25, డిసెంబర్ 2022, ఆదివారం

ఎక్కడ నా ప్రాణం...(సీరియల్)...(PART-8)


                                                                            ఎక్కడ నా ప్రాణం...(సీరియల్)                                                                                                                                                                  (PART-8) 

సమయం నత్తలాగా నిదానంగా జరుగుతోంది.

"మూలిక మందు తయారుచేసేటప్పుడు, వదలకుండా మనసులో మంత్రాలు ఉచ్చరిస్తూ తయారుచేయాలి. అప్పుడే అందులో వ్యాధిని గుణ పరిచే శక్తి ఎక్కువ అవుతుందని గంగయ్య స్వామి అయ్యగారు చెబుతారు. నూరటానికి---పొడిచేయటానికి ఒక పద్దతి ఉంది. పద్దతి మారితే మూలిక మందు పనిచేయదు. మీరు నాకు సహాయం చేయాలని ఇష్టపడితే-అదిగో పటిక రాయిని పగలకొట్టి, పొడిచేసి ఇవ్వండి. అది చాలు"

పురుషోత్తం, అర్జున్ తో చెప్పి-ఏవేవో ఆకులలో నుండి చిన్న చిన్న కాడలను ఏరి పారేసి, గుండ్రని రాయితో నూరుతున్నాడు.

'నాన్నను ఎలా కాపాడబోతామో? డాక్టర్ సుధీర్ -- నాన్నను అడవిలో చోట దాచి పెట్టి కష్టపెడుతున్నాడో? గంగయ్య స్వామి గారు ఎప్పుడు తిరిగి వస్తారో?  కొండపై నుంచి లోయలోకి దూకినప్పుడు, చెట్లు-కొమ్మలను విరుచుకుంటూనే కదా కిందకు వచ్చాము? అవి రాసుకుంటున్నప్పుడు--చిన్న చిన్న గాయాలు కూడా తగలకుండా ఎలా మమ్మల్ని కాపాడి ఆశ్రమానికి తీసుకు వచ్చి చేర్చుంటారు?'-- ఇలా పలు రకాల ప్రశ్నలు ఆమె మదిలో తలెత్తినై.

నాన్నతో గంగయ్య స్వామి గారు బాగా స్నేహంగా ఉండేవారు. స్నేహైతుడి కూతురు, అల్లుడి మీద ఏక్కువ శ్రద్ద, అభిమానం చూపిస్తున్నారు.

అంతపెద్ద రౌడీ గుంపు దగ్గర నుండి, ఒక చిన్న ధూలి కూడా పడకుండా మమ్మల్ని కాపాడారే?

ఇది సాధారణ మన్యుష్యుల వలన సాధ్యమవుతుందా?

ఊహు...ఈయన ఒక రుషే!

అది సరే...ఇంత శక్తి గల ఆయన, నాన్నను వాళ్ళ దగ్గర నుండి కాపాడలేరా ఏమిటి? అదేమీ పెద్ద విషయమే కాదే? స్నేహితుడ్ని రౌడీ వెధవుల దగ్గర నుండి వెంటనే కాపాడి తీసుకు రాకుండా...ఎందుకు ఆలశ్యం చేస్తున్నారో అర్ధంకావటంలేదే? మనసులో ఏది అనుకున్నా ఆయనకు తెలుసి పోతోందే.

నాన్నను తలచుకుని నేను పడుతున్న బాధ ఆయనకు తెలిసుంటుందే? అయినా కానీ ప్రయత్నం చేయకుండా ఎందుకున్నారో? కారణం ఏమై ఉంటుంది? మా మీద ఇంత ఇంటరెస్టు చూపించే ఈయన, స్నేహితుడి మీద చిన్న ఆందోళన కూడా చూపటం లేదే...ఎందుకని?

ఈయన ఇలా ఉండటానికి ఏదో ముఖ్యమైన కారణం ఉండే ఉంటుందని అనిపిస్తోంది. కారణాన్ని ఓపన్ గా చెప్పినా కొంత నెమ్మదిగా ఉండొచ్చే?

ఆయన వచ్చిన వెంటనే, ఇది అడిగేయాలి!

అయ్యో...నేనొక మూర్కురాలుని. నేను ఇలా అనుకోవటం కూడా ఈపాటికి ఆయనకు తెలిసుంటుందే?

తప్పు...తప్పు! ఇంత అభిమానం చూపి, ఆశ్రయం ఇచ్చి, గుడారంలో చోటు ఇచ్చి, రౌడీ వెధవల దగ్గర నుండి మమ్మల్ని కాపాడటమే పెద్ద విషయం.

జరగాల్సింది జరగనీ. శివుడి మీద, గంగయ్య స్వామి మీద నమ్మకం ఉంచి వేచి ఉండాల్సిందే!

వేరే దారే లేదు...'

తనలో అనుకుంటూ -- పచ్చని ఆకులని పురుషోత్తం పద్దతిగా రుబ్బటాన్ని వేడుక చూస్తూ ఉండిపోయింది దివ్యా.

పటికార రాయిని పగులకొట్టి పొడి చేసి, నుదుటి కొసలను ఎగరేస్తూ  తీవ్ర ఆలొచనలతో అప్పుడప్పుడు ఆశ్రమ వాకిలినే చూస్తూ ఉన్నాడు అర్జున్.

రోజు పూర్తిగా గంగయ్య స్వామి గారు రాలేదు.

రాత్రి తొమ్మిదింటికి నిద్ర కళ్ళ మీదకు వచ్చి బలవంతం చేస్తుంటే, చేతి గడియారం వైపు ఒకసారి చూసి, చిన్నగా అతని భుజం తట్టింది.

"నిద్ర వస్తోంది అర్జున్. నేను వెళ్ళి నిద్ర పోనా?"

ఓకే దివ్యా. నువెళ్ళి పడుకో. నాకు నిద్ర రావటంలేదు. నిద్ర వచ్చేంత వరకు ఇలా వేడుక చూస్తూ ఉంటాను. తరువాత నిద్రపోతాను. ద్వారంలో నుండి బయటకు చూసి అనవసరంగా కంగారుపడి మనసు పాడుచేసుకుని నిద్ర చెడగొట్టుకోకు...ప్రశాంతంగా నిద్రపో. సరేనా?"

"సరే సరే...వెల్తున్నా"

తల ఊపి, చెక్కకు అవతలవైపుకు వెళ్ళి తనకని ఇచ్చిన చోటులో పడుకుంది.

బయట గాలి బలంగా వీస్తుంటే, చెట్లు భయంకరంగా ఊగుతున్న శబ్ధం క్లియర్ గా వినబడింది.

ఆరోజు ఎందుకనో తెలియదు...నిద్ర ఆమెను వెంటనే ఆవహించింది.

                                                                    ***************************

ఒక గంటసేపు అయిన తరువాత, గబుక్కున అర్జున్ లేచాడు.

అదే సమయం పురుషోత్తం కూడా తన పనులు ముగించుకుని చాప వేసుకుంటున్నాడు.

"నాకు ఇచ్చిన పనులన్నీ పూర్తిచేశేసాను. ఇక ఏమైనా పనులుంటే గురువుగారు వచ్చి చెబితేనే. అంతవరకు రెస్టే"

చెబుతూ ఆశ్రమ గుడారం తడిక గుమ్మం తలుపుని దగ్గరకు వేసి వచ్చాడు.

"ఏమిటి సార్? ఏదో ఆలొచనలో మునిగిపోయున్నారు?” --- అర్జున్ ను చూసి అడిగాడు పురుషోత్తం.

దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక అర్జున్ సతమతమవుతుంటే పురుషోత్తమే తిరిగి మాట్లాడాడు.

"ఏమిట్రా ఇది...అడవి మధ్యలో నివాసముంటున్నారే? వీళ్ళకు కృరమృగాల వలన గానీ, బందిపోట్లు వలన గానీ ఇంతవరకు ఆపదే రాలేదా? కొంచం కూడా భయంలేకుండా ఉన్నరే నని మీరు ఆశ్చర్యపోతున్నారు...కదా సార్?"

"అవును"

"అరుదైన మూలికల వేర్లను లోపల పేర్చి పెట్టాము. వాసనకు, ఆశ్రమాన్ని చుట్టీ విధమైన విష జంతువులో, కృరమృగాలో గుడారం దగ్గరకే రావు. అదిమాత్రమే కాకుండా గంగయ్య స్వామి అయ్యగారు ఎప్పుడూ మంత్రాలు ఉచ్చరిస్తూ ఉంటారు. ఆయన దగ్గర ఒక శక్తి ఉంది. చెడు ఆలొచనతో ఎవరూ అయన దరికి వెళ్ళలేరు. ఆశ్రమం చుట్టూ కంటికి కనబడని ఒక బద్రతా వలయం ఉన్నదని చెప్పొచ్చు. అందువల్ల మాకు ఇంతవరకు ఎటువంటి ఆపద రాలేదు. ఇక మీద కూడా రాదని కచ్చితంగా నమ్మ వచ్చు సార్"

"నాకు నమ్మకం నిన్ననే వచ్చేసింది" అని చెప్పి నవ్వాడు అర్జున్.

"మంచిది సార్. పడుకుందామా? అదిగో మట్టి కుండలో మంచి నీళ్ళు ఉన్నాయి. ఇంకేదైనా కావాలంటే ఆలొచించకుండా అడగండి"

రుచికరమైన పండ్లు తిన్నాను, కడుపు నిండుగా ఉంది. ఇప్పటికి ఇంకేమీ అక్కర్లేదు...ధ్యాంక్స్"

"ధ్యాంక్స్ అంతా చెప్పకండి. ఇది నా బాధ్యత. గంగయ్య స్వామి గారు మిమ్మల్ని జాగ్రత్తగా దగ్గరుండి గమనించుకోమని చెప్పేరు? పడుకోండి"

"సరే"

చాప మీదా నిటారుగా పడుకుని గుండెల మీద చేతులు పెట్టుకుని ఆలొచనలోకి వెళ్ళాడు అర్జున్.

సీతమ్మ, పంచ లింగ దర్శనానికి రాకుండా ఉండిపోతే ఏం చేయాలి? తల్లిని ఎలాగైనా చూడాలే? ఆమె ఉండే గుహను వెతుక్కుని వెళ్ళాల్సిందే. దివ్యాను మనతో తీసుకు వెలితే, దారిలో ఏమేమి ఆపదలు ఎదుర్కోవాలో...ఎవరికి తెలుసు? ఒక్కడ్నీ వెళ్తానంటే, దానికీ ఒప్పుకోనంటోందే? ఆమెకు తెలియకుండా నేను ఇప్పుడే బయలుదేరి వెళ్ళాల్సిందే. ఇదే సరైన పని.

దారిలో ఆపద ఎదురైనా ఎదురుకోవలసిందే. మందుల కొండ మీదున్న శివునిపై భారం వేసి, ధైర్యంగా వెళ్ళాల్సిందే. అది వదిలేసి ఆశ్రమం లోపలే కూర్చుని సమయాన్ని గడపటం మూర్కత్వం కాదా? దివ్యా ఇక్కడ బద్రం గానే ఉందికదా? అదిచాలు నాకు...'

చెక్క గోడ పక్కగా చూశాడు అర్జున్.

పెద్ద గురకతో ఆదమరచి నిద్రపోతున్నాడు పురుషోత్తం.

గబుక్కున లేచి, శబ్ధం చేయకుండా మెల్లగా నడిచి అవతల వైపున్న మరో చెక్క గోడ పక్కన నిద్రపోతున్న దివ్యా వైపు చూశాడు.

ఏందుకైనా మంచిదని మేల్లగా ' దివ్యా... దివ్యా ' అని పిలిచాడు.

అలా రెండుసార్లు పిలిచాడు.

సమాధానం లేదు..........

'పాపం! ఆదమరిచి నిద్రపోతోంది...'తనలో తాను గొణుగుకుని పిల్లిలాగా పాదాలను మోపుతూ ఆశ్రమం తలుపు తీసుకుని బయటకు వచ్చాడు.

బయట నిలబడి నలువైపులా చూశాడు.

' దట్టమైన అడివిలో పగటి పూటే వెల్తేనే కనిపెట్టటం కష్టమే? చీకట్లో దారే తెలియదు...కాలువ కూడా కనబడదే? గుహను ఎలా వెతకబోతాను? ఊహూ...ముందు వేసిన కాలును వెనుకకు తీసుకోకూడదు. మొదట మందుల కొండ శిఖరానికి వెల్దాం

అనుకున్న వెంటనే గబగబా నడవడం మొదలుపెట్టాడు.

కొండ క్రింద ఉన్న గుడార ఆశ్రమాన్ని ఒకసారి చూసి చెట్లు, చేమలు, పొదలు మధ్య ఉన్న కొండ దారిని ఎక్కాడు. 

చీకట్లో, ఒక జత కళ్ళు అతను వెళ్ళే దిక్కునే లోతుగ చూస్తున్నాయి.

కళ్ళు వెన్నల కాంతిలో వజ్రాలలాగా మెరుస్తున్నాయి.

                                                                        *****************************  

సమయం జరుగుతున్న కొద్ది దివ్యాకి ఏడుపు ముంచుకు వస్తోంది.

'అర్జున్ ఎక్కడికి వెళ్ళుంటారు? ఒకవేల... పురుషోత్తం గారికి సహాయం చేయటానికి అతనితో పాటు తోటలోకి వెళ్ళుంటాడా?’

కాసేపు వేగంగా నడవటం, కాసేపు పరిగెత్తటం చేసి పురుషోత్తం గారికి ఎదురుగా వెళ్ళి నిలబడింది.

"మీతో పాటూ అర్జున్ రాలేదా?"

"లేదే! నేను లేచినప్పుడు, నా పక్కన ఆయన లేరు. నేను జలపాతంలో స్నానం చేసేసి, తోటలోకి వచ్చాను. కొత్త చోటు కదా, అందుకని ప్రొద్దున్నే లేచి కొండ ప్రాంతాన్ని చూసిరావడానికి వెళ్ళుంటారు. మీరు కంగారు పడకండి. వచ్చేస్తారు"

అలా కూడా ఉండొచ్చో? నా దగ్గర ఒక మాట కూడా చెప్పకుండా ఆశ్రమం వదిలి ఎందుకు బయటకు వెళ్లారు?’ --  ఆలొచన ఆమెలో కోపం తెప్పిచ్చింది.

మార్చుకోవటానికి వేరే దుస్తులు తీసుకుని---జలపాతానికి వెళ్ళి గబగబా స్నానం ముగించుకుని ఆశ్రమానికి తిరిగి వచ్చ్నప్పుడు ఆమె నిరాశ పడింది.

అర్జున్ ఇంకా రాలేదే? ప్రొద్దున్నే లేచి కొండ చూడటానికి వెళ్ళినట్లు తెలియటం లేదే? ఒకవేల...మధ్యరాత్రి బయలుదేరి సీతమ్మను చూడటానికి ఆమె గుహను వెతుక్కుంటూ వెళ్ళేరా? అలాగే అయ్యుంటుంది.. మీరు ఒంటరిగా వెళ్ళద్దు అని చెప్పినప్పుడే, అర్జున్ మొహంలో మార్పు కనబడిందే? తరువాత నాతో సరిగ్గా మాట్లాడలేదే? ఏదో దీర్ఘ ఆలొచనలో మునిగిపోయున్నారే?

మధ్యరాత్రి లేచి--నాతో చెబితే వద్దంటానని చెప్పకుండా వెళ్ళారే? ఎందుకు ఇంకా తిరిగి రాలేదు? వెళ్ళిన చోట ఆయనకు ఏదైన ఆపద వచ్చుంటుందా?    

అయ్యో...దీనికొసమే కదా ఆయన్ని వెల్లోద్దని చెప్పాను? వెళ్ళే దారిలో డాక్టర్ సుధీర్ గూండాలకు దొరికిపోయాడా?

ఆమ్మో...అలా దొరికిపోయుంటే?

పాటికి వెర్రి పట్టిన గూండాలు, ఆయన్ను చంపేసుంటారే? ఒకవేల కృరమృగాల దగ్గరో, విష జంతువులు దగ్గరో దొరికిపోయారో? ఆయనకు ఏదో జరిగింది. అందుకే ఆయన తిరిగి రాలేకపోయారు. తెల్లారేలోపు వచ్చేయచ్చు అనుకోనుంటారు.

కానీ......

ఏమిటో తెలియటం లేదే!

అయ్యో...నేనేం చేయబోతాను? నాన్నను వెతుక్కుంటూ వచ్చాము. ఆయన గురించి ఒక్క క్లూ కూడా దొరకలేదని బాధపడుతుంటే.... అర్జున్ ను పోగొట్టుకున్నానే?

అర్జున్... అర్జున్...నన్ను ఎందుకు ఇలా ఒంటరిగా వదిలేసి ఏడిపించి వెళ్ళారు. మీకు ఏదైనా అయ్యుంటే....అది నేను తట్టుకోగలనా? మరు క్షణమే నా ఊపిరి ఆగిపోతుంది.

అయ్యో...నా మనశ్శాక్షి నన్ను చంపుతోందే? ఆపద నా వలనే కదా? నా కోసం...నా తండ్రికోసం... ఆడవి మధ్యలోకి వచ్చి ఆపదలో చిక్కుకుపోయారే?

ఇప్పుడు మిమ్మల్నీ, నాన్ననీ నేను ఎలా కనిపెట్టబోతాను?  మిమ్మల్నిద్దరినీ ఆపదలో నుండి నేనెలా రక్షించ గలను?

ఎక్కడ, ఎలా? ఎలాంటి ఆపదలో చిక్కుకున్నారో నాకు తెలియదే!

మొదటగా మీరు ఇప్పుడు ప్రాణాలతో ఉన్నారా అనేది కూడా నాకు సందేహం వస్తోందే?

కచ్చితంగా ప్రాణాలతోనే ఉంటారు. నేను మిమ్మల్ని మనస్పూర్తిగా అభిమానిస్తున్నాను.

నా ప్రేమనో, అభిమానాన్నో నేరుగానో, ఫోనులోనో ఎక్కువగా తెలియపరచలేదని మీరు మాటిమాటికీ నా దగ్గర బాధపడేవారు. కానీ, నిజానికి మిమ్మల్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను!

నా మనసు నాతో చెబుతోంది...మీరు కచ్చితంగా బాగానే ఉంటారు. మీకు ఏమీ అయ్యుండదు. భగవంతుడు నన్ను కష్టపెట్టడు అని నమ్ముతున్నాను.

అర్జున్...మీరు కూడా నామీద ప్రాణమే పెట్టుకున్నారు! మీరు ఇలా చెయొచ్చా? ఇప్పటికే నా ప్రాణంలో సగం పోయింది తెలుసా? ఎవరో నన్ను బలవంతంగా నిప్పుల్లోకి తోస్తున్నట్లు ఉంది. బాధతో పురుగులా కొట్టుకుంటున్నా.

మీరే నా ప్రాణం. మీరే నాకు ఆధారం. మీరే నాకు సకలం...! మీరు లేకుండా నేను ఒక్క నిమిషం కూడా భూమి మీద బ్రతకలేను. మీకు ఏమైందో? అదే నాకూ అవనీ. ఇదిగో, నేను బయలుదేరి వస్తున్నా...'

తనలో తీర్మానించుకుని---కుండపోతలాగా వస్తున్న కన్నీటితో--ఆశ్రమం వాకిలి వైపుకు నడిచింది.

అక్కడ.

                                                                                                              Continued...PART-9

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి