21, డిసెంబర్ 2022, బుధవారం

మానవత్వం...(పూర్తి నవల)

 

                                                                                            మానవత్వం                                                                                                                                                                             (పూర్తి నవల)

సృష్టిలో మానవత్వాన్ని మించిన మతం లేదంటారు. మానవత్వం లేని మతం రాణించదు.మానవత్వం అంటే కరుణప్రేమదయఇంకా ఎన్నో ఉన్నాయి.ఉదాహరణకు: బాధితులపట్ల కనికరం చూపటంకులమతాలకు అతీతంగా మనుషులందరినీ ప్రేమించటంఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం ఇంకా ఎన్నో.  గుణాలన్నీ ఆడవారికి ఎక్కువగా ఉంటుందని చెబుతారు.  నవలలోని హీరోయిన్  యామిని అలాంటి గుణం కల ఒక ఆడది. పెళ్ళి చూపులకు వస్తున్నారని తల్లి ఆఫీసుకు ఫోన్ చేసిఆఫీసు నుండి త్వరగా బయలుదేరి రమ్మని యామినికి చెబుతుంది.

యామిని ఇంటికి వస్తున్న దారిలో చెత్త కుండికి దగ్గరగా ఎవరో అప్పుడే పుట్టిన బిడ్డను పడేశారు. మానవత్వం నిండిన యామిని అందరూ వేడుక చూస్తూండగాతానుగా ముందుకు వచ్చి  బిడ్డను కాపాడి ఇంటికి తీసుకు వెళ్ళింది.

పిల్లను చూద్దామని వచ్చిన పెళ్ళి వారుయామిని తల్లితండ్రిమిగిలిన కుటుంబ శభ్యులు ఆమె చర్యకు ఆశ్చర్యపోతారు. అది యామిని బిడ్డేనని వాదించి తిరిగి వెళ్ళిపోతారు మగ పెళ్ళివారు.

యామిని బిడ్డను ఏం చేసిందిప్రేమికుడికి బిడ్డగురించి ఏం సమాధానం చెప్పిందితన తల్లితండ్రులకు ఏం చెప్పింది?......చివరికి ఆమెఆమె జీవితాన్నిబిడ్డ జీవితాన్ని ఎలా మలుచుకుంది?...ఇవన్నీ  నవలను చదివి తెలుసుకోండి.

ఆఫీసు పనిలో లీనమైపోయిన యామిని, ఆరవసారిగా తల్లి దగ్గర నుండి వచ్చిన సెల్ ఫోన్ ఆహ్వానం వలన, అవసరవసరంగా టేబుల్ మీదున్న ఫైళ్ళను మూసేసి, ఫైళ్ళను టేబుల్ సొరుగులో పెట్టి, సొరుగుకు తాళం వేసి, తాళం చెవిని హాండ్ బ్యాగులో వేసుకుని లేచింది.

సహ ఉద్యోగి నలిని యామినిని ఆశ్చర్యంగా చూసింది.

"ఏమిటి యామిని... రోజు త్వరగా బయలుదేరావు?"

"దివాకర్ వాళ్ళింట్లో నుండి వస్తున్నారు"

"పెళ్ళి చూపులకా?"

"ఆలాంటిదే" చిన్నగా నవ్వుతూ అన్నది యామిని.

పన్నెండు మిస్డ్ కాల్స్. ' గాడ్' అనుకుంటూ వాటిని చెక్ చేసింది. అమ్మ మరియు దివాకర్...మారి మారి కాల్ చేశారు. మొదట తల్లికి ఫోన్ చేసింది. రింగ్ కొట్టిన వెంటనే 'ఫోన్తీసి కోపంగా మాట్లాడింది యామిని తల్లి సరోజ.

"ఏమిటే...ఫోన్ చేస్తే తీయవా?"

"సైలెంటులో పెట్టుంచాను...ఇప్పుడే తీసి చూశాను"

"అంటే ఇంకా ఆఫీసులోనే ఉన్నావా?"

"లేదమ్మా...బయలుదేరాను.వస్తున్నాను"

"బయలుదేరేవా! త్వరగారావే. ఇక్కడ అందరూ చాలాసేపటి నుంచి కాచుకోనున్నారు"

అందరూ అంటే ఎవరమ్మా?"

"పెళ్ళికొడుకు తరఫు వాళ్ళు"

"ఏమిటీ!?"- సీటులో వేనక్కి జరిగి నిటారుగా కూర్చుంది యామిని.

హడావిడిగా దిగింది. వేగంగా నడిచి స్టేషన్ బయటకు వచ్చి, ఆటో స్టాండు వైపుకు వెళ్ళింది. ఆటో స్టాండ్ దగ్గర చాలామంది గుమికూడి ఉన్నారు.

'ఏమీటీ గుంపు? ఎందుకని దారికి అడ్డంగా గుమి కూడి ఉన్నారు?' కొంచం విసుగ్గా గుంపును తోసుకుంటూ ముందుకు కదులు తుండగా...చెవిని తొలుస్తునట్టు ఒక శబ్ధం. సన్నని గొంతు నుండి వస్తున్న ఏడుపు. అది మామూలు ఏడుపు కాదు. గొంతు ఎండిపోతున్నా ఆపుకోలేని బాధతో కూడిన ఏడుపు. ఏడుపు విన్న వెంటనే యామిని పాదాలు సడన్ గా ఆగినై. గుంపును తోసుకుంటూ, ఏడుపు వస్తున్న వైపు వేగంగా వెళ్ళి ఆగింది. అక్కడ చూసిన దృశ్యం ఆమె గుండెను పిండేసింది.

పుట్టి కొన్ని గంటలే అయిన ఒక పసి గుడ్డు, పేగు కూడా పూర్తిగా కోయబడని స్థితిలో...మురికి కాలువ దగ్గరగా 'పాలీతిన్సంచీతొ చుట్టబడి పడుంది. కాళ్ళూ, చేతులూ ఎగరేసుకుంటూ గొంతు చించుకుని ఏడవటం వలన 'పాలితిన్సంచీ నుండి కొంచంగా బయటకు వచ్చిన పసిగుడ్డు, మట్టి నేల మీద ఉండగా... యామిని వొల్లు కంపిస్తూ, మనసు కొట్టుకుంటుంటే పరిగెత్తుకునెళ్ళి పసిబిడ్డను ఎత్తుకుంది.

"అమ్మా.... యామిని వచ్చేసింది"

దివాకర్ అరుపుతో అందరూ మౌనంగా వెనక్కి తిరిగి చూశారు. సరోజ అధిరిపడ్డది. చేతిలో ఒక బిడ్డతో వచ్చి దిగిన కూతుర్ను చూసిన మిగిలినవారు ఆశ్చర్యపోయారు. దివాకర్ తల్లి కళ్ళు పెద్దవి చేసుకుంది.

"దివాకర్ ఏమిట్రా ఇది....ఈమె పెళ్ళికూతురా?"

"అవునమ్మా"

"ఏమిటి...బిడ్డతో వచ్చింది?"

నవలను చదవటానికి క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మానవత్వం...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి