27, డిసెంబర్ 2022, మంగళవారం

మాతృత్వం...(కథ)

 

                                                                                            మాతృత్వం                                                                                                                                                                                     (కథ)

మాతృత్వం స్త్రీలకు దేవుడిచ్చిన వరం. మాతృత్వం ఓ మధురానుభూతి. సృష్టిలోనే మధురమైనది.. మాతృత్వం... వివాహమైన ప్రతి మహిళ మాతృత్వం పొందాలని... పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ఎన్నో కలలు కంటుంది.

సంతానలేమి కారణంగా మహిళ సామాజికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయితే వాటిని మౌనంగా భరించాల్సి వస్తోంది. పిల్లలు లేకపోతే ఆమె పరిపూర్ణం కాదనే భావన చాలామందిలో ఉంది. అందమైన కలలకు, మధురమైన అనుభూతులకు, ప్రతిరూపమే మాతృత్వం. పండంటి బిడ్డకు జన్మనివ్వడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టగల త్యాగమే మాతృత్వం. నవమాసాల యజ్ఞఫలమే మాతృత్వం.

గౌరికి పిల్లలు పుట్టడం సాధ్యం కాదని ఆమెను పరీక్ష చేసిన డాక్టర్లు చెబుతారు. సరోగసి ద్వార పిల్లలను కనవచ్చు అని సలహా ఇస్తారు. సరొగసికీ ఒక మహిళను వెతికే ప్రయత్నంలో ఉన్నప్పుడు, గౌరి భర్త యొక్క ప్రాణ స్నేహితుని భార్య అర్చన, ‘అద్దె గర్భానికి మహిళను వెతకొద్దు, నేనే నీకు సరొగసీ మహిళగా ఉంటాను అని సలహా ఇస్తుంది. ప్రాణ స్నేహితులిద్దరూ సంతోష పడతారు. గౌరి బిడ్డ అర్చన కడుపులో పెరుగుతున్నప్పుడు సడన్ గా గౌరికి, ఆమె భర్తకు మనస్పర్ధలు ఏర్పడటంతో గౌరి అర్చన దగ్గరకు వచ్చి బిడ్డ మాకు అవసరం లేదు, అబార్షన్ చేయించేసుకో అని చెబుతుంది.

కొన్ని నెలలుగా గౌరి బిడ్డను తన గర్భంలో మొస్తున్న అర్చన, గౌరి చెప్పిన మాటకు ఆశ్చర్యపోయి, గౌరి తప్పు చేస్తున్నట్టు, మాతృత్వం అనేది ఒక మహిళకు ఎంత ముఖ్యం అనేది చెబుతుంది. కానీ గౌరి అర్చన మాటను పెడచెవిన పెడుతుంది. గౌరి, అర్చనల మధ్య మాటల ఘర్షణ జరుగుతుంది.

గౌరి చెప్పిన మాటవిని అర్చన అబార్షన్ చేయించుకుందా? గౌరి, అర్చనల మధ్య జరిగిన మాటల ఘర్షణ సారంశం ఏమిటి? ఆ తరువాత ఏం జరిగింది?....ఈ కథ చదివి తెలుసుకోండి.

రోజు కోర్టులో జడ్జిమెంట్ డే.

జడ్జిమెంట్ వినడానికి పత్రికా విలేఖరులతో సహా మామూలు జనం కూడా పోగయ్యేరు.

కోర్టు హాలు ఇంతకుముందెప్పుడూ అంతమంది జనంతో నిండలేదు. రోజు కోర్టులో ప్రముఖ రాజకీయ నాయకుడిదో లేక ప్రముఖ సెలెబ్రెటీ కి చెందిన కేసులోనో జడ్జిమెంట్ ఇవ్వటంలేదు.

మరి అక్కడ అంతమంది జనం ఎందుకు గుమికూడున్నారో నన్న ప్రశ్న మీకనిపించవచ్చు. దానికో ముఖ్య కారణం ఉన్నది. కోర్టులో రోజు అత్యంత విన్నూతమైన, కొత్తరకం కేసుకు సంబంధించిన జడ్జిమెంట్ ఇవ్వబడుతోంది. జడ్జిమెంట్ ఎలా ఉంటుందో తెలుసుకోవలన్న ఆత్రుత, ఇంట్రస్టే అక్కడ అంతమంది జనం పోగవడానికి అసలు కారణం.

"జరగండి...జరగండి" ...ఇద్దరు పోలీసులు గుంపును పక్కకు జరుపుతుంటే నిండు గర్భిణి అర్చన ఒక చేతిని నడుం మీద మరొక చేతిని తన స్నేహితురాలు గౌరి భుజం మీద వేసుకుని నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ కోర్టు హాలులోకి వచ్చి అక్కడున్న బెంచి మీద కూర్చుంది. పక్కనే ఆమె భర్త కిషోర్ కూర్చున్నాడు. కిషోర్ పక్కన అతని ప్రాణ స్నేహితుడు వెంకట్ కూర్చున్నాడు. అతని పక్కన అతని భార్య గౌరి కూర్చుంది.

వీరు నలుగురూ కలిసిరావటం, పక్కపక్కనే కూర్చోవడం చూసి అక్కడ గుమికూడిన జనం ఆశ్చర్యపోయేరు. ఎందుకంటే కోర్టులో ఆరోపణ పిటిషన్ వేసి న్యాయం కోసం పోరాడుతున్నది ఇద్దరు దంపతులే. ఎప్పుడు కోర్టుకు వచ్చినా వేరు వేరుగా వచ్చి, వేరు వేరు చోట్లలో కూర్చునే రెండు జంటలూ రోజు కోర్టుకు కలిసి రావడం, పక్క పక్కన కూర్చోవడం అక్కడ గుమికూడిన జనాన్ని ఆశ్చర్యానికి లోను చేసింది.

"ఇదేమిటి!...ఎప్పుడూ పిల్లి-ఏలుకల్లా దూర దూరంగా ఉండే వీళ్ళు రోజు ఒకరి భుజం మీద ఒకరు చేయివేసుకుని కలిసి వచ్చేరు...పకపక్కనే కూర్చున్నారు" గుమికూడిన జనంలో ఎవరో తమ ఆశ్చర్యాన్ని గట్టిగా అందరికీ వినబడేలా వెలిబుచ్చేరు.

అక్కడ గుమికూడిన జనం విషయం గురించే చర్చించుకుంటున్నారు. వారి మాటలు కోర్టు హాలును మార్కెట్టులా మార్చింది.

ఇంతలో "సైలన్స్" అన్న కేక వినబడింది.

ఒక్కసారిగా కోర్టు హాలులో నిశ్శబ్ధం చోటు చేసుకుంది.

కోర్టు హాలులోకి ప్రవేశించేరు జడ్జి.

కూర్చున్నవారందరూ లేచి నిలబడ్డారు...జడ్జి తన సీటులో కూర్చుంటూ అందరినీ కూర్చోమన్నారు.

గుమాస్తా జడ్జికి ఒక కేసు కట్టను అందించేడు.

కేసు కట్టను తీసుకున్న జడ్జి అందులోని పేజీలను ఒక సారి తిరగేసి కేసు కట్టను తన టేబుల్ మీద ఉంచుతూ "గౌరీ వాసస్ అర్చన ఆరోపణ కేసులో జడ్జిమెంట్ ఇవ్వబోయే ముందు...చివరి సారిగా కోర్టుకు ఏమైనా చెప్పదలచుకుంటే చెప్పుకోవచ్చు" అన్నారు.

వెంటనే గౌరి తరఫు వాదనను సమర్ధించే లాయర్ లేచి నిలబడి "ఎస్...యువర్ ఆనర్" అని గౌరవంగా అన్నాడు.

"ప్రొసీడ్" అన్నారు జడ్జి.

"యువరానర్... కేసులో మీరు జడ్జిమెంట్ ఇవ్వవలసిన అవసరంలేదు. ఎందుకంటే గౌరి-అర్చనలు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ మెంట్ చేసుకున్నారు. నా క్లయంట్ గౌరి తన ఆరోపణను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు...మా రిక్వెస్టును మీరు దయచేసి అంగీకరించాలని కోరుతున్నాను" అంటూ ఒక కవరును జడ్జికి అందించేడు.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మాతృత్వం...(కథ) @ కథా కాలక్షేపం-1 

**************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి