1, డిసెంబర్ 2022, గురువారం

ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(సీరియల్)...(PART-10)

 

                                                                    ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(సీరియల్)                                                                                                                                                         (PART-10)

ఈ రోజు.

ఆ రోజు ఆడిటోరియంలో జరిగిన ఎదురు చూడని ఆ సంఘటనే, జయశ్రీ ఈ రోజుకూ నన్ను ఛీదరించుకొవడానికి కారణం

నడుస్తున్న మోహన శర్మ ఒక్క నిమిషం ఆగి నవ్వుతూ గౌతంని చూసారు.

అవునూ...దాన్ని ఎవరు అప్పుడు రేప్ చేయాలని చూసారు. మీరు కాదా?” -- అడిగారు.

అది ఆ నందకుమార్ పని సార్. నా మీద పగ తీర్చుకోవటానికే. జయశ్రీని నా నుండి శాశ్వతంగా దూరం చేయటానికి అతను చేసిన పని. నేరం నా మీద. కానీ, అతను చేసిన పాపం అతన్ని వూరికే వదలదు సార్... చెబుతున్నప్పుడే గౌతం కళ్ళల్లో నుండి నీరు కారింది. ఆ కన్నీరే అతను నిజం చెబుతున్నాడని చెప్పకనే చెబుతోంది.  

అయ్యిందేదో అయ్యింది...నా కూతురు ఇక మీదట ఆ నందకుమార్ తో జీవించటం సాధ్యం కాదు. మరు జీవితం ఇవ్వటానికి మీకు ఇష్టమేనా గౌతం?”

ఎదురు చూడనే లేదు! ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు.

ఏం గౌతం, జవాబే లేదు? మీరు జయశ్రీని మనసారా ప్రేమించింది నిజమేనా? ఆ ప్రేమ శరీర అందం కోసం కాదు కదా? మీ అభిప్రాయం ప్రకారం మీరే నడుచుకోకపోతే ఎలా?”

సార్...నేను ప్రేమించటం పెద్ద విషయం కాదు. జయశ్రీ నన్ను ప్రేమించాలి సార్ అన్నాడు.

దానికి నేను బాధ్యుడ్ని గౌతం. ఆమె జీవించాలి. ఇకమీదటైనా మోసపోకుండా జీవించాలి. ఆ నందకుమార్ అనే కిరాతకుడి దగ్గర నుండి తప్పించుకుని జీవించాలి. జీవించి చూపించాలి. దానికి మీరు సహాయం చేయాలి  

ఖచ్చితంగా...నా ప్రేమను జయశ్రీ అర్ధం చేసుకుని అంగీకరిస్తే...

అంగీకరిస్తుంది. మీరు కొంచం ఓపికగా ఉండాలి. నందకుమార్ యొక్క నిజమైన స్వరూపం ఇప్పుడు జయశ్రీకి తెలిసిపోయింది. అదేలాగా మీ మంచి మనసు ఆమెకు తెలియకుండానా పోతుంది?”

తెలిసినా, తెలియకపోయినా నేను కాచుకోనుంటాను సార్. కాచుకోనుంటేనే అది ప్రేమ...

చాలా సంతోషం గౌతం. నా కూతురి యొక్క జీవితం అస్తమించి పోతుందని అనుకున్నాను. సూర్యుడిలాగా ఇప్పుడు మిమ్మల్ని చూసాను. నా సంతోషానికి ఇప్పుడు కొలతే లేదు...

మోహన శర్మ ఆ మాటలు చెప్పిన క్షణంలో ఆయన భుజాల మీద ఒక చేయి పడింది. ఎవరా అని వెనక్కి తిరిగిన ఆయన తన మీద చేతులు వేసిన మనిషిని చూసి అధిరిపడ్డాడు. చేతులు వేసింది నందకుమార్!

ఏమిటి మామా...అల్లుడు ప్రాణాలతో బండరాయి లాగా ఉన్నప్పుడే మీ అమ్మాయికి ఇంకొక మనిషిని చూడటం మొదలుపెట్టేరే...భలే! అన్నాడు.

రోడ్డు మీద పెద్దగా జనసంచారం లేదు. అక్కడ అతను కనబడటం, అలా మాట్లాడటం విన్న మోహన శర్మ కుమిలిపోయేడు. గౌతం కోపంతో ఊగిపోయాడు.

నందకుమార్! నువ్వు మనిషివేనా? లేక మనిషి రూపంలో ఉన్న పిశాచివా...? నీ లాంటి ఒక సాడిస్టును నేను చూసిందే లేదు. ఎందుకిలా నడుచుకుంటావు?”

గౌతం ప్రశ్నలకు సమధానం చెప్పటం ఇష్టంలేని వాడిలాగా ఇద్దరినీ ఒకసారి లోతుగా చూసాడు నందకుమార్.

రేయ్, నువ్వు మంచి మగవాడుగా ఉంటే, జయశ్రీ మెడలో తాళి కట్టు చూద్దాం! ఆ తరువాత మాట్లాడుకుందాం అన్నాడు.

ఆమె మెడలో నేను తాళి కట్టటం అటుంచు. నువ్వెందుకు ఇలా నడుచుకుంటున్నావు... జయశ్రీ ఏం పాపం చేసింది?”

ఏ పాపమూ చేయనివ్వకుండా నన్ను అడ్డుకుంటోందే, అదే ఆమె చేస్తున్న పాపం. నువ్వే కదా చెప్పావు, నేనొక సాడిస్టునని...సాడిస్టులు ఇలాగే నడుచుకుంటారు...

ఆ నడుచుకుంటారు! మా చేతులు ఏమీ వూరుకోవు. నీ పొగరును అనిచి వేస్తానా లేదా చూడుఅని గర్జిస్తునట్టు ముందుకు వచ్చాడు మోహన శర్మ.

నేను అడవి పులిని. ఏ వేటగాడి వలనా నన్ను ఏమీ చేయటం కుదరదు...

అదీ చూస్తాను. గౌతం, ఇతన్ని గట్టిగా పట్టుకో. వదలకు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను

మోహన శర్మ ఆ మాట అనేటప్పటికి, తుఫాన వేగంతో ఇద్దరినీ తోసేసి, రెప్ప మూసే సమయంలో అక్కడ్నుంచి మాయమయ్యాడు.

సార్, వీడు ఎలా సార్ ఇక్కడికి వచ్చాడు? ఎందుకు వచ్చాడు?” గౌతం దగ్గర ఆందోళన.

తెలియటం లేదు గౌతం...కాలుకు చుట్టుకున్న పాము కాటు వేయకుండా వదలదన్నట్టు ఉండే ఇతని ప్రవర్తన...

సార్, ఇతని ప్రవర్తనలో ఏదో మర్మం దాగుంది…

మర్మమా...మీరు చెప్పేది అర్ధం కావటం లేదే...?”

జయశ్రీ ఇతను ప్రేమించి పెళ్ళి చేసుకున్న అమ్మాయి. ఆమె దగ్గర ఎందుకు ఇంత కృరత్వం చూపడం? ఇందులో నన్నెందుకు ఇరికించటం చేస్తున్నాడు?”

సాడిస్టూ అని నిర్ణయించుకున్న తరువాత కారణాలు అడగటంలో అర్ధం లేదు గౌతం

మోహన శర్మ, గౌతం ఇద్దరూ వెనక్కి తిరిగి నడవటం మొదలుపెట్టారు.   

కొంచం త్వరగా నడుద్దాం. ఇంట్లో జయశ్రీ ఒంటరిగా ఉంటుంది. వీడు అక్కడకూ వెళ్ళి ఆమెనూ బెదిరించవచ్చు... మాట్లాడుతూనే కాలుకి వేగం కలిపారు.

మాట్లాడుతూనే చాలా దూరం వచ్చారు. గౌతం కూడా ఆయనతో పాటూ వేగంగా నడిచాడు.

ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఇతను ఎందుకు ఇలా నడుచుకుంటున్నాడు? ఎందుకు గొడవలకు వస్తున్నాడు?”

జయశ్రీ వాళ్ళ ఇంటి వెనుక ఉన్న కాంపౌండ్ గోడ మీద -- మోహన శర్మ ఊహించినట్టే నందకుమార్! చుట్టి చుట్టి చూసినట్టు వెనుక ఉన్న కాలవ లొని మురికి అతని కాలు అంతటా అతుక్కుని ఉంది. ఎక్కి దూకినతను -- వెనుక వైపు తలుపులను దబదబ మని కొట్టాడు. 

భయపడుతూనే తలుపులు తెరిచిన జయశ్రీ, ఎదురుగా రౌడీ లాంటి ఆకారం, నవ్వుతో లోపలకు దూరాడు నందకుమార్.

నాకు ఎదురుగా కోర్టులో సాక్ష్యం చెప్పి నాకు ఆరు నెలలు జైలు శిక్ష ప్పించావు! నిన్ను వూరికే వదలను అంటూ ఎగిరి ఆమె తల జుట్టును పుచ్చుకున్నాడు.

కేకలు వేయటం మొదలుపెట్టిన ఆమె నోటిని తన బలమైన చేతులతో గట్టిగా నొక్కి పెట్టాడు.

ఆమె ఉక్కిరిబిక్కిరి అయ్యింది.

ఈ లోపు వాకిటి వైపు నుండి మోహన శర్మ, గౌతం ఇద్దరూ లోపలకు వచ్చారు. వాళ్ళు వేగంగా పరిగెత్తుకు రావటం చూసి తన జేబులో నుంచి కత్తి తీసి జయశ్రీ గొంతుకు ఎదురుగా పెట్టి....

దగ్గరకు వచ్చారా ఈమె గొంతును ఒక్క దెబ్బతో కొసేస్తా అన్నాడు.

వాళ్ళిద్దరూ స్థంభించిపోయినట్లు నిలబడిపోయారు. తరువాత ఏం చేయాలి అనేది తెలియక ఆశ్చర్యంలో నిలబడ, నందకుమార్ దగ్గర ఆవేశం.

ఈ నిమిషం ఈమెను చంపి నేరాన్ని నీ మీద మోపగలను. ఆ రోజు ఆడిటోరియంలోచీకటిలో ఈమెను రేప్ చేయటానికి ప్రయత్నించి, నేరాన్ని నీ మీద వేసినట్లే, అదేలాగా ఇప్పుడు కూడా నేను చేయగలను. దగ్గరకు రాకు...దగ్గరకు రాకు...

నందకుమార్ విరక్కొట్టిన ఆ నిజాన్ని విన్న జయశ్రీ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఆ మరు క్షణమే గౌతం ను జాలిగా చూసింది. 

గౌతం , క్షణం కూడా ఆలశ్యం చేయకుండా, నందకుమార్ చిన్నగా మెడ తిప్పిన సమయం చూసి అతని మీద పడి అతని చేతిలోని కత్తిని పడగొట్టాడు.

నందకుమార్ వెంటనే తమాయించుకుని వాకిటి వైపుగా పరిగెత్తటం మొదలు పెట్టాడు.

జయశ్రీ! నిన్ను నేను ప్రశాంతంగా బ్రతక నివ్వనే... అని గట్టిగా అరిచాడు.

వాకిటి వైపు ఉన్న పోలీసు కానిస్టేబుల్ కొంచం దూరంగా నిలబడి సిగిరెట్టు కాల్చుకుంటున్నాడు. నందకుమార్ వేగంగా బయటకు పరిగెత్తుకుని వెళ్ళటం చూసి బెంబేలు పడి, ఇన్‌స్పెక్టర్ తిడతారే నన్న భయంతో....

సార్! ఇతను ఎలా సార్ ఇటు పక్క వచ్చాడు? కొంచం గట్టిగా అరిచి ఉండకూడదా?”

మోహన శర్మ ముఖంలో దీర్ఘమైన విచార రేఖలు. గౌతం కూడా కంగు తిని ఉన్నాడు. జయశ్రీ వెక్కి వెక్కి ఏడుస్తోంది. 

ముఖ్యంగా అతను ఆడిటోరియంగురించి మాట్లాడిన మాటలతో ఆమె హృదయం నూనెలో వేయించినట్లు అయిపోయింది.

ఈ గౌతం ఎంత ఓర్పు గల వ్యక్తి! ఎంత దీర్ఘమైన స్పష్టత గల కవి!అనుకుని అనుకుని ఏడ్చింది.

జయశ్రీ! ఏడవకు...నువ్వు ఏడవటం చూడటానికి కష్టంగా ఉంది... గౌతం ఓదార్పుగా చెప్పాడు.

ప్లీజ్! నన్ను ఏడవనివ్వండి...మిమ్మల్ని అనుమానించిన పాపానికి నాకు ఈ కష్టాలు చాలదు. ఇంకా కావాలి. ఇంకా కావాలి

లేదు...ఇది నువ్వు ఏడవాల్సిన సమయం కాదు. సంతోషపడాల్సిన  సమయం -- మోహన శర్మ మధ్యలో వచ్చారు.

నాన్నా మీరేం చెబుతున్నారు? వాడొచ్చి బెదిరించి వెడుతున్నాడు. అందరూ బెదిరిపోయి నిలబడ్డ ఈ సమయం, నేను సంతోషపడాలా?”

ఖచ్చితంగా! ఈ క్షణంలో నువ్వు గౌతంని పెళ్ళిచేసుకోవటానికి ఒప్పుకో. మిగిలినది నేను చూసుకుంటా

నాన్నా, పెళ్ళి అనేది ఆడుకునే విషయమా?”

కాదమ్మా. అది చాలా పవిత్రమైన విషయం...

అది తెలిసి కూడా ఇలా ఎందుకు పెళ్ళి గురించి మాటి మాటికి మాట్లాడుతున్నా రు?”

ఏం చేయనమ్మా? నీకింకా పవిత్రమైన పెళ్ళి జరగలేదే...!”

అలాగైతే నందకుమార్ కట్టిన తాళికి ఏమిటి అర్ధం...?”

మోసం చేసి, ద్రోహంతో నిన్ను వసపరుచు కున్నందుకు అది సాక్షి. అంతే!

ఉండచ్చు. మొదటిసారే ఒక పవిత్రమైన విషయానికి నేను యోగ్యత లేకుండా పోయినందువలనే ఇలా జరిగింది. ఇంకో ప్రయత్నం ఎందుకు నాన్నా?”

నీకు అప్పటికంటే, ఇప్పుడే బద్రత అవసరం. అందుకే ఈ ప్రయత్నం

ఆత్మీయతతో చూసుకోవటానికి మీరు ఉన్నారుగా...చాలదా?”

ఖచ్చితంగా చాలదు. నందకుమార్ ని ఆశ్చర్యపరచాలి. వాడి పొగరుకు, సాడిస్టు బుద్దికి చావు గంట కొట్టాలంటే నీకు భర్త అనే తోడు అవసరం. జీవించటానికి ద్రోహులను జయించి ఒక కొత్త జీవితం జీవించటంలో తప్పులేదు జయశ్రీ. పాతకాలం మనిషిలాగా ఆలొచించకు. నిన్ను నువ్వే మోసగించుకోకు... మోహన శర్మ మాటల్లో నిజాలు ఉరుములు లాగా వినిపించాయి.

 జవాబు చెప్పలేని మౌనం జయశ్రీ దగ్గర.

సార్, ఏదైనా సరే సహజంగా జరగాలి. కర్రతో కొట్టి పండించ కూడదు అన్నాడు గౌతం.

టైము ఆరు గంటులు అయ్యిందని గంట కొట్టింది గోడ గడియారం.

తరువాత ఏం చేయాలి? మోహన శర్మకు అర్ధం కాలేదు! అప్పుడు పోలీసు బృందం లోపలకు ప్రవేశించింది.

సార్, ఆ నందకుమార్ ఇక్కడకు వచ్చాడటగా?” ఆందోళన కూడిన ప్రశ్న.

అవును సార్! వచ్చాడు. కత్తి చూపించి బెదిరించాడు. గౌతం వలన నా కూతురు తప్పించుకుంది. మమ్మల్నందరినీ తోసేసి పరిగెత్తాడు…

మీ అల్లుడు తప్పుకు పైన తప్పు చేస్తున్నారు. జీవితాంతం జైలులో ఉండాలని ఇష్టపడుతున్నట్టు ఉన్నాడు...ఆయనకేమైనా పిచ్చా? ఎందుకు సార్ ఇలా నడుచుకుంటున్నారు? హంతకుడు కూడా సంతోషంగా ఉండటానికి ఆశపడే కాలంలో, ఈ మనిషి ప్రవర్తనే అర్ధం కావటం లేదా...నిజంగానే పిచ్చాడు…

--సబ్--ఇన్‌స్పెక్టర్ యొక్క ఆవేశం అందరినీ ఒక్క ఊపు ఊపింది.

నందకుమార్ ఒక మెంటల్ ఇల్నెస్ మనిషా?.

                                                                                                                Continued...PART-12

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి