17, డిసెంబర్ 2022, శనివారం

వెన్నెల...(కథ)

 

                                                                                              వెన్నెల                                                                                                                                                                                         (కథ)

డబ్బును తరుముకుంటూ, ఎప్పుడు చూడూ ‘పని...పని’ అంటూ తిరుగుతున్న భర్తకు, జీవితానికి డబ్బు మాత్రమే ముఖ్యం కాదు, కట్టుకున్న భార్య సంతోషం కూడా ముఖ్యమే నని అతనికి షాక్ ఇచ్చి కనువిప్పు కలిగించింది అతని భార్య. ఏమిటా షాక్? తెలుసుకోవాలంటే ఈ కథను చదవండి.

ఆ లేఖను చదివిన తరువాత జగపతి ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఆ లేఖలో రాసున్న ఒక్కొక్క అక్షరమూ సాన పడుతున్న కత్తిలో నుండి వెలువడుతున్న నిప్పురవ్వల లాగా అతన్ని కాలుస్తున్నాయి.

తిన్నగా విషయాన్ని మొదలు పెట్టి...లేఖను ముగించింది జగపతి భార్య మేనక.

డబ్బును తరుముకుంటూ, ఎప్పుడు చూడూ పని...పని అంటూ తిరగాలనుకున్నప్పుడు నన్నెందుకు పెళ్ళి చేసుకున్నారు?

మీరు ఇంటికి వస్తారని ఎన్ని రాత్రులు భోజనం చేయకుండా కాచుకోనున్నానో మీకు తెలియదు? కానీ, మీరు...నేను తినేశాను, నువ్వు భోజనం చేసి పడుకో!అని చెప్పేసి పడుకునే వారు!

నా కడుపుకు మాత్రమే ఆకలి వేస్తుందా? చలికి దుప్పటి యొక్క వెచ్చదనం చాలా?

ఇవన్నీ చాలవని వారానికి రెండు మూడు రోజులు 'తాగి ఇంటికి వస్తారు. అడిగితే, 'హు...బిజినస్ లో మనుషులను మాయ చేయటానికి ఇలా 'పార్టీ' ఇవ్వాల్సి వస్తోంది!

ఇలాంటి పరిస్థితుల్లో..........

మీ బిడ్డను కడుపులో మోస్తున్నాను. ఆ విషయం మీతో చెప్పటానికి ఎన్నో రోజులు ప్రయత్నం చేశాను!

నేను చెప్పేది వినటానికి మీకు టైమూ లేదు, ఓపికా లేదు… ఇక నాకు ఓర్పూ లేదు.

అందువల్ల ఒక నిర్ణయానికి వచ్చాను.

నన్నూ, నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డను ప్రేమించి ఇష్టపడి నన్ను ఏలుకునే ఒకతనితో జీవించదలచుకున్నాను...

దానితో లేఖ ముగిసిపోయింది!

ఆ లేఖను మళ్ళీ మళ్ళీ చదివాడు జగపతి.

దెబ్బతిన్న పక్షిలాగా జగపతి మనసు గిలగిలా కొట్టుకుంది.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

వెన్నెల...(కథ) @ కథా కాలక్షేపం-1

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి