎత్తుగా ఉన్నది.

ఆయాసపడుతూ ఆయన్నే వెంబడిస్తూ వెడుతున్న ఆమెకు, ఆయన కాళ్ళ మీద పడి తన పరిస్థితిని వివరించి సహయం అడగాలని అనిపించింది.

గంగయ్య  స్వామీజీని మళ్ళీ చూడటం కుదరలేదు. ఈయన దగ్గర ఏడ్చి, బ్రతిమిలాడి సహాయం అడగాల్సిందే. సీతమ్మ గుహకు వెళ్లే దారి చూపించినా చాలే...'ఆలొచిస్తూ నడిచింది.

'ఇదిగో...పంచలింగ బహిరంగ ఆలయం వచ్చేసిందే?'

ఇంకా ఆలశ్యం చేయటం మంచిది కాదు. పెద్దాయన్ను కలిసి సహాయం అడగాల్సిందే.

ఆయన ముందుకు వెళ్ళి నిలబడ్డది.

"అయ్యా...నేను నిర్గతిగా నిలబడున్నాను! నాకు మీరే సహాయం చేయాలి"-- జాలిగా బ్రతిమిలాడింది.

ఆయన ముఖం తిప్పుకునే నిలబడ్డాడు. సమాధానం లేదు.

ఆరోజు లాగా రోజు కూడా వేగంగా గాలి వీచింది.

అప్పుడు.

                                                                                                           Continued....PART-11

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి