తలవంపు (కథ)
పిల్లలు ప్రేమిస్తే పెద్దలు దానిని తమకు తలవంపుగా భావిస్తారు. అందులోనూ తమకంటే తక్కువ స్టేటస్ లో ఉన్న వారిని ప్రేమిస్తే అది పెద్ద పరువు తక్కువ పని అని పెద్దలు వాదిస్తారు. ఎలాగైనా ఆ ప్రేమికులను విడదీయటానికి ప్రయత్నిస్తారు. తక్కువ స్టేటస్ వాళ్ళు పెద్ద స్టేటస్ వాళ్ళకు భయపడి తప్పుకుంటారు. ఇది మామూలుగా సమాజంలో జరుగుతున్న తంతు. ఈ కథలో ప్రేమికుడి తండ్రి అదే పనిచేసి(ప్రేమికులను విడదీసి)తన గౌరవాన్ని నిలబెట్టుకుని, కొడుకు వలన వంచుకున్న తలను పైకెత్తుకోగలుగుతాడు. కానీ, విధి ఆయనకు వెరే ముగింపు రాసుంటుంది....విధి రాసిన ఆ ముగింపు ఏమిటో తెలుసుకోవాలంటే తలవంపు కథ చదవండి.
"అయ్యగారండీ...అయ్యగారండీ" అని ఇంటి బయట
నుండి కేకలు వినబడటంతో,
చదువుతున్న పేపర్ను పక్కన
పడేసి, కూర్చున్న ఈజీచైర్ లో నుండి
లేచి గుమ్మం దగ్గరకు
వచ్చాడు కేశవరావ్.
వాకిట్లో నడుం చుట్టూ
తుండు కట్టుకుని నిలబడున్న పనివాడు కనిపించాడు.
"ఏవిట్రా ఆ
అరుపులు...ఏదో కొంపలు
మునిగిపోయినట్లు"
"అవునండయ్యా...నిజంగానే మన కొంప మునిగిందయ్యా. మన చిన్నయ్యగారు ఆ
నూకాలమ్మ కూతురితో రైలు
స్టేషన్లో కనిపించారండి "
"ఏవిట్రా వాగుతున్నావ్" కళ్ళు పెద్దవి చేసాడు
కేశవరావ్.
“నే సెప్పేది నిజమేనండయ్యా...నా కళ్ళారా
చూసానయ్యా. ఇద్దరి సేతుల్లోనూ సూటు కేసులున్నాయండయ్యా...ఈ ఇషయాన్ని మీకాడ సెప్పాలని ఎంటనే
లగెత్తుకుని ఈడకొచ్చానయ్యా"
"సావిత్రీ" అంటూ పెద్దగా
అరిచాడు కేశవరావ్.
"ఏమిటండీ అలా
అరిచారు!" వంటగదిలోనుండి పరిగెత్తుకొచ్చిన కేశవరావ్ భార్య
సావిత్రి భర్తను చూస్తూ
ఆశ్చర్యంగా అడిగింది.
"కిష్టుడు గదిలో
ఉన్నాడో లేడో చూడు"
భార్యను ఆదేశించాడు కేశవరావ్.
"గదిలోనే ఉంటాడు...నిద్రలో నుండి ఇంకా
లేచుండడు" చెప్పింది సావిత్రి.
"చెప్పింది చెయ్యి"
భార్యను గదమాయించాడు కేశవరావ్.
వెంటనే పరుగు లాంటి
నడకతో మేడపైకి వెళ్ళింది సావిత్రి. కొడుకు క్రిష్ణా రావ్ గది తలుపును
రెండు సార్లు తట్టింది. మూడోసారి గది తలుపు
మీద తట్టినప్పుడు తలుపులు
కొంచంగా తెరుచుకున్నాయి. దాంతో సావిత్రిలో భయం పుట్టుకొచ్చింది. ధైర్యం తెచ్చుకుని లోపలికి వెళ్ళి చూసింది.
కొడుకు మంచం మీద
లేడు. బాత్ రూములో
ఉన్నాడేమోనన్న అనుమానంతో అటు
తిరిగింది. బాత్ రూము
తలుపు తెరిచే ఉంది.
బాత్ రూములో కూడా
కొడుకు కనిపించకపోయేసరికి సావిత్రి గుండె
గుభేలుమంది.
కొడుకు గదిలో నుండి
పరుగులాంటి నడకతో బయటకు
వచ్చి "కిష్టుడు రూములో
లేడండి" మేడపై నుండే
భర్తకు వినబడేలా చెప్పింది సావిత్రి. ఆమె గొంతులో
వొణుకు చోటుచేసుకోవటం ఎవరికైనా అర్ధమైపోతుంది.
భార్య మాట వినగానే
నెత్తిమీద బరువు పడినట్లు పక్కకు ఒరిగిన కేశవరావ్ పడిపోకుండా ఉండటానికి దగ్గరున్న గుమ్మాన్ని పట్టుకున్నాడు. "ఎంత పనిచేసాడు!...కుటుంబ గౌరవానికి తలవంపులు తీసుకు వచ్చాడే...గౌరవంగా
బ్రతుకుతున్న నన్ను తలవంచుకునేలా చేసాడే" అనుకుంటూ కుంగిపోతూ పక్కనున్న గుమ్మం మీద
కూర్చుండిపోయాడు.
"ఏమైందండీ...ఎప్పుడూ మీసాలు తిప్పుకుంటూ గంభీరంగా ఉండే మీరు...ఇలా డీలా పడి కూర్చున్నారు" భర్త దగ్గరకు వచ్చిన సావిత్రి కేశవరావ్ ను చూసి అడిగింది.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
తలవంపు...(కథ) @ కథా కాలక్షేపం-1
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి