రాళ్ళే పుస్తకాలు (ఆసక్తి)
శాసనం(Epigraphy లేదా Inscription) అంటే పురాతన కాలంలో రాయి, రాగిరేకు వంటి వాటిపై వ్రాసిన అక్షరాలు. పురాతన కాలంలో కాగితంతో తయారుచేసిన గ్రంథాలు ఉపయోగించని కాలంలో రాజులు, చక్రవర్తులు, సామంతులు, జమీందారులు తమ రాజ్యపు అధికారిక శాసనాలను 'రాళ్ళ పై, రాతిబండలపై, రాగిరేకులపై చెక్కించి, బధ్రపరిచేవారు. ఇలాంటి అధికారిక ప్రకటలనే శాసనం అనేవారు.
ఆ తరువాత శిలాశాసనాలు తగ్గిపోయి లోహ శాసనాలు ప్రాధాన్యత వహించాయి. సంఖ్యాపరంగా చూస్తే శిలాశాసనాలకన్నా ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కానీ వీటికి చారిత్రిక ప్రాధాన్యత చాలా ఎక్కువ. పల్లవ, కదంబ, గాంగ,
చాళుక్యాది వంశాల చరిత్ర ప్రధానంగా లోహ శాసనాలపై ఆధారపడి ఉన్నాయి. మంత్రతంత్రాలకు సంబంధించిన వివరాలేవో వాటిపై వ్రాసి ఉన్నాయని ప్రజలు భావించడంతో చాలా శాసనాలు వెలుగులోకి రాలేదు. వీటిలో నిధినిక్షేపాలున్న ప్రదేశాల దారిని చూపే రహస్యం ఉండవచ్చని పలువురు భావించి ప్రభుత్వానికి ఇవ్వక తమ వద్దే దాచుకోవడంతో ఎంతో చరిత్ర కాలగర్భంలోనే ఉండిపోయింది. కొందరు తామ్ర శాసనాలను కరిగించి ఇంటికి ఉపయోగించే చెంబులు, తపేలాలు, గుండిగలు వంటివి తయారుచేసుకున్నారు. వీటివల్ల ఎంతో విలువైన చారిత్రక సమాచారం నశించిపోయింది.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
రాళ్ళే పుస్తకాలు...(ఆసక్తి) @ కథా కాలక్షేపం
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి