మాటే మంత్రము (మినీ కథ)
ఒకప్పటి మానవతానుబంధం కనుమరుగై, డబ్బే ప్రపంచమై పోయిన తర్వాత అన్ని సంబంధాలూ మాసిపోయాయి. వైద్యం ఖరీదైపోయింది. వ్యాధి నిర్ధారణకు బోలెడన్ని పరీక్షలు, వాటి కోసం కోట్ల రూపాయల విలువ చేసే పరికరాలు దిగాయి. చికిత్స పద్ధతులు కూడా గణనీయంగా మారాయి. రోజుకో కొత్త వ్యాధి పుట్టుకొస్తున్న ఈ ఆధునిక యుగంలో వాటికి చికిత్స చేయడానికి కార్పొరేట్ ఆసుపత్రులే దిక్కవుతున్నాయి. కొన్నిసార్లు ఎటువంటి వైద్యమూ, ఎంత అనుభవమైన పెద్ద డాక్టర్ కూడా చేతులు ఎత్తేస్తున్నారు....కానీ అదే చోట ఒక్క మాట మంత్రంలా పనిచేస్తుంది......అదేమిటో?
సరొజ చెంప చెల్లు మన్నది...!
మంచి నీళ్ళు తీసుకురావటానికని బిందె తీసుకుని సరొజ బయలుదేరుతున్నప్పుడు ఆమె చెంప మీద కొట్టాడు చలపతి.
ఎదురు చూడని ఆ చెంప దెబ్బ వలన సరొజ బుగ్గలు, చెవులు కందిపోయినై. కళ్ళల్లో నుండి బొటబొటా కన్నీరు దొర్లింది.
"నీకు నేను ఎన్ని సార్లు చెప్పాను! మంచి నీళ్ళు తీసుకురావటానికి నువ్వు వెళ్ళద్దు అని. నేను వెల్తాను అంటే వినవేమిటి?”
చెంపను రుద్దు కుంటూ
చిరాకు పడింది సరొజ.
"నువ్వు కాలుజారి క్రింద పడితే....కడుపులో ఉన్న బిడ్డకు ఏదైనా అయితే...?"
అతను సరొజ దగ్గరున్న బిందెను లాక్కుని నడిచాడు.
అప్పుడు సరొజ ఎనిమిది నెలల గర్భిణి.
'ఈయనకు నేనంటే ముఖ్యం కాదు. ఏప్పుడు చూడు బిడ్డ...బిడ్డ... బిడ్డ...! గర్భం దాల్చిన దగ్గర నుండి ఒకటే దబాయింపు ఆదేశాలు. ఇది చెయ్యకు, అది చెయ్యకు, అలా నడవకు, ఇలా నడవకు, ఇలా పడుకోకు,
అలా పడుకోకు ! అని ఆదేశాలు. అన్నిటికీ కారణం కడుపులో ఉన్న ఈ బిడ్డే'
తన కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద తనకే ఎరుగని విరక్తి కలిగింది సరొజకు.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
మాటే మంత్రము…(మినీ కథ) @ కథా కాలక్షేపం-1
***************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి